Sunday, March 6, 2022

2018

2018
తెలుగు రచన
07/02/2021
==========================
చివరినాటి శుక్లపక్ష చంద్ర ఆననం
విరబూసే వెన్నెలమ్మ ఊష్మ చందనం
ఆకృష్టపు కనుజూపులు కృష్ణాలోహము
కెంపుల ఈ చెంప లే స్థపితా నైపుణ్యము
సౌదామిని స్వర్ణలేప మేనువర్ణము
తామ్ర సృజన తన్మయ స్వరము
సవ్యసాచి తృణత బోలి నా మధ్యము
రతి దేవుని యతి స్థానము ఈమేనేమో
చీర చెంగు దారి మళ్ళినా వైనం
అక్షయపాత్రలో వెన్నముద్దలా పళ్లెం
కురుల చివరకేమిటో ఈ ఆత్రం
తాకిన ప్రతి చోటా తకిదిమి తాళం
పచ్చా పచ్చ వసంతాలు వయ్యారం
పడుచుపిల్ల వియ్యానికి మేమొస్తాం
ఉన్నదంత ఇచ్చేసే ఓ సంతకం
చేసేసా ఇంటిపేరు నీకు అంకితం
==========================
య. వెంకటరమణ/..

No comments:

Post a Comment