Thursday, April 30, 2015

వేలుగెరుగని ఉదయం

రగడం రగడం రాజ్యాలు రగడం
రగిలే కడుపుకు ఓదార్పు మంత్రం
ప్రజలే రాజ్యం - ఇది ఒక సోధ్యం
తృణమో పణమో బ్రతికుండడమే
ప్రజలకు పాపం రాజుల వరము
చెమటకు నిండని కడుపుల భారం
కన్నీరందుకు సాయం సాయం
సీతలపానుపు గోడలు మందం
గోడే వినని రాజుల వైనం
అదిగో కాంతి తూరుపునుదయం
అంతే వేగం పడమటి పయనం
వెలుగే ఎరుగని చీకటి బ్రతుకు
పడమటిలోనే సూర్యోదయము
సూర్యోదయము సూర్యోదయము
సూన్యం సూన్యం అంటా సూన్యం
ఆవిరికాని చెమటలకీగతి
సమాధి పాపం విశ్రాంతి మఠము !

...............య.వెంకటరమణ

Sunday, April 19, 2015

రామా ఓ రామా

ఓరిమితో.బ్రతకమని' ఓప్రక్కనమాకుజెప్పి,
నోర్వలేనికష్టఁబుల నొసగమీకు తగదుస్వామి!
ఓమాటకు కట్టుబడి,ఆజన్మం కష్టపడ్డ-ఓరామా!శ్రీరామా!
ఊరకుండనింతమీకు నెరవుకాదు మారామా!!

ఆనీతికి కట్టుబడి,ఆమంతం కష్టపడీ,
పొట్టకింతకూడులేక,సతినికూడ సాకలేక,
సకలరాజ్యాలొదులుకుని,శ్మశానాలు పట్టె
నట్టి సార్వభౌములు - శ్రీ.హరీశ్చంద్రులన్
సాధించావేమయ్యా- సాక్షంగా నిలుపమాకు ?

సత్యంగా బ్రతుకనేడు సాధ్యంగా లేదుస్వామి.
సడలు జనంచూడుతండ్రి! సఖలసౌఖ్యమొందనైరి!
సాక్షంగానిలవమని సోధింపన్  తగదుమీకు.
సాధ్యమైతె సవరించు. సుఖంకూడ ప్రశాధించు!!

ధైన్యంగా మారిపోయె - దైనందనజీవితాలు
ధనంకూడబెట్టనైరి - దుర్మార్గులు దుష్టులీడ!
పనికిరానిదైపోయే - పలుకనీతినిలపైన.
పరికించుము ప్రణిధివీవు-పరమునీడి పరమాత్మా!!


                                    య.వెంకటరమణ

Monday, April 13, 2015

ఆశాజ్యోతులు

అదిగదిగదిగో అగుపిస్తుంది
ఆశాజ్యోతులు వెలిగేకిరణం
అవినీతిరాజులకాఖరితరుణం
బొటనివ్రేలుతో భష్మంజేసే
బ్రహ్మాస్త్రం,బ్రహ్మాస్త్రం
రక్కసరాజుల చరమాస్త్రం
ఆచీ-తూచీ ...... సంధిద్దాం
అవినీతి అంతం చూసేద్దాం!!

.........య.వెంకటరమణ

Sunday, April 12, 2015

భయం భయం భవిత భయం

భయమేస్తుంది నాకు భయమేస్తుంది.
హద్దులేని అవినీతి అచ్చోసిన ఆంబోతుల
అరుచుకు-మీధడుతుంటే భయమేస్తుంది
భయమేస్తుంది నాకు భయమేస్తుంది !!

నిన్నగాక మొన్నచూడు-పేరు బడ్డ ఊరు లోన,
అబ్బకేమొ తెలియకుండ అన్నఅనుభవిస్తుంటే,
అన్నకేమి చెప్పొద్దని అబ్బఅదుముకొచ్చాడు.
చెప్పుకునే దిక్కులేక,బయట చెప్పుకోలేక
బయలుదేరెనాబిడ్డ,-ఉరితాడే నయమంటు.
భయమేస్తుంది నాకు భయమేస్తుంది
 ఈ అధ్వానం చూస్తుంటే భయమేస్తుంది !!

అమ్మఅన్న-అక్కచెల్లి అన్నిమరిచినమానుషం
చీకటిలా  అలుముకుంటు కామాంధం క్రమ్ముతుంటే'
వాయివరస మరిచి జనం,ఆవేశాలు తీర్చుకుంటూ,
ఉన్నీపాటి సంస్కృతిని ఊభిపాలు చేస్తుంటే ..
భయమేస్తుంది నాకు భయమేస్తుంది.
భావితరం భవితచూసి భయమేస్తుంది.!!

అధ్వానం గుండటమే  అభ్యుదయం అనుకుంటే,
అభ్యుదయం పేరుచెప్పి ఉన్నబట్టలిప్పుకుంటే,
బాయ్ ఫ్రెండ్  పేరుజెప్పి బడువుకెత్తి తిరుగుతుంటే,
భయమేస్తుంది నాకు భయమేస్తుంది
భావితరం రూపుజూసి భయమేస్తుంది !!

వ్యభిచారం తప్పంటూ లైసెన్సులు రద్దుజేసి,
వ్యవహారం నడుపుతున్న మనవారంతీరుచూడు.
లవరుపార్కు పేరుచూడు .. ఆడుండే తీరుచూడు.
కప్పుకుంటే ఏమీ లేదు .. విప్పుకుంటే కిరీటాలు
చిత్తరంగ ఉందికదా! చెప్పుకుంటే సిగ్గుచేటు !!

సావిత్రమ్మ తెలీదంట ... సక్కుభాయి తెలీదంట.
శరవతు ముంమైతు మస్తు మస్తు గురుతంట.
మతిబోయిన కుర్రకారు మైమరచి తిరుగుతుంటే
భయమేస్తుంది నాకు భయమేస్తుంది..
మనుగడనిక  తలచుకుంటే భయమేస్తుంది .

డేటింగులు-చాటింగులు ... అబ్బోచెప్పతరం కాదు.
ఆ వెబ్బులజోలికెళితె ... అసలు చెప్పతరం కాదు
అవనిపైన బుట్టినాము... అమ్మనైన వదలరేర?
భయమేసింది నాకు భయమేసింది ..
ఆ బూతుకథలు చదవబోయి నాకుభయమేసింది !!

........యలమంచిలి వెంకటరమణ

జనాలు

బ్రతుకుట కొరకు జచ్చే వీళ్ళూ,
అనాధి నుండీ పెద్దోళ్ళీళ్ళు.
చచ్చేటందుకు బ్రతికే వీళ్ళు
దెయ్యాలండోయ్ దెయ్యాలీళ్ళు
భారం కాదా బ్రతుకన్ జూడు
దెయ్యాల మధ్య బ్రతుకుల్ జూడు
భరించలేని బాధల మధ్య,
జీవం లేనీ జీవాలు వీళ్ళు
జీవించేటి మనుజులు వీళ్ళు.
మనుజులు వీళ్ళు-మనుజులు వీళ్ళు
శవాలమధ్య శవాలు వీళ్ళు
ఆశలకెరటం అంతే వీళ్ళు
సమాజమెరుగని జనాలు వీళ్ళు
సమాజమెరుగని జనాలు వీళ్ళు !!

............య.వెంకటరమణ

Wednesday, April 8, 2015

కన్నీరు

కలలుగనే కళ్ళకే కన్నీరు తెలుసులే.
కన్నీళ్ళే లేనికళ్ళు కలలేమికనునులే.
కలనిజమై నవ్వినా,కలచెదిరీ ఏడ్చినా
కడవరకూఉండేవే,కడవరకవి ఉండునులే.

చెప్పలేని భావాలు చెప్పేవి కన్నీళ్లు.
చెప్పేటి భావాలకు స్పందించే కన్నీళ్లు
చేసేదిలేక చూడు నేల జారిపోతాయి
నేలజారిపోతాయి,నేలనింకిపోతాయి.

తోడుండే వారంతా నిన్నువీడిపోయినా
తో'పండే  పంటకీ తొలకరిపులకించినా
ఒలికేవి కన్నీళ్ళే,పలకరింపు కన్నీళ్ళే.
ఓదార్పూ-సమకూర్పూ  కన్నీళ్ళే.

                     .య.వెంకటరమణ

అనాథ

అనాథవు కావునీవు-నాధులకేదాయినీవు.
నాధుఁడేగోల్పోయిన దీషణుఁడవీవు.
దిగ్గుజనుల బ్రతుకనేర్పు దమితుండవునీవు.
నిస్స్యుఁడవుగావునీవు-నెరకాఁడవెజూడవీవు !!

పరగష్టముగోరనట్టి  దుర్యుఁడవు నుర్వినీవు.
ధుర ధురమదిమోయునట్టి ధుర్యుఁడవు ధరనీవు.
ధిఃక్కారమునన్నిగల్గి దక్కులుజూసునట్టి
ధనికులమనిజెప్పుకొనెడి కృపనుఁడవుగావునీవు!!
       
                                        య.వెంకటరమణ


అలసిన అడుగులు

అలసిన అడుగులు నడిచొస్తున్నా సవ్వడిలవిగో వినిపిస్తున్నాయ్
పొలిమేరల్లో చిరు-పోధలాడే గుసగుసలవిగో వినిపిస్తున్నాయ్
హైన్యం ఎరుగని దేహం చేసే ఆలాపనలో అపసృతులున్నాయ్
రక్కసక్రీడకు స్పందన లేవి? రగిలేమంటలు అగుపిస్తున్నాయ్
ఆకలిమరిగిన గాజులు పాపం,రక్తపుమరకలు చవిచూస్తున్నాయ్
మొరటి చేతిలో మల్లెలు కూడా అల్లాడేనే  చెల్లాచెదురై
ఆఖలితీర్చే చెమటలు పాపం మంచును కూడా మరిపిస్తున్నాయ్
వెలుగే ఎరుగని చూపులు 'ఎవరని?'వేసే ప్రశ్నకు
చీకటి చెప్పే జవాబు ' కానిది తనదను నవాబు'
ఒదార్పెరుగని భాష్పాలవిగో,స్వేదంతోమరి చెలిమైపోయే.

........................................య.వెంకటరమణ.  ( 11/03/2014

ఆశూ/పత్రి

చెతస్కోపు బెస్టు .. జేబులకదిగురిపెట్టు.
జేబుకాస్త ఎత్తుంటే గుండెలయలు గల్లంతు.
పలచబడేలోపలే   పల్సురేటు గల్లంతు .
పల్సురేటు గల్లంతు-పల్సురేటు గల్లంతు.
పరుగుచూడు  అటూ-ఇటూ
అంతుబట్టనట్టి జబ్బు,ఒక్కడికే వచ్చినట్టు.
ప్రక్కనున్న రూములో పచ్చతెరల ఏర్పాటు.
పైనలైటు- క్రిందలైటు. ముఖానికో మాస్స్కెట్టు
భయమొద్దు,భయమొద్దని'బయపెట్టే మరోట్రిక్కు.
ఎర్రలైటు,పచ్చలైటు. ఏమున్నది జబ్బంటే?
వెలగబెట్టె ముఖాన ఏమీలేని రిపోర్టు .
అంతలోనే ముందుకొచ్చే బిల్లుకట్టే ప్రపోజు!!
.
                                  య. వెంకటరమణ

మన పరిచయం

మన పరిచయమే ఒక పుస్తకమై,
ప్రతి అనుభవం ఒక జ్ఞాపకమై,
అపురూపమైన నీ రూపాన్ని దాచి,
రాసే ఈ అక్షరాలే మన సాక్ష్యాలు  

ఏడు అడుగుల దూరంలో,
విధాత ఆటకి విడిపోయాము
కాని, చివరికి మిగిలే మన ప్రేమలో,
ఓడిపోయి కూడా మనం గెలిచాము

గతముతో నేను సతమతమవుతూ,
ఒంటరిగా ఎన్నో క్షణాలు గడిపాను.
ఆపుకోలేని అశ్రువులతో తడిచి,
ఈ యెదలో నా వ్యధ దాచాను.

దేవుడినే ద్వేషించాలి,
తలరాతనే దూషించాలి.
నమ్మలేని నిజాన్ని మరిచి,
నీ కలలో ఇక జీవించాలి.

నా మౌనంలో నీ సంతోషం ఉందని,
ఈ హృదయానికి సర్దిచెబుతాను.
నవ్వే నివ్వెర పోయేలా,
నీ కోసం నవ్వుతూ ఇక బ్రతికేస్తాను.

ఆచార్యదేవోభవా

మట్టిముద్ధవంటి వట్టిమనిషినైనా
ఇట్లుమలచనేర్చు ఘనులు మీరు
రాతిపలకపైన రాతల్నిదిద్దించి
బ్రతుకు బాటలిట్లు బయలుదీర్చి
శ్రమలుఓడ్చిమీరు మముదీర్చనైరి
యిలను వెలసినట్టి పరబ్రహ్మరూపా
జ్ఞానఫలములొసగు  విజ్ఞానభాండా.
గుడులుకట్టలేము పూజలన్నిమీవే
జయము జయము నీకు ఆచార్యదేవా !!

................... య.వెంకటరమణ

( నాకు తెలుగు అక్షరాలూ దిద్దించిన కీ!శే!  శేషావతారం మాస్తారు గారి జ్ఞాపకార్ధం
పూజ్యులగు ఉపాధ్యాయులందరికి అంకితం)

కమనీయం

కమనీయం కళ్ళల్లోకదలాడే ఈఉదయం
కమ్మిన మేఘాలేవో కదలాడే  తెరచాపై
వర్షించే కనుపాపలు హృదయానికి  ఓదార్పై
స్తంభించిన ఈమనసుకు నీపాటే ఓదార్పు
నింగదిగో నేనున్నానని నాతోనే దోబూచి
ననువీడని ఈ చీకటి  సాగేనే పరిపాటై.
పదిలం ఓ ప్రియతమా పరికించుమునన్ను
పగిలిన ఈగుండెల్లో ప్రతిబింబం మరి నీవే
నీవే అది నీవే. కమనీయం కళ్ళల్లో నానీవే !!

........................య. వెంకటరమణ

నవకవితా మాధుర్యం

నా మనసులోని వెలితిని
నీమాటల చల్లదనాల వెన్నెలపుప్పొడి
గలగలా రాలి నాపై వీచింది
స్తబ్దమైన నాహృదయం నీనవ్వుల
విరిపువ్వులు ఏరుకుని సంబరపడుతుంది ..

                                          మాధుర్య

ఆశాజ్యోతులు

ఆశాజ్యోతులు ఆర్పోతున్నాయ్
అందరికళ్ళూ ఎరుపౌతున్నాయ్
ఆకలిమంటలు చెలరేగదిగో
అగ్గిగమారే రోజొచ్చింది
సర్దుకుపోయే సమయంకాదు
సాధించేందుకు ఎవరూరారు
ఏరేమొక్కలు చాలాఉన్నాయ్
ఏరులుపాతుకు పీడిస్తున్నాయ్
ఎవరొస్తారని ఎదురుచూపులు
ఏముందింకని ఆశాపేక్షలు
ఏకంకండీ ఏకంకండి
సేధ్యంసేసే సమయంరండి
ఆర్తులనాధం కాదదిమిత్రా
శంఖారావం వినిపిస్తుంది
ఆర్తులనాధం శంఖారావం
అప్పుడుగానీ రాదారాజ్యం
అందరుగోరే ఆరామరాజ్యం!
.........య. వెంకటరమణ

శాంతి

తుపాకిగుండుకుతునాతునకలే అయ్యింది
విష్పోటంతో చెల్లాచెదురైపోయింది.
ధర్జీవానికి కబురంపండి.
చాకలివానిని పిలిపించండి.
ముక్కలు ముక్కలు కలిపైనా,
మళ్ళీ తెల్లగచెయ్యండి.
ఏదేమైనా వెతకండి-ఎక్కడికైనా వెళ్ళండి!!
విజయోత్సవమది తెలియకనా?
ఎందుకు తానిటువిలపిస్తుంది?
విప్లవమంటేనేమా!వింతగబయపడుతుంది.
మనమంటేనే బయపడిపోతుంది.
మరి మరి పరుగులు తీస్తాఉంది.
ఆయుధమేదీలేదేతనకి
మరి ఎవ్వరు కాపాడాలి?
పరుగులుదీస్తుందామె
పద పద పట్టుకురండి
ప్రహరీలన్నీ మూసెయ్యండి.
పిరంగిదాడులు ఆపేయండి.
ఆత్మాహుతులకు అడ్డెల్లండి
మారణహోమం నచ్చదు తనకి.
మానవహారంకట్టైనా,
మళ్ళీ తీసుకురారండి.
కాగితాలపై అచ్చేయండి.
కనిపించేదాకా వెతకండి.
ఆనవాళ్ళను చూపించండి.
అడిగినవాళ్ళకి చెప్పండి.
"తెల్లచీరకట్టుకుంది,
ఎరుపంటే బయపడుతుంది.
'శాంతి'పేరు పెట్టుకుని
అశాంతిగతానుంటుంది"
అందరు వెళ్ళి వెతకండి
ఆ శాంతిని మీరే స్థాపించండి!!

                 య.వెంకటరమణ

వినాశకాలం

వినాశకాలం వచ్చేస్తుంది.
విపత్తులన్నీ ముంచేస్తాయి.
వారధికున్నా గొళ్ళెంలాగేయ్.
ఒకటో-రెండో బాంబులువదిలెయ్!!

పాపంకట్టలు తెంచకపోతే,
లోకంపోకడ మారకపోతే ,
ముప్పేతప్పదు ఎప్పటికైనా.
ముందాభారం వధిలించండి!!

నాదీ-నీదీ ఏదీలేదోయ్.
లోకంమొత్తం సృష్టేనోయి.
సృష్టినిముంచిన స్పష్టతఉంది.
లొట్టలువేసి పాపంగట్టకు!!

లోకంపోకడ మారకపోతే
పాపంకట్టడి జెయ్యకపోతే
ముందొచ్చేది ముప్పేనోయి.
ముంచొచ్చేది నిప్పేనోయి!!

             య.వెంకటరమణ

ప్రేమ కానుక

చుక్కల్లో చూసాను చక్కనైన నీ జాడ
ప్రక్కన నువ్వున్నా చుట్టూ ఈశూన్యమేల?
ఊహలలో నీకై పంపాను పరువాల పల్లకి
వలపు తోటలో నే వేచా తోట మాలినై నీకోసం
పలకరించవే ప్రణయమా పరితపించు ప్రేమని!!

                                                   మాధుర్య

ప్రేమ కడలి

తీరమెరుగనీ యానం ప్రేమసాగరం .
చుక్కానిలేని మనకు,చుక్కెదురు ప్రయాణం.
చుక్కాని లేనిది నాప్రేమా,నువ్ చుక్కైపోకే ఓభామా
ఎక్కడ దిక్కులు లేవో, అక్కడ చాలిద్ధాము.
ముక్కల ప్రేమను కూర్చే ఒక్కటి చేసేద్దాము.
దూర దూర తీరంలో గూడు కట్టినాము .
చేరువైన ఈ ప్రేమని చెందనాడ లేమూ. .
 అందు నీవు నేనులే.ఉంది నేను నీవేలే ..
 గుండెతలుపు తీసిచూడు ఆడున్నది నేనుగా
 ఆ నువ్వే నేనుగా ! ఈ నేనే నునువ్వుగా
జగమంతా మనదిగ, సాగించే ప్రేమకి
నీవేగా సాక్షామూ,నీవేగా సాక్షామూ.
ప్రేమకిదే సాక్షమూ .. ప్రేమొకటే సాక్షామూ !!

