Monday, August 15, 2022

నీకేమి లేవయ్య కైలాశ వాసా













1906
తెలుగు రచన .
22/02/2020 
==================== 
నీకేమి లేవయ్య కైలాశ వాసా 
పైన నీవైతే కింద మేమయ్యా 
 నీరు నిచ్చే కొండ నాపైన పెట్టావు 
నీరు దప్పిక మమ్ము నీ నేలనెట్టావు ఇబ్బందులన్నీ ఈడ మాకెట్టి 
నిబ్బరంగా నీవు నాడ నుంటావు 
నీకేమి లేవయ్య కైలాశ వాసా 

 నాగు బాములు జుట్టి నాట్యమాడే నీవు
గంగమ్మనే జుట్టు శిఖలోన బెట్టావు 
నెలవంక సింగారమేమి భాగ్యంబు నీది 
నా బాధలేరీతి నీకు జెప్పాలి కైలాసవాసా
 శివశంకరా శంఖధారీ శివుడాజ్ఞ లేనిదే చీమైన కుట్టదు క్కు'బుద్ధి జనులీడేమో కోకొల్లలయ్యారు 
ఆ బుద్దులెవరిచ్చె ఆపలేవా నీవు ఆకాశవాసా
 ఇంతింత ఘోరాలు ఏల జాప్యం 
 నేలమొత్తం ఈడ చీడబట్టేనాయే
 నికృష్టులయితే నిండిపోయేనాయె 
 హిమగిరుల నడుమ ఏముంది స్వామి
 ఏతించుమోసారి బాట తప్పెను తీరు 
నీకెమి లేవయ్య కైలాసవాసా 

 నిన్ను చుట్టివచ్చి లోకమన్నా కొడుకు 
నీవన్న మాటకి లోకమెగురన్ 
బోయేనొక్క కొడుకు ఎంత భాగ్యం నీది 
ఏమి శివుడా ఈడేంది స్వామి ఇట్టాంటివాళ్ళు
మోసి కన్నా గానీ రోత పొమ్మందురాయే
  భ్రష్టమంతా ఇంత బ్రహ్మాండమే నిండె
 మోసమైతే చూడు లోకమంతానుండె వాయివరసలు బోయే తారతమ్యంబోయే
 తరుకెళుతున్నారు తల్లoటి బిడ్డల్ని
 తస్సదియ్యా వీళ్ళు తగలేయజూస్తుండ్రు సంశానులేముంది చచ్చినోళ్ళుదప్ప కాటిగాపుడాడ తగలేయనే జాలు బ్రతుకజస్తున్నారు చంపి బ్రతికేటోళ్ళుు
 చాలు చాలింకా శంఖు బూరించు 
ఈ కళ్ళు తెరిపించు నీ కన్ను తెరిచుంచు
నీకేమి లేవయ్య కైలాశ వాసా
 పైన నీవైతే కింద మేమయ్యా ======================
 యలమంచిలి వెంకటరమణ...✍🏻

Saturday, August 13, 2022

స్వతంత్రబానిస పౌరుల్లారా

1932
తెలుగు రచన
30/07/2020
===================
Telugu Rachana

స్వతంత్రబానిస  పౌరుల్లారా
చావుకు బుట్టిన చీమల్లారా
అలసీ సొలసిన జీవుల్లారా
ఆకలి మరిగిన ఆర్తుల్లారా

ఆఖరి వరస అధ్యాయంతో
ఆరవ వేదం సిద్దం చేద్దాం
అది మనకోసం మనమే వ్రాద్దాం
అంతరాలకు హద్దులు గీద్దాం

నడుమే వంగని నాయకులారా
వస్త్రం నలగని సేవకులారా
స్వర్గం కోరే త్రిశంకులారా
అరిగో అరిగో వశిష్ట పుత్రులు

అరిగో అరిగో వశిష్ట పుత్రులు
శాపం తప్పదు ఛండాలులకు
ఎందరు ఉన్నా విశ్వామిత్రులు
వజ్రాల మాల ఇనుమైపోవు

విశ్వామిత్రులు ఎందరు ఉన్నా 
తల్లకిందులే త్రిశంకు స్వర్గం
తలపులు మారే సమయం ఇదిగో
మూసిన తలుపులు తీసేయ్ తీసేయ్
========================
         యలమంచిలి వెంకటరమణ..

బురద నీటి యా కమలం కాను

                                                          
2059
Telugu rachana
తెలుగు రచన
22/07/2022







=======================
బురద నీటి యా కమలం కాను
చెత్త వీధిలో చీపిరి కాను
వెనుక చూడని విక్కము గాను
తిరుగుడు చక్రం సైకిలు గానీ 
పంటలు పెరికే కొడవలి గాని
కానే కాను  వృక్కము నేను
మృగముల నడుమ ఒదుగి బ్రతికెడి 
చీనము, చమూరు, కానే కాను,
నెత్తురు మరిగిన సింహం గాను
వీరుడు విడిచిన విల్లున్నేను 

కాల్చే కొద్దీ పదునుదేరిన గొడ్డలి నేను 
వెలిగే కాగడ యువతన్నేను
విరుచుకు పడేటి పిడుగున్నేను
విల్లు విడిచినా  విశిఖమును నేను
నివురు గప్పినా నిప్పున్నేను

కొలిమి నిప్పులో కొనలుదేరిన
ఖడ్గం నేను  కవచం నేను 
భవితకు పునాది బ్రహ్మ అస్త్రము
భావితరానకి  బారోస నేను 
భారతమాతకు ముద్దు బిడ్డనా
యువతన్నేను యువతన్నేను
=======================
                   య. వెంకటరమణ/..

