Saturday, October 7, 2017

1581 యలమంచిలి వెంకటరమణ


06/10/2017
తెలుగు రచన
====================
పొద్ధే గూకని కుల వైరాలు
అంతకు పెరిగే వైషమ్యాలు
పేరుకుపోయిన మత మాంద్యాలు
నశించిపోతూ సంస్కారాలు
పేరుకు నిలిచిన బాంధవ్యాలు
బాధ్యత మరిచిన అనుబంధాలు
స్వలాభ నేతల దేశసేవలు
కొలుకుకు చేరని వాగ్ధానాలు
ఎప్పటికప్పుడు ఒడికే వాటం
తుప్పు పట్టినా రంగులరాట్నం
చూస్తున్నాం చూస్తున్నాం
భరించలేని బ్రష్టాచారపు
హద్దులు ఎరుగని అత్యాచారం
అంతే కానని అవినీతి యుద్ధం
భరించుకున్నాం భరిస్తు ఉన్నాం
తరాలు మారిన, మారని వైనం
తలరాతంటూ తలంచుకుంటూ
భరించుకుంటూ భరిస్తు ఉన్నాం
నల్లబారినా కంటి చారలు
బొగ్గు బారినా దీపంబుడ్లు
వెలుగే ఎరుగని దీనపు జీవులు
వేసారిపోయిన వ్యాకుల బ్రతుకులు
మరో ప్రపంచం ఇది మరో ప్రపంచం
మచ్చల నడుమ స్వచ్ఛత మరిచిన
ఉచ్చులనడుమ స్వతంత్ర జీవపు
జీవంలేని జనాలు బోలెడు
అదిగో అదిగో శంఖారావం
సిద్ధం జేసే సమర నినాదం
ఎవరికి వారే యుద్ధవీరులై
సేతవు జేసే బాధ్యత్త సమయం
బాధ్యత్త సమయం నీదే నీదే
నీవేనోయీ దేశం నీవే, నీవే నీవే!
====================