................యలమంచిలి వెంకటరమణ

ఛఁ ట్టం

చట్టంబులనిటు రాయంబట్టి
పొత్తంబులుగా కట్టలుగట్టి
కట్టలుగా మరి కట్ట గట్టి
కట్టలమరుగున బట్టేనోయి
చట్టంబులు మరుగట్టెనోయి  
తొలకరి న్యాయం,దొలకలుజేసి జూడు
తొలచుకుబోవనాయే దులసరిమిడతలు
దండుకుపోయే దొంగలోయి దొంగలు
దండులు దీరిన పందులు మరివీళ్ళు !!
బరిగీచుకునికూర్చొని నువ్వుంటే
త్వరితేముందని వేచి, వేచి చూస్తుంటే .
తరము బోవు . వరము బోవు,
తరళిరమ్ము యువతరమా.
తడిమి తడిమి పట్టేద్దాం
చీకటి మరి తరిమేద్దాం
తరిమేద్దం యువతరమా
తరిమికొట్టి చీకటిని ...

............య. వెంకటరమణ

కోవెల ఎరుగని దేవత

కోవెల ఎరుగని దేవత నీవే మాకమ్మా
శివునికిదక్కని వరముల నొసగావమ్మా
బ్రహ్మరూపమే నీవమ్మా,జన్మను ఇచ్చిన 'అమ్మా!
యిల'లో వెలిసిన దేవతవమ్మా.మాతృదేవత నీవమ్మా.
నీవు మలచినా బొమ్మలు మేము
నీ ప్రేమకు మిగిలిన ప్రతిరూపాలము
అవనిలో వెలసిన ఆదర్శమూర్తివి నీవు
ప్రేమను పంచి,సృష్టికి వరమయ్యావు
అడుగులు నేర్పిన మాయమ్మా
అడుగడుగున నీవున్నావమ్మా
ఎంతని చెప్పము మేము,ఇంతగ పెంచిన'తల్లీ
ఋణపడియుందును నీకు,తరములుజాలవు తీర్చగ .
వరాలు కురిపే తల్లీ,దీవించమ్మా మమ్ము

................................మాధుర్య

నేను


సాక్షం దాచని చీకటి నేను  
కరుణే ఎరుగని ఖడ్గం నేను  
బండగ మారిన వృక్షం నేను
సుగంధమెరుగని పుష్పం నేను    
స్వార్ధం కమ్మిన సాధువు నేను  
నేనే నేనను అహంకారినే నేను
ప్రలోభాలతో పాతుకుపోయానేను  
వీరుడ్నినేను, సూరిడుడ్ని నేను
నా శవానికింత పాడైన కట్టే
ఓపిక లేని పరాక్రమశాలిన్నేను
తరాలుతరగని ఆస్థులకైతే అధిపతినేను
ఆరడుగులకే నోచని నేను
శవాన్ని నేడు శవాన్ని నేను  !!

...............య.వెంకటరమణ
"పదిమందికి సాక్షంగా ఉండలేని చీకటిమనిషిని నేను,నాలో దయా దాక్షన్యాలు లేక సాటిమనిషి సైతం చంపి జీవించు స్వార్ధజీవిని నేను,వృక్షంలా పదిమందికి నీడనీయగల నేను, నేడు జీవంలేని మ్రానులా మారిపోయాను. నాలో ఎలాంటి పరిమళమూ లేదు.దేవుని పోలికలతో ఉన్న నేనో స్వార్ధపరుడ్ని. అహంకారిని. ప్రలోభాలు నాలో పాతుకుపోయాయి.ఏమైనా చేయగల వీరుడ్ని సార్వాబౌముడ్ని, ధనికుడిని అనుకునే నేను చనిపోయిన తర్వాత నా పాడి నేను కట్టుకోలేను, నా యంత నేను సమాధి కాలేనని మరిచిపోయి స్వార్ధప్రలోభభరితుడినై   ఆస్తులంటే పోగుచేసుకున్నాను కానీ అందుకు నాకోసం నేనో నలుగురి మనసుల్ని సంపాదించుకోలేకపోతున్నాను.ఎన్ని సంపాదించినా నాఆస్తులు నాతో రావనీ , చివరికి నా శరీరం కూడా నాది కాదని. నా శరీరాన్ని పాతిపెట్టిన ఆ సమాధిలో కూడా నేనుండలేనన్న విషయమే మరిచిపోతున్న మనిషిని నేను .. శవంగా మారి మట్టిలో కలిసిపోయే మనిషిని నేను."

దారిమళ్ళించు

తనయుల్నిసాకంగ తనువునమ్మనే వచ్చు
జారవనిత మిన్న, జారబోతు కన్నా .
తనువు-నాస్థినేమి? తనవారినమ్మేటి
పనికిమాలి జబ్బు మనకంటనీయొద్దు.
మనకంటనీయొద్దు-మరి చెంత చేరొద్దు

జూదమనెడి జబ్బు యుద్ధాలతోనేజచ్చు
యుద్ధాల ఒరవడిలో రాజ్యంబులనే పోగొట్టు
మారాజులాంటోడ్ని  బైరాగిజేసేటి  జబ్బు
జూదమొలదుభాయి-జూదమొలదుమనకు !

జూదమొక్కటేన?!  తాగుడబ్బునెనక.
తాగుడన్నకేమో  పొగత్రాగసోకంట.
పనికిమాలినోళ్ళు పోగయ్యినారాడ.
మరిదారిమళ్ళించు  ఓ తెలుగుమిత్రా !!

............యలమంచిలి వెంకటరమణ

16

గరికమేయు దున్నలరకజేయు
మెరకదున్ని ఏరు జదునుజేయు
బోనమారగించు మందుండు నీమనిషి
బోగమెల్లగోరు వట్టి సౌనికుండు !!

................య.వెంకటరమణ

ఏరు=అరక (పొలము దున్నే సాధనము)
మందుండు = సోమరి
సౌనికుండు= పశువులను చంపుకు తినేవాడు
బోనము = బోజనానికి ( వండుకు తినేదానికి ) వికృతి
బోగము = సుఖము
గరిక =  ఒక గడ్డి

‘నా’టకం


నేనా ! నిన్నన్నానా? “నేనున్నానని”.
నేనననే నా ‘నైనా’ .
నిన్ను నేననను,
నన్నూ నేననను,
నన్నన్నా నేనినను.
’నానీ’నిన్ననేనని,నాన్ననేను నిన్న .
నేనే నిన్ననినా..,నానీ నిన్ననినా..,
 ‘నైనా’ నన్నింన్నింననేనా?
నైనా – నా నైనా !!
                 య.వెంకటరమణ

Tuesday, April 7, 2015

యుద్ధం

స్పృహలో ఉండి,యుద్ధంచేసా
ఫలితంగా నే అపజయమొందా .
ఆచీ తూచీ అంచనవేస్తే
కోల్పోయిందీ అర్థరాజ్యమే.
గెలిచినవాటికి లెక్కలు వేస్తే
ఒకటారెండా?వేలకువేలు
నేలకు వరిగిన సిపాయిలాళ్ళు.
గెలుపనుకుంటూ ఓడినప్రాణం
వెలకట్టేందుకు వెయ్యఁలెక్కలు
లేనేలేవే అంకెలు ఇంకేన్.
స్పృహకోల్పోయి యుద్ధంచేసా.
పోగులుపడ్డ శవాలపైన
పోరుకుపోయీ జయించుకొచ్చా.
పోయినప్రాణం ఖరీదు కడుతూ,
లెక్కలు గట్టఁ అంకెల్లేక ,
స్పృహలోఉండే యుద్ధంచేసా.
ఓడిందంతా జయించుకొచ్చా!!

.......య.వెంకటరమణ

స్వరాజ్యమాత

స్వరాజ్యమాతకు స్వతంత్రమెప్పుడు?
సమలోచనమది సాధ్యం ఎప్పుడూ?
సమరులు కన్నా కలలను కాస్తా
సమాధి చేసిన సమాజమాయెను !!

సర్దుకుపోయే సమయంకాదు
సదిరేస్తారు సుతరామంటూ.
సత్తాకలిగిన పౌరునివయ్యీ
చస్తూ - బ్రతికే  పనిలేదోయి !!

అవిగో వెలుగులు కనిపిస్తున్నాయ్
ఆత్రంగా  అవి  కనిపెడుతున్నాయ్
ఆరతి కాదు  ,     ఆజ్నంపోద్దాం.
ఆశాకిరణం వెలుగులు చూద్దాం !!

................. య.వెంకటరమణ

గమ్యంఎరుగని కాలం

గమ్యంఎరుగని కాలంతో
గమనంచేస్తూ ముందుండీ,
గతించిపోయిన కాలాన్ని
గమనంతో మరిముడిపెడుతూ,
కవితలువ్రాసే పనియంటే
సులభం కాదది సుతరాము.

సులభం కాదది సుతరాము
సూక్షమ దృశ్యం చూస్తూనే
చూడని కళ్ళకు చూపిస్తూ
చూసే కళ్ళను మరిపిస్తూ
కవితగమలిచే పనియంటే
సులభం కాదది సుతరాము
సులభం కాదది సుతరాము.

మనసుకు వెలుగులు చూపిస్తూ,
చీకటి పటనం సాగిస్తూ,
వ్రాయటమంటే పనికాదోయి
స్పందించేటి హృదయంతో
స్పందనకలిగే పదములతో
పదిలం చేసే పనియంటే
సులభం కాదది సుతారము.
సులభం కాదది సుతరాము.

.....యలమంచిలి వెంకటరమణ

తొలి ప్రేమ

కిలకిలపక్షులు కబురులునీవే చెబుతున్నాయి.
నీనవ్వును పోలీపువ్వులుకూడా వికసిస్తున్నాయ్
కదలే పవనాలవి,నీలానే  మధిస్పర్శిస్తున్నాయ్.
పచ్చని చీరతో భూదేవేదో ముస్తాబయ్యే వచ్చింది
నిన్నెన్నడులేని అందం ఏదో, వావై నాలోసాగింది
నాలో నేనే నవ్వుకునే ఈ వైనం ఏమది-ప్రేమేమో
ప్రేమేమో ! అది ప్రేమే ప్రేమే అంటుంది ...

...............య.వెంకటరమణ

ప్రేమేమో! ఇది ప్రేమేమో !


నాపెదవులపై వికసించే ఆ నవ్వులు మరినీవేనా,అవి నీవేనా?
నీవన్నది మరి వేరేలేదని నాకెందుకు అనిపిస్తుందది,నిజమేనా?
నా దదికూడా నీలానే అనిపిస్తుంది. ఏమయ్యే మరి ఏమయ్యే ?
నువ్ తాకినా అణువులు ధన్యంలా అగుపిస్తుంటే!అగుపిస్తుంటే,
నీతలరాలిన కుసుమాలేందుకు నా హృదయంలో వికసిస్తున్నాయ్?
వీచే పవనం నినుతాకిటు వచ్చిందనిపిస్తుంది. అనిపిస్తుంది.
నిదరోతే నీవుందవని మెలకువనే ఇటుగడపాలనిఉంది .
నీవుంటేనే చాలని ఎందుకు అనిపిస్తుంది?
నువ్ లేకుంటే అంతాసూన్యంలా అనిపిస్తుంది.
ప్రేమేమో అది ప్రేమేమో. ప్రేమే ప్రేమే ఇది ప్రేమేనేమో!
................................... య.వెంకటరమణ

వీడని చీకటి

వీడని ఈ చీకటి నన్నింకా వేధిస్తుంటే
ఎన్నాళ్ళని ఆకాశం వంగొంగివారిస్తుంది
వేధించేనీగురుతులు,రోధనతోకనుమరుగై
కదిలేటికాలంలో ఈ కలలన్నీనిజమైతే
ఈఊపిరి నాకెందుకు నీ చూపులుచాలంటా
ఆకాశం కౌగిలిలో ఆమంతం బ్రతికేస్తా !!

................... య. వెంకటరమణ

విళయతాండవం

విళయతాండవం-వికృత వైనం
స్వైరయానమే బ్రష్టాచారం
బట్టబైలుగా నిరంకుశత్వం
నేటికి సాగే బానిసత్వము .
చిప్పెడు గంజికి ఎప్పటిదాకా
చింపిరిగుడ్డల జీవితము.
కులాలజబ్బును పులుముకుని
కూటికి నీతిని  అమ్ముకుని,
పేటలుగా మరి పంచుకుని
పేటకు పార్టీ పెట్టుకుని
వాటాలేసుకు తింటుండ్రు
మనమాటే మరిచీనాయాళ్ళు.
యువతను నిద్దురలేపండి
సమతా మమతలు పెంచండి
భవితను తీరుగ దిద్దండి
నిరంకుశత్వం కోరలు తెంచి
నవయుగ స్థాపనచేయండి !!

............య.వెంకటరమణ

నీలో నేనై నీకోసం

పెదాలమాటున నన్నుండనీ
నీసుఖాలలో చిరుదరహాసాన్ని పాలుపంచుకుంటా!
కనురెప్పలా నన్నుండనీ నీ భాధలన్నీ కన్నీరునై కడిగేస్తా!
నీ పెరటిలో ఓ మొక్కలా నన్ను పెంచుకో
పువ్వునైవిరిసి నీలో నవుల్నిపూయిస్తా !
నివు చూసుకునే అద్దంలానన్నుంచుకో
నీమనసుకు ప్రతిబింబాన్నై లక్షముక్కలు చేసినా
ప్రతి ముక్కలో నీజ్ఞాపకాలనై అగుపిస్తా !
నీ ఉహనై నన్నుండనీ సుఖాలతివాచినై నీకుసంతోశాన్నిస్తా !!

                                                                   మాధుర్య

యువ (తరం)

విప్లవమావర్దిల్లని ఎవ్వరెంత అరిచినా,వీధులబడితిరిగినా
ఒరిగేది ఏమున్నది? , తిరుగుబాటు పేరుతప్ప!
యువతరం నిద్రపోతూ, ఊహల్లో తేలిపోతూ,
వెలకట్టని కాలాన్ని వెల్లకిల్లా గడిపేస్తూ,
వెలుగుచూడగోరెటోళ్ళు,వీధిలైటు స్థంబాలు,
వచ్చిపోయేటోళ్ళని పరికిస్తూ కూర్చుంటే
తోడేళ్ళదండులు, తోడుకు పోనొస్తున్నాయ్
తరము నీదిచూసుకో, తరిమి కొట్టకుక్కల్ని.
వెలుగు బాటలేసుకో, చీకటి బరి గీయక .
చీకటి తెరచీల్చంగా,వెలుగుచారలోస్తున్నాయ్
నీకోసం నిలిచిచూడు-నిలచి వలసపోతున్నాయ్
నీసత్తా చూపించు, నీవేమిటో  నిరూపించు
జైహిందను స్వరాలనే  జల్లులుగా కురిపించు !
నీకోసం నేనున్నా .. నీతోనే నేనున్నా
నీపైనే ఆశలతో నివురుగప్పి నేనున్నా .
యువతరమా నిద్రలే . యువతరమా నిద్రలే
నిద్రలే నిద్రలే..నీపైనే భవితలే !!

                                   య. వెంకటరమణ

విరహం

విరహం అదివేధిస్తూనే జ్ఞాపకాల వరమిచ్చింది.
దుఃఖంలో నీరూపం అందంగా నాకగుపించింది.
మబ్బులు తెరతీసేనేమో మధుమాసం ఇటువచ్చింది.
అద్దంలా నాహృదయం నీముందే మరినిలిచింది.
జలజల రాలిన నీమాటలపుప్పొడి జల్లులుగా కురిసింది.
స్థబ్దమైన నాహృదయం కన్నీరైకరిగింది.
ఇప్పుడు నేనున్నది నేలే ఐనా ఆకాశం అనిపిస్తుంది.
మేఘాలా కౌగిలిలో ఈమేను చలువదీరింది .
మండుటెండ వెన్నెల్లో మనసు పరవసించింది.
శ్రీ శ్రీ కే కాదుసుమా!అది నాకూ తెలుసనిపిస్తుంది!!

                                           య.వెంకటరమణ

అచ్చుల రామాయణం

అ) అయోధ్యకి రాజు , దశరథ మహారాజు
ఆ) ఆయనకు ముగ్గురు భార్యలు, నలుగురు కుమారులు.
ఇ) ఇలలో వెలసిన దేవుడు శ్రీరాముని కథ ఇది
ఈ) ఈయనకు భార్య సీత . సర్వ సుగుణాల సంపన్నురాలు
ఉ) ఉన్నరజ్యమొదలి అడవులకేగే, తండ్రి మాట వినుటకై
ఊ) ఊరు జనులందరూ ఒక్కటై సాగనంపగా,
ఋ) ఋషుల, మహ ఋషులను కాపాడుటకై
ఎ) ఎన్నో పాపాలు చేసిన రావణుని చంపి మంచిని నిలిపే
ఏ) ఏడేడు లోకాల శాంతికై చేసే అశ్వమేధం .
ఐ) ఐకమత్యమే బలమని వానరుల వల్ల  చాటే
ఒ)  ఒకే మాట,ఒకే బాణం,ఒకే భార్య అతన లక్ష్యమట
ఓ)  ఓటమెరుగని వాడిగా, ఆదర్శ్యవంతునిగా, రామరాజ్యమే స్థాపించే
ఔ)  ఔరా.. యనగ . దేవతలూ, జనులూ ప్రతియేటా  నవామినాడు చేతురితనికి కళ్యాణం
అం) అందాల సీతరాముల కథయే రామాయణము .

....................................... మాధుర్య

నా మాట

ఒక్క మాట వెయ్యి ఏనుగుల శక్తినిస్తుంది
ఒక్కమాటతో మనసు ముక్కలై
దిగంతలలోయలోకి కూరుకుపోతుంది
అందుకేనేమో దురానఉన్నానేస్తమా పలికే ఒక్కపలుకే
నన్నూ నా హృదయాన్ని సుతిమెత్తగా లాలించేది
నీ మాట నా మౌనపు నిర్లిప్తతల సమ్మెట ని
మౌనం ఒంటరిబాటసారిలాంటి దైన్యాన్ని
బ్రతుకు శ్వాసలో బారాన్నిస్తుంది నాకోసం
వెయ్యి వేణువులు ఒక్కసారిగా మీటిన
వీనుల విందైన సంగీతం నీ మాట
హిమాలయాలని జలపతాలని
మలయమరుతలాన్ని నా దరిచేరుస్తుంది
నీ పలుకులు పండువెన్నెలని  పంచి
పరవసిమ్పజేస్తుంది ఆ మాట
అందుకే అగు వరకునా శ్వాస
ఆపకు నేస్తమా నాతో మాట
కోపంలోనైనా అలకలోనైనా
మెచ్చుకోలుగానైనా మాటాడు నేస్తం !
దురాన ఉన్న ప్రణయమా
మాటివ్వు ప్రియతమా ఆపనని నీ మాట!
నా మాట .. నాకై నేనేసుకున్న పూలబాట!!

                      యలమంచిలి వెంకటరమణ 

ఎలా చెప్పను

అన్వేసిస్తున్న నాకన్నుల సాక్షిగా చెప్పనా
ఎగసిపడుతున్న నాగుండె సాక్షిగా చెప్పనా
ప్రతీక్షణం ననుతడిమే నీజ్ఞాపకాలసాక్షిగా చెప్పనా
ఎలా చెప్పను నేస్తమా నువ్ నా ప్రాణమని,
నువ్ లేనిదే నాకీవెన్నెల కూడా చీకటని.