పొద్దుగూకింది బాగా మబ్బు క్రమ్మింది

Telugu rachana
Telugu rachana


2059
తెలుగు రచన
24/07/2022
===============================
పొద్దుగూకింది బాగా మబ్బు క్రమ్మింది
వెలుగు కాస్తా సమసిపోతోంది
వేసవల్లే వేడి సెగలు  రగులుతుంటే
పిడుగుపాటుకు అక్కడక్కడ తూట్లు పడుతుంటే
అనగద్రొక్కే ఉక్కుపాదం అడుగులేస్తోంది
అసురధ్వనిలో ఆర్తనాదం అనిగిపోతుంది
అన్నెమెరుగని చిన్న ప్రాణులు చితికిపోతుంటే 
తెగల సెగల మంటలోపడి
మానవత్వం మాడిపోతుంది
మనిషినే మరి మనిషి చూసి వణికిపోతుంటే 
కడుపు కోసం కోరలెత్తే క్రూర మృగములు 
కాస్త కూడా కరుగ రాని కొండరాళ్ళు
జాలి పడుతున్నాయ్ సోలిపోతున్నాయ్
 తెల్ల మల్లెలు ఎర్రబడుతున్నాయ్ రగతమవుతున్నాయ్
మతాలేమో తలో దారికి పరుగులెడుతింటే
కులాలేవో కొత్త జెండా లెత్తబోతుంటే
భవితకేచరిత మనము స్మరణకీయాలి
ఎవరికెవరు  ఎవరుగాక
చివరికెవరై మనము బ్రతకాలి
=============================
                               య.

Friday, August 12, 2022

అందని ద్రాక్షలు పులుపనుకుంటే

Telugu rachana
























2061
తెలుగు రచన
27/07/2022
======================
అందని ద్రాక్షలు పులుపనుకుంటే 
అంతకు మించిన సుఖమేముంది
అందిన వన్నీ చేదనుకుంటే 
పొందినవన్నీ వ్యర్థములెండి

కలలే  మనిషికి సాకారం 
ఎదగడానికి ఆధారం
కలలేకంటూ కూర్చొని ఉంటే
వాస్తవమంతా అతలాకుతలం 

ఎదగాలంటే ఎత్తులు చూడు
ఎదిగిన కొద్దీ దిగువను చూడు
బ్రతకాలంటే తిరిగి చూడకు
బ్రతికుంటావు వెనుక మరువకు

పయనములో పరుగులాపకు
పడిపోయెలా పరుగుదీయకు
కళ్ళకు గంతలు గుఱ్ఱం పాపం
అగమ్య గోచరమదేమి పయనం

లోకం చూడని ఆకలి కోసం
లోకులనెందుకు చూడాలంటూ
కళ్ళు మూసుకుని పాలు త్రాగెడి
పిల్లులు చెప్పే నీతిని చూడు

రాతలురాసే దేవుడు కూడా
రంగులద్ధడు అది నీ పూచీ
మండడమనేది మంట లక్షణం
మండిపోయినా, మంటకాగినా
అది మన సమ్మతము

పూజకు మోలని పువ్వులు కూడా
పుటమున గాలి ప్రాణంబోయును
ప్రాణం పోయిన మనుజుడు మాత్రం
తననే తాను విడిచిపోవును

చోద్యం కాదా మానవ నైజం
ఉన్న దానిని ఉపేక్షించడం
లేనిదానికై  ప్రాకులాడడం
చివరికి సర్వం విడిచిపోవడం
=====================
                  య.వెంకటరమణ/..

Tuesday, August 9, 2022

Comment here

నిశీధిలో జన సందోహం

2066
తెలుగు రచన
----/----/-------
====================
నిశీధిలో జన సందోహం

ముసుగుల్లో మరో సమాజం
లిప్తాభివ్యక్త అలసత్వాలూ
రక్తాలిప్త తేనె కత్తులు

మధుర భాష్యపు మర్మ భాషలు
సాధు మకుటపు క్రూరమృగములు
దిక్కుతోచని నిశీధి వీధుల్లో
ఎలా మెలగా లెలా మెలగాలి

సోక గీతపు కోకిలమ్మ,
రక్త లిప్తపు శాంతి సంజ్ఞ
మంచుగప్పిన ముళ్ళపొదలు 
మండుటెండన పండువెన్నెల్లు

మతులుబోయిన మందలవిగో 
మైకమబ్బిన మాంద్యమదిగో 
మేక వన్నె పులులు అవిగో 
మరక నోట్లకు మరిగిరరిగో

తరములీగతి తరలిబోతే
తనువు గాస్తా సల్యమైతే
సన్నగిల్లును మానవత్వం
తరలిరండి తరలిరండి

మరో వర్గం మేలు కొలిపి 
యువత వీపుకు విల్లు గట్టే 
సమత సాధన శంఖ భేరికి 
సమయమొచ్చే తలలిరండి
==================
         య.వెంకటరమణ/..

Sunday, August 7, 2022

Thursday, August 4, 2022