Sunday, March 6, 2022

సుసప్త వర్ణ విరాజితా

సుసప్త వర్ణ విరాజితా
సప్త దారణా సంజ్ఞా ..
ప్రభోదిని సము సాధనీ
మనః స్థిరేహి,మనో వికాసే
ఉషోదయ వెలుగుల వాణీ
విరాజిల్లే హరివిల్లు రంగుల హేళి
భవ భారత ఆకాశానకిదే వికాసీ
బంగారు భవితలకు నమో ప్రమాణీ
ప్రభోధిని ప్రభారతి ప్రకాశిని
శారీరక దృఢ సృజనా సుస్వరూపినీ
విద్యార్థుల ధ్యాన పృష్టినీ
హరివిల్లు, హరివిల్లు ఈ హరివిల్లు
................ మాధురి గౌడ్

No comments:

Post a Comment