Sunday, August 23, 2015

అర్ధంకాని తప్పుడు రాతలతో నా జీవిత డైరీ నిండిపోయింది

అర్ధంకాని తప్పుడు రాతలతో నా జీవిత డైరీ నిండిపోయింది
చెరిపే యత్నంలో పుటలెన్నో ఇలా మాసిపోయాయి
ఆశలు నిండిన సిరాబుడ్డితో అక్షరాలు పొదగలేక
ఆశలుగానే నా కలం వరకూ వచ్చి  ఆగిపోయాయి
తిరిగిచూడమంటే,తిరగవ్రాస్తానన్నాను తిరిచూడలేకున్నాను.
ఆశలు అందంగా ఉంటాయి. అందుకే తుమ్మెదలా చుట్టూ తిరుగుతుంటాయి
నాకుతెలిసి మృత్యువు కూడా చాలా అందంగా ఉంటుంది.
అందుకేనేమో తన కౌగిలి చేరితే బ్రతుకుమీద ఆశలు పోతాయి.
ఈ ఉదయానికెంత గర్వమో కదా!
మిర్రుగుడ్లేసుకుని చూస్తుంది.మరీ నెత్తెక్కుతుంది.
అస్తమయమది ఎరుగదుగా.
పాపం పడమటి కొండల్లో ముఖం దాచు కుంటుంది.
ప్రాణం ఖరీదు తెలిస్తే బాగుండు,పైకంతో కొనిపెట్టుకుందును.
పైపెచ్చూ,అది అమ్మేవాడెవరో తెలుసుంటే బాగుండును,
రేటైనా అడిగుందును.
అనాముఖుడు,ఆ రోడ్డు ప్రక్కన పడి ఉండుట నే చూసాను.
అమాయకుడు, ఆ ప్రాణం ఊరకనే ఇచ్చేసాడు.
కోట్ల ఆస్తి,పాపం అప్పనుకుంటా వదిలేసాడు.

..................................య.వెంకటరమణ

కుచ్చులు జడకుచ్చులు మనసుకు పడి నాఉచ్చులు


కుచ్చులు జడకుచ్చులు మనసుకు పడి నాఉచ్చులు
నొసలిరుసులు రొసరొసలు నడివంత్రపు నీ సొగసులు
ఒయ్యారి భామా అయ్యయ్యొ రామా చాలించవమ్మా
ఓసారిచూస్తే తరియించిపోమా,మనసంత నీకు అర్పించుకోమా

జానా..నువ్వందుకునా.. ఆ జానడు నేను అందుకోలేనా?
జానా..ఈ నజరానా.హంసనడక నీవెంట పడీపడీ రాలేనా!
రానా.. నే రానా.. ఇంపైనా నీవిందుకు విడిది పరుచుకోనా
వనజాక్షి .. నీ సాక్షి.. క్షణమైనా నిను మరిచి ఉండలేను పిచ్చి.

వోణీ...మరి బోణీ.వోలిస్తా మాగాణీ..చలోచలో చూపిస్తా లోగిళిని
మానేయ్.ఇక మానేయ్.చల్లకొచ్చి ముంతదాచుడెందుకింక మానేయ్
మగాడినే మరీ. మోజు పడినానే.సరే అనే, సరే అనే
సరసంలో సరిగమలు వినే వినే.నేనే ననేయ్.నీకు నేనేననేయ్.!!
=================================

..............,య.వెంకటరమణ

( Tab లో typing తప్పులు మన్నించాలి)

