Sunday, March 13, 2022

అంతరించి పోతున్న చిట్టడవి

అంతరించి పోతున్న చిట్టడవిలో
ఆశలొడిగిన చెట్టు చిగురులేసింది
మఱ్ఱి చెట్టయినా మరో దారిలేక
పశు పక్షులు పక్కకొచ్చి చేరాయి
పచ్చి పిచ్చి మొక్కలన్ని పంచనొచ్చి చేరాయి
ఆసరా అని మెచ్చుకొనసాగాయి
అంత కంతై ఆ చెట్టు పెరిగింది
మ్రానుగట్టింది, ఊడ లిడిసింది
నీడ పెరిగిందని ఊరుమొత్తం నాడ చేరింది
మొదలు బాగుంటే మనము బాగుంటామని
మట్టి నోటన గరిచిపెట్టి చిట్టిచీమలు
గుట్ట పెట్టెను పుట్ట పెట్టెను మ్రాను చుట్టూ
గుట్టు తెలిసిన పాములన్నీ వచ్చిచేరాయి
పచ్చి మోసం పురుగు బుట్రను తినను నేర్చాయి
మ్రాను మాత్రం మండసంగా కాన వస్తుంది
చెట్టు చూస్తే లోపలంతా గుల్లబారింది
మఱ్ఱి చెట్టు నీడలోన మెక్కలన్నీ చచ్చిపోయాయి
మోసపోయిన జనం పాపం పరుగు దీశారు
ఊడలల్లుతు మఱ్ఱి చెట్టు ఊరుమొత్తం.

సశేషం

No comments:

Post a Comment