Sunday, March 6, 2022

1897

1897
తెలుగు రచన
02/02/2020
======================
గుడిసెల్లో, గుడి అరుగుల్లో
గుమ్మం లేని పూరి పాకలో
కాలు కాలెడి మండుటెండలో
క్షుధ బుధ కాలే కడుపు మంటతో
నిద్రే ఎరుగని నిప్పు కళ్ళకు
నరాలపీకుడు, ఎముకల సలుపు
నిన్న మాదిరే నేటి బ్రతుకులు
నిఘంటువెఱుగని నుదిటి రాతలు
ఎన్నాళ్ళింకా కునుకుపాటులు
ఎవరొస్తారని ఎదురుచూపులు
పిడికిలి బిగించి పదపద ముందుకు
పదపద ముందుకు పదపద ముందుకు
నేడు కూడా నిద్రపోతే,
నిన్నలాగే నేడు పోతే
నేడు సైతం విడిచిపోతే
రేపులేదోయ్ రేపులేదోయ్
నోట్ల కట్టల మాటున మరిచిన
మాపుడు గుడ్డలు జెండాలెత్తు
మాపున పుట్టిన మాతకు నీవే
నీవే వెలుతురు బిడ్డవు నీవే
అదిగో అదిగో వేకువ గీతం
కడలిని చీల్చుకు ప్రభాత కిరణం
చీకటి తరుముకు వచ్చేస్తుంది
వేకువ నీదే, నీదీ ఉదయం
ధ్యేయం మరువక ముందుకు సాగే
యువతా నీకో సవాలు గీతం
అదిగో శంఖం ఇదిగో శ్రమికం
ప్రచండ భారత ప్రమదాగీతం
యువకుల్లారా, శ్రమికుల్లారా
రేపటి భారత ప్రమిదుల్లారా
నిశాంత కిరణం మీరే కాదా
నియంత లెవరు, మీరే కారా
చమట బిందువు సిరా చేసుకో
నింగిపైనన్ నీ చరిత వ్రాసుకో
చరిత్ర మార్చే శాస్త్రం అనుకో
ఆగక నీవిక సాగుకుపో సాగుకుపో
======================
యలమంచిలి వెంకటరమణ...✍🏻

No comments:

Post a Comment