Sunday, March 6, 2022

2016

2016
తెలుగు రచన
02/02/2021
===================
ధమనస్కంధం తెగిన జీవులు
వశ్యమానవ వివశ్యాలు
రుధిరలేపము జగతి సర్వం
రక్తసిక్తపు క్రందనములు
రాక్షసత్వం రగులు మంటలు
దగ్దమవుతూ సామ్య జీవులు
పగలు రేతిరి కష్టపడినా
కడుపు నిండని శ్రమలు బోలెడు
సబల నాదం అబల బ్రతుకులు
పొదలమాటున పగిలు గాజులు
పడగలెత్తిన రక్కసత్వం
పగలిబడిన వికటనవ్వులు
సొంతలోనే కొంత భేదం
అంతరాలా వింత జాలం
దిచ్చుమొగమున దయాగుణము
రిక్తారిక్తులు తొంభై శాతం
దేశమీగతి దగ్దమవుతూ
ధనికుడే మరి ధనికుడవుతూ
కష్టజీవుల ఖర్మ గారం
తెల్లవారని గతుకు యానం
ఖండవెల్లో కండ్రిగెల్లో
కడుపు కూటికి పాటు పడెడి
చెమట నెత్తురు అత్తరల్లే
సోకు జేసే సావుకారులు
చెమట నెత్తురు అత్తరల్లే
సోకు జేసే సావుకారులు
రామ రామా రాజ్యమీగతి
రామ దండు సేతు సమరం
===================
య.వెంకటరమణ/.

No comments:

Post a Comment