                                       మాధుర్య

కోయిలా కూ ఇలా

కోయిలా!ఉడికించకు నన్నిలా
వసంతమంతా నీదేననుకుని
హొయలొలకాబోస్తావేలా?
నాప్రియునికి కబురంపానీవేళ
ఎదవెన్నెలకురియునులే,
మది గీతం పాడునులే
అది నీకూ చెప్పనులే,కోయిలా
కుహు కుహు కూయకిలా?
మధుమాసం నాదేనోయ్ పిచ్చికోయిలా
కుహు కుహు.ఉడికించకు ఇలా ఇలా!!

                                     మాధుర్య

నువ్ లేక

ఇన్ని దీపాలు వెలుగుతున్నా
ఈ చీకటి తెరలేలోయీ
కళ్ళుమూసుకుని పడుకున్నా
ఆనిదురా జాడేదోయీ
చుట్టూ మరి పదిమందున్నా
 ఒంటరితనమది  నాతోనేలా?
ఏ రాత,రాసిచూపనోప్రియా
నిను వదలి నేనుండలేననీ
ఏ పదములుపేర్చి వ్రాయను
నీవులేక యిక  నేనేలేనని ,లేనేలేనని !!

.........................మాధుర్య

మ(స్తం)త్తండి

గుట్కా ష్టాకు- గుడంబ షాపు
హుక్కాసెంటర్-డ్రగ్గులకెంటర్
రెష్టారెంటు- బీరుల సెంటు
డబ్బూ జబ్బూ - క్లబ్బూ పబ్బూ
అమ్మటుపోయే-నాన్నా లేటే
అందుకునేమో పబ్బుల బేటీ
అందీ అందని బట్టలు కట్టి
అందేందయ్యా ఊగిసలాట
ఊపే మైకం ఊరటకాదోయ్
ఉచ్చులఫందా పొంచేఉందోయ్
మాధకద్రవ్యం ముంచేస్తుంది
మున్ముందింకా ముప్పౌతుంది
ముచ్చటపడినువ్ మచ్చుకుబోతే
ముంచేస్తుందది మున్ముందంతా!!

                      య.వెంకటరమణ

అధునాతన భారతం

అధునాతనవిశ్వంతో  నన్నుకూడ మార్చుకున్నా.
అమెరికాతో పోటీపడి నా అవతారం మార్చుకున్నా.
అవతారం మార్చుకున్నా,ఆచారం మార్చుకున్నా,
అవసరమదికాకున్నా ఆ పద్ధతి నేర్చుకుని
ఆపదలోపడుతున్నా అదే బాట నే నున్నా.
పెద్దమ్మా,చిన్నమ్మా-అత్తమ్మా, నాతమ్మా
అందరేడబోయేనో !అంటీతొ తేల్చేసి,ఎంటేంటో అంటున్నా.
అధునాతన విశ్వంలో నన్నుకూడ మార్చుకున్నా.
విభజించి పాలించు రాజ్యమేలు సిద్ధాంతం
ఏకంగా ఎత్తుకొచ్చి ఇంటగూల్చ పెట్టుకున్నా
ఏడుమూరలెందుకని,ఎడించీలేసుకుని,
నాదేశందేముందని ఆదేశంననుసరించి,
ఏడడుగుల నడకేందని ఏకాంగానేతించా
‘ఉమ్మడంటే కుమ్ముడని’అమ్మడేమో ఆడబోయే,
తమ్ముడేమో ఈడబోయే,అమ్మ జాడ తెలియకాయే,
అధునాతనవిశ్వంలో అమ్మజాడ తెలియకాయే.
కప్పుకునే గొప్పులన్ని ఇప్పనాకు సిగ్గులేదు
సిగ్గుకంటే సిగ్గుబోయే,అధునాతనవిశ్వంలో బొత్తిగా దగ్ధమాయే.
అధునాతనవిశ్వంలో అన్నిమార్చుకున్నా,
ఇన్నొంకులు తిప్పలేక అమ్మభాష వదులుపెట్టి,
అమెరికాతో పోటీపడి ఆంగ్లభాషనేర్చుకున్న,
అవతారం మార్చుకున్న,ఆచారంమార్చుకున్నా.
అధునాతనవిశ్వంతో  నన్నుకూడ మార్చుకున్నా.

......................................య.వెంకటరమణ

( అధునాతనం గోరి పరదేశాలతో పోటీపడుతూ మనం సాధించిందేముందో కాని, అవసరం లేని పరదేశీ విధానంలో-భాషనూ, వస్త్రధారణను, ఆప్యాయంగా పిలిచే పిలుపులను,ఉమ్మడి కుటుంభజీవనాన్ని అన్నీ వదిలేసి, ఆరడుగుల చీర ఎవరు కడతారని . చిన్న చిన్న చెడ్డీలు వేసుకుంటూ ,, సాంప్రదాయ విధానపు పెళ్ళిళ్ళు మాని సహజీవనాలు చేస్తూ, రిజిస్టర్ పెళ్ళిళ్ళు చేసుకుంటూ,మన ఆచారాలను హతమారుస్తున్నాం.చివరికి ' తెలుగు అయితే ఇన్ని వంకులు తిప్పి వ్రాయాలి. ఇంగ్లీష్ అయితే దించిన పెన్ ఎత్తే పని లేదని మాతృ భాషనూ కూడా వదిలేస్తున్నాం .ఇది నేటి దౌర్భాగ్యం . ఇదేనా అదునాతనమంటే ? )

నీ నవ్వు

కనులు మూసుకుని మగత నిద్రలో ఉన్నవేళ
తొలిచినుకుల తుంపరలు మోమును స్పర్శించాయని
కళ్ళు తెరిచి చూతును కదా ! తుళ్ళిపడే నీ అల్లరినవ్వులవి
మనస్సులోని మాధుర్యమంతా నవ్వులో నింపుకున్నవా-
అంత తియ్యగా వినబడుతుంది ?
ఏటిగాలి,ఎంకిపాట-ఇంద్రధనుసు, ఇసుకతెన్నెలు
సృష్టిలోని అందాలంటారు. కానీ చిత్రం !
నీ నవ్వుకవేమీ చాటిరానేరావే నేస్తం !!

..............................మాధుర్య

ఆశ

ఆగిపోకే కాలమా - ఆశ తీరే వరకూ
రాలిపోకే పుష్పమా-వసంతం వచ్చేవరకూ
జారిపోకే మేఘమా -జల్లు కురిసేవరకూ
తేరుకోకే స్వప్నమా-జామురాతిరి వెళ్ళేవరకూ
కరిగిపోకే జ్ఞాపకమా-తిరిగి కలిసేవరకూ
సడిచేయకే చిరుగాలీ-చెలికాడు లేచేవరకూ
భాధపెట్టకే బ్రతుకా-తనతో ఉండే వరకూ
మరిచిపోకొ నేస్తమా-మరణాన్ని చేరేవరకూ!!

--------------------------------మాధుర్య

దయనీయం దయనీయం

దయనీయం దయనీయం-దేశంగతి దయనీయం.
బరిగీసిన భాగ్యరేఖ,మరిదాటని ఆకలితో-
అలమటించు అన్నార్తుల కెవరమయ్య భాధ్యులం?
అభ్యుదయం చూడబోతె అంతకంతకధ్వానం.
అజ్ఞానం అంతేలే- ఈ జ్ఞానం వింతకదా,
ఉన్నబట్టలిప్పుకుంటు, విలువ బెంచనీవైనం.

ఓపక్కన చూడబోతె యువతరమది తగుదునంటు ,
ఉధ్యోగం లేదంటూ ఊరులెంట దిరుగుకుంటు,
ఉన్నదంత తినుకుంటూ, ఊరకనే కూసుంటే!
విచ్చలవిడి సైన్యంలో ఒక్కొక్కడె జేరుతుంటే,
మిడిసిపాటు మరీ మరీ మిన్నంటుగ పెరుగుతుంటె
అద్వానం అద్వానం -దేశంగతి అద్వానం.
అందుకునే జనం మనం. ఇక ఇంతేనా మనం మనం.
దేశంగతి అద్వానం - దేశం గతి అద్వానం.

                                        .య.వెంకటరమణ

రెక్కలు

ఎప్పటిలానే అమ్మానాన్నలు అప్పటిలానే ఉన్నారు
ఇప్పుడు పిల్లలే మరీ ఇంతగా ఎదిగీ పెద్దోళ్ళయ్యారు .
రెక్కలువస్తే చూస్తారంటూ రెక్కలు కొట్టుకుపెంచారాయే
'రెక్కలువచ్చిన బిడ్డా,ఎక్కడికెళ్ళా'వంటూ-దిక్కులుజూసే
వాళ్ళు- అమ్మా నాన్నలు నాన్నా,అయ్యో మరిచారేమా?
ఎగిరే రెక్కలు ఏమో గాని-విరిగిన రెక్కలు మళ్ళీ రావక!
ఎలా బ్రతుకాలయ్యోయంటూ.. ఇలాగ బ్రతికే వీళ్ళు-
అమ్మా నాన్నలు బాబు .. మన అమ్మా నాన్నలు బాబు


                                     .యలమంచిలి వెంకటరమణ

సుమమాల

మధుర భావాల సుమమాలా
మనసులో  విరిసేనీ వేళ
పరవశించె నా హృదయం
పదిలమాయే ననురాగం !

అద్దంలో నారూపం
సిగ్గులొలుకు ధరహాసం.
ఇద్దరమే లోకమనే
ఇదో వింత సోయగం

మధుర భావాల సుమమాలా..
మనసులో  విరిసేనీ వేళ..

ఈవెన్నెల తెల్లారదు
ఎదకురిసెను జల్లుగా...
మదికలవరపాటుకీ
నీరూపం సాక్షిగా ..

మధుర భావాల సుమమాలా..
మనసులో  విరిసేనీ వేళ..
పరవశించె నా హృదయం ..
పదిలమాయే ననురాగం
ప ది ల మా యె నను రా గం!

..........................మాధుర్య

వెన్నెల్లో ఆడపిల్ల

నిన్నేనిన్నే తలుచుకుంటూ
నాలో నిన్ను చూసుకుంటూ
ఎన్నాళ్లని మురుసుకోను మామయ్యా
ఈ వన్నెలన్ని నీకేనోయి చూడయ్యా !

సిగ్గుపడి అందాలెంత ముద్దైపోయెనో
ముగ్ధమయ్యి మోము ఎలా కందిపోయెనో
వలువకింత చులకనాయే
నిలకడేది నిలువకాయే

నిన్నేనిన్నే తలుచుకుంటూ
నాలో నిన్ను చూసుకుంటూ
ఎన్నాళ్లని మురుసుకోను మామయ్యా
ఈ వన్నెలన్ని నీకేనోయి చూడయ్యా !

నక్కి నక్కి చందమామ నన్ను తొంగిజూసునేమో
నొక్కి నొక్కి ఊరంతా, తెల్లవారి చెప్పునేమో
బొట్టునింత జారనీకూ
కట్టునింత జారనీకు మామయ్యా

నిన్నేనిన్నే తలుచుకుంటూ
నాలో నిన్ను చూసుకుంటూ
ఎన్నాళ్లని మురుసుకోను మామయ్యా
ఈ వన్నెలన్ని నీకేనోయి చూడయ్యా !
.............................  మాధుర్య

జనశక్తి

అపరమైనా జనశ్శక్తీ
ఆకుమడిసి కూసుంటే,
అపరాలే కొనలేక
ఆకలితోచస్తుంటే,
జనంమధ్యచిచ్చుపెట్టి,
జనానికేకక్షబెట్టి,
జల్సాలే చెయ్యమీరు,
జాతరల్లెజూతురా?!
అల్పమైన మనుషులనీ,
అంతచులకనెందుకు?
ఆఛ్చేదనమాడతారు.
అల్లాడే జనంవీళ్ళు.
ఆరిపొయేదీపమేర,
లంకనంతగాల్చింది.
అంతుజూసివదుల్తారు,
అల్లాడేజనంవీళ్ళు
అల్లాడేజనంవీళ్ళు

---.య.వెంకటరమణ

ఎవడు పిచ్చోడు?

పిచ్చోడని కొట్టేయకు- పరమెరిగిన పుత్రుడీడు.
ఏకాగ్రత సాధించీ ఐఖ్యమైన దైవాంతుడు
తానెంచిన కార్యంలో తన్మయమై తానెప్పుడు
తపనమొందు తపశ్వీడు- పరమెరిగినపుత్రుడీడు.

కుతంత్రాలు యెరగనీడు-కుట్రబన్న తెలియనీడు
మధమెరుగని మనిషివీడు-మనకంటేనయంవీడు.
పిచ్చోడని కొట్టేయకు- పరమెరిగిన పుత్రుడీడు
ఏకాగ్రత సాధించీ ఐఖ్యమైన దైవాంతుడు!!

....................య.వెంకటరమణ

చీకటి


కళ్ళెం తెగిపోయదిగో కాలం పరుగెడుతుంది
పాపం! లోకం చూడోయ్ చీకటి దారులుబట్టే.
లాంతరు చూపగరండి.. దారులు మళ్ళించండి
దాదులు మీరవ్వండి ..దయతో చెయ్యివ్వండి!

                                      య.వెంకటరమణ

ఊహల్లో నీకోసం

చిత్రమైన ఈ బంధం , విచిత్రమైన మీ పరిచయం
నీవు తాకినంతనే మయూర భావం
నీవు పలకరింపుతో మయమరుపౌతుందీ లోకం
నీస్పర్శకై తనువూ,నీమాటకై మనసూ తపించిపోతాయి
నలుగురిలో నువ్వున్నా,నామనసు ఒంటరిగా నీతోనే.
ఊహల్లో నీతో జీవితం, కలల్లో నీతో కలిసి బ్రతకటం
ఈ జన్మకి చాలనిపిస్తుందీ అనుభూతులు తలుచుకోవటం
మరు-మరు జన్మకు మరీ-మరీ కావాలీసాంగత్యం
మరి నీ ఊహగానైనా, అది నీ జ్ఞాపకంగానైనా.
నిదురలేని రాత్రులూ,మధురమే నీ స్మృతులు
ఆ నరకం నాకొద్దు. నువ్ లేనీ ఆ క్షణము
నీఊహలు నను వేధిస్తున్నా,జ్ఞాపకాలు మదియిస్తున్నా.
నీకై తపించు నీమనసు,ఆగైనా ఆగిపోదు.నిలకడైనా నేర్చుకోదు.
మరు జన్మకూ నువ్ కావాలి. ఊహగానైనా, జ్ఞాపకంగానైనా.
నిన్ను మరువకుండా ఉండాలనే వరం నీవూ కోరుకోవా,
నన్నుమరువకుండా ఉండిపోవా. నాజ్ఞాపకంగానైనా నానేస్తం !!
                               
                                                                  .మాధుర్య

గ్రీష్మంలొ వసంతం


సంబంధాలు ,గ్రీష్మంలో తొలకరి చినుకుల వంటివి.
అలసిన మనసుకు,జ్ఞాపకాల  చల్లదనాన్నిస్తాయి.
బంధాలుపెంచే ఆత్మీయత,చల్లనిదే పున్నమజాబిలివోలె
అనుబంధాలనేవి విడదీయరాని పీటముడులు.
బంధాల బాటలో దొరికిన స్నేహమనే మజిలీ,
చల్లని హాయిగొలిపి,బాధల్ని పంచుకుంటుంది.
ఈ జీవనగమనంలో అడుగిడిన ప్రతిమనిషికి,
మజిలీకో బంధం, మరిచక్కని అనుబంధం.
మనసున్నమనిషికి అనుబంధాలో పూదోటలు.
మనసెరిగిన మనిషికి బందాలే బీటలులేని కోటలు.
గుర్తుంచుకో ఓ మనిషీ,
మనసులొ నువ్ పెనవేసుకున్న ఏ బంధమైనా
నిలుపు నిన్ను చిరస్మరనీయునిగా కలకాలం.
అనుబంధాల నీడలో...స్నేహితుల కళ్ళల్లో ..
..కావలసిన వారి మాటల్లో ...!?

..............................................మాధుర్య

మండేగుండెలు

ఉన్నారరిగో ఉన్నారు
రగిలినజనులిటులున్నారు
రెప్పలువాల్చని చిరుతల్లే
నిప్పులుచెరిగే కొలువల్లే
రాజీపడకీ రాబందులతో
రగిలే గుండెల మంటలతో
ఉన్నారరిగో ఉన్నారు
రగిలినజనులిటులున్నారు!!
రాహువుకమ్మిన రాజ్యంలో
రాక్షసరాజుల సైన్యంలో
ఉక్కిరి-బిక్కిరి వైనంతో
ఉన్నారరిగో ఉన్నారు
రగిలినజనులిటులున్నారు!!

...................య.వెంకటరమణ

తెలుగు


సోంపులొలుకు పలుకు తేటతెలుగు
జాలువారు తేనె తీపి పలుకు
మమత పెంచు మంచి పలుకరింపు
పరవశంపజేయు  తెలుగు పలుకు!!

మధురమైన బాష మన తెలుగు బాష
సొగసులొలుకు మంచిస్వరమున్నబాష
స్వశ్ఛమైన పలుకు స్వరమిచ్చు  బాష
యిలనులేదుచూడు  మరియొకటి  మిత్రా !!

...........................య వెంకటరమణ


ఒక మాధుర్యం

నా కవిత్వం నాదొక తత్వం
మరికాదు మీరనే మనస్తత్వం
కాదు ధనికవాదం సామ్యవాదం
కాదయ్యా అయోమయం జరామయం

గాజుకేరటాల వెన్నెల సముద్రాలు
జాజిపువ్వుల అత్తరు దీపాలు
మాత్రలోకపు మణిస్తంభాలు
నా కవితా చందనశాల ,చిత్ర విచిత్రాలు


madhu

జీవన్మరణం

అత్తరులద్దిన గంధం ఏమైపోయింది
ఖరీదు గంధం కంపైపోతుందెందుకు?
స్వేధంలో మధురం వెతికిన  నువ్వు
నాశికమదిలిస్తున్నావెందుకు?
కనుసన్నల్లో నడిపిద్దామనుకున్నా
నీ చేతులు అవి మూసేస్తున్నాఎందుకు?
ఎన్నడు కలువని అడుగులు నావి
తాళ్ళతో అవి కడుతున్నారెందుకు?
బంగారు గొలుసులు బోలెడు కాదా
నను తాళ్ళతొ కడుతున్నారెందుకు ?
ఆస్తీ-అంతస్థన్నీ నావే కాదా
నను బయటకు మోసేస్తున్నారెందుకు?
అలుపెరుగని ఆశలు కావా నావి
అంతా సూన్యంగగుపిస్తుందెందుకు?
సుతిమెత్తని పానుపులేమయ్యాయి?
కట్టెలపై నను జేర్చారెందుకు ?
నా వెనుకే నడిచే మీరంతా
నా ముందే నడిచెల్తున్నారెందుకు?
నే రగిలించిన నిప్పులుకావా అవి
నన్నే తగలేస్తున్నా ఎందుకు ?
నీ భయముకు ధైర్యం కాదా నేను
నను చూసే భయపడుతున్నారెందుకు?
నా ఆశల వలయం కూల్పోతుంటే
ఆస్తులవాటాలేస్తున్నారెందుకు?
మృత్యువుకే మృత్యువుననుకున్నా
ఆ మృత్యువు నన్నూ కభళించిందే!
సామంతం ఎరుగని చావిది
ఇప్పుడు నను కభళించిందే
 ఆ చావును మరిచానేను
అది మరువక వెంటాదిందే
బ్రతికుందును మీలోనేను
మనస్సులో బ్రతికే ఉందున్నేను
అవకాశం నాకుండుంటే
అయ్యో బ్రతికుందున్నేను
అయ్యో బ్రతికుందున్నేను !

