Wednesday, July 1, 2015

స్వప్నమా .. ఇది శిల్పమా

స్వప్నమా .. ఇది శిల్పమా
కల్పనా ..  కవి కల్పనా
కోటి వేణువులు ఒక్కపాటిన
మీటి నట్టి రాగం
దేవకన్యకలు మారు వేషమున
నాట్య మాడు వైనం
అడుగు అడుగులో అప్సరసలదే
అదమస్థానమది ఖాయం
నీ మేను వంపులు బాపు కుంచెలో
ఒంపులనుట భావ్యం
శంకు దేరినా ఈ కంటమెవరిదని
కడలినెట్లా అడుగ సాద్యం
మదుర వీణా స్వరాపీటిక తామ్రనాదా
పలుకు మధురం
మెరుపు మాయని మోముపిండితొ ఎవరుజేసిన
ఇంత శిల్పము
ఏ రసాభరితా ఫలముచీల్చి అమర్చినారీ పెదవులన్నని
ఏ వృక్కుజేరి నేను అడగను
తాకినతనే కందిపోయే ఇంత అందం
ఎవరి సృష్టని ఎవరినడుగను
ఏ మన్మదుండి చౌర బాణమది నా మదిని తాకిన
నైన కిరణము
ఎవరినడగను ఎవరినడగను ఎవరు నీవని
ఎవరినడుగను?
.............................య.వెంకటరమణ

నీవంటే నాకిష్టం

=================
నీ ఊహల్లో నేనుంటే నాకిష్టం
నా ఊపిరి అది నీవైతే నాకిష్టం
ఆ చూపుల్లో ప్రేమంటే నాకిష్టం
పెదవిరుపుల నీ కోపం నాకిష్టం
కోపంలో జడ విసురులు నాకిష్టం
జతకోరే ఎదపొంగులు నాకిష్టం
కొంగంటని ఆ వంపులు నాకిష్టం
మదిరేపే అల్లరులే నాకిష్టం
వయ్యారీ నీ నడకకు సైకొట్టే
జడగంటలు నాకిష్టం నాకిష్టం
అడుగుల్లో అడుగునై ఏడడుగులు
నడిసొచ్చి ఏకంగా ఉండడమే నాకిష్టం
అదృష్టం కలిసొస్తే ఆ కోణం నాదైతే
ఇరుకైన సరే మరి ఈదుకెళ్ళి పోవటం
గెలుపోటపు ఆటలో చివరికోడిపోవడం
ఒదిగి నిన్ను చేరటం నాకిష్టం నాకిష్టం !!
========================

.......................య. వెంకటరమణ

కథలు వ్రాయనా నేను?

===========================
కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?
కన్నీటి శోకాలను కలంజేసి,కథలు వ్రాయనా?
కడుపునిండినాకలిని,కన్నీళ్ళతో నింపుకునే,
కడదేరని కథలన్నీ,పోగుజేసి నేను వ్రాయనా?
కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?

కూటికి నోచుకోక, కాటిలోన చోటులేక.
ఆదారి మధ్యలోన,నిరాదార శవాలను,
పేర్చిజేర్చి కథలు వ్రాయనా,కథలు వ్రాయనా?
జనాభాకు లెక్కరాక, జనం మధ్య చోటులేక,
ఊరు బయట కుక్కలతో, ఆ చెత్త కుప్పలతో,
అదోజాతి ప్రాణిలాగ అలమటించు ఆ మనుషుల
కథలుపేర్చి కథలు కథలుగా, కథలు వ్రాయనా?
 
రెక్కాడిన డొక్కాడని ఆ బక్కా ప్రాణులను
కర్కోటపు కోరలతో నొక్కి చంపు కామందుల
కథలు విప్పి,కథలు వ్రాయనా,కథలు వ్రాయనా
నిర్దోషుల దోషాలను నిలదీసే అన్యాయం
దోషులకు దాసోహం దేశచరిత వైబోగం
కట్టల గుట్టలలో ఊపిరాడనీ న్యాయం
ఓరకంట  భారతం విడమరిసి నేను వ్రాయనా?

వందుంటే పాతికప్పు,పొలముంటే పంటకప్పు
ఏదీ లేని జనాలకు ఏమున్నది నువ్వు చెప్పు?
చెప్పు చెప్పు నీవు చెప్పు. ఏమి వ్రాయనోజెప్పు
ఎలా వ్రాయనో చెప్పు, ఏమి వ్రాయనో నీవుజెప్పు.

కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?
కన్నీటి శోకాలను కలంజేసి,కథలు వ్రాయనా?
కడుపునిండినాకలిని,కన్నీళ్ళతో నింపుకునే,
కడదేరని కథలన్నీ,పోగుజేసి నేను వ్రాయనా?
కథలు వ్రాయనా  నేను, కథలు వ్రాయనా?
============================

................................య.వెంకటరమణ

పరువాల పందిరిలో

ఇన్ని నాళ్ళు వేచి ఉన్నా
పడుచుదనము పరుగులాపి
నిన్ను చేరే వింత ఆశలు
నేడు కలిగేను, నేడు కలిగేను
 
నింగి నేలా సాక్షమయ్యి
నీవు నేను ఏకమయ్యి ,
నన్ను నేనే మరిచిపోయి
నీవు నేనై కలిసిపోయే,
ఇన్ని ఆశలు ఎలావచ్చేను

కడలి పొంగుల చాటుజేరి
నింగి నేలా ఏకమయ్యే
వింతలేవో నేడు చూసేను
అంతలోనే పులకింతలేవో
నన్ను తాకేను,నన్ను తాకేను.

 
ప్రక్రుతెంత  అందమాయేను
కొత్త బాషలు నేడు తెలిసేను ,
చిలిపి ఆశలు నాకు కలిగేను
పరువమే మరి పంచియాయెను
నిన్నలేని వింతధోరణి నేడు వచ్చేను
ఇంతలోనే వింతలేవో ముంచుకొచ్చేను

పదుగురింటే పరువు పోయే
బిడియమేదో తెలిసి వచ్చేను
ఇన్ని నాళ్ళు వేచి ఉన్నా
పడుచుదనము పరుగులాపి
నిన్నలేని కొత్త  ఆశలు
నిన్ను చేరే వింత ఆశలు
నేడు కలిగేను, నేడు కలిగేను.


...........................య.వెంకటరమణ