Monday, June 22, 2015

కడలి రాజు కెరటాలతో కేరింతల నాతల్లీ

======================
పడమటి కొండలతో  పాపిడి తీసుకుని
సిందూరపు సూరిడ్ని నుదిటన బొట్టద్దుకుని
హరివిల్లు అందాలను ఆ కొప్పున దిద్దుకుని
పుడమి పచ్చ చీరును నడుము చుట్టుకుని
నీలి కురుల మేగాలను గాలికెగరవైచుకుని
వీచు గాలి లాలి పాట జోలగా పాడుకుంటు
కడలి రాజు కెరటాలతో కేరింతల నాతల్లీ
చెలయేటి పరవళ్ళ చెంగులు ఝలిపించుకుంటు
గువ్వలతో చెప్పుకునే గుసగుసలు ఆలకించుమా
ఈ ప్రక్రుతమ్మ వడిలోన సేద దీర్చుకుందుమా
ఇలపైన దివి స్వర్గము ఇదే ఇదే మిత్రమా !!
==========================
.............................  య.వెంకటరమణ

నాన్నా!

"దేవుడెలా ఉంటాడో చూడాలనుందని ఆ దేవుడినే అడిగే వాడిని
అయన చిరునవ్వుతో '' వెతుకు నాయనా దొరుకుతారు '' అని
అన్నపుడల్లా అనుకునే వాడిని 'నా తండ్రికేమి తెలియదని'
దగ్గరున్న నన్ను గుర్తించటం లేదని నొచ్సుకున్నారో, ఏమో
నన్నొదిలి వెళ్లిపోయారాయన... అన్నీ ఉన్నాయనుకున్నా
అన్నీ మా నాన్నేనని ఆ తరువాతే తెలుసుకున్నా
నన్ను తిడుతుంటే  కటోరుడనుకున్నా
నా కాలు తెగినప్పుడు కంగారుపడుతుంటే  పిరికివాడనుకున్నా
టెంకాయలో మీగడ మెత్తదనం పగిలాకే చూసుకున్నా
నాన్నా! నేనేడిస్తే మీరు ఓదార్చేవారు కదా
చూడండి .. ఎంతేడుస్తున్నానో..  మరి ఓదార్చరా  ".....మీ  బుజ్జిబాబు గాడు

స్వప్నమా .. ఇది శిల్పమా

స్వప్నమా .. ఇది శిల్పమా
కల్పనా ..  కవి కల్పనా
కోటి వేణువులు ఒక్కపాటిన
మీటి నట్టి రాగం
దేవకన్యకలు మారు వేషమున
నాట్య మాడు వైనం
అడుగు అడుగులో అప్సరసలదే
అదమస్థానమది ఖాయం
నీ మేను వంపులు బాపు కుంచెలో
ఒంపులనుట భావ్యం
శంకు దేరినా ఈ కంటమెవరిదని
కడలినెట్లా అడుగ సాద్యం
మదుర వీణా స్వరాపీటిక తామ్రనాదా
పలుకు మధురం
మెరుపు మాయని మోముపిండితొ ఎవరుజేసిన
ఇంత శిల్పము
ఏ రసాభరితా ఫలముచీల్చి అమర్చినారీ పెదవులన్నని
ఏ వృక్కుజేరి నేను అడగను
తాకినతనే కందిపోయే ఇంత అందం
ఎవరి సృష్టని ఎవరినడుగను
ఏ మన్మదుండి చౌర బాణమది నా మదిని తాకిన
నైన కిరణము
ఎవరినడగను ఎవరినడగను ఎవరు నీవని
ఎవరినడుగను?
.............................య.వెంకటరమణ

Thursday, June 18, 2015

ఊరుకోవే నెలవంకా

========================
ఊరుకోవే నెలవంకా చూడకలా నావంక 
ప్రియుడోచ్చే వేళాయే పరువు తీయకే ఇంక
పరువాలు మూటగట్టి పదిలంగా ఉంచాను 
పంచుకునే ప్రేమకొరకు పొంచి నేను ఉన్నాను 
మబ్బుకన్న సిగ్గులేదు తెరలు తీసి ఉంచింది 
తెరపులేని వెన్నెలేమో నన్ను గప్ప చూస్తుంది 
చిలిపి జాజి మల్లె కొమ్మ కొంగు పట్టి లాగింది 
నిలకడేమి అనుకుందో నన్ను విడిచి పోయింది 
నిలువ లేని నా మనసు కునుకుదీయనీకుంది 
ఊరుకోవే నెలవంకా చూడకలా నావంక 
ప్రియుడోచ్చే వేళాయే పరువు తీయకెఇంక!
==========================
.............................య. వెంకటరమణ

Thursday, June 11, 2015

శుభోదయం

గవాక్షం నుండి వెలువడు తొలికిరణం
ఈ సాక్షం తెలవారిన ఈ ఉదయం
చలచల్లగా  తాకినా వేకువ పవనం
వికసించిన ఈ వదనం అది నీకోసం

లేలేత మావి చిగురు కొమ్మలపైనా
కూ కూ యని కోయిలమ్మ కొత్తగానం
పరవశించు పడుచుకొమ్మ ఉబలాటం
బలేబలే మంచి ఈ ఉదయం అది నీకోసం !!

........................య. వెంకటరమణ

నీవస్తావని...

===========================
ఇంత అలజడెందుకు,మనసు నిలువదెందుకు?
పిల్ల గాలి తాకిడికే తుళ్ళి పాటు లెందుకు ?
కళ్ళు నాకు నీవైతే నా కళ్ళకెందుకాశాలు ?
నా కళ్ళల్లో నీవుంటే కలలకెందుకాత్రము ?