                య. వెంకటరమణ

బడిపిల్లలు

ఎంపీ గారికేమో ఎడంపక్కసీటు
ఎమ్మెల్యేగారికీను ఎనకమాల సీటు
పెద్దవాళ్ళకుంది చూడు అటూ ఇటూ సీటు
ఆడవారికందరికీ ఆప్రక్కన సీటు-గేటు.
బండిమోపు బొక్కులన్ని ,బుజంమ్మీనవేసుకునీ,
పాపం బడి పిల్లలకు, పక్కనింత చోడులేదు.
ఓటుహక్కులేదనా?,ఊరికే దండగనా?

                                            య.వెంకటరమణ

మబ్బుతెరలు

వెన్నెలెంత చీకటాయె మబ్బుతెరలుకమ్మగా,
వెన్నెలేది కోయిలా చీకటాయె జీవితం!
కోరుకున్నవారికే దూరమయ్యినేనిలా,
బ్రతకాలా కలకాలం రోధిస్తూ విల విలా!
మూగబోయే నామనసు, మోడుబారెనీబ్రతుకు,
జాలిచూపు నేస్తమా, జారనీకు ప్రాణమా!
పిడికిడంత హృదయమిదీ-పిచ్చిప్రేమకోసమని,
పగలురేయి ప్రగళమయ్యి, పగలనాయె తాళక
జాలువారు కన్నీళ్ళే జాడనీది అడగంగా.!
కళ్ళుకుట్టు కున్నవారే కన్నీరూ పెట్టనైరి,
కనికరమేలేని ప్రియా! కక్షగట్ట భావ్యమా?!
కన్నకలలె కరగనాయె కన్నీటీ ధారలో,
కరుణజూపు నేస్తమా- కరుణించే ప్రియతమా !!

....................య.వెంకటరమణ

కల

<3 <3 <3 అనుభూతి <3 <3 <3

కలఎంత మంచిదైనా క్షణికమే.
మంచిదైనా,చెడుదైనా,అనుభూతి శాశ్వతంకదా
నిద్రిస్తున్న  ప్రతికళ్ళు కలలు కంటాయి, కానీ ...........నేస్తం
స్పందించే  మనసు అనుభూతి చవిచూడదు
మీరు పొందిన అనుభూతులన్నీ
మీరు సంపాధించిన  ఆస్తులతో  సమానం.
అవి తలచినవేళ పులకించి పరవశించినా,
గుండె బరువెక్కి కన్నీరు వచ్చినా...........
ఆ అనుభూతి పంచే , గుర్తుకు తెచ్చే అనుభవాన్ని
ఏమిచ్చి  కొనగలం ఏ లాకర్లో  దాచగలం
అనుభవించే కళ్ళ కన్నీళ్ళలో తప్ప.

.................................మాధుర్య

అంతం

నిర్మలమైనా ఆకాశం
నిప్పులు చెరిగెను ఆక్రోశం
అతలాకుతలం అంతరిక్షము
ఎంతనిమోయును ఇంతింతపాపం?

ఎన్నిమణుగులా పాపాన్నైనా
ఇట్టే హరించు గోదారమ్మా,గంగోత్రి
గొప్పులు కట్టెను అయ్యోపాపం
పాపాలు కడిగే జనాల ఆత్రం !

పాపం అంచులు దాటిందీ
ముంచేటి  రోజే రానుంది
వంతులుమారే పాపాలుమాని
ఇంతోఅంతో ఇంకా ఉందాం !!

...........య.వెంకటరమణ

ఇదే(మీ)చిత్రం

భ్రష్టాచారం కట్టెలుపేర్చి
అక్రమాలతో అగ్గంటించి
దహనంచేసే దైన్యంచూడు
సోధ్యంజూసే మనలనుజూడు!

ధరిద్రమేలే రాజ్యంలోన
ప్రాణంలేని జీవలమయ్యి
జనాభలెక్కకు  అంకెలుబేర్చే
జనాలమయ్యో జనాలుమేము!

జరిగినదానికి  బాధ్యుల్గాము
జరిగేదానికి యోజనలెయ్యం
దీపంవెలుగును పగలనుకుంటూ
సాగుచున్నదే బ్రతుకనుకుంటాం!

ద్రవ్యాలోభం మాయాజాలం
అంకెలతోనే ఆకలి మంత్రం
కోట్లకు కోట్లు అచ్చౌతున్నా
నోట్లే గానవు ఇదేమి చిత్రం !

జనాలమండోయ్ జనాలుమేము
జరాసకూడా జరగమ్మేము
అక్కడ వేసిన గొంగళిమేము
ఎప్పటికంతే జరగమ్మేము!

...........య.వెంకటరమణ

అన్నా నీవున్నవని

మేలుకో ఓయువతా ! మేలుకో నవయువతా!!
న్యాయమనే వలవేసి పట్టిచంపు కీచకులన్
నిర్భయవే అయ్యినీవు అండగుండు వనితలకు
హక్కులన్నీ పొందుతూ బాధ్యతగా మసులుకో
చట్టాలతో చుట్టిపడేయ్ దోచుకునే పురుగులను
దిగివచ్చు భారతమాత దీవింపగ నిన్నుజేరి
సమాజాన్ని ఉద్ధరిస్తూ,సంఘీభావం తెలియజేస్తూ
కులమతాలు వద్దని, ఐఖ్యంగా ఉండమనీ
పూర్వికులా అడుగులే నీజాడగ ఎంచుకుని
తప్పని సత్యం,నీతి,న్యాయం,ధర్మం మనదని
చరిత్రనే నువ్ చాటించు, స్త్రీ తలరాతలుమార్పించు
తాకవచ్చు భారతమాత నిన్నశీర్వాదింప !!

.......................................మధ్రుర్య

పల్లవేది పాటకి

పిడుగు పడెకద నాముంగిటనే,
పెకళించెనుకద పునాధులసైతం.
ఎంత మన్నుగప్పినా,ఎన్ని రాళ్ళుపేర్చినా
పూడ్చలేని గాయానికి పునాదులే వేయలేక
పగులుతున్న హృదయానికి బీటలైన పూడ్చలేక
ఇలామిగిలిపోయాను గతం చేదు గురుతుగా.
వేధనలో నన్ను వదలి ఒంటరిగానెళ్ళిపోయి
దాహంతో ఉండొద్దని కన్నీళ్ళే ఇచ్చితివే.
కలంనాకు వదిలి నీవు,సారమెత్తుకెలితివే.
ఎలా దిద్దుకోనమ్మా తప్పురాతలు.
ఎలా చెప్పుకోనమ్మా తీపిగురుతులు.
చెప్పవేమి ప్రియతమా? చిత్రమేమి దైవమా?
ఏ పాపం పగబట్టెను  ! నాదీపమె కొడిగట్టెను.
ఇన్నివేల జ్యోతుల్లో నాజ్యోతికి మసిబట్టెను.
అంధఃకారపంజరంమై నాబ్రతుకు కానకిటులయ్యెను
పిడుగుపడి నాముంగిట అంతసూన్యమైపోయేను
ప్రియా ప్రియా!పిలిచినా పలుకలేని దవ్వుకేల
నీజాడే చెప్పరాద,నేను చేరగా ?ప్రియ ప్రియ ప్రియా!

................................ ...మాధుర్య

నాలో..... నీవు

దేవుడే అనుగ్రహించిన వరానివో
పూజించకనే దక్కిన ఫలానివో
ఆశించకనే అందిన తీరానినో
కోరకనే నెరవేరిన కోరికవో
అధ్రుష్టానివై  చేజిక్కిన స్నేహానివో

అందుకే ...  
ఆశ్చర్యమే!అచ్చెరువొందే అనురాగం
అసూయకే ఈర్ష్య పుట్టే ప్రేమ
దురాశాకే ఆశపుట్టే అనుబంధం
చెలిమికే చెలిమి చేయలనిపించే స్నేహం

కేవలం ....
నాకే నాకే సొంతం అది నీవల్లేనోనేస్తం

....................... ...  మాధుర్య

మజిలీ

కలలైనా నచ్చినవి రావే!
జీవితపు కష్టాల కడలిలో
కన్నీరై సాగే ఈ నౌక
కడ ఎరుగని పయనం
మజిలీకో బందం
కనిపించని అనుబంధం
కల్పితమో మరి కలిప్రభావమో
మౌనం సహించలేని మధ్యతరగతి వ్యధ
ఆశలెన్నో...అగచాట్లే తుదికన్నీ  
బాపలేని చీకటి,ఎండమావి ఆరాటం
నాయకులిచ్చిన మాటలు ఎన్నికనాడే అంతం
వాగ్దానాలా వారధి-నీటను వ్రాసిన బాసట.
ఒట్టేసి చెబుతా.. అనుకోలేదేనాడు
విలువలేనిదే అవుతుందీ ఓటని.
గెలుపుకు  చెప్పిన మాటలకిటు
మాటలుతెలియని శిలనై పోతామని
ధరల సుడిగుండంలో
దరిద్రపు సంద్రంలో మునిగిపోతామని
 పెరిగే మేధస్సు కారణమా ?
మేతమేసు కాపుగాచు మనవాళ్ళా!!

============== మాధుర్య

నేస్తం

కుటుంబం పంచని బంధం
విధాత పంపిన బంధం
స్నేహమనే ఈ అనుబంధం
పెంచక పెరిగే సంతోషం
మనసుపంచిన మకరందం
మనసెరిగిన ఈ సంబంధం!
ఆశలన్నీ పంచుకుని
ఆశయాలెన్నో పెంచుకునే
మరుపెరుగని ఈ బంధం
 బాధలు కస్టాలు పంచుకొని
శత్రుత్వాన్నే తెంచుకుని
బీతలేరుగని బంధం!
స్త్రితి గతులతో పనిలేదంటా
కులమతాలసలే వద్దంటా
తోడై నిలిచే ఈ బంధం
అందమసలె అడగదు
స్వార్ధంతానెరుగని స్వశ్చమైన ఈ బంధం
అన్నిటికన్నా విలివైనది
రక్తసంబందం కాదిది
రంక్తం పంచే  బంధం
నీ మౌనపు నిల్ప్తల సమ్మెట
ఈ స్నేహపు బంగారు పూదోట
కలకాలం నిలవాలి మనస్నేహం
కలనైనా విడకూడదు ఈ బంధం!!

" స్నేహితుల దినోత్శవ శుభాకంక్షలతో"
            మీ నేస్తం

జాతీయపతాకం

ఆగష్టు పదిహేనొచ్చేస్తుంది.
అదిగదిగో గుమ్మంలో నిలబడి ఉంది.
ఆశలతో ఎదురెల్దాం,ఆనందంతో ఆహ్వానిద్దాం.
అక్కడక్కడా అపసృతులుంటే అక్కడికక్కడే సరిచేద్దాం.
అబసుపాలది కాకుండా జాతీయ ఝండా నిలబెడదాం.
ముల్లోకాలను మురిపించేది మూడు రంగులా మన ఝండా.
మీదా క్రిందా తెడాలెరిగి  మున్నుకు ఎగురగ చూపెడదాం
ప్రేమ, ధైర్యం, సహనం, శాంతి, కరుణ, మంచి, విశ్వాసం,
"హుందాతనం, సంయమనం, లాభాపేక్ష లేకుండటం, త్యాగనిరతి,
నిజాయితీ, ఖచ్చితత్వం, న్యాయం, దయ, ఆహ్లాదం, ఆర్ద్రత,
ధర్మాధర్మ విచక్షణ, జాలి, భగవంతునిపట్ల ఎరుక, ఈశ్వర జ్ఞానం,
నైతికత, పాపభీతి, భగవంతునిపట్ల శ్రద్ధ, ఆసక్తి, భక్తి విశ్వాసాల"
ఇన్ని నిండినా అశోకచక్రం ఒక్కో రేఖతో ఇరవై నాలుగు
కలచాక్రమది గిరగిర తిరుగుతూ మళ్ళీ మొదలవు
అశోకచక్రపు ఆనవాలుగ వెలిసెను చూడు ఆనవాలుగా
ధర్మపాలనకు అదియొకగురుతుగ-ధర్మపాలనకు అదియొకగురుతుగ.
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, నీలివర్ణము అశోకచక్రం
ఉప్పొంగిపోయే నినాదమదిగో "ఝండా ఊంఛా రహే హమారా..."
జాతీయ పతాకమంటే జాతికి చిహ్నం.మరువకు నేస్తం మరువకు నేస్తం
మురిపించే మువ్వన్నె చిహ్నం.జయహే జయహే జయ జయ జయ జయహే!!

( జాతీయ జెండా అవమానాలపాలు కాకుండా కాపాడుకొనే భాద్యత మనందరి మీదా ఉందని మరువకండి.)

........................................................యలమంచిలి వెంకటరమణ

జన్మాష్టమి శుభాకాంక్షలతో


పైకొని చూడరె వుట్ల పండుగ నేడు

ఆకడ గొల్లెతకు ననందము నేడు

అడర శ్రావణబహుళాష్టమి నే డిత డు

నడురేయి జనియించినా డు చూడ గదరే

అరుదై శ్రావణబహుళాష్టమి నా టి రాత్రి

తిరువవతారమందెను కృష్ణు డు

యిరవై దేవకిదేవి యెత్తుకొని వసుదేవు

కరములందు బెట్టితే కడుసంతోసించెను

===========అన్నమాచర్య కీర్తన

యెదవాకిట

ఈ వాకిట విరబూసిన ముత్యాలాముగ్గులను
పరికించగ చందమామ పరిచెనుగా వెన్నెలిలా
పరవశించి కోకిలమ్మ పాడెనుగా స్వాగతం
జాలువారు కురులజేరి జాజులెంత మురిసెనో
పెరటి జామచెట్టుకెంత పొగరుచూడు ప్రియతమా
పరువమింత పరిచినా పగలబడి నవ్వుతుంది
చిలకకేమిచెప్పిందో వెకిలినవ్వులిసురుతోంది
పవనాల గిలిగింతలు పదే పదే నీగురుతులు
హృదయమనే ఇంటజూడు ఎన్నివెలిసిబాటులు
పరువాల పల్లకిని, పంపించా ప్రియతమా
ప్రకృతిలా హత్తుకో యెదతలుపులు మూసుకో
మదినిండా నేనుండగ మరిలేదిక తావుప్రియా
మరీ మరీ హత్తుకో మనుగడకే గురుతుగా !!

...............................మాధుర్య

ఆచార్య దేవోభవా



విలుకాడు పార్ధుండు గురువు నేర్పు
గురినెరుగు బాణంబు రామగురువుదీర్పు.
గురువు గరిమలెన్ని,చరితజూడనుర్వి
చరితజెప్పునోయి  ఆవిలువలిన్నిన్ని  !!

గనిన జనని  తరువ నిలుచునొజ్జు
జనమనిచ్చుదండ్రి జతనిల్చునానొజ్జు
గురువుకేమి కొరత భ్రుగువదోడబల్క?
గురువుదప్పలేరు బ్రతుకనేర్పనుర్వి!!

గురువులేని విధము గురినేర్వదదినెర్గు
గురువునెంచి గొలువు-మిగులబ్రాప్తి .
నెరవుగానివిధ్య నూరిపోయుగురువు
దరను వరములిచ్చు దైవంబు గురువు !!

గురువునెంత గొలువ సంస్కారమంతబ్బు
గారవించినెరవు కోరుగమ్యంబు నీకబ్బు
తెలుగురచన పలుకు తేటతెల్లమోయి
కరములెత్తిపలుకు గురులదినమునేడు!!

.........................య.వెంకటరమణ

( గరిమ = గొప్ప : ఒజ్జు= గురువు : బృగువ=సృష్టికర్త )

నాకో ఉత్తరమొచ్చింది


                                                                                              దివి : 12/10/2014
                                                                                              స్థలం: గంటి 
" యామండి ! 
నేను గుర్తున్నానా? ఏం తప్పు చేసానని నన్నింత సులభంగా మరిచిపోయారు? మీ సుఖము, దుఖము, అన్నీ మీతో పంచుకుని ఎల్లప్పుడూ మీకు ఓదార్పుగా నిలిచిన నన్నింత తొందరగా మరిచిపోతారని నేననుకోలేదు. నేను పుట్టిందే మీకోసం.అలాంటి నన్ను మధ్యలో ఇలా వదిలేస్తే నాజీవితమేమైపోతుందో ఒక్కసారైనా ఆలోచించారా? మీకే చిన్న భాధ కలిగిన నాతో పంచుకుంటుంటే మీ కష్టాలకు నేనే ఓదార్పనుకున్నాను.మీ సంతోషాన్ని ముచ్చటపడి చెబుతుంటే అదంతా నామీద మీరు చూపే ప్రేమనే అనుకున్నాను. మీ సంతోషాన్ని నా సంతోషంగా భావించి, ఊర్లు దాటి మరీ ఆ విషయం వెల్లడించేదాన్ని, మీరు ఇబ్బందుల్లో ఉంటె, నానా అగచాట్లూ పడి,ఎక్కడికేక్కడికో  వెళ్లి , మీ ఇబ్బందికి పరిష్కారం తెచ్చేదాన్ని, అదే నా జన్మ సార్ధకం అనుకునే దాన్ని. నేను రావటం ఆలస్యమైతే మీరు పడిగాపులు పడి నాకోసం ఎదురు చూసే రోజులు గుర్తు చేసుకుంటే నేటికీ నా మనసు పులకించిపోతుంది.  అలాంటి నాకేందుకండి ఇంత దూరమైపోయారు..ఇప్పుడు మిమ్మల్ని చేరలేని నా జీవితం అగమ్య గోచరమైపోయింది. నా జీవితంలో అమావస్య  కారుమబ్బులు ఇప్పటికే అలుముకున్నాయి.ఇప్పటికీ మీరు నన్ను చేరదీయకపోతే, ఆ చీకటిలో నేను శాశ్వతంగా కనుమరుగైపోతాను.
మీరీ మధ్య ఓ వగలమారిని వెంటేసుకు తిరుగుతున్నారని నాకుతెలుసు. రాత్రి పగల ఒక్క గంట కూడా వదలకుండా ఉంటున్నరట. అది మీ ఇష్టం.మీరు తనతోనే ఉండండి. వద్దనటానికి నేనెవర్ని? 
అయితే, మీ క్షేమాన్ని కోరుకునే దానిగా తనగురించి మీకు చెప్పటం నా భాద్యత.ఆమె మీ చెక్కిలి నిమురుతూ చెవిలో చెప్పే గుస గుసలకు మురిసిపోతున్నారు కదా?. ఆమె చెప్పేమాటలన్నీ నిజాలు కాదు. నిజానికి తనేం చెబుతుందో మరు క్షణమడిగితే తనకు గురుతుండవు. నాకు ల ఏళ్ళ తరబడి గుర్తుంచుకునేటంత గొప్ప ప్రేమ కాదండి తనది.అంతే కాదు మీకు చెప్పే ప్రతి మాటకు తను లెక్కలు వేసుకుంటుంది. రకం వసూలు చేస్తుంది. ఈ జేబులు ఖాళీ చేయాలనే చూస్తుంది. అంతే కాదు తనదగ్గర బోలెడు రోగాలున్నాయి. వాటిని ఇప్పటికే చాలా వరకూ మీకంటించిది. తన ఆయుస్సెలాగూ అంతంతమాత్రమే. తను పోయేది గాక , మిమ్మల్ని కూడా అనారోగ్యంపాలు చేయాలని చూస్తుంది.అది నాకులా రూపాయికీ, పావలాకి పనిచేసే రకం కాదు. తను పెద్ద వ్యాపారి.కావాలంటే కొంతకాలం తనకేమి పెట్టటం మానేసి చూడండి.మీరు తనకేమి ఇవ్వటం లేదని గ్రహించిన మరుక్షణం. మూతు ముడుసుకుని మూలాన కూర్చోక పోతే నన్నడగండి. దానికి లెక్కలెక్కువ.తను చేసే ప్రతి పనికీ వెల కావాలి.లేదా తన పేరున డిపోజిట్లైనా చేసుండాలి. 
తియ్య తియ్యని ఆమె కబుర్లకు మీరు మురిసిపోతున్నారే కాని ఇవన్ని మీరు గ్రహించటం లేదు.ఆ వగలాడిని నమ్మకండి. నష్టపోకండి. నేనున్నాను. నన్ను గుర్తు చేసుకోండి. నేనెప్పుడు మీకోసమే. హా ఆ దేవుడు నాకు మాటలివ్వలేదు. తనలా హోయలోలకబోయడం నాకు రాదు.ఇదేనా నా తప్పు.విధిని ఎదిరించి నేను కూడా మీకలాంటి ముచ్చటలు ఎలా చెప్పగలను.
ఇప్పటికైనా మించిపోయిందేమి లేదు. రండి . నేను మీకోసమే ఉన్నాను. మీరుంటున్న ఊర్లోనే ఉంటున్నాను. నా పెదిరకాన్ని చూసి నాకో పాత ఇల్లు ఇచ్చారు. అందులోనే ఉంటున్నాను. ఒక జీతగాడున్నాడు. పాపం ఉదయం నుండి సాయంతం వరకూ నన్ను కనిపెట్టుకునే ఉంటాడు. అతని సంరక్షణలోనే ఉంటున్నాను.
మీరంటే నన్ను గుర్తించలేకపోయారు కాని. ఊరు ఊరంతా నన్నెరుగుదురు. నా పేరు చెప్పి , ఎక్కడుంటుందని ఎవరిని అడిగినా యిట్టె చెప్పేస్తారు. మా ఇంటిముందు ఒక ఎర్రటి డబ్బా ఉంటుంది. అదే నా ఇంటి గురుతు. లోపల అయన ఉంటారు. ఆయన మీకోసమే కనిపెడుతున్నారు. ఆయన్ని అడగండి. ''ఉత్తరం ఉందా " ని . వెంటనే నన్ను మీ ముందుకు తెస్తాడు. చీకటి పడిన తర్వాత గాని రాకండి సుమీ. ఎవరన్నా చూస్తే తప్పుగా అనుకుంటారు.ఉదయం తొమ్మిది నుండి సాయంత్రం ఐదు గంటల మధ్యలో ఎప్పుడైనా రండి. వస్తారు కదూ?

