Sunday, March 13, 2022

అంతరించి పోతున్న చిట్టడవి

అంతరించి పోతున్న చిట్టడవిలో
ఆశలొడిగిన చెట్టు చిగురులేసింది
మఱ్ఱి చెట్టయినా మరో దారిలేక
పశు పక్షులు పక్కకొచ్చి చేరాయి
పచ్చి పిచ్చి మొక్కలన్ని పంచనొచ్చి చేరాయి
ఆసరా అని మెచ్చుకొనసాగాయి
అంత కంతై ఆ చెట్టు పెరిగింది
మ్రానుగట్టింది, ఊడ లిడిసింది
నీడ పెరిగిందని ఊరుమొత్తం నాడ చేరింది
మొదలు బాగుంటే మనము బాగుంటామని
మట్టి నోటన గరిచిపెట్టి చిట్టిచీమలు
గుట్ట పెట్టెను పుట్ట పెట్టెను మ్రాను చుట్టూ
గుట్టు తెలిసిన పాములన్నీ వచ్చిచేరాయి
పచ్చి మోసం పురుగు బుట్రను తినను నేర్చాయి
మ్రాను మాత్రం మండసంగా కాన వస్తుంది
చెట్టు చూస్తే లోపలంతా గుల్లబారింది
మఱ్ఱి చెట్టు నీడలోన మెక్కలన్నీ చచ్చిపోయాయి
మోసపోయిన జనం పాపం పరుగు దీశారు
ఊడలల్లుతు మఱ్ఱి చెట్టు ఊరుమొత్తం.

సశేషం

2054

2054

తెలుగు రచన
12/03/2022
====================
కనురెప్పలు వాలిపోతాయి
కనుబొమ్మలు రాలిపోతాయి
వాడిపోతాయి మారిపోతాయి
కొత్త ఆశలు చిగురులేస్తాయి

కొత్త ఆశలు చిగురులేస్తాయి
ఆశలన్నవి మొలకదీస్తాయి
చిగురు తొడిగి చిలవ పలవలు
నింగి వైపుకు దారితీస్తాయి

చిగురు తొడిగి చిలవ పలవలు
నింగి వైపుకు దారితీసేను
నిన్నలాగే నేడు కూడా  
కలలు కంటికి మిగులిపోయేను

ఎంత వాడీ అలఁతి ప్రాణి
ఎంతకెంతకు ఎంత ఎదిగేను
చూపు కంటే దూరమేగెను
నేలనొదలి నింగికెగసేను

నీటినార్పే నిప్పునే మరి
నిప్పుగా  ఈ మనిషి మార్చేను
నిప్పు లాంటి సత్య మొకటి
ఎప్పుడూ ఈ మనిషి మరిచేను

తృప్తి లేని తత్పరుండు 
తపనలోనే తనువునిడిచేను
తనది మొత్తం తవిషనిడిచి
రిక్తహస్తుడు  పరముకేగేను 
==================
         య.వెంకటరమణ/..

Sunday, March 6, 2022

ఏమో!ఇలా వచ్చేసింది,వ్రాసేసా.బాగుంటే చదవండి.

ఏమో!ఇలా వచ్చేసింది,వ్రాసేసా.బాగుంటే చదవండి.
============================
నే నిషా పుచ్చుకోలేదు, నిజం నన్ను నమ్ము
నీ కళ్ళమత్తు కాబోలు కల్లోలం అయ్యింది
నిదురంతా నీవే మరి ఆ నిద్దురేడకేగింది
నే నిషా పుచ్చుకోలేదు, నిజం నన్ను నమ్ము
నా తోటపూలు చూడు మరీ మృదువు మరిచిపోయాయి
నిన్ను తాకినాయేమో తమ ఉనికి మరిచిపోయాయి
ఆ అలలకేమి మూడింది.. నీ కురులుజూసికాబోలు
అలా-అలా తేలిపోతు అల్లరంత చేస్తున్నాయి
ఈ కోయిలమ్మకేమాయే కొత్తపాట పాడుతుంది
నీ అనురాగం చూసిందా తనరాగం మారింది
మరీ చిత్ర మీ ఉదయం ఇంతందంగా ఉంది
నీ అందం చూసిందా అది ముస్తాబయ్యొచ్చింది
చందమామకేమిటంట తొందరగా వచ్చింది
ఉన్నపాటినీ వెన్నెల ఇలా పరిచి వేసింది
నిన్నేమి అనుకుంటుందో,ప్రతిభింబం కానని చెప్పు
పదేపదే నిన్నుచూసి అలా మురిసిపోతుంది
నే నిషా పుచ్చుకోలేదు. నిజం నన్ను నమ్ము
నీ కళ్ళమత్తు కాబోలు కల్లోలం అయ్యింది
నిదురంతా నీవే మరి ఆ నిద్దురేడకేగింది
నే నిషా పుచ్చుకోలేదు. నిజం నన్ను నమ్ము
============================
...............య. వెంకటరమణ

