Sunday, March 6, 2022

2002

2002
తెలుగు రచన
16/12/2020
===========================
అలక చాలులే రాజా అలగమాకిలా
అనువు కాని చోట నీవు అడిగితే ఎలా
ఆస్థులన్ని వ్రాసిస్తా ఆగరాద నీవు జరా
చెలికత్తెల చెంతనుండ చెప్పలేనుగా ఇలా
వెన్నెలమ్మ వాకిట్లో పందిరేసి పెట్టింది
మురిపాలూ మూటగట్టి మల్లెలమ్మ పిలిచింది
రాయబారి మేఘమాల రాగాలా కోయిలమ్మ
వంతులేసి ఇంత ఇంత ఇంత చేయగా
పైరగాలి పంతముతో పవిట నిలువనీకుంది
పొద్దెరుగని ఈ పరువం హద్దుమీరిపోతోంది
పడమరేపు కొండలలో పొద్దు దాగి చూస్తుంది
గుండె కూడ మాట వినదు గుబులు గుబులుగా ఉంది
కోయిలమ్మ నేడు చూడు కొత్త రాగమెత్తింది
చూడ ఊరు జనంలో ముచ్చటే మనదుంది
మాటుమనగనీ ఊరు ముద్దుల మామా
వెన్న మీగడిస్తాను మెచ్చుకునేలా
===========================
యలమంచిలి వెంకటరమణ/.

1 comment: