Thursday, February 4, 2016

కారుణ్యO కారుణ్యం


మనకీ- మనకీ మధ్య నీ గొడవలేంటి?
మనిషికీ-మానవత్వానికీ మధ్యనీ గోడలేంటి?
మనకీ -రాక్షసులకీ ఇంక తేడా ఏంటి?
కారుణ్యం లేకుంటే అది మతమేంటి?
హిందువు,ముస్లీమ్  ఈ పగ లేంటి?
ఇసాయిలయితే మరి మనకేంటి?
మతం పేరుతో మారణ హోమం
దారుణమండి .. దారుణం 
మన కనుకూలంగా మతాన్ని మార్చకండి
హింసను కోరే మతమంటూ ఏదీ లేదండి
మతం పేరుతొ మారణహోమా లాపండి
మానవత్వాన్ని మించిన మతమంటూ లేదండి.
స్వర్గమైనా, నరకమైనా ఇదే  కదండి
సుఖమయ జీవితాలను నరకం చేయకండి
మనసే ఒక మందిరమైతే!, అందులో దేవుడుంటాడండి

దేవుడు కావలసిన మీరెందుకు రాక్షసు లౌతారండి      
ఒకర్నంటున్నానని, ఇంకొకరనుకోకండి
మనమందరము ఒక చెట్టు కొమ్మలమేనండి
హేతువేదో వెతకండి , హితవుగోరి బ్రతకండి
ఇదే కదా జీవితం, అర్ధం గ్రహించండి.
సమ సమాజమే  మనదండి
స్వర్గం-నరకం ఇదే నండి
ఈ స్వర్గంలో నరకమెందుకండి
జన్మకు చివరి ఘట్టం  చావేనండి 
బ్రతకమని  దేవుడు పుట్టిస్తే
చస్తూ బ్రతకడం దేనికండి
చంపడానికో చావడానికో అయితే
ఇంక పుట్టడ మెందుకండి
కారుణ్యపు విత్తనాలు జల్లండి
మానవత్వపు వృక్షాలు పెంచండి
అలసిపోయిన సమాజానికి
సేద తీరుద్దాం  రండి .. సేద తీరుద్దాం రండి !
                                                         య.వెంకటరమణ