2001

2001
TELUGU RACHANA
---/---/-------
=================
నీ ఊహల్లో నేనుంటే నాకిష్టం
నా ఊపిరి అది నీవైతే నాకిష్టం
ఆ చూపుల్లో ప్రేమంటే నాకిష్టం
పెదవిరుపుల నీ కోపం నాకిష్టం
కోపంలో జడ విసురులు నాకిష్టం
జతకోరే ఎదపొంగులు నాకిష్టం
కొంగంటని ఆ వంపులు నాకిష్టం
మదిరేపే అల్లరులే నాకిష్టం
వయ్యారీ నీ నడకకు సైకొట్టే
జడగంటలు నాకిష్టం నాకిష్టం
అడుగుల్లో అడుగై నే ఏడడుగులు
నడిసొచ్చి ఏకంగా ఉండడమే నాకిష్టం
అదృష్టం కలిసొస్తే ఆ కోణం నాదైతే
ఇరుకైనా సరే మరి, ఈదుకెళ్ళి పోవటం
గెలుపోటపు ఆటలో చివరికోడిపోవడం
ఒదిగి నిన్ను చేరటం, నాకిష్టం నాకిష్టం !!
========================
........................య.వెంకటరమణ

1889


1889
తెలుగు రచన
13/12/2019
=================================
ఆ అంచు ఈ అంచు నింగి నీకు పవిటంచు
పర్వతాల ఎత్తులు పరిమళించు సోయగాలు
సెలయేటి గల గలలు ఘల్లు ఘల్లు అందె మువ్వలు
ఒడ్డు లేని ఈ కడలీ హృదయ సీమలో
కీరవాణి ప్రేమ గీతి నన్ను పాడనీ
హొయలొలికే వయ్యారీ గొల్లబామనడిగాను
నెలవంకు నుదిటబొట్టు నిలదీసి అడిగాను
పొదిగి ఉన్న పొదల మాటు మల్లె తీగనడిగాను
నీ జాడా తెలియక నే నింగి నేల తిరిగాను
వెన్నెలమ్మనే చూసి వన్నె నీది అనుకున్నా
వన్నెలొలుకు వనజాక్షిని వనమంతా వెతికాను
నన్ను విడిచి వెళ్ళకలా నీలి మేఘమా
చిన్న జాడ చెప్పి వెళ్ళు చెలియ చంద్రమా
తూలిన ఈ కళ్ళతో తులా భారము
చెల్లిన నా కలలకు చెలియ నీవు వాస్తవం
మళ్లీ మళ్లీ కలలుగనే ముగ్ద నీ రూపము
మన్నిస్తే జన్మిస్తా మరుజన్మ నీకోసం
=================================
యలమంచిలి వెంకటరమణ...

2002

2002
తెలుగు రచన
16/12/2020
===========================
అలక చాలులే రాజా అలగమాకిలా
అనువు కాని చోట నీవు అడిగితే ఎలా
ఆస్థులన్ని వ్రాసిస్తా ఆగరాద నీవు జరా
చెలికత్తెల చెంతనుండ చెప్పలేనుగా ఇలా
వెన్నెలమ్మ వాకిట్లో పందిరేసి పెట్టింది
మురిపాలూ మూటగట్టి మల్లెలమ్మ పిలిచింది
రాయబారి మేఘమాల రాగాలా కోయిలమ్మ
వంతులేసి ఇంత ఇంత ఇంత చేయగా
పైరగాలి పంతముతో పవిట నిలువనీకుంది
పొద్దెరుగని ఈ పరువం హద్దుమీరిపోతోంది
పడమరేపు కొండలలో పొద్దు దాగి చూస్తుంది
గుండె కూడ మాట వినదు గుబులు గుబులుగా ఉంది
కోయిలమ్మ నేడు చూడు కొత్త రాగమెత్తింది
చూడ ఊరు జనంలో ముచ్చటే మనదుంది
మాటుమనగనీ ఊరు ముద్దుల మామా
వెన్న మీగడిస్తాను మెచ్చుకునేలా
===========================
యలమంచిలి వెంకటరమణ/.

2003

2003
తెలుగు రచన
21/12/2020
===================
వేదాలెలసిన దేశంలో
వెదవల రధాల రోధనతో
కపూత ప్రసూత వేదనతో
ఉసూరు మంటుందీ తల్లి
తలనమ్మేది ఒకరనుకుంటే
తననమ్మేసే దళారి ఒకడు
మిఠాయిపొట్లం ఆమడ జూపి
రక్తం పిండే జలగల డేరు
ఉక్కుగొలుసుల ఉచ్చుల బిగిలో
ఊపిరి సలపని దుర్దవ దశలో
దేశాన్నయ్యో దరిద్రమాతకు
దాసోహానికి దానం చేసే
తల్లిని సైతం తెగనమ్మేసే
తనయులు తానా తందానా
తడిసిన కళ్ళకు కాటుకలద్దే
దళారులందరు తందానా
===================
యలమంచిలి వెంకటరమణ/.

2004

2004
తెలుగు రచన
01/01/2021
HAPPY NEW YEAR
===================
సర్వం మరిచిపోవాలని నాడు త్రాగాను
త్రాగి సర్వం నేడు నేనే మరిచిపోయాను
ముందు త్రాగి నేనేడుస్తూ నవ్వాను
నవ్వలేక నేడేడుస్తు మందు త్రాగుతున్నాను
కొన్ని మరువాలని నేనిన్ని మరిచిపోయాను
మరిచి మరిచి నన్ను నేనే విడిచిపోయాను
పందితో నే పానుపేసాను కుక్కతో నే ప్రక్క వేసాను
త్రాగుబోతునే నేను ఎంత కాదన్నా
నాడమ్మకొడితే అలిగి త్రాగను
రేడు నాన్న తిడితే నేను త్రాగాను
నేడెవడు పడితే వాడు కొడుతుంటే
నేడెవడు పడితే వాడు కొడుతుంటే
అలక మరిచాను సలుపు మరిచాను
నేడెంత కాదన్నా త్రాగుబోతున్నేను
ఆస్థులమ్మాను పుస్తులమ్మాను
మానమమ్మా నభిమానమమ్మాను
నమ్మలేనీ నిజం నేనే అమ్ముడయ్యానూ
మానివేశాను త్రాగుడే నే మానివేశాను
త్రాగుడే నను త్రాగుతుంది
బ్రతకడం నే మానివేశాను
త్రాగుడే నను త్రాగుతుంది
బ్రతకడం నే మానివేశాను
===================
యలమంచిలి వెంకటరమణ/..

2005

2005
తెలుగు రచన
02/01/2021
==========================
రారాదా వసంతమా రాలి పోయానూ
వికటించిన గ్రీష్మంలో మాడి పోయాను
రారాదా వసంతమా రాలి పోయానూ
వికటించిన గ్రీష్మంలో మాడి పోయాను
వేచి వేచి ఎదురు చూసి వేసవిలో వేడిగాచి
శిశిరంలో ఆకులా శిథిలమై పోయానూ
తుఫానులో ఎగిరి నేను ఎడారికి చేరాను
వసంతమా ఒక్కసారి వచ్చి వెళ్ళుమా
కోయిలమ్మ నీవైనా చెప్పి చూడుమా
సెలయేటి ఒడ్డున కొత్త చిగురునై
చిగిరించే చిన్న ఆశ చెరగనీకుమా
వసంతమా ఒక్కసారి వచ్చి వెళ్ళుమా
==========================
యలమంచిలి వెంకటరమణ/.

2006

2006
తెలుగు రచన
04/01/2021
===============
కొంచెమున్న చీమలూ
ఖరారైన మొక్కలు
జలములో చేపలూ
ఎగురుతూ పక్షులు
కలిసన్నీ బ్రతుకుతుంటే
కలిగన్నీ యోచించక
కలిసి బ్రతుకు నేర్వలేక
మనిషేందుకు మరీ ఇలా
కులాలుగా తెగలుజేసి
మతలుగా మరీ దీర్చి
ఆ మూలన వాడంటూ
ఈ మూలన వీడుంటూ
తెగలు తెగలు తలో దారి
తగలబెట్టు వెతలు బెట్టి
చావలేక బ్రతుకుతూ
బ్రతికినోళ్ళ చంపుతూ
ఎందుకయ్య బ్రతకలేడు
బ్రతికెటోళ్ళ బ్రతకనీడు
ఎందుకయ్య బ్రతకలేడు
బ్రతికెటోళ్ళ బ్రతకనీడు
బలాదూర్ నాయాళ్ళు
బ్రతకనేర్చి చంపుతుంటె
బాధ్యతగల పౌరులమై
బడలి బ్రతుకనేలనోయి
కలిసుంటే కలదు సుఖము
కలిసుందాం మనం మనం
కలిసుంటే కలదు సుఖము
కలిసుందాం మనం మనం
=================
యలమంచిలి వెంకటరమణ/.

007

007
తెలుగు రచన
06/01/2021
===================
కురస బట్టల ఫ్యాషనొచ్చింది
పొడవు జుట్టూ క్రాఫు కొచ్చింది
లోన గుడ్డలు బయటకొచ్చాయి
బయట ముగ్గులు వంటికెక్కాయి
వంట గదిలో వారుపుండదు
పడక గదికి మరుగు ఉండదు
ఇల్లు ఖాళీ రోడ్లు రద్దీనోయ్
అమ్మానాన్నలు రోత నేడోయి
లేచి తడువు లేడి పరుగు
పరుగు పరుగు అదే బ్రతుకోయి
శిష్టమన్నది శిష్టమాయెను
చిరుగు బట్టల సోకులంటోయి
భయములుండవు భక్తిలుండదు
బాధ నెఱిఁగిన మనుజులుండరు
వాయి వరసలు మాయమయ్యేనూ
పడుపుతనముకు పార్కులొచ్చేను
పోయెకాలం పరిధి దాటేను
పాపమెపుడో హద్దు మీరేను
శ్వేత అశ్వం సిద్ధమయ్యేనూ
కల్కి విష్ణువు సమయ మొచ్చేనూ
======================
యలమంచిలి వెంకటరమణ/.

2008

2008
తెలుగు రచన
09/01/2021
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ఏ తీగదో ఈ రాగమూ
ఏ రాగమో ఈ గీతము
ఈ పాట నను పాడనీ
ఆ తీరాలు నను దాకనీ
ఏ శుక్తిలో ముత్యమో
పలు వరసగా మారెనే
ఏ తోఁట దీ కుసుమమో
స్మితమాయే నీ మోమునా
మెరుపు మేళవింపుల ఛాయ
విల్లు వంచిన నడుము
నడక నాట్య లహరి
నీది ఏ పురము నారీ
నల్ల ద్రాక్షాల కనులు
మల్లెపూవుల తెలుపు
చెంప జారిన ఒంపు కురులు
చిలుక నాసికమాని చెక్కిళ్ళు
చెవిజాటు నా తావు
చిన్న ముద్దు కొళ్ళు
చేసెటి అల్లర్లు జెప్పతరమా
కందిపోయే శంక నాచేయి తాక
మృదువైన కౌగిళ్ళల్లో
ఎదురిచ్చి నా ఊపిరి
కాపాడు కోవాలనీ
కలగనుట అతియాశనా
పెరియారు పెన్నిధులు
పేట ముక్కోటి దేవతలు
ఆశీస్సులందింప నతిధులెల్ల
నాగడియ నాదగుటయే భాగ్యము
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
యలమంచిలి వెంకటరమణ/.

2008

2008
తెలుగు రచన
09/01/2021
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
ఏ తీగదో ఈ రాగమూ
ఏ రాగమో ఈ గీతము
ఈ పాట నను పాడనీ
ఆ తీరాలు ననుదాకనీ
ఏ శుక్తిలో ముత్యమో
పలు వరసగా మారెనే
ఏ తోఁట దీ కుసుమమో
స్మితమాయే నీ మోమునా
మెరుపు మేళవింపుల ఛాయ
విల్లు వంచిన నడుము
నడక నాట్య లహరి
నీది ఏ పురము నారీ
నల్ల ద్రాక్షాల కనులు
మల్లెపూవుల తెలుపు
చెంప జారిన ఒంపు కురులు
చిలుక నాసికమాని చెక్కిళ్ళు
చెవిజాటు నా తావు
చిన్న ముద్దు కొళ్ళు
చేసెటి అల్లర్లు జెప్పతరమా
కందిపోయే శంక నాచేయి తాక
మృదువైన కౌగిళ్ళల్లో
ఎదురిచ్చి నా ఊపిరి
కాపాడు కోవాలనీ
కలగనుట అతియాశనా
పెరియారు పెన్నిధులు
పేట ముక్కోటి దేవతలు
ఆశీస్సులందింప నతిధులెల్ల
నాగడియ నాదగుటయే భాగ్యము
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°
యలమంచిలి వెంకటరమణ/.

2009

2009
తెలుగు రచన
14/01/2021
=========================
కొండనే నేను గుండె నిండా నీరు
ఆ నీటి ధారలో తానమాడే మీరు
కోనేరు సెలయేరు అనుకొందురే గాని
బ్రద్దలయ్యే గుండె బాధ లెఱుగంగలేరు
మొలిచి నిలచిన వనములెల్ల నరుకనేర్చేరు
తొలచి గర్భ ఘనులుదీసే ఘనులు మీరు
చదును జేసీ సంభ్రమేలయ్యా
గర్భఘోషను యెఱుగరేమయ్యా
గూడు లేక కోట్ల పక్షులు శిథిలమయ్యేను
నీడ లేక నేల సైతం నెరలుబారేను
చెట్లు నరికి చదును జేసీ
విలుప్తత జేయ మేలా సృష్టినిట్లు
వాన కురిసే దారి నేనూ
వరద రోధకంబు నేనూ
ఘనులు తొలిచే గనులు మీరయ్యా
గతులు దప్పెను ఋతువులనకండీ
వెతలు బోవుట తగదు లేవండి
కంపనాలూ కరువు బాధలు
కొత్త కొత్త వింత ఆమయములు
ఎంత ఆయుషు ఎంత కొచ్చింది
సృజనశీలత భ్రష్టమయ్యిందీ
కొండనే నేను గుండె నిండా నీరు
ఆ నీటి ధారలో తానమాడే మీరు
కోనేరు సెలయేరు అనుకొందురే గాని
బ్రద్దలయ్యే గుండె బాధ లెఱుగంగలేరు
=========================
Yalamanchili Venkataramana/..

2010

2010
తెలుగు రచన
18/01/2021
=================
కాకపోదును కవిని నేను
లేకపోవును కవనశీలత
కాదు నేను నిద్వజనుడన్
విధికి లోబడి బ్రతుకు జీవుడ
మాటలొచ్చిన మ్రాను నేను
చూడగలిగిన గ్రుడ్డి వాడను
వినికిడెరిగిన బధిరి నేనూ
సొంత లాభం సంఘ జీవిని
తిండి కొరకు తినట మాని
నీడ కొరకూ ఎండ నెండీ
నాది కానీ దాని కొఱకు
నన్ను మరిచే మనిషి నేను
సృష్టి మర్మం ఎరుగ లేనీ
సృష్టి నేలే శ్రేష్ఠ జీవిని
కట్ట కట్టి కట్టెలందున
కాలిపోయే మట్టి మనిషిని
నిన్న మరిచీ రేపు ఎరుగని
నేడు నాపే నిగ్గు లేనీ
గోడ కెక్కిన పటం నేను
మాటవరసకు మనిషి నేను
నోటపెంటా గబ్బిలాలూ
నిశీధిలో గుడ్లగూబలు
తెల్లవారితె కుప్పతెప్పలు
మూత గప్పిన మురికి వాగులు
తానా తానా తందనానా
ముప్పు తప్పదు ముందరోయి
భూమికెందుకు బరువు చేటు
దాటుకెళ్ళే దారు లెదుకోయి
===================
య. వెంకటరమణ__/°°

2011

2011
Telugu Rachana
21/01/2021
===================
ఎవరు కట్టిన గోడలో ఇవి
ఎవరు వేసిన పునాదులో
శక్తిశాలే పర్వతాలను
పగలగొట్టి కట్టినారో
అంతకంతకు పెరిగిపో యే
వింత రాళ్ళను పేర్చినారో
ఇంత పెరిగిన అంకణాలు
కోటగట్టిన కోటి తెగలు
తెగని తగువుల తెగలడేరు
తెగల వారీ మతం వేరు
మానవత్వం పునాధుల్లో
మనగద్రొక్కిన మనిషి తీరు
బ్రతుకు మార్గపు వర్ణభేదం
బడలి చావుకు దారి తీస్తే
బదల రానీ పరాత్పరుడు
మదనపడుట మహత్తరమా
మనసు తలుపులు తెరిచి చూడు
అంతరాత్మకు ఒదిగి బ్రతుకు
ఊరకే ఈ తగవులెందుకు
కులంమీదా మతం మీదా
కులం మీదా..? మతం మీదా..?
మనది మనమే మతం కాదా
కలిసి బ్రతికే మార్గమెంచు
కడకు బ్రతుకే స్వర్గమనుచూ
===================
య. వెంకటరమణ/.

2011

2011
Telugu Rachana
21/01/2021
===================
ఎవరు కట్టిన గోడలో ఇవి
ఎవరు వేసిన పునాదులో
శక్తిశాలే పర్వతాలను
పగలగొట్టి కట్టినారో
అంతకంతకు పెరిగిపో యే
వింత రాళ్ళను పేర్చినారో
ఇంత పెరిగిన అంకణాలు
కోటగట్టిన కోటి తెగలు
తెగని తగువుల తెగలడేరు
తెగల వారీ మతం వేరు
మానవత్వం పునాధుల్లో
మనగద్రొక్కిన మనిషి తీరు
బ్రతుకు మార్గపు వర్ణభేదం
బడలి చావుకు దారి తీస్తే
బదల రానీ పరాత్పరుడు
మదనపడుట మహత్తరమా
మనసు తలుపులు తెరిచి చూడు
అంతరాత్మకు ఒదిగి బ్రతుకు
ఊరకే ఈ తగవులెందుకు
కులంమీదా మతం మీదా
కులం మీదా..? మతం మీదా..?
మనది మనమే మతం కాదా
కలిసి బ్రతికే మార్గమెంచు
కడకు బ్రతుకే స్వర్గమనుచూ
===================
య. వెంకటరమణ/..

2011

2011
Telugu Rachana
21/01/2021
===================
ఎవరు కట్టిన గోడలో ఇవి
ఎవరు వేసిన పునాదులో
శక్తిశాలే పర్వతాలను
పగలగొట్టి కట్టినారో
అంతకంతకు పెరిగిపో యే
వింత రాళ్ళను పేర్చినారో
ఇంత పెరిగిన అంకణాలు
కోటగట్టిన కోటి తెగలు
తెగని తగువుల తెగలడేరు
తెగల వారీ మతం వేరు
మానవత్వం పునాధుల్లో
మనగద్రొక్కిన మనిషి తీరు
బ్రతుకు మార్గపు వర్ణభేదం
బడలి చావుకు దారి తీస్తే
బదల రానీ పరాత్పరుడు
మదనపడుట మహత్తరమా
మనసు తలుపులు తెరిచి చూడు
అంతరాత్మకు ఒదిగి బ్రతుకు
ఊరకే ఈ తగవులెందుకు
కులంమీదా మతం మీదా
కులం మీదా..? మతం మీదా..?
మనది మనమే మతం కాదా
కలిసి బ్రతికే మార్గమెంచు
కడకు బ్రతుకే స్వర్గమనుచూ
===================
య. వెంకటరమణ

2012

2012
Telugu Rachana
24/01/2021
=======================
నీలి మేఘాల క్రింద నేల అందాలు
హేళి బంగారు వలువాంబరాలు
కుసుమ నెత్తావి స్తబ్ద సమ్మోహము
రమణీయ రసభరిత సాయంత్రము
జాజి మల్లియలన్ని జాబిల్లి కోసం
జాము జాగార జాన వయ్యారము
జలాధార లయ గీత నేపద్యము
కొలను శ్వేతోత్పలావర్ఛము
తావి తమ వంతు విన్యాసము
ఈల పాటల గాలి కూగియాడే
కొమ్మ కొమ్మ కో కొత్త వాయిద్యము
వైవశ్యమగుపించు వర్ణ మిళితం
హింసీర సంగీత శ్రావ్యస్వరముల్
జాలరిడిచిన దోనె తెరచాప రెపరెపలు
నిమ్మగిల్లిన మామ చెంత జేరిన ఎంకి
సిగ్గులొలికే మోము శృంగార హొయలు
చింతలన్నీ విడిచి చెంత చేరిగ జంట
వెలుగులొలికే దివ్వె మెలిదిరిగె బిడియాన
అదుపు దప్పగ జూసి జంట నజరాన
తకిదిమిత తెల్లార్లు తందాన వాన
=========================
య. వెంకటరమణ/..

పైపులోని నీరులా పడి పోడానికెందుకంత తొందర

================================
పైపులోని నీరులా పడి పోడానికెందుకంత తొందర
పొయ్యి మీద నీళ్ళలా పైకెళ్లాడానికెందు కింత అల్లరి
నింగిలో మేఘమవ్వాలంటే క్రింద నీరు మండాలీ
పతనమవ్వాలంటే ఎంత చిన్న వెలుసుబాటు చాలు
=================================
య. వెంకటరమణ/.

2013


2013
తెలుగు రచన
26/01/2021
==============
భారత జాతి మనది
భాగ్య దాత మనది
మన తత్వం మనది
మానవత్వమే అది
మతాలనీ మొత్తుకుంటు
కులాలనీ కొట్టుకుంటూ
కుచ్చితాల ఉచ్చులలో
కుతంత్రాల వ్యూహంలో
మనిషి కొరకు మనిషి గాక
మనిషి కోరకో మనిషై
మట్టిగరిచి పోతున్నా
మత్తు విడక మనమెందుకు
గిట్టుటకే పుట్టినట్టు
గట్టి గుట్టలవుకుంటూ
ఎక్కుపెట్టు బాణాలకు
ఎదురెల్లా లెందుకు
ఏరులై పారుతున్న
ఆ రక్తం ఏ జాతిది
నిర్జీవా ఖాయాలను
అడుగు నీవు మతమేదని
ఉగ్రవాదామో ప్రక్కన
ఉన్మాదులు మరో ప్రక్క
ప్రక్క సంధులెతుకుతూ
పరుల పోరు మరో ప్రక్క
చిన్న వేలు చిటికినేలు
బిగబడితే పిడికుళ్ళు
పిడికిలి నీ పిరంగీ
పదులు కాదు కోట్లమంది
ఒకే ఒక్క నినాదం
వందేమాతరం
భరతమాత బిడ్డలం
మనమంతా ఒక్కరం
==============
య.వెంకటరమణ/.

