Sunday, March 6, 2022

1782

1782
తెలుగు రచన
15/07/2018
=============
ఇంతమంది లోకంలో
ఎంత ఒంటరయ్యాను
అంతకంత శిథిలమై
ఇంత మిగిలి ఉన్నాను
కెరటమై కడలి నీవు
ఇటురాకే చెలిలేదు
పయనించే ఓ గాలి
పరిహాసించి వెళ్ళిపోకు
ఎండమావి నీటికొఱకు
పరుగులెంత తీసాను
జాలిలేని మేఘమాల
దారైనా చూపలేదు
మోముదాచి చందమామ
శుక్లపక్షమయింది
కొడిగట్టిన దీపమేమొ
కొసరి కొసరి నవ్వింది
ఎక్కడో నక్కల అరుపు
చిక్కనీ చీకటి మలుపు
లెక్కలేసి శ్వాసల గడువు
గుక్క మరిచి పోయాను
పిచ్చి ప్రేమ పోతేనయము
ఈచిచ్చు ఆరిపోతే నయము
మన్న లేను నేనింక
మనసు మాసిపోతే నయము
ఎంత నమ్ముకున్నాను
నమ్మరాని ప్రేమను
కొన్ని నాళ్ళ ముచ్చటకు
ఎన్నినాళ్ళు ఏడ్చాను
================
యలమంచిలి వెంకటరమణ...

No comments:

Post a Comment