Sunday, March 6, 2022

మనసు మురిసి నెమలియాయె నిన్నుజూసీ

మనసు మురిసి నెమలియాయె నిన్నుజూసీ
విప్పారిన పెదవులపై చిరునవ్వు నిన్ని తలంచి
కనులు మూసినా వేళా కలలలోనూ నీవు
కనులు తెరిచినా వేళా ముంగిట నీవు
ప్రొద్దుతిరుగు పువ్వులా ఎంత చూడనూ
పగలు రేయి నీకోసం వేచి ఉండనూ
నా నీడై కలసి నడిచి ఏడనయ్య నీవూ
జాడ మరిచి నీడగా ఆమడయ్యి నావూ
కాన రాని వెలుగుల్లో ఆశవు నీవూ
ఆనవాలు నా గుండె లయలే నీవు
మనసు మురిసి నెమలియాయె నిన్నుజూసీ
విప్పారిన పెదవులపై చిరునవ్వు నిన్ని తలంచి
కనులు మూసినా వేళా కలలలోనూ నీవు
కనులు తెరిచినా వేళా ముంగిట నీవు
.........మాధురి గౌడ్

No comments:

Post a Comment