తృష్టమైన శిలను తృటిని మలచివీవు

=========================
తృష్టమైన శిలను తృటిని మలచివీవు
మూర్తి రూపమిచ్చి, మోహరింపజేయు
మహాశిల్పివయ్య , మహీబ్రహ్మవయ్య.
మంత్ర మేసి చేయు తంత్ర మూర్తి కన్నా
మర్మ మెరుగ నట్టి నీ మూర్తి మిన్నయ్యా
మహికి మెప్పు నీవు నెలవైన ఉలికాఁడా!!
==========================
తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ

నీతిభ్రష్టమాయె

నీతిభ్రష్టమాయె
నియము భ్రష్టమాయె
భవిత భ్రష్టమాయె
భ్రష్టమాయె మనిషి
భవనఛాయగప్పి
శూలమాయెనేమో
చీకవాలుబట్టె
చిన్నజీవితాలు
అణియమయ్యోచూడు
అణగారె దినదినము
అధికమాయెనేడు
అవినీతి మితిమీరి
మత్తువీడు మిత్రా
మట్టుబెట్టగ నీకు
ఉన్న హక్కు చాలు
అదే ఓటు హక్కూ
చెందనాడి నీవు
చేయవలదు గేలి
స్వార్ధమింత జూసి
చెడు నెంచ నైనా
చెదలు తొలచినట్లు
తొలచేను నిలువెల్ల
నీతి లేని వాడు
నిన్నంత నమ్మించు
కొమ్మ దాసరల్లే
కోటి కథలు జెప్పి
కొంప ముంచు నీదు
కొసరి అడుగు వేయూ
===============
య.వెంకటరమణ

2014

2014
తెలుగు రచన
30/01/2021
===================
చలిలో వేడి కోరే జనం
వేడిలో చలి కోరే మనం
వెళ్ళేవారకూ నేడు భారం
నిన్న నీనాడు పొగడడం
పేక ముక్కల జీవితం
ఫలితం వరకునే పట్టుకుంటాం
గెలిచినా ఓడినా విసిరి కొట్టడం
ఎవరికి వారే ఉత్కంఠభరితం
అమ్మేవాడికెంతొచ్చినా తక్కువ
కొనేవాడికది చాలా ఎక్కువ
ఎక్కడండీ మన తప్పొప్పుకుంటాం
ఎదుటివారినే నిందిస్తుంటాం
తాను పొడవయ్యి బట్టలు కురసయ్యాయాంటాం
లావు మనమయ్యి బిగువయ్యాయాంటాం
ఎక్కడుంది నిజం చెప్పే ధైర్యం
కాల్చేది అగ్గయితే చెయ్యి కాలిందటాం
సూర్యుని కిందకు మనమెళ్ళి
సూర్యుడే నెత్తిమీదికొచ్చాడంటాం
ఉద్దండులమే సుమా మనం
సూన్యమైన ఆకాశాన్ని రంగుల్లో చూస్తాం
తాకివెళ్ళే వాస్తవం గాలినేమో చూడలేము
దోమతెర చేపల వల
అందులోకి దొమలెళ్ళవు
ఇందులో చేపలు బయటకు రాలేవు
కర్మను బట్టే ధర్మముంటుంది
ధర్మంలో కర్మమేముంటుంది?
గుణాన్ని బట్టే కులం గానీ
కులాన్ని బట్టి గుణమొస్తుందాండి
===================
య. వెంకటరమణ

