Sunday, March 6, 2022

వసంతంలో ఓ సందె వేళ

=====================
వసంతంలో ఓ సందె వేళ
అందంగా వంగిన ఆ కొమ్మ
మృదువైన లేలేత చిగురులతో
నా చెంపలు నిమురుతూ
వేసవిలో నువ్వు పోసిన నీటి పుణ్యం
నేడు నేను చిగురులు తోడుగాను
ఆ శక్తినంతా కూడ గట్టి
నీ శక్తికి ఫలములిస్తున్నాను
ఇక నా జీవితం నీకంకితం
నా ఛాయాలో సేద దీరుస్తాను
ఓ అడుగు నేల నాకిస్తే చాలు
నీకడ్డురాక గాలిలో బ్రతికేస్తా
నా ఆకులు నేనే తిని బ్రతికేస్తాను
మండుటెండలో ఎండైనా గాని
ఎండలో నీడనిస్తా నేను
నీవిడిచిన శ్వాసతోనే బ్రతికేస్తా
అన్నా అటు చూడు
అందరూ నన్నే చూస్తున్నారు
నా నడుముకు లెక్కలు వేస్తున్నారు
గొడ్డలి సిద్ధం చేస్తున్నారు.
ఎటూ వెళ్లలేను, ఏమీ అన లేను
ఎదురు తిరగలేను, ఏడ్వనైనా లేను
జోడించాలన్నా చేతుల్లేని నేను
యాచిస్తున్నా ఆపు కాస్త నేస్తం
=====================
తెలుగు రచన..

No comments:

Post a Comment