Friday, September 23, 2022

సామా ధామా దండ భేదము

Telugu Rachana
2075
20/09/2022
===================
సామా ధామా దండ భేదము 
సంధించారు నాల్గో అస్త్రం
మనలో మనకే కయ్యంబెట్టి
వేడుక చూసే స్వార్థ జీవులు 

తేనెలు రాసిన కత్తులతో
తడిసిన గుడ్డలు పట్టుకుని
గొంతులు కోసే గుంటనక్కలు
గుంపులు గూడి వచ్చేసమయం
డాలూ ఖడ్గం పట్టుకుని
దారులకడ్డం నిలబడదాం 
తొలుకులు పలుగులు పట్టుకుని
కలుపు మొక్కలు పెరికేద్దాం
 
పెద్దలు కాదు గ్రద్దలు వీళ్ళు
దొంగల ముఠా నాయకులీళ్ళు
తప్పుకు పోయే సమయం కాదు
తప్పించాలి సిద్దంకండి

బలిమి కలిమి పెంచుకుని
మనమై మనకు నిలవాలి 
మువ్వన్నె చిహ్నం మనకుంది
మతాల కులాలు ఎందుకులే 
జన్నత్ స్వర్గం ఒకటే అర్థం 
జహన్నుమ్  నరకం ఎందుకు మనకు

పగ్గం మగ్గం ఏదైనా
విడిపోతే తెగిపోతుంది
విడి విడి గెందుకు కలిసే ఉందాం
ప్రగతి బాటలో ముందు పోదాం
===================
      య. వెంకటరమణ/..

Thursday, September 22, 2022

Tuesday, September 20, 2022

వేగం బాగా పెరిగిపోతుంది

Telugu Rachana
2074
20/09/2022
=======================
వేగం బాగా పెరిగిపోతుంది
ప్రాణం కన్నా సమయం ప్రధమవుతుంది
సమయంతో వేగం పోటీ పడుతూనే ఉంది
రేపు కోసం నేడు పరుగెడుతూనే ఉంది
అయినా అది కనబడకుండానే పోతూనే ఉంది

పరుగుల్లో ప్రాణం చితికిపోతుంది
గతుకుల్లో మనసు చచ్చిపోతుంది
సమయం తన పనిలో తానుంటుంది
వేగం సమయంతో పోటీ పడుతూనేఉంది 

రేపెప్పుడూ స్వప్నం గానే అగుపిస్తుంది
స్వప్నమెప్పుడూ అందంగానే ఉంటుంది
భయపడితే స్వప్నం చెదిరిపోతుంది
చెదిరిన స్వప్నంతో రేపు సమసిపోతుంది 

నిజం ఎప్పుడూ కనబడదు
అందుకేనేమో రేపు కూడా అగుపడదు
నిలబడేది నిజమొక్కటే తెలుసు
నిజమంటే ఈ నాడొక్కటే అది కూడా తెలుసు

అయినా, వేగం బాగా పెరిగిపోతుంది
సమయంతో అది పోటీ పడుతూనే ఉంది
రేపు కోసం పరుగెడుతూ నేటిని కోల్పోతుంది
నిన్న ఎప్పుడూ స్మృతిగానే మిగిలిపోతుంది
వేగం బాగా పెరిగిపోతుంది

ముత్యాల రాశులుపోయి కంకరొచ్చింది
బంగారం ఘనులు కాస్తా బొగ్గులయ్యింది
నిన్న' నిన్ను చూసి నవ్విపోతోంది
నిన్నా రేపుకు మధ్యలో నేడు నలిగిపోతోంది
అయినా వేగం పెరుగిపోతోంది
==============================
      య. వెంకటరమణ/..

Sunday, September 18, 2022

పిడక దాపున మరగ కాగి ఎరుపు దేరిన పాల మీగడ

Telugu rachana
2072
18/09/2022
================
పిడక దాపున మరగ కాగి
ఎరుపు దేరిన పాల మీగడ
గడ్డ పెరుగు సద్దియన్నం 
ఆవకాయ ముక్క తాయం

ఉడకబెట్టిన వడ్లు దంచి
వండి పెట్టిన ఉప్పుడన్నం
పప్పు ముద్ద పైన వెన్న
ఇంగువేసిన ఇంత చారు

నాయనమ్మ బొబ్బరట్లు
పాల కోవా తేనె పట్లు
ఉప్పుడన్నం గంజిలోన 
పుల్ల గింత నిమ్మరసము

నానబెట్టిన తెల్ల అటుకులు
నాన్న తెచ్చిన ముంజు కాయలు
కోరు దేసిన పాతబెల్లం
తవ్వి తీసిన తేగ ముక్కలు 

కాటుకద్దిన బెదురుకళ్ళు
పసుపు రుద్దిన స్వర్ణవదనం
పరికిణీలో పడచులందం
పలుకరింపుల సంప్రదాయం

పూజ గదిలో అవ్వ పూజలు
అమ్మ చేతి మట్టి గాజులు
తులసి కోట అలుకు ముగ్గులు
మువ్వ పట్టీ చెల్లి ఆటలు

చంటి గాడి లాగు చొక్కా
నిమ్మ తొనలకు ఐదు పైసలు
పుల్ల అయిసు పదే పైసలు
పావలా మరి షావుకారు

మట్టి పలక తెల్ల కణిక
పేక బెత్తెం గోడ కుర్చీ
సగం బెల్లు పెంకులాటలు
కాకి ఎంగిలి చాకిలెట్లు

పండగొస్తే పబ్బమొస్తే
పసుబ్బొట్టు కొత్త బట్టలు
గమిడి పూజలు తోరణాలు
పిండి వంటల గుబాళింపులు

కొప్పు చుట్టూ బట్ట చుట్టి
మోజేతి వరకు పసుపులద్ది 
ఆకు పరిచి అన్నమెట్టే  
అమ్మ చేతి మధురిమాలు

గురుతుకొస్తున్నాయ్
గురుతుకొస్తున్నాయ్
గురుతులే ఇక మిగిలిపోతున్నాయ్
గురుతులూ ఇక చెరిగిపోనున్నాయ్
================
     య. వెంకటరమణ/..

Sunday, September 4, 2022

కొప్పు లిన్నిబెట్టు జుట్టున్న జాన

2068
తెలుగు రచన
39/08/2022
==========================
కొప్పు లిన్నిబెట్టు జుట్టున్న జాన
గొప్ప లన్నిజెప్పు విను వాళ్ళు తనకున్న
చిత్తముంటే డేరు చిత్త గింపుల జోరు
ఇప్పుడంతే నిచట చెప్పెటోళ్ళే కొదవ

ఒక్కడున్నూలేక ముప్పు కాదాజెప్పు
చెప్ప నొక్కడు లేడు చేత కాని వాళ్ళు
చిప్ప చేతికిచ్చి గొప్ప జెప్పేటోళ్లు

చచ్చెటోళ్ళను కూడ
గొప్పగా చూపెటోళ్ళు
మెప్పు కోసమీళ్ళు ఒక్కటేమిటోయి
నిప్పు పెట్టికూడ మెప్పు పొందేటోళ్లు 

చెంతనున్నా గానీ చిట్టాల పొత్తంబు 
చిత్రగుప్తుల వారు చిత్తమైతేనిప్పు
తెల్లముఖమువేయు తెరుచుకున్నా నోళ్ళు
తెరదించు మంత్రాలు తెగ నేర్చెనీళ్ళు

చావు కబురు కూడా చల్లగా చెప్పేటి
సారు గారి మణులు చాలానే ఉన్నారు
చాలు చాలింక తగ్గించు మంట
గ్యాసు మంటలు పోయి పెట్రోలుకంటే
============================
            య.వెంకటరమణ/..