Thursday, April 21, 2022

పొద్దుగూకు వేళలో పెద్ద వెలుగు తానైనెలవంకై నా ఇంట వెన్నెల వెదజల్లైనావెంటే తానుంటూ నన్నింతగ ప్రేమించేప్రియమైన నా ఇల్లాలికి ప్రేమతో.. 2059

పొద్దుగూకు వేళలో పెద్ద వెలుగు తానై
నెలవంకై నా ఇంట వెన్నెల వెదజల్లై
నావెంటే తానుంటూ నన్నింతగ ప్రేమించే
ప్రియమైన నా ఇల్లాలికి ప్రేమతో..

 2059
Telugu rachana
14/04/2022
=============================
తావిలేక పూవులేదు, పూవులేక ఫలములేదు
ఫలములేక వనము లేదులే
నీవులేక నేనులేను, నేనులేక నీవులేవు
నాకు నీవు లేనినాడు నేను లేనులే .నేను లేనులే

తార లేని గగనమూ ఘనాసూనము
చిగురు లేని కొమ్మలూ కళా హీనము
వెలుగు లేని కన్నులకు కలలు దూరము
నా కన్నుల వెలుగు నీవు ప్రియా భామిని

నింగి నీలి వర్ణము కొలనుకెంత అందము
సూర్యకాంత పుష్పానిది వెలుగు బంధము
నా జీవనరాగంలో  ప్రేమ తాళము
ప్రియా నాకు చాలునులే పెనిమిటి వరము
=============================
             య.వెంకటరమణ/..

2060

2060
TELUGU RACHANA
20/04/2022
========================
పరీభ్రమణమిలా తగదు ఓ మణిమాల
మరీ ఇలా జమీనుపై మతిపోయేలా
తెఱగంటిత్రోవలో తారొకటి లేదని
తలో దారి వెదుకసాగె చరా చరములు  

మిలా మిలా మేను ఛాయ  సువనకుమారీ
హొయలొలికే ఆ నడక నాట్యమయూరి
వంపులు మరి ఆ సొంపులు వంతులు మారి
నడుమొంకులు కురులొంకులు ఎవరీ నారి

నయనాలా నీ పేరూ నయన కుమారీ
మదువొలికే ఆ పెదవుల మధుబాలేమో
మణికట్టు పడికట్టు మణిమాలే మో
సిగ జుట్టు ఆ తీరు  శిరోమణి శిరోమణేలే

నయనాలా బాణాలు నను దూసుకుపోతుంటే
నిలిచేనా ఈ మనసు నయినబాలా
సిగలొనీ ఆ పూలు చెలాయించి చూస్తుంటే
చంచలమైపోరా మరి చిరంజీవులు

చెరకు బాణ మొకటి కాదు రతీ కుమారి
చెరో వైపు మన్మధుడు కృష్ణ మురారి
తునా తునకలన్నింటా నీవే మరి
ఇలా గాక ఎలా నేను చెప్పనో సిరి

సయ్యంటే సరే మరీ సరస కుమారీ
మాఘమాస మెందుకులే ముందునే సరి
తలో పేరు విడి విడిగా వద్దులే మరి
నా పేరే నీకిస్తా పంచుకో చెలీ

ఒప్పుకుంటే ముప్పు కూడ ముందు ఉందిలే
పాల గ్లాసు పంచుకునే పనే ముందులే
కార్తి సందులో కూడా కమామిషాలే
కథలుకథలు జనం నోట మనం మనములే
========================
               య. వెంకటరమణ/..

Sunday, April 10, 2022

2055

2055
తెలుగు రచన
19/03/2022
===============
కొండలూ, గుట్టలూ
కోటలు, మేటలు
చివరికా చివర నున్న
పేటలనే పంక్తులు
వెతుకుతూపోయాను
వెతుకుతూపోయాను

శాంతినెతుకుతూ,
ప్రశాంతి నెతుకుతూ
పోయానే పొందలేక
ఇంతైనా శాంతిలేక

రక్తపాత మార్గంలో
రాజ్యాలను విస్తరిస్తు
జనం చంపి శవాలపై
జండాలను పాతుకుంటు
రక్తంతో రాళ్ళపైన
విజయోక్తులు వ్రాసుకుంటు

జనంజంపి రాజ్యాలను
జనానికై విస్తరించి
ఎవడికాడు ఇతిహాసం 
ఇంత కంత వ్రాసుకున్న
కో చరితల పుటల యందు
పడీ పడీ వెతికా నే
శాంతి లేని సమాజాన
శాంతి స్వప్న కిరీటాలు
చరితలిన్ని తిరగేసి 
తరచి తరచి నే జూసా 
రక్తంతో వ్రాసుకున్న చరితలన్ని నే జూసా
శాంతి లేని సమాజాన
శాంతి స్వప్న కిరీటాలు
శాంతి లేని సమాజాన
శాంతి స్వప్న కిరీటాలు
శాంతి లేని సమాజాన
శాంతి స్వప్న కిరీటాలు
===============
   య.వెంకటరమణ/..