రెప రెపలాడే పతాకమదిగో

స్వతంత్ర్యమండోయ్,స్వరాజ్యమండోయ్
నిజమేనండోయ్, నిజమేనండోయ్
సాయుద దళాలు సామగ్రి బట్టుకు
శాంతి స్థాపనకు సిద్దం రండోయ్
రెప రెపలాడే పతాకమదిగో
తుపాకి నోకులు కాపలగున్నాయ్
నిమేనండోయ్ నిజమేనండోయ్
స్వతంత్ర్యదినమిది మీరూరండోయ్
మంత్రివర్యలను చూసేయోగం
రోగంకుదరని తాతకు పాపం
రోజూరాదోయ్ చూసేయోగం
కూలికి రానని చెబితే కోపం
కామందులయ్యకు కాదండిలేవోయ్
స్వరాజ్యమండోయ్ స్వతంత్ర్యమండోయ్
పదండి పదండి పంతులుగారు మిఠాయిలిచ్చే
పండగరండోయ్ స్వతంత్య్రమండోయ్
ఎరుపు రంగుతో ఎలర్టులండోయ్
ఏలికవారు తెలుపేనండోయ్
ఎటుబోనుందో ఏమోనండోయ్
మనదేనండోయ్ దేశంరండోయ్
స్వతంత్ర్యమండోయ్,స్వరాజ్యమండోయ్
నిజమేనండోయ్, నిజమేనండోయ్!!

............ . . . .  తెలుగు రచన

ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం

===================
ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం
కష్టాలసముద్రంలో సుఖాలెతకడం
కష్టమెరుగని సుఖాలను కష్టపెట్టడం
నిజమైన  నిజాన్ని  సూన్యమనడం
సూన్యమైన సమాజాన్ని సొంతమనడం
కష్టాల సముద్రంలో సుఖాలెతకడం
సుఖాల గమ్యం చవిచూడకుండానే
కష్టంగా సుఖంలో కరిగి పోవడం
ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం
ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం
==================
......................య.వెంకటరమణ

మౌనం రేపిన అలజడి

===============
నీ మౌనం రేపిన అలజడి
 నా మదిన కొలువై మూగవోయింది
అలకలు కానవు కోపాలెరుగవు
దాగున్నావేడనో మబ్బులమాటున ఓ మామా
జాబిలితో దాగుడు మూతలా
కనికరమెరుగునా నీ మది
జాలువారు కన్నీరు గాంచునా
బరించలేని ఈ మౌనం వరమనుకోనా?
నీ పిలుపుకు దూరంకావడం శాపంకాదా
చిరునామా లేని మదిలో కొలువున్నకదాని
చులకనచేస్తున్నావా ....?!
నీ నీడను నే కానన్నందుకు
ఎండలేని చోటుకేగిపోయావా
జాడలేకుండా, నా తోడులేకుండా!!
=================

........................ మాధుర్య

విన్నారా ఓ చిత్రం

============================
విన్నారా ఓ చిత్రం! వెన్నెలైవచ్చే వేయికళ్ళతో రారాజుకి
కలువభామ కన్నీరేగార్చింది కనరాని కాంతి కిరణానికి
పొద్దుతిరుగుడునై తిరుగుతున్నా నీ చుట్టూ ఓ నెలరాజా
పెకళించకు నాలో విరహాన్ని నేస్తమా,నా ప్రియతమా !!
============================

........................................,.... తెలుగు రచన

స్నేహం

=================================
కొన్ని పరిచయాలు మహావృక్షంలా చాలా ఉన్నతంగా కనిపిస్తాయి
కాస్త ఎండకే  ఒడిలిన ముఖంతో ఆకులురాల్చి  మోడుబారి పోతాయి
నీస్నేహం నాకా ఆకులప్రాయంకాదు లోలోపల అల్లుకుపోయే వేరై ఉండాలి నేస్తం !!
=========================================

...................................................................... తెలుగు రచన

అద్దం

ముఖమ్మీద చిన్నమచ్చను కూడా చూపించే అద్దం
తనను తానెప్పుడూ చూసుకోనేలేదది కాదా చిత్రం
ఎదుటివారి తప్పులెంచే మనిషి
తన తానెప్పుడూ చూసుకోనే లేడయ్యో పాపం !!
========================