thamaashaa


ధరలు మండే దేశమందు

ధరలు మండే దేశమందు
================
ధరలు మండే దేశమందు
ప్రగతినొందెడి కలలు కద్దు
దేశమంటే కాదు కదవోయ్
గీసుకున్నా హద్దు గీతలు
మోజు తీరని మారకాలు
పరుల సరుకుల మోజు బారు
సొంత మార్పిడి కొంత ఉన్నా
ఇంత ప్రబలం కాదు కదవోయ్
వలసిపోతూ ఆకలదిగో
ఊడిగాలకు, పరుల సేవకు
దేశమీ గతి వలసిపోతే
పరప తేలను భారత మాతకు
పరులు సైతం వలసి వచ్చే
మార్గమెంచుట మేలు కదవోయ్
తిండి గలిగే మార్గ మెంచి
ఎదుగ నేర్పుట మేలు కదవోయ్
పేరు బెట్టక నాది నీది
ప్రేరనెఱిగీ ప్రజలు గలిసిన
పరోక్షంగా దేశమెదుగును
ప్రజల ఆకలి అదే సమసును
చౌక బియ్యం, గింత తైలం
ఎత్తిపోతలు ఎంత కాలం
ఎత్తవోయి దేశ భారం
జూపమేలో బ్రతుకు మార్గం
రెచ్చగొట్టెడి ప్రాంతః వైరము
మతం పేరట మరణహోమము
అధోగతికి మూలాధారం
కలిసి మెలగుట కదా సౌక్యము
కలిసి పోదాం, ప్రగతిబడదాం
భారత మాతకు ముఖిటమెడదాం
ఎవరికారే కష్టపడి మరి
ఆకలన్నది తరిమి కొడదాం
======================
తెలుగు రచన
యలమంచిలి వెంకటరమణ

NOT TO COPY


NOT TO COPY
=============🤍=============
నాకిష్టమైన ప్రతి పేజీ నీవయ్యున్నావు
కష్టమైన నా ప్రతి పేజీలో నీవున్నావు
నా కలం నుండి జాలువారే ప్రతి అక్షరం
అందంగా మలచి జీవిత గ్రంధం చేసావు
ప్రతి భావంలో నీ హృదయం నింపేవు
నీ ఊపిరితో వాటికి ప్రాణం పోశావు
చివరి పేజీలో ఒక తప్పు దొరలింది
ఇంపనుకున్నావేమో ముగింపు వ్రాశావు
నీవు నాటిన మొక్క నేడు చెట్టగయ్యింది
రాలని పండ్లు రతనాల్లా కాస్తూనే ఉంది
ప్రతి పుష్పం నీ వదనంలా వికాశిస్తూనే ఉంది
ఆ పరిమళాలు నన్నింకా పరికిస్తూనే ఉన్నాయి
ఈ గ్రంధంలో చివరి పేజీ తెరచే ఉంది
నీ సంతకం లేకది మూయాలేకున్నా
మోయడం కూడా నాకు భారంగానే ఉంది
నీకోపం నాకు తెలుసు అయినా వస్తావని ఆశ
=============🤍=============

1897

1897
తెలుగు రచన
02/02/2020
======================
గుడిసెల్లో, గుడి అరుగుల్లో
గుమ్మం లేని పూరి పాకలో
కాలు కాలెడి మండుటెండలో
క్షుధ బుధ కాలే కడుపు మంటతో
నిద్రే ఎరుగని నిప్పు కళ్ళకు
నరాలపీకుడు, ఎముకల సలుపు
నిన్న మాదిరే నేటి బ్రతుకులు
నిఘంటువెఱుగని నుదిటి రాతలు
ఎన్నాళ్ళింకా కునుకుపాటులు
ఎవరొస్తారని ఎదురుచూపులు
పిడికిలి బిగించి పదపద ముందుకు
పదపద ముందుకు పదపద ముందుకు
నేడు కూడా నిద్రపోతే,
నిన్నలాగే నేడు పోతే
నేడు సైతం విడిచిపోతే
రేపులేదోయ్ రేపులేదోయ్
నోట్ల కట్టల మాటున మరిచిన
మాపుడు గుడ్డలు జెండాలెత్తు
మాపున పుట్టిన మాతకు నీవే
నీవే వెలుతురు బిడ్డవు నీవే
అదిగో అదిగో వేకువ గీతం
కడలిని చీల్చుకు ప్రభాత కిరణం
చీకటి తరుముకు వచ్చేస్తుంది
వేకువ నీదే, నీదీ ఉదయం
ధ్యేయం మరువక ముందుకు సాగే
యువతా నీకో సవాలు గీతం
అదిగో శంఖం ఇదిగో శ్రమికం
ప్రచండ భారత ప్రమదాగీతం
యువకుల్లారా, శ్రమికుల్లారా
రేపటి భారత ప్రమిదుల్లారా
నిశాంత కిరణం మీరే కాదా
నియంత లెవరు, మీరే కారా
చమట బిందువు సిరా చేసుకో
నింగిపైనన్ నీ చరిత వ్రాసుకో
చరిత్ర మార్చే శాస్త్రం అనుకో
ఆగక నీవిక సాగుకుపో సాగుకుపో
======================
యలమంచిలి వెంకటరమణ...✍🏻