Thursday, March 5, 2020

జనం అంటె వందకాదు

సవరణతో
1779
తెలుగు రచన
13/07/2018
=================
జనం అంటె వందకాదు జనంఅంటె మందకాదు.
జనం,జనం. జనం అంటే జనంకాదు కోట్లమంది!
జనమంటే ఒక్కడేను జనమంటే ఒక్కడేను
ఆ ఒక్కడు నువ్వేనుఆ ఒక్కడు నువ్వేను

గాంధీజీ   ఒక్కడే నేతాజీ   ఒక్కడే
అల్లూరీ ఒక్కడేర జనమంటే ఒక్కడే
జనంపై నిందలేస్తు జనం కొరకు ఎదురుజూసు
జనంకాదు కాదు కోట్లమంది

సాధంచేదెంతున్నా సాధించేదొక్కడేను
సాధించే లక్ష్యముంటె జనమంతా ఒక్కడవును
ఆ జనం ముందు ఒక్కడేను, ఆ ఒక్కడు నీవేను

తెలుగు బాష ఒక్కటేను తెలుగు వాళ్ళమొక్కటేను
తెలుగువీరుడొక్కడేను తరికొట్టె నానాడు.
తెలుగు వీరుడొక్కడేను ఆ ఒక్కడు నువ్వేను

తరిమికొట్టు కుక్కల్ని, కొల్లగొట్టు, నక్కల్ని.
అధికారం మేడకట్టి,అదిమిపెట్టు కుక్కల్ని
గాదికాడ పందికొక్కు గ్రాసమంత తోడుకెళ్ళ
గానుగల్లె నలగనేల నడంకట్టు తెలుగువీర

అన్యాయంకెదురు తిరుగు. అడ్డంగా తెగనరుకు.
హారతిచ్చు ఆడపడుచు లాశాన్ని నీవెను
అనతియోచనెందుకంట తరిమిగొట్టనీకింకా,
దోచుకునే దొంగల్ని దోపిడీ ఈ దొరగాళ్లని

అన్యాయం అక్రమాలు ఆమడెళ్ళిపోవాలా
తిరిగి చూడ దమ్ములేక, అదే పరుగుతియ్యాలా
లంచమనేమాటకే పంచె తడిచిపోవాలా

తెలుగువీర లేవరా ధీక్షతోడసాగరా.
తెలుగుతల్లికెప్పటికీ ముద్దుబిడ్డగావరా
తెలుగువీర లేవరా ధీక్షతోడసాగరా.
తెలుగువీర లేవరా ధీక్షతోడసాగరా.
=================
యలమంచిలి వెంకటరమణ.. ✍

ధన్యవాదాలు