ఇట్లు 
మీ రాకకై ఎదురు చూసే 

" ఉత్తరం"
*******

ఇదీ వరస

ఖర్మగాలి నువ్వుకాస్త అనారోగ్యమయ్యావో
అయిపోయిందింకంతే – అంతంతే,బ్రతుకంతే!
తలనొప్పికి స్కాన్నింగు-మెడనొప్పికి మెఘాస్కాను
కరంటులూ,కరన్సీలు – కలక్షన్ల కౌంటర్లు.
అంతే ఇంకంతే – బ్రతుకంతా ఇంకంతే !
రోగమొచ్చి రొప్పుకుంటు,తిండిలాగ మందు మింగి,
తిరగలేవు ఊరలంట – తిరగకుంటే బ్రతకలేవు.
పడకుండుట మేలుచూడు,ఔషదాల విందులోన.
అతిసుఖిగా పెద్దరోగి-అలుపుజేయ ముప్పుగాదు.
అనారోగ్యమదోఎత్తు-నరక ద్వారా మొదటిమెట్టు.
కసరత్తది గమ్మత్తు-అదే మంచి మరామత్తు.
మొదలుపెట్టు కసరత్తు-ముందుండు మరోమెట్టు!!

......................యలమంచిలి వెంకటరమణ

జనం అంటె వందకాదు

జనం అంటె వందకాదు జనంఅంటె మందకాదు.
జనం,జనం. జనం అంటే జనంకాదు కోట్లమంది!

జనమంటే ఒక్కడేర,  జనమంటే ఒక్కడేర.
ఆ ఒక్కడు నువ్వేరా. ఆ ఒక్కడు నువ్వేరా,
జనమంటే నువ్వేరా.జనమంటే ఒక్కడేరా.
గాంధీజీ ఒక్కడేర. నేతాజీ ఒక్కడేర,
అల్లూరీ ఒక్కడేర. జనమంటే ఒక్కడేర!

సాధంచేదెంతున్నా సాధించేదక్కడేర
తెలుగు బాష ఒక్కటేర,తెలుగు వాళ్ళమొక్కటేర.
తెలుగువీరుడొక్కడేను తరికొట్టె నానాడు.
తెలుగు వీరుడొక్కడేర, ఆ ఒక్కడు నువ్వేరా.
తరిమికొట్టు కుక్కల్ని,కొల్లగొట్టు నక్కల్ని.
అధికారం మేడకట్టి, అదిమిపెట్టు కుక్కల్ని
గాదికాడ పందికొక్కు గ్రాసమంత తోడుకెళ్ళ
గానుగల్లె నలగనేల నడంకట్టు తెలుగువీర
అన్యాయంకెదురు తిరుగు.అడ్డంగా తెగనరుకు.
హారతిచ్చు ఆడపడుచులాశలన్ని నీవేరా.
అనతి యోచనెందుకంట అందుకోర హారతులు
అన్యాయం అక్రమాలు ఆమడెళ్ళిపోవాలా
 తిరిగి చూడ దమ్ములేక,అదే పరుగుతియ్యాలా
లంచమనేమాటకే పంచె తడిచిపోవాలా!

తెలుగువీర లేవరా ధీక్షతోడసాగరా.
తెలుగుతల్లికెప్పటికీ ముద్దుబిడ్డగావరా!!.

............................ య.వెంకటరమణ

విద్య

నేర్చుకునేవరకూ నాకబ్బనీవిద్య
నేర్చుకున్నాకంట వెన్న తోడివిద్య
చేర్చుకునేవరకు కారు మనవాళ్ళు
జేర్చుకున్నాకింక లేరు పగవాళ్ళు !!
......................  య.వెంకటరమణ

అనుభూతి

కలఎంత మంచిదైనా క్షణికమే.
మంచిదైనా,చెడుదైనా,అనుభూతి శాశ్వతంకదా
నిద్రిస్తున్న  ప్రతికళ్ళు కలలు కంటాయి, కానీ ...........నేస్తం
స్పందించే  మనసు అనుభూతి చవిచూడదు
మీరు పొందిన అనుభూతులన్నీ
మీరు సంపాధించిన  ఆస్తులతో  సమానం.
అవి తలచినవేళ పులకించి పరవశించినా,
గుండె బరువెక్కి కన్నీరు వచ్చినా...........
ఆ అనుభూతి పంచే , గుర్తుకు తెచ్చే అనుభవాన్ని
ఏమిచ్చి  కొనగలం ఏ లాకర్లో  దాచగలం
అనుభవించే కళ్ళ కన్నీళ్ళలో తప్ప.

.................................మాధుర్య

అభినందనలు

అచ్చులుకావవి-ఉత్తఃల్లులేమికావు.
పొల్లు'గపోవవి-చెల్లనివవిగావుసుమీ.
ముత్యాలవి,మిత్రులునాకొసగిన
మురిపెఁబుల గుఛ్చాలివి.
గుప్పించిన హస్తాలివి-చెల్లించెడిస్తోత్రాలివి.
మధురమైనవాఖ్యలవీ-మీరరసినవాక్కులవి!
మరిజెప్పిన మిక్కిలేమి,మెప్పుల్గాదే !
విరబూసిన పుష్పఁబుల నారబోయుదీరున
వర్షించిన పధ-సంధులు పరికించిన ఆతల్లి
కురిపించిన వరాలివి- ప్రశాధించు భిక్షలివి !!

.... ఆధరించు అందరికీ ధన్యవాదాలతోఅచ్చులుకావవి-ఉత్తఃల్లులేమికావు.
పొల్లు'గపోవవి-చెల్లనివవిగావుసుమీ.
ముత్యాలవి,మిత్రులునాకొసగిన
మురిపెఁబుల గుఛ్చాలివి.
గుప్పించిన హస్తాలివి-చెల్లించెడిస్తోత్రాలివి.
మధురమైనవాఖ్యలవీ-మీరరసినవాక్కులవి!
మరిజెప్పిన మిక్కిలేమి,మెప్పుల్గాదే !
విరబూసిన పుష్పఁబుల నారబోయుదీరున
వర్షించిన పధ-సంధులు పరికించిన ఆతల్లి
కురిపించిన వరాలివి- ప్రశాధించు భిక్షలివి !!

.... ఆధరించు అందరికీ ధన్యవాదాలతో

చిరుదివ్వె

నా మనసుకు యేలికవయ్యి - నా నౌకకు సారికవయ్యి
చిరుదివ్వెగ వెలిసిన నీవు - వెలుగులు నింపీనావే
వెలితిగ మిగిలిన నాకు వరమై వచ్చీనావే !!

ఇన్నినాళ్ళు వేచి-వేచి ఇంకిపోయినీకళ్ళూ
ఎలా నిండిపోయినాయి,కళాకాంతితో ?
కనులు నిండిపోయెనోయి సవ్యజ్యోతిగా
మనసునిండి పోతివాయే కావ్య మూర్తిగా
మనసుచూడు ప్రియతమా! పరవసించెనింతగా
మాట మూగబోయెనే  నిన్ను గాంచినంతనే !

నా మనసుకు యేలికవయ్యి - నా నౌకకు సారికవయ్యి
చిరుదివ్వెగ వెలిసిన నీవు - వెలుగులు నింపీనావే
వెలితిగ మిగిలిన నాకు వరమై వచ్చీనావే !!

............................మాధుర్య

మారని మారకం


నిన్నేనేమో! అనుకుంటే నేడూ కూడా ఇంతేనా?
అమ్మేటోడి ధరలంతే కొనేటివాడి గతియేమా!
కొన్నైనా కొనలేకే అమ్మనాయే  ఉన్నఇల్లు.
పండించే రైతన్నలు పస్తులతో అగచాట్లు.
పప్పులమ్ము  దళారోడు కట్టనాయే మేడలెట్లు?
కందిపప్పు వందకెళ్ళే–రోజుకూలి బియ్యమాయే,
ఉల్లిపాయ రెల్లుగాయ నింగినంట బోవునాయే .
స్విచ్చులేసినంతనే బిళ్ళుపేలు మంత్రమేసి,
ఇంటింటా కరంటంటూ చిచ్చులేసి పెట్టినారు.
అప్పులింత మాఫీజేసి,పన్నులెంత పెంచిరయ్య,
గింతరోడ్డు చదునుజేసి, టోలుగేటు లెంతబెట్టె!
బండిరేటు  తగ్గజూసి  – ఇందానా పెంచిరాయే,
పెద్ధఫోజుకొట్టిరయ్య,పంచతీరు సొంత ఆస్తి.
గద్దెకెక్కి గలీజోళ్ళు గంజిదక్కనీయకాయే.
నిన్నేనేమో! అనుకుంటే నేడూ కూడా ఇదేనా?
నింగినంటు రేటులింక నేలజేరకవ్వునా ..!!
...........................య.వెంకటరమణ

ఆరాటం


తెల్లారిందదిగో –ఉరకల పరుగుల జనమరిగో,
వచ్చిపోవు వాహనాల ఓయబ్బో జోరదిగో.
ఉరుముపడ్డ ఊరునొదలి ఉరకదీయు తీరదిగో.
తెల్లారింధదిగో –ఉరకల పరుగుల జనమరిగో

తొందరంటే తొందరే-అందరికీ తొందరే
ఆమె'కడుపునింపనైతే అయ్యగారి' తొందర
ఆ తల్లికడుపు చీల్చనైతే బిడ్డకేమో తొందర .
అడుగులేయ నేర్వకున్న నడవనెంత తొందర.
నడకనేర్చినంతనే పరుగుతదీయ తొందర.
తొందరంటే తొందరె-అందరికీ తొందరే

ముక్కుపచ్చలారకున్న మీసాలకు తొందర
మీసమీడ పండకున్న రంగుబూయ తొందర
తొందరంటే తొందరని తొక్కులాడుజనంచూడు
పరుగులాటపందెంలో-పరువులాటయాగంలో
ఆరాటంకద్దులేని పోరాటం ఈడ చూడు
తొందరంటే తొందరే-అందరికీ తొందర.

శయ్యపైన చేరినాకసాఫీగా లెక్కలెయ్య
శ్వాసకాస్త జారుకుంటే,సాగనంప జనంలేరు.
సాధించిందేముందట,సాగనంప జనంలేరు
జనం మధ్య చోటు లేదు, జనానికా జాములేదు
సాధించిందేముందట? శ్వాసనిలుప ధమ్ములేదు
జనం మధ్య చోటు లేదు, జనానికా జామలేదు
తెల్లరిందిదిగో,తుదకిటు తెల్లరిందిదిగో !!
........................యలమంచిలి వెంకటరమణ

పాపం(ఆమె)


అమ్మలేని ఇల్లు, అమ్మో తేరుకోదు.
ఇల్లాలు తెలుసుకదా! ఇంటి దీపము.
మరముగప్ప ఒకేపదం, అమ్మ'వచనము
ఆధారము ఆడదిగా! అన్నింటా మౌలికమే
ఓదారుపు వరమిచ్చే, ఆ దేవత వనితగా!
వనితజన్మనోర్వలేని మనుజనెల్లయున్,
మనుజుల్లోలెక్కజూడ మూర్ఖమే కదా !!

..................య.వెంకటరమణ

సత్యం


చూసేవన్నీ నిజమనుకుంటే
గాల'న్నది మరి లేదంటారా ?
ఆకాశం' అది నీలం అయితే
సూన్యం అన్నది  తప్పంటారా?

కనిపించేవే నిజాలా చెప్పు
నిజాలు మొత్తం కనిపించవుగా.
సత్యం ఎప్పుడు సాక్షం వెతకదు
సాక్షం లేదని సత్యం చంపకు.

భగవద్గీతను ప్రమాణమెంచి,
తప్పులు సాక్షం చెప్పేవాడిని
తప్పని చెప్పి వదిలే చట్టం
శిక్షేవేయదు బలేటి చట్టం

చెల్లని రాతల కట్టలు బోలెడు,
ఒడ్డుకుచేరని కేసులుబోలేడు.
ఓయబ్బా ఇదేమి చిత్రం
శవమయ్యాకే  తీర్పుల తీర్ధం.

సాక్షం దొరకని సత్యం పాపం
సమాదికాదా-మారాలి చట్టం.
అదిగో పాపం సమాజమదిగో
న్యాయం కోసం బారులు దీసే..

న్యాయం  కోసం గోడలు కాదోయ్
నాలుగ్గోడల  వెలుపలకొస్తే
నాట్యం చేసే అన్యాయాన్ని
అక్కడికక్కడ ఖండించొచ్చు
నవనిర్మాణం సాధించవచ్చు !!

...............య.వెంకటరమణ

ఆర్తి


నీకై ఆగని నిరీక్షణ – నిన్నే చేరలేని అవేధన
అర్ధంకాని ఈ ఆర్తిని –అర్ధంలేని ఈ బందాన్ని
వేధించే ఈమౌనాన్ని-వినిపించాలది ఎలాగనేను?
నీకైవధించే నాఈమనసును-వర్ణించాలి ఎలాగనేను?

అందని  ఈ అభిమాన కుసుమానికే నిచ్చెన వేసిన నిచ్చెలిని
ఊహల లతనై నిన్నల్లుకుపోయి పంచని అనురాగాన్నే పంచా
తపిస్తున్న మది ఆవేదనని మౌనపు సమ్మెటల తాకిడికి
మదిపాడే ఆవేదనల గీతంనయ్యా నేను,గీతంనయ్యా నేను

అవసరం లేని మీకు అర్ధం ఎందుకు ?
అర్ధమైన నాకు అంతావ్యర్ధం తెలుసును నాకు
కోరుకునే ఇందరిలో ఒంటరినే  నేను..కాదు
ఎన్నో కలువల నడుమ ఒంటరి గులాబి నేను !!

........................................మాధుర్య

పల్లెకు పోదాం చలో చలో

**  **

రుబ్బురోలు-సన్నెకాలు
పచ్చిచింతా కాయ పచ్చడి
చల్లకామా-గొల్లబామ
ఉట్టుగట్టిన యన్నముద్ద!!

కొర్రభియ్యం-జొన్నకూడు
కొర్రమేను-చేపపులుసు
కిర్రుచెప్పులు-కోరమీసం
మామకెక్కెను నాటుసరుకు!!

సందెపొద్దు-సన్నజాజి.
చందరమ్మా-సత్తిగాడు.
పెందలాడే సద్దుమణిగే
సందుచూసే బిత్తరోడు !!

పొద్దుపొడుపు-పొల్లికేకలు
పెద్దివేసే సద్దెముంతలు
పరుగుదీసే మేకపిల్ల
పాలుగుడిసే ఆవుదూడ!!

పేకబెత్తెం-ఏకపంతులు
పలక-బలపం-పొట్టినిక్కరు
పనికి బోయే పల్లెపడుచులు
పదరాపోదాం పట్టమొదలీ!!
...................య.వెంకటరమణ

ఎండమావి


ఎంతైనా వీడు కూడ బ్రతుకు జీవుడోయ్
కట్టనింత బట్టలేక కడుపుకింత కూడులేక
ఎండకెండి నేల పండు బడుగు జీవుడోయ్
ఎవడి  గొప్పలాడివాయె వీడి తిప్పలెవరికోయి
వెండి కంచమొకడిదైతె ఎండవానలొకరివాయె
అడుసుపిండి ఆడికెళ్ళె కలిపినోడు కదలకాయె
ప్రభుత్వాలు మారనొచ్చె బ్రతుకలేక వీడుజచ్చె
బలాదూరు నాయాళ్ళకు బదులుజెప్పనోపికేది?
బంకమన్నుకింత రేటు ! బంగళాలు కట్టనొచ్చు
బజారులో ఇంతమోటు ఈసడింపు కేమిలోటు
తరాలెన్ని మారుతున్న తలరాతలు మారకాయె
తలోగింత మన్నుగప్పి సమాధైన గట్టకాయె!!

............................య వెంకటరమణ

హృదయం

హృదయమింత విధారము,ఎంత కటినము
పదిలమైన మనసుకి పగటి కలవరం
వెన్నెలాయె మండుటెండ ఎలా తాళను?
పందిరిట్లు  పరిహసించే ఏమి చెప్పను?

అంతస్తులు అడ్డుగోడ ఇదా హేతువు?
అందలేని చిన్న చేయి ఇదా శాస్తికం ?
ప్రత్యర్ధి ప్రణయమాయే  ఎలా బ్రతకటం?
జాలితలసి తెరిసిచూడు మనోద్వారము .

హృదయబారంమెంతనేది జెప్పసాధ్యమా?
చెప్పుకునే తావు లేని ఇదా జీవితం ?
శిక్షచాలు.. మన్నించమ్మ పేదప్రేమని
అమావాస కానీకమ్మ ఇంత వెలుగుని !!

..................... య.వెంకటరమణ

కణిక



నిశ్చలకణికను నేను
నీ భావాలకుసాక్షిన్నేను
పిలిచినంతనే పలుకగలేని
సరస్వతిదేవి పుత్రిన్నేను!!

