![]() |
Telugu rachana |
2059
తెలుగు రచన
24/07/2022
===============================
పొద్దుగూకింది బాగా మబ్బు క్రమ్మింది
వెలుగు కాస్తా సమసిపోతోంది
వేసవల్లే వేడి సెగలు రగులుతుంటే
పిడుగుపాటుకు అక్కడక్కడ తూట్లు పడుతుంటే
అనగద్రొక్కే ఉక్కుపాదం అడుగులేస్తోంది
అసురధ్వనిలో ఆర్తనాదం అనిగిపోతుంది
అన్నెమెరుగని చిన్న ప్రాణులు చితికిపోతుంటే
తెగల సెగల మంటలోపడి
మానవత్వం మాడిపోతుంది
మనిషినే మరి మనిషి చూసి వణికిపోతుంటే
కడుపు కోసం కోరలెత్తే క్రూర మృగములు
కాస్త కూడా కరుగ రాని కొండరాళ్ళు
జాలి పడుతున్నాయ్ సోలిపోతున్నాయ్
తెల్ల మల్లెలు ఎర్రబడుతున్నాయ్ రగతమవుతున్నాయ్
మతాలేమో తలో దారికి పరుగులెడుతింటే
కులాలేవో కొత్త జెండా లెత్తబోతుంటే
భవితకేచరిత మనము స్మరణకీయాలి
ఎవరికెవరు ఎవరుగాక
చివరికెవరై మనము బ్రతకాలి
=============================
No comments:
Post a Comment