Sunday, March 6, 2022

1783

1783
తెలుగు రచన
17/07/2018
==============================
హాలము బట్టిన అన్నకాకలేస్తుంది
పొలము దున్నే దున్న రంకెలేస్తుంది
నెరలు బారిన నేల విలవిలలుబోతుంది
హాలము బట్టిన అన్న కాకలేస్తుంది
యాతమేసిన చేతి ఎముకు అరిగింది
లాటు పెట్టిన కుప్ప చలి మంటకయ్యింది
రేటు పలకని రాశి పర-గ్రాసమయ్యింది
పర దేశమే నేడు మన వాసమయ్యింది
తీతువెక్కిన చెట్టు ఆకులెండింది
కోకిలెక్కిన కొమ్మ చిగురు మాడింది
పంట కోసిన రైతు గొంతెండిపోతోంది
పైరు పచ్చని నేల బీడుబారింది
ఓట్లకొచ్చిన్నాడు వాటేసుకున్నోడు
కోటు కొచ్చెను వాడు మాట కందడు నేడు
కోట్లు కతికిన వాడు ఈ పాట్లు వినడు
నిన్న కామందుడితడు నేడు రైతుకూలీడు
రైతు తలపాగ వాడి కళ్ళు తుడవకపోగ
పురుగు మందులు నేడు కడుపుకాహారం
తగదు చిన్న చూపు అది పెద్దముప్పు
రైతన్న కన్నీరు దేశాన్ని వెనుదిప్పు
పంట భూముల చోట పొగగొట్టమేసి
వండ గింజల్లేక మందు బిళ్ళల్ మేసి
మన్న గలమా మనము రైతన్ననొదలేసి
మన్న గలమా మనము. రైతన్ననొదలేసి!?
===============================
యలమంచిలి వెంకటరమణ..

No comments:

Post a Comment