భావాలకు రూపం నేను
భాధ్యతలకు సాక్షం నేను
అంకితమై నేనుంటాను
అన్నింటా నేనుంటాను!!

మూగమనసుకు బాషన్నేను
కవి'రాజుకు ఒక  నాయకినేను
కదనానికి నవసారధినౌతాను
కవితశృంకల బాటన్నేను!!

విదిరాసిన బ్రహ్మా నేనే
ఇది వ్రాసే నువ్వూ నేనే
శాసించే చట్టం నేనే
సాధించే లక్ష్యం నేనే !!

నీ వృత్తికి తోడౌతాను
నీ మాటకు గురుతౌతాను
ఎరుపెక్కిన రక్తం తో
ఏమైనా సాధిస్తాను !!

చూపుడువేలుతో దారులుగీచి
బొటనవేలుతో  నడకలుజేసే
సాహిత్యమాతకు తల్లిన్నేను
సరస్వతి పుత్రి కాలాన్ని నేను !!

..............య.వెంకటరమణ

పాతపుస్తకం



విద్యావంతులు వందలకొందలు
ఒక్కడు లేడా జ్ఞానమంతుడు?
అప్పుడు రాసిన చట్టాలన్నీ
ఇప్పుడుకూడా అచ్చులుగుద్దే
ప్రచండభారత మహీపుత్రులు!!

చదివేటప్పుడు రేంకుల యత్నం
చదువయ్యాక ఉద్యోగ రాట్నం
ఉద్యోగంలో ఒకటే తంత్రం
వెనకచూడటం,ముందురాయటం!

పెంచనువరకూ  తూతూమంత్రం
ఆతర్వాతిక  పంచన మంచం
అయ్ పోయిందీ జీవితకాలం
వచ్చేవారికి అచ్చులు సిద్ధం!!

రాజులు మారే,రోజులు మారే
రోజు రోజుకీ మనుషులు మారే
ఇరుకుసందులో ఏనుగు జారే
చట్టంమారదు ముప్పేనోయి !!

ఒక్కడు లేడా జ్ఞానమంతుడు.
అప్పుడు రాసిన చట్టాలన్నీ
ఇప్పుడు మార్చే విద్యావంతుడు
వెలుగు చూపేడి జ్ఞానమంతుడు!!

.............. య.వెంకటరమణ

వినాశపర్వం



నిర్భయ శాస్త్రం పట్టుకుని
చిక్కుల వలయంగప్పుకుని
రక్షితమనుకొను గోడలమధ్య
ఎక్కడ నేస్తం రక్షణ నీకు !
మహిసాసురులు వధించబడ్డా
మహిసానరులకు లోటేముంది?
రావణకాష్టకు నిప్పంటించి
రాజ్యాన్నంతా ఆవరించినా
రక్కసరాజులు బోలెడుమంది
రాముని జాడే కనబడకాయే.
పందికొక్కులు తోలిచేస్తున్నాయ్
పునాదులిట్లే నిలబడిఉన్నాయ్
మహిలో అలజడి మొదలయ్యింది
ముంచే రోజది రానే ఉంది.
పద పద పద పరుగులుతీద్దాం
మంగళగ్రహమును సిద్ధంచేద్దాం!!

.....యలమంచిలి వెంకటరమణ

యిలస్వర్గం


నూకబియ్యం-తాటిరొట్టు
ఎండబెట్టిన -ఒరుగుబద్ధలు
మిగలముగ్గిన-పనసపండ్లు
మీగడట్టిన-పెరుగుకుండలు!

ఎంకితెచ్చిన-ముంతగంపలు
ఇగరబెట్టిన-ఎండుజేపలు
ఉల్లిపాయా-చద్దెకూడు
ఊరబెట్టిన-పెరుగుతోడు!

మట్టి కాదది స్వర్గమయ్యా
మిరుమిట్లు గొలిపే అందమయ్యా
ఊరకే ఇది ఊరు కాదయ్యా
నీళ్ళరాకుంటది నోరుకాదయ్యా!

నలుగులాట నగరమెందుకు
పదర సోధర పల్లెకెళదాం
ఎంకిపాటలు ఆలకిద్దాం
పట్టమొదలి పల్లెకెలదాం !!

...........య.వెంకటరమణ

జీవితం


ఓడిపోయి గెలవటమే జీవితం
గెలిచి ఓడిపోవటమది తధ్యము
మరణానికి పెట్టలేని ముహూర్తం
జననానికి ఎందుకంట ? విచిత్రం!

సుఖదుఃఖపు అదినేతది కన్నీరని
తెలిసికూడ వెతకటం-గెలుపుకొరకు ఆరాటం.
గెలుపులాట పందెంలో చివరికోడిపోవటం.
ఇదేకదా జీవితం , చివరికిలా మిగలటం .

పది పదుల యానంలో పదికాలాలుండేవి
పదిలమైన గురుతులే-పదిలమైన గురుతులే.
ఓటమికీ గెలుపునకూ ఒకే ఒక్కమైలురాయి
తలకాడది స్థంభించగ తోడురాని ఖలనమిదీ

నాది నీదదేదిలేదు, నీదికూడ నీకులేదు.
సాధించది సాధ్యమైతే-శాశ్వతమది సాత్వికమే
సాధించది సాధ్యమైతే-శాశ్వతమది సాత్వికమే !!
                                        య.వెంకటరమణ

ప్రేమించుకోవాలి



చిరునవ్వే వరముగనిచ్చి, బరోసాగా బుజం తట్టి,
సాటిమనిషి మేలుకోరే స్వార్దమెరుగని మనసు కావాలి
......................................నేను ప్రేమించుకోవాలి
అందానికి అతీతమైన హృదయంతో, బీటలుబారని బంధాలతో
బాదల్నిపెంచే రాగద్వేసాలెరుగని  మనిషి కావాలి
......................................నేను ప్రేమించుకోవాలి
సంతోషమైనా,బాధైనా ఓ కన్నీటి చుక్క రాల్చాలి
దాని విలువేరిగిన ఓ వ్యక్తిత్వం ఉండాలి
......................................నేను ప్రేమించుకోవాలి
మమతానురాగాలు కురిపించే ఓ బంధం కావాలి
మధురానుభూతులు పంచె ఓ స్పర్శ కావాలి
......................................నేను ప్రేమించుకోవాలి
నాకోసం తానుండాలి,తనకోసం నే బ్రతకాలి
నాకై వేచే ఓ హృదయం కావాలి
......................................నేను ప్రేమించుకోవాలి
"నువ్వు లేకపోతే చచ్చిపోతాన'నే ప్రేమ కాదిది
నీ సంతోసంలో బ్రతుకుతాననే ఓ ప్రేమ  కావాలి
......................................నేను ప్రేమించుకోవాలి.

(ఇలాంటి ప్రేమకోసం ఎన్ని ప్రేమలు కట్టగాట్టుకొని సమ్మెచేస్తున్నాయో కదా)

==================== మాధుర్య /..

అయ్యో పాపం

బ్రతుకుట కొరకు చచ్చిన వాళ్ళూ
అయ్యో పాపం పోయారాళ్ళు
చచ్చేటందుకు బ్రతికే వీళ్ళు
దెయ్యాలండోయ్ దెయ్యాలీళ్ళు !!
భారం కాదా బ్రతుకన్ జూడు
భయాలమధ్య బ్రతుకున్ జూడు
భరిచలేని బాధల మధ్య జీవం లేకే
జీవించంగా,జీవించేటి మనిషిన్నేను
మనిషిన్నేను, మనిషిన్నేను
శవాలమధ్య శవంబు నేను.
ఆశలకెరటం అంతే నేను
అర్ధం కాని సవాలు నేను !!

............య.వెంకటరమణ

మువ్వన్నెజెండా-మురుపాలజెండా



రెప రెపలాడే జెండానుజూసి
రెండేరంగులు అనుకోకండి .
మధ్యన నలిగే తెలుపురంగును
ఎరుపురంగుతో కప్పేకండి!

ఇరవైనాలుగు ఆకుల చక్రము
నీతికి చిహ్నం,అశోకచక్రము .
అశోకచక్రం - ధర్మచక్రము
జాగ్రుతిలోయది మనకొకచిహ్నం!

సమరయోధుల ముందునడిచిన,
పిరంగి దాడులకు ధీటుగనిలిచిన,
శాంతి అస్త్రము,విజిగిష శస్త్రము
జెండాస్థంభము-మనకది గర్వము!

గలగలా రాలే పూలవర్షము ,
అమరవీరుల దీవెనలర్షము,
అదిమనభాగ్యం-అదిమనభాగ్యం
అమరవీరుల దీవెనలర్షము!

కిలకిల నవ్వుల బోసిపాపల
జనగణమన' యదిమన గానం.
ఏకత్వానికి తారకాణము
భారతమాతకు జేజేకారము!

భూదేవెప్పుడు పచ్చరంగుగా
ఆకాశం మరి రంగులు కురియగ
మధ్యన మనము శాంతిజీవులై
మువ్వన్నె జెండానెగరవేయుదాం!

స్వచ్చత నెరిగి సాక్షంగుందాం
మనస్వాస్థ్యం మనమే సాధించుకుందాం
వందెమాతరం,వందెమాతరం,వందేమాతరం
వందెమాతరం,వందెమాతరం,వందేమాతరం!!...జై హింద్

..........................య.వెంకటరమణ

పారీగత్తులు



ఎదోకాడికి ఇల్లయితేగట్టి,
ప్రహరీగట్టను ప్రారంభించగ.
పంచెలుగట్టిన పెద్ధలుజేరి,
ఆరాలుదీసే పారీగత్తులు .

అర్ధకానీ అయ్యోమయ్యం
అంతో ఇంతో ఉత్కోచామెడితే
అయ్యంగారు కొలతలకొచ్చే
డొలికిందంతా డొలుక్కుపోతూ
మక్కులు'మాత్రం పైపైనెట్టీ,
సంతమైతే పెట్టకబోయే.

అలసీ సొలసిన అధికారులకు నే
అదనంగా మరి చెల్లించుకుంటే
ఈడ్చిపెట్టిరి  ఇంకు'సంతకం .
ఈడ్చిపెట్టిరి ఇంకు'సంతకం
ఇవ్వను పొమ్మని గుమస్త పంతం

చొక్కాజేబులు బొక్కలుపోయే
పేంటులుకూడా లూజైపోయే
అరిగినచెప్పులు ఆడేవదిలి
ఎదోకాడికి యామరబోయి
పట్టా పట్టుకునింటికి వస్తే !

పక్కింటోడు కోర్టుకు పోయిన
కొత్త కబురుతో పెళ్ళాం'ఎదురు .
ఎదురేముంది?,తిరుగేలేదు
ఏడేడేళ్ళు ఏకం తిరుగుడు

ఎదిర బాబాయ్ కోర్టుకు విరిగుడు
ఇంతేనయ్యా ఒకటే తిరుగుడు .
ఒకటే తిరుగుడు- ఒకటే తిరుగుడు
వచ్చినదారే మళ్ళీ ఎగాబడు!!

(ఇదండి సంగతి)

......................యలమంచిలి వెంకటరమణ

నువ్వు-నేనే మనము


హిందూ,ముస్లిం-భాయి,భాయి
నిజమేనోయి భాయి భాయి
ఇబ్బందంతా అదేనులేవోయ్
ఆస్థులకాడే తగాదలోయి !

ఆస్థులుపంచిన పెద్దోళ్ళంతా
హద్దులు గియ్యక పోయారయ్యో
అద్దిరబన్నా అసలు చిక్కది
కాశ్మీరంలో అది కనిపిస్తుందోయి!

ఎడమొఖమాళ్ళు,పెడమోఖమీళ్ళు
విడమరసంగా ఎవరున్నారు?
దొరికిందదునని దోచేటోళ్ళే
ఇంకో రాయి వేసేటోళ్ళే!

నాదీ నీదని ఏదీ లేదోయ్
నువ్వూ నేనే మనమంటేనోయ్
ఖర్మలకొద్దీ మనుషులమోయి
మంచినిమించిన మతాలులేవోయ్!

హద్దులు గీచె వరవడి తప్పు
యుద్దాలెందుకు అంతాముప్పు
ప్రజలకు రుద్దే రాజతంత్రమిది
పచ్చేఓర్వని పక్షాలెందుకు!

దన్నం వెడితే హిందువులవునా?
దోసిలిపడితే ముస్లీమవునా ?  
ఆ చేతులు చాచి గుండెకద్దుకో
సర్వం మరిచి ప్రేమపంచుకో !!

.............య.వెంకటరమణ

( విన్నపం:- అయ్యా ! ఇది ఏకత్వాన్ని పురస్కరించుకుని వ్రాసినది.దయుంచి కుల మత ధర్మ సంభందిత విమర్శలు చేయకండి. ఏ ధర్మాన్నైనా దూషించి మాట్లాడేవారు దయుంచి దీనిని వేదిక చేయవద్దుధర్మం కంటే,మతం కంటే మానవత్వం గొప్పదనే విషయం మనసులో పెట్టుకోవలసినదిగా మనవి)

అలజడి



అలజడి ఎరుగని  సంద్రం నేను
అలుపేఎరుగని స్వప్నం నాది
కరువైపోయా, నేప్రేమజల్లుకై
ఇంకెన్నాళ్ళని  వేచిచూడను,
ఒంటరిగా ఈ బ్రతుకుయాత్రలో!
తెరతీయని కోరికలే నావై
కనుమూయని కలలే నావై
కన్నీటీవరదల్లో ఇంకానేనుండాలా
కన్నీటీవరదల్లో ఇంకానేనుండాలా

..................మాధుర్య

సందెవేళ



చందమామ చూడమాకే దొంగచూపులు
మబ్బుతెరలుదీసిమరీ చూడ దగుననా?
ఇన్నిసొంపులెందుకనీ ఏమిప్రశ్నలోయ్
కొంటిమామ ఇంటికొచ్చే వేళ కదోయి !!

మల్లెపూలు పూసింది నీకోసం కాదులే
చెలయేటి పరవళ్ళు నిన్నుచూసికాదులే
చిలిపినవ్వునవ్వుతూ నువ్వుపరిచినీవెన్నెల
పరవశించు మనసుకు పందిరాయెనీవేళ.
మనసుపాడు పాటకు వేణువాయెనే ఇలా.
దొంగచూపు చూడకోయి చందమామా
అందగాడి వేళకి, నన్నుండనీ ఇలా

చందమామ చూడమాకే దొంగచూపులు
మబ్బుతెరలుదీసిమరీ చూడ దాగుననా!
ఇన్నిసొంపులెందుకనీ ఏమిప్రశ్నలోయ్
కొంటిమామ ఇంటికొచ్చే వేళ కదోయి !!

......................య.వెంకటరమణ

ఆచార్య దేవోభవా


విలుకాడు పార్ధుండు గురువు నేర్పు
గురినెరుగు బాణంబు రామగురువుదీర్పు.
గురువు గరిమలెన్ని,చరితజూడనుర్వి
చరితజెప్పునోయి ఆవిలువలిన్నిన్ని !!

గనిన జనని తరువ నిలుచునొజ్జు
జనమనిచ్చుదండ్రి జతనిల్చునానొజ్జు
గురువుకేమి కొరత భ్రుగువదోడబల్క?
గురువుదప్పలేరు బ్రతుకనేర్పనుర్వి!!

గురువులేని విధము గురినేర్వదదినెర్గు
గురువునెంచి గొలువు-మిగులబ్రాప్తి .
నెరవుగానివిధ్య నూరిపోయుగురువు
దరను వరములిచ్చు దైవంబు గురువు !!

గురువునెంత గొలువ సంస్కారమంతబ్బు
గారవించినెరవు కోరుగమ్యంబు నీకబ్బు
తెలుగురచన పలుకు తేటతెల్లమోయి
కరములెత్తిపలుకు గురులదినమునేడు!!

.........................య.వెంకటరమణ

( గరిమ = గొప్ప : ఒజ్జు= గురువు : బృగువ=సృష్టికర్త )

మల్లెపూవు



మల్లెపూవుకేది మరులు గొలిపేమత్తు
ప్రియురాలి సిగజేరి చేసేను గమ్మత్తు.
పొదలమాటునిటుల పడిఉన్నసుకుమాన్ని
పడిగాపులడిదెచ్చి తనసోగాసు పంచిచ్చి
సిగతురిమి సొగసంతా తనతోనే పులిమింది
ప్రియురాలు కాదేమి, ప్రియురాలు కాదేమి.

మల్లెపూవుకేది మరులు గొలిపేమత్తు
మగువసిగనుజేరి మరిఎగసి బడెనిట్లు
పూసొగసుదేముంది ప్రియురాలుగురుతుంది
తన స్మృతులునింపిచ్చి మరులిట్లునింపింది
మల్లెపూవుకేది మరులు గొలిపేమత్తు !!

............................మాధుర్య

ఆపేక్ష


మసగేసినమబ్బుల్లో మిడిగట్టూదీపంలా
తుఫానుల తాకిడికీ తల్లడిల్లిపోతున్నా
మనసుపడే వేదనకు మరీమరీ రోధిస్తూ
వికశించే వెన్నెల్లో వేడి తాళకున్నాను
కనిపించని కన్నీట వరదలఈ తాకిడికి
ఓదారుపు వరం కోర నీకోసం వేచున్నా
వర్షించే మేఘంలో ఆనవాళ్ళుపోయినా
అదేగురుతు ప్రియతమా ఆకాశం నీప్రేమ
ఆ అంచులు తాకాలని అపేక్షలో నేనున్నా
అనురాగపుఆకలితో అలమటించిపోతున్నా
అఘాదాల మాటునా ఆలపించుగీతమిది
ఆదరించుప్రియతమా ఆమంతం తోడుగా
ఆ వరమొకటడగనా అనురాగపు దేవతని
అరుదెంచిన ఆదేవత నీవేలే నీవని !!
..............మాధుర్య (తెలుగు రచన )

ప్రియ రాగం



నీవువ్రాసే కవితల భావం  నేను
నువ్ చూసే కనులకు రూపం నేను
నీవు వేసే అడుగుల  జాడను నేను
కన్నులు నిండిన ఈఆనందం  నేను

అరవిరిసిన నవ్వుల్లో దాగిన సంతోషం నేను
అలుపెరుగని నీ కలంలో విరాజిల్లే ఇంకున్నేను
నువ్ వ్రాసే అద్వితీయపు కవితావస్తువు నేను
అసలేం తెలియని మీలో మిగిలిన మీరే నేను

మీ కలం తెలుపని కవితను నేను
మీరడుగకనే దక్కిన ఫలితం నీను
మీరాస్వాదించిన మధువున్నేను
సరసాలెరుగని శృంగారం నేను

కష్టాలెరుగని  ఆనందం నేను
పోటీలెరుగని గెలుపు న్నేను
పరువం పంచె పానుపు నేను
నీకై నేనుంటూ  నీవైనేనుంటాను

ప్రతిజన్మలోను ఓ పువ్వునై
అరవిరిసిన నవ్వునై నిన్నే చేరుతా
అర్చిస్తా అర్పిస్తా గుర్తిస్తూ ఉండు సుమా
ఈ హృదయం నీకై వేచుందని ప్రియా !

...............................మాధుర్య

Monday, April 6, 2015

స్వప్న సౌదము

******
పెనవేసిన చీకటిలో వెన్నెలకై ఆరాటం
ఊరించే చుక్కలకు మబ్బుతెరల చెలగాటం
ఆశలిలా శోకమై కడలిదారి తీయగా
ఆకాశం విరగబడి నన్ను చూసి నవ్వగా
ఎలా ఎలా ఎలా చేరనూ,నా కలల సౌదము
కలో మరో ఎమో కదా ప్రేమ స్వప్నమూ...

