Sunday, March 6, 2022

1889


1889
తెలుగు రచన
13/12/2019
=================================
ఆ అంచు ఈ అంచు నింగి నీకు పవిటంచు
పర్వతాల ఎత్తులు పరిమళించు సోయగాలు
సెలయేటి గల గలలు ఘల్లు ఘల్లు అందె మువ్వలు
ఒడ్డు లేని ఈ కడలీ హృదయ సీమలో
కీరవాణి ప్రేమ గీతి నన్ను పాడనీ
హొయలొలికే వయ్యారీ గొల్లబామనడిగాను
నెలవంకు నుదిటబొట్టు నిలదీసి అడిగాను
పొదిగి ఉన్న పొదల మాటు మల్లె తీగనడిగాను
నీ జాడా తెలియక నే నింగి నేల తిరిగాను
వెన్నెలమ్మనే చూసి వన్నె నీది అనుకున్నా
వన్నెలొలుకు వనజాక్షిని వనమంతా వెతికాను
నన్ను విడిచి వెళ్ళకలా నీలి మేఘమా
చిన్న జాడ చెప్పి వెళ్ళు చెలియ చంద్రమా
తూలిన ఈ కళ్ళతో తులా భారము
చెల్లిన నా కలలకు చెలియ నీవు వాస్తవం
మళ్లీ మళ్లీ కలలుగనే ముగ్ద నీ రూపము
మన్నిస్తే జన్మిస్తా మరుజన్మ నీకోసం
=================================
యలమంచిలి వెంకటరమణ...

No comments:

Post a Comment