2058

2058
తెలుగు రచన
30/03/2022
============================
ఎవరు నీవు నా ఎదలో అలజడింత రేపేవు
కన్నులలో జేరి నీవు నిదురనెళ్ళగొట్టవు
ఉండి కూడ లేనట్టే నన్ను నీవు చేసావు
ఉన్నపాటినీ నాలో ఇన్ని మార్పులిచ్చేవు

నిదురున్నా మేల్కొన్నా పెద్ద మార్పు లేదులే
ఎదురుగా ఎందరున్న అందరిలో నీవేలే
ఒంటరిగా నేనున్నా వెంట నీవు ఉన్నట్టు
వింత మాయలేవేవో ఇంతలోనె క్రమ్మినట్టు

ఏమిటో ఈ వింత ఎవరు నీవు ఎవరంట

కారు మబ్బులన్ని పుణికి కొప్పున నీవల్లుకుని
వెన్నెలమ్మ అందాలను ఒళ్ళంతా పులుముకుని
కన్నె త్రాచు నడక లాగా కదలాడే  అడుగులతో
మదిలో నువ్ మ్రోగించే  మన్మోహన్ రాగాలు

ఇంతకీ ఎవరునీవు   ఏమిటీ ఈ వింత

ఉన్నట్టే ఉండి ఉండి ఉలికిపాటు ఇదేమి
పలుకరింపు లేకున్నా బదులు చెప్పుటదేమి
పరధ్యానమే ఎపుడూ పలుకరించినా నచ్చదు
నిప్పులపై నడవడం నీటిపై తేలడం
నాకిప్పుడు గొప్పకాదు  ఎప్పుడిలా అవ్వలేదు

ఏమిటో ఈ వింత ఎప్పుడూ లేదింత

ఇంతకీ ఎవరు నీవు అలజడింత రేపేవు
తొలకరిలో జల్లులాగ నన్ను తడిపివేశావు
పులకింతలు గిలిగింతలు  ఎన్ని ఎన్ని తుళ్ళింతలు
ఇన్ని ఇన్ని, ఇన్ని వింతలా మరెన్ని వింతలా!?
=============================
             య.వెంకటరమణ/..

2057

2057
తెలుగు రచన
25/3/2022
==================
వాయవ్యంలో హోరా హోరీ
పడమట వాళ్ళ పండగ చూడోయ్
ఉత్తర మూలన పొంచి నక్కలు
దయనీయంగా దక్షిణ మోళ్ళు

ఇల్లు కాలి మరి ఈరయ్యుంటే
పేలాలేరుతు ప్రక్కింటోళ్ళు
పేరుకు మాత్రం పెద్దలు కానీ
పేలాలేరే బుద్ధులు పోవోయ్

పురుగును చంపే సత్తాలేక
పీనుగులట్లే రాశులు పోసి
పదినాళ్ళయినా కానే లేదు
ఎలాను పోతానేందీ పోరు

మనుజుల్లేని మట్టి కోసమా
మారణహోమం మానని త్రివిధం
మర్మం తెలియని మనుషులు పాపం
మట్టి శిధిలమా ఇదేమి న్యాయం

దేశపు టెల్లలు రక్తదారలు
పునాధులన్నీ శవాల డేరు
కాపాడేందుకు కాసుల్లేవు
కాల్చేటందుకు మార్భాలాలు

బోర్డరు పెంచే రాజుల యత్నం
బోసిపోయిన గోడలకయ్యో
నెత్తురు పూసా రంగులద్దడం
నెత్తురు పూసా రంగులద్దడం
===================
          య.వెంకటరమణ/..

2056

2056
తెలుగు రచన
20/03/2022
====================
సుదర్శన చక్రం  
శ్రీరాముని అస్త్రం
బోళాశంకర మూడో నేత్రం
సూర్య దేవుని అశ్వశకటము

ఏమయ్యేనో ఏమో ఏమో
ఇక్కడ పెరిగెను ఘోరం ఘోరం
రాజ్యం నిండెను రావణ బ్రాహ్మలు
కోరలుదీరిన మృగాల డేరు

చీకటి రాజ్యం భ్రష్టాచారం
ఆశల తీర్థం ఆకలిరాజ్యం
వికార జీవుల వికృత మౌఢ్యం
చిక్కులు వలలో  ఓటాఱు జనము

నింగికి నిచ్చెన భోగజీవులు
నేలకు నోచని అభాగ్యులెందరు
ఆకలి పాపం ఆహాకారం
ఆకలి తోనే జన వ్యాపారం

కామం నిండిన కబోది నైనం
మలమల మాడుతు మల్లెలు పాపం
మనుజుల పైకే మనుజులు చూడు
మృగాలు మేలు రోగులు వీళ్ళు

ఉంటే వేసేయ్ విష్ణుచక్రము
గంగను వదిలేయ్ సర్వనాశనం
చండీ వచ్చేయ్ నిండెను పాపం
అంతకు మించి లేదేమార్గం
====================
             య.వెంకటరమణ/..