......................... తెలుగు రచన

ఏడ్చే నీ కళ్ళల్లో కన్నీళ్ళే నిలబడవు


ఏడ్చే నీ కళ్ళల్లో కన్నీళ్ళే నిలబడవు
ఇంకాకళ్ళల్లో  నేనెలా నెలవుంటాను.
నీ చిరునవ్వుతో నాకన్నీళ్ళే మరిఉండవు
మరి,నేనెలా ఉండగలను నిన్ను మరిచి.
నేన'నే పదం ఏనుగులా అడ్డుంటే
నీకు నేనేం  కనిపిస్తానో నేస్తం
మనం మనమైతే ఇంకేముంటుందో నేస్తం!!
=======================
                                                         తెలుగు రచన

ఓ బంధం

ఈజన్మకు తీర్చలేక మిగిలే మిగులేమో
కోరుకుంటున్నా ఆ భగవంతుడ్ని
ప్రతిజన్మలో నీతో ఓ బంధంకావాలని
ఆ జన్మలోనూ ను నేతీర్చలేని రుణానివై ఉండిపోవా
మరుజన్మకు ననుకలుస్తానని మాటివ్వవా
వేచి చూస్తుంటా నీకై ప్రతిజన్మలో
అందుకుంటే నా నువ్ నన్ను చేర ఈజన్మకి
తీర్చలేక మిగిలే మిగులునేమో
కోరుకుంటున్నా ఆ భగవంతుడ్ని
ప్రతిజన్మలో నీతో ఓ బంధంకావాలని
==================
                                      తెలుగు రచన

కలిసుందాం

=========================='
రేపు ఎంత చెడ్డదో నీకు తెలిసుంటే నిన్నను మర్చిపోవు
నిన్నకూడా ఒకప్పుడు రేపులాగే వచ్చింది
కొన్నాళ్ళకు నేడుకూడా నిన్నలాగే వెళ్ళిపోతుంది.
విడిపోవడమే న్యాయమని నేడు నీవనుకుంటుంటే
నిన్నటివరకూ చేసింది అన్యాయమని నేననుకోనా?
=========================
'................................తెలుగు రచన

సర్దుకుపోదాం

=========================
పొరపాట్లున్నాయని పుస్తకం చింపుకుంటామా
తప్పుజరిగిందని మిత్రులను  వదులుకుంటామా
చేత నందైనా, వ్రాత నందైనా తప్పులు సహజం
సరిదిద్దుకోవడం సమంజసం,సమంజసం !!
========================
................................. తెలుగు రచన

నీవే చెప్పు

=========================
''ఎదుటి వారి మనసు నొప్పించేతత్వంకాదు నాది
ఎవరిమాటలకూ కోప పడడం నాకలవాటు లేదు
ప్రేమించడంతప్ప ద్వేషించడం నాకు తెలియదు
నీవు నన్ను సరిగా అర్థం చేసుకోలేదనుకుంటా
వచ్చినట్టే వచ్చి,ఏమీ చెప్పకుండానే వెళ్తున్నావ్ !!''
========================== తెలుగు రచన

వెన్నెలెరుగని రాత్రులెన్నెళ్ళిపోలేదు

====================
వెన్నెలెరుగని రాత్రులెన్నెళ్ళిపోలేదు
వెలుగెరుగని రాత్రులెన్నయ్యిపోలేదు
ఈ ఇంటవెలుగు చూసి దీపమనుకోకు
నా కళ్ళల్లో ఒత్తులింకా ఆరిపోలేదు
===================
............................తెలుగు రచన

మనసులేని మనిషి

========================
కాలగమనంలో తరాలు మారిపోతాయి
వయస్సుతోపాటు ఆలోచన్లు మారతాయి
పరిస్థితులనుబట్టి నిర్ణయాలు మారుతుంటాయి
మనసు మార్చుకోవాలని నేనూ అనుకుంటాను
కానీ,ఏంచేయను?
నా మనసు నాకిచ్చెయ్ మని అడగలేకుంటాను
మనసులేని మనిషిగా బ్రతకలేకుంటాను
=========================
..................................తెలుగు రచన