Sunday, March 6, 2022

2003

2003
తెలుగు రచన
21/12/2020
===================
వేదాలెలసిన దేశంలో
వెదవల రధాల రోధనతో
కపూత ప్రసూత వేదనతో
ఉసూరు మంటుందీ తల్లి
తలనమ్మేది ఒకరనుకుంటే
తననమ్మేసే దళారి ఒకడు
మిఠాయిపొట్లం ఆమడ జూపి
రక్తం పిండే జలగల డేరు
ఉక్కుగొలుసుల ఉచ్చుల బిగిలో
ఊపిరి సలపని దుర్దవ దశలో
దేశాన్నయ్యో దరిద్రమాతకు
దాసోహానికి దానం చేసే
తల్లిని సైతం తెగనమ్మేసే
తనయులు తానా తందానా
తడిసిన కళ్ళకు కాటుకలద్దే
దళారులందరు తందానా
===================
యలమంచిలి వెంకటరమణ/.

No comments:

Post a Comment