కన్నీరు మున్నేరై ఏకధాటి రోధన
ఎన్నాళ్ళు నే మోయను ఇంతకఠిన వేదన
విధిరాసిన ఆ బ్రహ్మే ఇలా వ్రాసి పెట్టుంటే
ఎలా నేను పొందగలను ప్రియా దైన్యము
ఎలా ఎలా ఎలా చేరనూ,నా కలల సౌదము
కలో మరో ఎమో కదా ప్రేమ స్వప్నమూ...

గుండె తాపమెప్పటికీ తీరిపోదనీ
నిన్ను పొందు రోజునాకు రానెరాదని
నిన్న రోజులెన్ని నాకు చెప్పలేదులే..
నమ్ముకున్న మనసునీ వమ్ముచేయక
కమ్ముకున్న చీకట్లు తెరలు తీయక
మళ్ళీ మళ్ళీ పొద్దుగూకు సందె వేళలా
ఇలా శిలై బ్రతుకుతున్న చెలిమినే ప్రియ
ఎలా ఎలా ఎలా చేరనూ,ఈ కలల సౌదము
కలో మరో ఎమో కదా ప్రేమ స్వప్నమూ.......!
  ******

......................య.వెంకటరమణ

Sunday, April 5, 2015

ప్రణుతి

పార్వతీ పుత్రుడా! పరమేశునికిష్టుడా!
పరమెరిగిన దేవుడా! ప్రణతింతుము గణేశా
గణేశ గణేశ గణేశా ! జై జై జై గణేశా
జయములిచ్చుగణేశా! జయము జయము గణేశా!

విఘ్నాలను తొలగించే విజ్ఞేశ్వర దేవుడా
గణనాయక నీవయా, గణపతివి నీవయా
 పార్వతీ పుత్రుడా! పరమేశునికిష్టుడా!
పరమెరిగిన దేవుడా! ప్రణతింతుము గణేశా

చిత్రమైన ఆకృతి-చిత్తమైన బలబుద్ధి
చెల్లునీకు గణేశా చేతులెత్తి మ్రొక్కుతూ
చెల్లించగవచ్చాము-స్తుతులు మీకుదెచ్చాము
పాలవిల్లుగట్టాము,పప్పులడ్డుదెచ్చాము గణేశా

పూజలందు దేవుడా-పాపులమే దేవుడా
పలహారం ఆరగించి-పాపులము ఆధరించు
ముక్కంటిప్రీతుడా - ముంజేతుల దేవుడా
గణేశా గణేశా గణేశా - జై జై జై గణేశా

 పార్వతీ పుత్రుడా! పరమేశునికిష్టుడా!
పరమెరిగిన దేవుడా! ప్రణతింతుము గణేశా
గణేశ గణేశ గణేశా ! జై జై జై గణేశా
జయములిచ్చుగణేశా! జయము జయము గణేశా!

.....................................య. వెంకటరమణ

ఈనజరానా ఏ వరఫలమో!

వెన్నెలకురిసే చంద్రబింబమో
మెరిసేతారల కాంతి రూపమో
శిల్పకారుని చిత్ర  ఛందమో
ఏకవి మలచిన భావదృశ్యమో

జాలువారేడి కురులనడగనా
జాబిలినిండిన కనులనడగనా
రెపరెపలాడే రెప్పలనడగనా
మేఘమాల మరి తనపెరేమని?

నేలకు  వంగిన  లేలేతకొమ్మల
ఒంపు సొంపులు, అవి నీవేనా
నడకలురాని హంసకునేర్పిన
అడుగులు  నీవా, అవి నీవేనా ?

నీఅధరము దాకి రూపుమారెనా
అనార్ కలీ అని పేరుగాంచెనా
రంభను చూసి నిన్ను మలచెనా
రంభే నిన్ను అనుకరించేనా ?

అందెల వరవడి గమనించేమో
గువ్వలు  సవ్వడి వినిపించేను
నగిషీబట్టిన నగలు జాలవు
ఈనజరానా ఏ వరఫలమో!ఏ వరఫలమో !!

.....................      య . వెంకటరమణ

భాద్యత

అడ్డుకునే నాన్నవద్దు,అడిగేందుకు అమ్మవద్దు
బాధ్యతేది భార్యలేదు, పిల్లలనే బెంగలేదు
నిన్న నాకు గురుతులేదు,రేపుమీద ఆశలేదు
నేడు అదే సాగుతుంది, ఇంకెందుకు చీకుచింత?
పొట్టకింత ఆకలుంది  పరులసోమ్ము ఊరకుంది
అదేకదా చూడువింత ,అర్ధమేది బ్రతుకనింక
చీకటున్న ఇంటనే వెలుగుచారలక్కరోయి
దీపమారిపోయినాక దారికానకావునోయి
కష్టమున్నమనిషికే సుఖం విలువదెలుయునోయి
కష్టాలకు భయపడితే వెనుకసుఖం దక్కదోయి
వెనుకసుఖం దక్కదోయి,వెనుకబడుట తధ్యమోయి
అలలు లేని కడలిపైన పడవ నడక సాగాదోయి
నడకజేయు పడవకింత అలలుతోడ గమ్యమోయి
ఎంత పరుగుదీసినా వెంబడించు నీడజూడు
నీడనిన్ను వెంబడింప గమ్యమెంచిపెరుగుబెంచు
నిక్కముకద నిలిచినీవు వెనుదిరిగితె నీడముందు
నీడముందు నీవుముందు అదేకదా జీవితంబు
అదేకదా జీవితంబు,సాధిస్తేసార్ధకంబు-సాధిస్తేసార్ధకంబు !!
........................................   య.వెంకటరమణ

యువ శరం

కాటిన్యపు చీకటిలో, కొడిగట్టిన వెలుగుల్లో  
 గుబురుపొదలు లోగిళిలో,ఆచీకటి వెన్నెల్లో.
 ఇంకిపోయినీకళ్ళకు ఇంకానా  కన్నీళ్లు ?
బెదిరిపోయినీకళ్ళకు ఎదురుచూపులెన్నాళ్ళు?
నీయబ్బా గోతునేల ,నీవింకా  లోతుకెళ్ళ
నీచుట్టూ కప్పలైతే? గొప్పుదీర్చు నాధులెవరు?
గోదారపు బాటలోన,మెరకెరుగని ఈ నడకలు  
అతుకుబ్రతుకు పడవలోన, కడదేరని ఈబ్రతులులు
కడదేర్చే నాధులెవరు?-కడదేర్చే నాధులెవరు?
ప్రమాదులు-ప్రమాదులు గతించంగ ప్రమాదాలు
ఓ మోస్తరు దారి కూడ అగుపించని ప్రమాణాలు.
ప్రమాణాలు పరికించే ప్రళయరుద్రశక్తి నీవు,
ప్రమదగణములెక్కించే మరోచరితస్పూర్తినీవు
యువశంఖంబూరించు, నీసత్తా చూపించు.
బొదిలోని అంబులును ఎక్కుపెట్టువణికించు.
ఒక్కొక్కడినెక్కుబెట్టి, అవినీతినిపూడ్చిబెట్టి  
ఎక్కనింక మెట్లుగట్టు,నవచరితం వ్రాయబట్టు
యువతా!నువ్ శరంబట్టు అవినీతిని పాతిపెట్టు.
అవినీతిని పాతిపెట్టు,యువతా నువ్ నడుంగట్టు!
=============================

..................................... య.వెంకటరమణ

వరాలకే వరం

ఆ మబ్బుల చాయలన్ని నీమోమున లేవని,
నినుజూసిన  చందమామ చిన్నబుచ్చుకున్నట్లు.
నీ మేను చాయలకు  తన వెలుగులు సాటిరాక
ముఖం దాచుకుందేమో,ముఖందాచుకుందేమో!

అమావాశ్య చీకటిని ఆ కళ్ళకు అద్దుకుని,
మిరుమిట్లకాంతితో మమునింపే  చాతుర్యం
తనకైతే లేదులే ........ తనతో నీకెందుకులే
అమాసలో ఈ మెరుపు తమాశేమికాదులే!

తను మలిచిన ఆరంభనిలా భువిపైకేపంపినట్లు
అదితెలిసిన ఆ దేవుడు భువిపైకేతించునట్లు
కలగన్నానది నిజమా కలసారం ఇదే సుమా
ఇదేసుమా,ఇదేసుమా.దివితారవు నువ్వేసుమా!

నినువీడే నిశ్వాసకు శ్వాసను మరి నేనౌతా
లయబద్దపు గుండెల్లో సవ్వడి మరి నేనౌతా  
జాలువారు కురుల వెనుక ఆ నీడను నేనైతే
నీ చెక్కిలి నొక్కుల్లో  ఇమిడిపోయి నేనుంటా

వరమడిగే అవకాసం ఆ దేవుడు నాకిస్తే
నాతరమాజెప్పు ప్రియా,నినుదప్పిగోరనాకు.
ఎన్నిజనమలా ఫలమో నాకన్నులకీవరము
 నీ హృదయం నాదైతే వరాలకే వరం వరం !!

....................... మాధుర్య { తెలుగు రచన

ప్రియా నీకోసం

ఓదారుపు నా ప్రేమకు వయనాలే లేకుండే
వేచి వేచి నీకన్నులు   వేగలేకనేయుండే
ఆకాశం చిల్లుపడి నాగుండెలు నిండెనేమో!
ఎంత ఎంత ఏడ్చినా ఇంకకాయే నీకన్నులు
మర్మాలా ఆదేవుడు మరీ ఎంత విడ్డోరం ?!
కలలుగనే మనసుల్లో కన్నీళ్ళేనింపనేర్చు !
కెరటాలా నాకలలు దరిజేరవు,అవి యాగవు.
దయలేని ఆదైవం మార్చన్నా విధిరాయడు
అదివ్రాయనురాకున్నా మరుపన్నానాకీయడు
ఒకసారి ననుజూసి, ఒదారుపు వరమివ్వు.
మరుజన్మకు వేచుంటా ప్రియా ప్రియా నీకోసం!!

...........................................మాధుర్య

నీవెరుగవా?

అందెల యా సవ్వడి నువ్విననైనా లేదా?
అలుపెరుగని ఆ నడకల మ్రుదురత్వపు
మధురాంతక మదిగీత తన్మయమగు సిరిపుత్రీ
నా రచనను నీ వెరిగి,ఆమెవరని అడిగేందుకు.
నిండారిన వాకిట నాముగ్గులు, అవి మలిచిన ఆ సొంపులు
కావా అవికావా? చెలి సొగసుల చిరునామాలవికావా ?
విరిసిన సిరి కెంపుల ఆ ముగ్గులు అవికావా?మరికావా?
 నా చెలిచెక్కిలి నెరజూపిన రవి బింబపు యా దారలు
విరబూసిన సిరిమల్లెల స్మరనీయపు మధురిమలు
మరికావా అవికావా? చెలి సొగసుల చిరునామాలవికావా ?
అందెల యా సవ్వడి నువ్విననైనా లేదా?
అలుపెరుగని ఆ నడకల మ్రుదురత్వపు
మధురాంతక మదిగీత తన్మయమగు సిరిపుత్రీ
నా రచనను నీ వెరుగవ? నీవెరుగవ?...............?

.......................... య.వెంకటరమణ

నేనే! ఆ నేనే !

నేనే!  ఆ నేనే !
                            బాపూ చెప్పిన  పౌరుడ్ని నేనే.
                             అగ్గై రగిలే ఈ  నిప్పూ  నేనే.
                            వెలుగులు చిందే ఆ దివ్వెన్నేనే.
                               భవితను దిద్దే కలాన్ని నేనే.
                                    మీ లక్ష్యం నేనే.
                                        మీరెతికే ఆ వెలుగున్నేనే.
                                                    నాకూ ఓ రోజొస్తుంది.
                                                      నను కాల్చే ఈ నిప్పులతో
                                                     లోకానికి వెలుగులు చూపిస్తా.
                                                         నాకా అవకాశం మీరిస్తే
                                                         నా సత్తా నే చూపిస్తా
              నేనెవరో మరి గుర్తిస్తే, ఆ గుర్తింపుకు నే గురుతౌతా!
              ఆ చీకటిలో నన్నదిమేస్తే వెలుగుకు నే కరువౌతా!

                .................. య. వెంకటరమణ ( తెలుగు రచన)

పులకించే ఆ హృదయం ఏమయ్యింది

నా చూపుల తాకిడితో పులకించే ఆ హృదయం ఏమయ్యింది?
దరహాసంతో నువ్ మరిపించిన ఆ లోకం ఇపుడేమయ్యింది?
ఊహల్లో నేవిహరించిన ఆ స్వప్నం ఏమయ్యింది?ఏమయ్యింది?
నను తాకిన నీకన్నుల్లో తన్మయమేమయ్యింది?అది ఏమయ్యింది?
మాధుర్యం తెరదీసిన కాఠిణ్యం నన్నెందుకు ఝళిపిస్తుంది?
మదివిరిసిన హరివిల్లు  నేడెందుకు నను   వేధిస్తుంది?
నిష్టోరపు మాటల భాండం నన్నెందుకు నిలదీస్తుంది?
మిరుమిట్ల ఆ ఉదయం నేడెందుకు చీకటిలా అగుపిస్తుంది?
తొలిరోజులు గురుతొస్తే మనసెందుకు దిగులౌతుంది?
ఈ ప్రశ్నల జవాబు నేనని తెల్సీ ప్రశ్నెందుకునాకొస్తుంది?
నే కలగన్నా పొద్దింకా తలపైకేరాలేదింకా
కనుగుచ్చే చీకటిలో ఏమౌతుందింకా,ఇంకా
ఆ ఉదయం నే చూసుండుంటే,ఈ చీకటిలో ఓ తోడుండేదే!
మోహంలో నే చూసిన లోకం మరి నేనెరిగుండుంటే ,
లోపానికి రూపాలెతికే బాధైతే తప్పుండేదే!అదితప్పుండేదే!
................................................... య.వెంకటరమణ

ఎవరని యడిగితే,ఏమనిచెప్పను?

ఎవరని యడిగితే,ఏమనిచెప్పను?
ఎవరూ ఎరుగని ఛాయ న్నేను.
ప్రేమకు గురుతు రచనన్నేను.
పాడే అందరు గాయకులైతే
అనుకోటానికి రచయితనేను.
పదాలకూడిక కవిత్వమైతే
నేనూ కూడా కవినౌతాను.
జీతం పొందకపోయుంటే
దేశ సేవలో సైనికుడందును
అందుకె మరి నేనుద్యోగుడ్ని
రక్షణ లక్ష్యపు ఖాకీ నేను.
కవిత గళమది నా కలమైతే!
‘తెలుగు రచన’మరి నేనే నేను.
 ఏరువాకలో నాగలి నేను
దున్నకపోతే దుంగన్నేను.
చదునూ,పదునూ,ఫలాలుకోరే
నేలను దున్నే వృషభం నేను.
విత్తులు,మొక్కలు,చెట్లైపోతే!
చీడకు చిలికే  చేదున్నేను.
పాడును మరిగిన ప్రభంజనంలో
మెరుగును గోరే మనిషిన్నేను.
తమస్సునందు ఉషస్సుగోరే
నూటపాతికా కోట్లమందిలో
ఒక్కడు నేను,ఒక్కడు నేను.
చెలిమిని గోరే తపస్సులోన
విజయం పొందిన తపస్వినేను.
తపస్సుగేలిచిన,  వరాలమాల
తెలుగు మిత్రులు. మీరే నేను !!

....య. వెంకటరమణ (హైదరాబాద్)

బ్రహ్మ

విధి వ్రాసిన ఆ బ్రహ్మకు
ఇది వ్రాయను చేతకాక
ఎకేకని వ్రాశాడా ఏకాన్ని
కలగలుపు రాతల్లో
కడకు ఇలా చేసావా
విధి వ్రాసే బ్రహ్మయ్యా
ఇది నీకూ తగధయ్యా
తగదు నీకు తగదయ్యా !
............... మాధుర్యment here

ఇద్దరు పెళ్లాలోడ

        ఇద్దరు పెళ్ళాలోడ-ఇద్దెలన్ని తెలిసినోడ
        ఏడుకొండలెక్కినోడ-శేషాద్రివాసుడా
        గోపన్న గోపాలతొ గోపురమైవెలుగుటోడ
        బ్రహ్మాంజలిస్వీకరించి,మముబ్రోచేదేవుడా!!

       ఆకాశరాజసుతి పద్ధమ్మకు పెనిమిటయ్యి
       తిమిరారములెల్లగొట్టు తీర్ధంకరుడునీవయ్యి
       మా ఇడుమలనిడిపింపగ యిలనెలిచిన దేవుడా
       తీర్ధములేస్వీకరించు-ఓ తిరుమలవాసుడా!!

      శిఖరాగ్రవాసముగా నికరమైన  హరిహరీ
      చిన్నచితికెవాళ్ళము-చింతలతోవచ్చాము
     గోవింద హరిహరి - హరిధరా నమోనమోః!!

                                 య.వెంకటరమణ

అరవిరిసిన జాజిమల్లి

అరవిరిసిన జాజిమల్లెలో
అపుడే పిరిసిన జాబిలమ్మలో
అందమైనా చందమామలో
అందమెరుగని కోయిలమ్మలో
కరుగుతూవెలుగునిచ్చే మైనపొత్తులౌ
కవితైసాగే భావాల పంక్తుల్లో
ప్రేమే నీప్రేమే, జగమంతా నీప్రేమే !

            యలమంచిలి వెంకటరమణ 

ఇంతలోనే అంత దూరం

ప్రేమకు నిర్వచనం మసమన్నావు
ప్రేమికులం మనమన్నావు
మౌనానికిబాషుందన్నావు
బాషా భావం మనమన్నావు

తెలుపకనే నీ భావం తెలుసన్నావు
నీకన్నులలో నేనున్నానన్నావు
కలలన్నీ వాస్తవమన్నావు
కాలాన్ని కొలువుంచుతానన్నావు

ఏమైంది నేస్తం ఇంతలోనే అంత దూరం
అగుపించని అవంతరాల మేఘం
వినిపించని నా ప్రియరాగాలా సౌదం
ఏమీ వైవిధ్యం కాదా ఇది వైరాగ్యం!

పులకించే ఈ ప్రక్రుతి నన్నెందుకు మరిపించింది
మురిపించే మన ప్రళయం మరుపెటులైపోయింది
ప్రణయానికి ప్రతి పదమది ప్రళయంగా మారిందా
విధిరాతలొ తప్పుందా నిజమది మరి వెనుకుందా?

........................    య.వెంకటరమణ

ఇంతే ! ఇంకిలా సాగిపోవాలంతే

ఇంతే ! ఇంకిలా సాగిపోవాలంతే
ఉద్దరిచే జనమెంతమంది రాలేదు
సాగనంపేవాడు లేకెంతమంది పోలేదు
ఇంకావస్తారని నేస్తం,ఎన్నాళ్ళికా ఆత్రం
ఎదురుచూపులతో కాయలు కాచే కళ్ళకు
బూడిదరాసే బాబులు,బోలెడు మందిరబాబూ
ఇదేమి చిత్రమొ జూడూ
ఇక్కడి దొంగల మాటా పక్కనబెట్టేసారు
అంకెల గారడి చేసి లెక్కలు చెబుతున్నారు
ఒకటే తెలుసున్నాకు.ఎవడికి వాడే బోకు
ఆశలు చూపెడతారు .అంతా బొక్కేస్తారు.
ఏనుగు చూడో నేస్తం.
ఎదురుగ కనబడు దంతం-తినటం రానిది పాపం,.
తినటం వచ్చిన దంతం-కనబడదెవరికి నేస్తం
..................య.వెంకటరమణ

నీవే నేను

కనులెరుగని కలవో!
కలం రాయని  కవితవో!
భావమెరుగని  పద్యానివో!
అర్ధాన్ని ఎరుగని పదానివో!
నా కోసం భువిపై కొచ్చావో!
నీ కోసమే
నే అరవిరిసిన పుష్పాన్నై
అందం లేని ఆనందాన్నై
అందలమెక్కని అధికారాన్నై
ఆరాధనెరుగని మీరానై
మీకై  మీకై
దగ్గరగా ఉన్న దూరాన్ని నేను
మీలో మీరే ఎరుగని మీరే నేను
గుర్తించావా.....? నీవే నేను !!

..................... మాధుర్య

ఓరామా!శ్రీరామా!

ఓరిమితో.బ్రతకమని' ఓప్రక్కనమాకుజెప్పి,
నోర్వలేనికష్టఁబుల నొసగమీకు తగదుస్వామి!
ఓమాటకు కట్టుబడి,ఆజన్మం కష్టపడ్డ-ఓరామా!శ్రీరామా!
ఊరకుండనింతమీకు నెరవుకాదు మారామా!!

ఆనీతికి కట్టుబడి,ఆమంతం కష్టపడీ,
పొట్టకింతకూడులేక,సతినికూడ సాకలేక,
సకలరాజ్యాలొదులుకుని,శ్మశానాలు బట్టి
నట్టి సార్వభౌములు - శ్రీ.హరీశ్చంద్రులన్
సాధించావేమయ్యా- సాక్షంగా నిలుపమాకు ?

సత్యంగా బ్రతుకనేడు సాధ్యంగా లేదుస్వామి.
సడలు జనంచూడుతండ్రి! సఖలసౌఖ్యమొందనైరి!
సాక్షంగానిలవమని సోధింపన్  తగదుమీకు.
సాధ్యమైతె సవరించు. సుఖంకూడ ప్రశాధించు!!

ధైన్యంగా మారిపోయె - దైనందనజీవితాలు
ధనంకూడబెట్టనైరి - దుర్మార్గులు దుష్టులీడ!
పనికిరానిదైపోయే - పలుకనీతినిలపైన.
పరికించుము ప్రణిధివీవు-పరమునీడి పరమాత్మా!!

......................య.వెంకటరమణ

ఆశాజ్యోతులు ఆర్పోతున్నాయ్

ఆశాజ్యోతులు ఆర్పోతున్నాయ్
అందరికళ్ళూ ఎరుపౌతున్నాయ్
ఆకలిమంటలు చెలరేగదిగో
అగ్గిగమారే రోజొచ్చింది
సర్దుకుపోయే సమయంకాదు
సాధించేందుకు ఎవరూరారు
ఏరేమొక్కలు చాలాఉన్నాయ్
ఏరులుపాతుకు పీడిస్తున్నాయ్
ఎవరొస్తారని ఎదురుచూపులు
ఏముందింకని ఆశాపేక్షలు
ఏకంకండీ ఏకంకండి
సేధ్యంసేసే సమయంరండి
ఆర్తులనాధం కాదదిమిత్రా
శంఖారావం వినిపిస్తుంది
ఆర్తులనాధం శంఖారావం
అప్పుడుగానీ రాదారాజ్యం
అందరుగోరే ఆరామరాజ్యం!

...............తెలుగు రచన

భయం భయం ...భవిత భయం



భయమేస్తుంది నాకు భయమేస్తుంది.
హద్దులేని అవినీతి అచ్చోసిన ఆంబోతుల
అరుచుకు-మీధడుతుంటే భయమేస్తుంది
భయమేస్తుంది నాకు భయమేస్తుంది !!

నిన్నగాక మొన్నచూడు-పేరు బడ్డ ఊరు లోన,
అబ్బకేమొ తెలియకుండ అన్నఅనుభవిస్తుంటే,
అన్నకేమి చెప్పొద్దని అబ్బఅదుముకొచ్చాడు.
చెప్పుకునే దిక్కులేక,బయట చెప్పుకోలేక
బయలుదేరెనాబిడ్డ,-ఉరితాడే నయమంటు.
భయమేస్తుంది నాకు భయమేస్తుంది
ఈ అధ్వానం చూస్తుంటే భయమేస్తుంది !!

అమ్మఅన్న-అక్కచెల్లి అన్నిమరిచినమానుషం
చీకటిలా అలుముకుంటు కామాంధం క్రమ్ముతుంటే'
వాయివరస మరిచి జనం,ఆవేశాలు తీర్చుకుంటూ,
ఉన్నీపాటి సంస్కృతిని ఊభిపాలు చేస్తుంటే ..
భయమేస్తుంది నాకు భయమేస్తుంది.
భావితరం భవితచూసి భయమేస్తుంది.!!

అధ్వానం గుండటమే అభ్యుదయం అనుకుంటే,
అభ్యుదయం పేరుచెప్పి ఉన్నబట్టలిప్పుకుంటే,
బాయ్ ఫ్రెండ్ పేరుజెప్పి బడువుకెత్తి తిరుగుతుంటే,
భయమేస్తుంది నాకు భయమేస్తుంది
భావితరం రూపుజూసి భయమేస్తుంది !!

వ్యభిచారం తప్పంటూ లైసెన్సులు రద్దుజేసి,
వ్యవహారం నడుపుతున్న మనవారంతీరుచూడు.
లవరుపార్కు పేరుచూడు .. ఆడుండే తీరుచూడు.
కప్పుకుంటే ఏమీ లేదు .. విప్పుకుంటే కిరీటాలు
చిత్తరంగ ఉందికదా! చెప్పుకుంటే సిగ్గుచేటు !!

సావిత్రమ్మ తెలీదంట ... సక్కుభాయి తెలీదంట.
శరవతు ముంమైతు మస్తు మస్తు గురుతంట.
మతిబోయిన కుర్రకారు మైమరచి తిరుగుతుంటే
భయమేస్తుంది నాకు భయమేస్తుంది..
మనుగడనిక తలచుకుంటే భయమేస్తుంది .

డేటింగులు-చాటింగులు ... అబ్బోచెప్పతరం కాదు.
ఆ వెబ్బులజోలికెళితె ... అసలు చెప్పతరం కాదు
అవనిపైన బుట్టినాము... అమ్మనైన వదలరేర?
భయమేసింది నాకు భయమేసింది ..
ఆ బూతుకథలు చదవబోయి నాకుభయమేసింది !!
           
                                 యలమంచిలి వెంకటరమణ

కదా

కట్నం డబ్బులు ఖర్చులు జేస్తూ,అదరగొట్టే అలంకారాలతో
పలాన రాజల్లే పోజులుపెట్టే,పెళ్లిపీటలపైన అల్లుడి వెనక,
ఎక్కాలబొక్కు ముఖానబెట్టి,అప్పుల్లెక్కల గుక్కతిరగకా,
గోడకు నిలబడు మామను జూస్తే, జాలేస్తుంది-నాకు జాలేస్తుంది

బొద్దుగ నిండిన తేనెపట్టును బాటిళ్ళునింపి బడాయిపోయే
బోయవాని మరి బోగట్టజూస్తూ,తొండం తెగినా తేనెటీగలు.
తెగిన రెక్కలకు లెక్కల్లేక,తెచ్చిన తేనెకు అంచనలేక,అలమటించెడి
ఈగలు  పాపం.ఈగలజూస్తే, జాలేస్తుంది-నాకు జాలేస్తుంది

కొలుక్కు చేరని వాగ్దానాలు,కోసేకొద్దీ వంకాయల్లే
కోసిన కోతలు పట్టుపంచెలు, పట్టాపొందిన రౌడీలీళ్ళు
ఒడ్డుకుజేరని వాగ్దానాలు, వచ్చేసీజను ఇంకో చిట్టా
చప్పట్లుగొట్టే జనాలజూస్తే,జాలేస్తుంది-నాకు జాలేస్తుంది

                     ......................  య.వెంకటరమణ

సఫాయివాడు

కలిమేముంది? లేమేముంది?
కుళ్ళిన  మొత్తం చెత్తే కాదా !
చిన్నా-పెద్దా తేడాలుండవు
చెత్తను ఎత్తే చేతులు బాబు!
చిన్న చూపుకు చలించడీడు
పెద్దమనసుకు ప్రతీకవీడు
సఫాయివాడు – సహనంవీడు.
ధరితమాతకు ప్రియతమ పుత్రుడు!
ముడుయుట గానీ,విరుయుటనెరుగని,
మూతు ముడువకు,మురికివాడని.
స్వస్థత  గోరే సఫాయి వాడు
స్వచ్చత నెరిగిన మనలో వాడు
కుడి ఎడమనక, ఎంగిలి యనక
ఈసడి సైతం ఎత్తేవాడు
వాడేనోయి-వాడే వీడు
పరమ వైద్యుడు- ప్రధమ వైద్యుడు
ధరితమాతకు ప్రియతమ పుత్రుడు
================
................... య. వెంకటరమణ

దడ దడలాడే రైలుపెట్టెలు

దడ దడలాడే రైలుపెట్టెలు,
దారిపొడుగునా దగాకోరులు.
దొరలకు వీళ్ళు తీసుకుపోరు,
దోచుకుపోయే దొంగలువీళ్ళు.

పశువుల గ్రాసం బొక్కేదొకడు,
దుంగలు,దుక్కలు అమ్మేదొకడు.
దోసిలి  జారిన ఎంగిలి విసిరి,
మీసం తిప్పే రాజంటాడు.

దోచుకుపోయిరి దొరలు సత్యమే
ఉన్నది  దోచే వీళ్ళేవరండి?
జీతంవద్దను దేశాసేవలో
జీతంవదిలి దేశం దోచే
దొంగలు బాగోయ్ దొంగలు వీళ్ళు

మొక్కేటోళ్ళే మింగుడుపడరు,
చెప్పులు మోతకు సిద్ధం వీళ్ళు
లక్షలకోట్లు  పక్కలు వేసి,
అమ్మా- అన్నని మొక్కేవీళ్ళు

చైతన్య సారధులీళ్ళంటండోయ్,
పట్టం గట్టేదీళ్ళే నండోయ్.
జనాలమధ్యన జనాలుబాబోయ్
జనాలకే మరి ఝరాలు బాబోయ్!!

....యలమంచిలి వెంకటరమణ

వాగ్ దానాలే

వాగ్దానాలు ఒకటా రెండా?-
వాగుడు మొత్తం వాగ్ధానాలే!
ఒరిగేదైతే ఏదీ  లేదు !
వచ్చేసారికి ఇంకో చిట్టా !
అదే ఊరులే,అదే స్టేజులే,
అదే జనంలో పాతపాటలు
అర్ధం లేని కరతాళాలు
ఆకళ్ళల్లో మరో ఆశలు.
అమ్మని కొలిచే ఆడబడుచులు
అన్నని కొలిచే ఆశాజీవులు
ఆఖరికంతే ఆకలి సొంతం
 అయ్యగారికి ఆస్థానయోగం
వచ్చే సారికి రంగం సిద్ధం
ఎక్కడి గొంగళి అక్కడపదిలం
ఎప్పటిదాకా ఎదురుచూపులు
ఇంకానా మరి ఎదురుచూపులు?
పద పద పద ముందుకు పోదాం
కలుపులు ఏరే పనిలోఉందాం
యువతను ముందు నిలబెడదాం
కొంతైనా మరిముందుందాం !!
........................................   యలమంచిలి వెంకటరమణ

అందం

సత్యం  పలుకుట పెదవులకందం
మాధుర్యమది ప్రార్ధించు స్వరము
దయగల  చూపులు మరింత అందం
అందంకాదా ప్రేమించు హృదయం

దానం చేసే చేతులు అందం
చిరునవ్వే నీ ముఖానికందం
అందం అందం అదికద అందం
అదిగల నీదే అసలైన అందం!!

................... తెలుగు రచన

ఓదారుపు

ఓదారుపు నా ప్రేమకు వయనాలే లేకుండే
వేచి వేచి నీకన్నులు వేగలేకనేయుండే
ఆకాశం చిల్లుపడి నాగుండెలు నిండునేమో!
ఎంత ఎంత ఏడ్చినా ఇంకకాయే నేకన్నులు
మర్మాలా ఆదేవుడు మరీ ఎంత విడ్డోరం ?
ముడివేసీ విడదీయుట వేడుకెంత దారుణం.

...................... య.వెంకటరమణ

కలముందని వ్రాసేస్తే శాశానమైపోతుందా

కలముందని వ్రాసేస్తే శాశనమైపోతుందా
బలముందని వాధిస్తే తప్పు నిజం ఔతుందా
అదిచూడది అద్దంలో నీనీడే నీముందు
లోకాన తప్పులెంచ పనేలేదు బందూ

లోకులంటె ఎవరనీ లోకాన్నిటు నింధిస్తావ్?
నిలదీసే దమ్ముంటే, నీ నీడనేల వదిలేస్తావ్?
చెప్పుటకే నీతులైతే చేసేందుకు ఎవరంటావ్?
ఎవరంటే ఎవరనీ ఎవరినయ్య నిలదీస్తావ్?

నిలదీసే పనిలోనా నిలువలేక పడిపోతే
నిలదీసే నాధుడెవరు నీకునీవు మిత్రమా!
 నీవెంటే లోకముంది వెంబడింప నీకేల
వెంబడింప నీకేలా వెలుగు బాటనీవేగా!
.............. య.వెంకటరమణ

అధునాతన భారతం


అధునాతనవిశ్వంతో నన్నుకూడా మార్చుకున్న.
అమెరికాతో పోటీపడి  అవతారం మార్చుకున్న.
అవతారం మార్చుకున్న,ఆచారం మార్చుకున్న,
అవసరమది కాకున్నా నా పద్ధతినేర్చుకుని
ఆపదలోపడుతున్నా అదే బాట నే ఉన్నా.
పెద్దమ్మా,చిన్నమ్మా-అత్తమ్మా, నాతమ్మా
అందరేడబోయేనో !అంటీతో తేల్చేసి,ఎంటేంటో అంటున్నా.
అధునాతన విశ్వంలో నన్నుకూడ మార్చుకున్నా.

విభజించి పాలించు రాజ్యమేలు సిద్ధాంతం
ఏకంగా ఎత్తుకొచ్చి ఇంటగూల్చ పెట్టుకున్న
ఏడుమూరలెందుకని,ఎడించీలేసుకుని,
నాదేశందేముందని ఆదేశంననుసరించి,
ఏడడుగుల నడకేందని ఏకాంగానేతించా

‘ఉమ్మడంటే కుమ్ముడని’అమ్మడేమో ఆడబోయే,
తమ్ముడేమో ఈడబోయే,అమ్మ జాడ తెలియకాయే,
అధునాతనవిశ్వంలో అమ్మజాడ తెలియకాయే.
కప్పుకునే గొప్పులన్ని ఇప్పనాకు సిగ్గులేదు
సిగ్గుకంటే సిగ్గుబోయే,అధునాతనవిశ్వంలో బొత్తిగా దగ్ధమాయే.

అధునాతనవిశ్వంలో అన్నిమార్చుకున్నా,
ఇన్నొంకులు తిప్పలేక అమ్మభాష వదులుపెట్టి,
అమెరికాతో పోటీపడి ఆంగ్లభాషనేర్చుకున్న,
అవతారం మార్చుకున్న,ఆచారంమార్చుకున్నా.
అధునాతనవిశ్వంతో నన్నుకూడ మార్చుకున్నా.
......................................య.వెంకటరమణ

సొంతం కాని ప్రేమ

భావమేలేని బాష నాది
సొంతంకాలేని ప్రేమ నాది
కనిపించని సిరాతో రాసుకున్నా
చదవబోవ కన్నీరే ఏడ్చేను
ఆనంద భాష్పాలై రాల్చేను
ఏమని చెప్పను ఎలాజెప్పను
బాధల్లో సంతోషం నీప్రేమ
సంతోషంలో బాధది నీ ప్రేమ
కన్నులలో కొలువుండనీ కనుపాపనై
కాపురముంటా కలలో నిజమై
జీవించి ఉంటా కనురెప్పనై
కాపాడుకుంటా నీ ఊహనై!
...............  మాధుర్య

బజారు మధ్యన బ్రాందీ షాపులు

సిటీ మధ్యలో పర్ణశాలలు
ఫారం హౌసులో పోకిరి పంటలు
ఎత్తుగ కట్టిన ప్రహారి గోడలు
ఎవరొస్తారిక భయమే లేదు !!

రోడ్డు ప్రక్కనా లవరు పార్కులు
లవరుపార్కులో పొదల గొడుగులు
గేటు ముందరే సౌకర్యాలు
ఎర్రపెట్టేలో ఎయిడ్సు మందులు !!

ఇటుప్రక్కనేమో స్కూలు పాకలు
అటుప్రక్కనేమో కల్లుపాకలు
భావిపౌరులకు వేసే బాటలు
పుట్టుకనుండే పునాది రాళ్ళు !!

బజారు మధ్యన బ్రాందీ షాపులు
బారుల సౌఖ్యం బోలెడు బోలెడు
బడిశాలలకే ఠికాన లుండవు
ఊరుకు బయటా ఓమూల కట్టుడు!!

అమ్మేటోడికి అనుమతులిచ్చుడు
కొనేటప్పుడు కట్టడులెట్టరు
కాల్చేటప్పుడు కట్టంటారు
ధూమ్రపానమది నేరం నేరం !!

చీమలు దూరని ఇరుకు సంధులో
ఏనుగునంపే ఇమాన్దారులు
జరాస కూడా జంకని వీళ్ళు
చట్టం మార్చే సమర్దులీళ్ళు !!

...........య. వెంకటరమణ

పట్నం వెలుగు - పల్లె బడుగు

మెరిసే పట్ణం వెలుగులుజూసా
లైటువెలుగులో చమక్కుజూసా
చీకటొక్కటి ఉందనుసంగతి
మరిచేపోయా మరిచేపోయా
ప్రహరీగోడకు పాతిక లైట్లు
పనికిమాలినా సిరియల్ దండలు
ఎనిమిదింటికే షాపులు బందు
తెల్లార్లెలిగే ఔట్లెట్ బోర్డులు
ఒక్కోబోర్డులొ ఏడేసి లైట్లు
ఎవరూ వెళ్ళరు,ఆరూము అంతే
ఎలుకలురావట లైటేసిపెడితే
వీధిలైటుకి స్విచ్చులుండవు
వెలిగినలైటూ ఆపేదుండదు
పొదుపంట బాబూ పొదుపంట పవరు
పల్లెలపైనే బాదుడు బ్రదరూ
ఆడికిబోయా అదీను జూసా
బూజులు పట్టిన బల్బులుజూసా
తీగలు పైనా బట్టలు  చూసా
వెలిగీ వెలగని స్థంభాలపైనా
వెలిగే లైటుల చీకటి చూసా
లాంతరు బుడ్డులకంకితమైనా
పాపం పిల్లల చదువులు జూసా
దీపాల పండగ రోజూనక్కడ
గంటుండి పోయే కరంటులక్కడ
టివీ పెడితే సిస్టం నడవదు
సిస్టం పెడితే టీవీ నడవదు
ఫేనులకైతే బేరింగు జాము
ఇసూరుమంటూ విసురో విసురు
ఏసీల బదులు   వినగర్రలు
అందొక సిస్టం ఇందిది కష్టం
పొదుపు చేయటం అధికమీయడం
ఇదేమి చిత్రం ఇదేమి చిత్రం ?!

........... య.వెంకటరమణ