Sunday, March 6, 2022

2009

2009
తెలుగు రచన
14/01/2021
=========================
కొండనే నేను గుండె నిండా నీరు
ఆ నీటి ధారలో తానమాడే మీరు
కోనేరు సెలయేరు అనుకొందురే గాని
బ్రద్దలయ్యే గుండె బాధ లెఱుగంగలేరు
మొలిచి నిలచిన వనములెల్ల నరుకనేర్చేరు
తొలచి గర్భ ఘనులుదీసే ఘనులు మీరు
చదును జేసీ సంభ్రమేలయ్యా
గర్భఘోషను యెఱుగరేమయ్యా
గూడు లేక కోట్ల పక్షులు శిథిలమయ్యేను
నీడ లేక నేల సైతం నెరలుబారేను
చెట్లు నరికి చదును జేసీ
విలుప్తత జేయ మేలా సృష్టినిట్లు
వాన కురిసే దారి నేనూ
వరద రోధకంబు నేనూ
ఘనులు తొలిచే గనులు మీరయ్యా
గతులు దప్పెను ఋతువులనకండీ
వెతలు బోవుట తగదు లేవండి
కంపనాలూ కరువు బాధలు
కొత్త కొత్త వింత ఆమయములు
ఎంత ఆయుషు ఎంత కొచ్చింది
సృజనశీలత భ్రష్టమయ్యిందీ
కొండనే నేను గుండె నిండా నీరు
ఆ నీటి ధారలో తానమాడే మీరు
కోనేరు సెలయేరు అనుకొందురే గాని
బ్రద్దలయ్యే గుండె బాధ లెఱుగంగలేరు
=========================
Yalamanchili Venkataramana/..

No comments:

Post a Comment