నిన్న నీవు లేవనా నింగి నీరుగారింది
నీ కబురు అందిందా నేల మురిసిపోతుంది
ఆ గువ్వలు చూడుమరీ గుసగుసలేబోతున్నాయ్
గూటికన్న పోకుండా నీ కబురులు చెబుతున్నాయ్

వరమాలతొ సిద్ధంగా ఇంద్రధనుసు నిలిచింది.
వరమిచ్చే పనిమీదే వెన్నెలమ్మ  వచ్చింది.
వనాలన్ని నీకోసం విరబూసీ చూస్తున్నాయ్.
వచ్చేది ఎవరని పచ్చతోరణాలు కూడ నన్ను,
నొక్కినొక్కి  చూడుమరీ ఎలా అడుగుతున్నాయో.

వస్తావని తెలుసునాకు-నీవొస్తావని తెలుసునాకు.
ఇంత చిన్న మనసులో అంత పెద్ద చోటిచ్చి,
అందమైన  తీరాలకు నన్నెత్తుకు వెళతావని,
తెలియదేమో పాపం, ఊరు సద్దుమణిగింది .

నిండు పున్నమెందుకో నిష్టోరం  వేస్తుంది  
పండు వెన్నెలెందుకో బిడాయించి చూస్తుంది
నీవొచ్చే క్షణం కొరకు నామనసు ఏగిపోతుంది
నీకోసం నన్నొదిలి  నిదుర  విడిచిపోయింది
రేయి పగలు నీకోసం ఊకుమ్మడి అయిపోయే
ఊకుమ్మడి అయిపోయే ..ఊకుమ్మడి అయిపోయే.....!!
================================

....................................య. వెంకటరమణ

Wednesday, June 10, 2015

ఆకాశ వీధిలో ఓ చందమామా

ఆకాశ వీధిలో  ఓ చందమామా
నా వైపు చూసి అలా నవ్వకోమా
నీ దొంగచూపు నా మదిని తాకి
అలజడలు లేపే అవితాళలేను
ఆకాశ వీధిలో ఓ చందమామా

తొలివాన చినుకు నను తాకగానే
మది వీణ మ్రోగి రాగాలు పలికే
ఈ శ్వాసలో నేడు ఇదిఎమి వింతో
తన లయలు మారే నీ పేరు పలికే
అలజడలు లేపే అవితాళలేను

ఏమంత్రమో ఏమో,ఈ వింతఏమో
నాలోన నాకే ఈ నవ్వులేమో
హరివిల్లు నాలో విరబూసేనేమో
ఓ చందమామా నను చూడకోమా
ఆ కొంటె చూపు నే తాళ లేను
నా వైపు చూసి అలా నవ్వకోమా

.................య.వెంకటరమణ

Sunday, June 7, 2015

స్వాతంత్ర్యదేశమనీ, గణతంత్ర రాజ్యమని

===========
స్వాతంత్ర్యదేశమనీ,
గణతంత్ర రాజ్యమని
ఘనతచాటజాలదు భాయి
ప్రగతి బాట సాగాలోయి

గరీబులు- నవాబులు
సవాలక్ష సమస్యలు
కులమత బేధాలూ
కుట్రబూను తత్వాలు
సమ సమాజ స్థాపనకు
సరికాదోయి,సరికాదోయి

సమసిపోని సమస్యలు
ప్రజలు పడే ఇక్కట్లు
సతమమగు దేశానికి
నవ సమాజ స్థాపనలో
నీ అడుగులు సాగాలోయి
ప్రగతి బాట నడవాలోయి

స్వాతంత్ర్యదేశమనీ,
గణతంత్ర రాజ్యమని
ఘనతచాటజాలదు భాయి
================

......య.వెంకటరమణ

Saturday, June 6, 2015

ఎవరని నే జెప్పను?

ఎవరని నే జెప్పను? ఎవరితో నిను బోల్చను?
నండూరీ భావనల ఆ వెంకి నీవనా!
కాళిదాసు కల్పనలో శశిరేఖవు  నీవనా!
ఎవరని నే జెప్పను? ఎవరితొ నిను బోల్చను?

పలుకరింప పరువాలు పైబడి మరి వస్తుంటే,
పచ్చరంగు  మోము మెరుపు విరగబడీ చూస్తుంటే,
మెలిక తిరుగు నడకల్లో మయురమే వెనకైతే,
ఎవరని నే జెప్పను? ఎవరితొ నిను బోల్చను?

ఎల్లోరా శిల్పాలు ఎందుకలా విస్తుబోయెనో!
బాపిరాజు భావాలకు బాసటెవరు నిలుచునో!
బంగిమలు ఒలికించు నైనాలను చూసికూడ,
ఎవరితొ నిను బోల్చను? నీవెవరని నే జెప్పను?

బంగబోయి నింగి కూడా నేలకొంగెను
నేలకుడ నిన్ను జూసి రంగులద్డెను
తొందరపడి చందమామ ముందు వచ్చెను
వదనంలో మధుమాసం ఉందిగా మరి
అందుకనే  నీముందర నేనులే సరి
అందుకో మరి చేయందుకో మరీ ..

============================
......................య . వెంకటరమణ

మధుబాల

మధు మాసపు మరుమల్లీ,నవ్వి వెళ్లిపోకిలా
యెద మంటలు రేపి మరీ,జారుకోకులే ఇలా.
జారుపైట నీడలో మనసు దాచుకోవాలని,
వెంటబడే మగాడిపై ఇంత చులకనేల?
సిగ్గులోలుకు సింగారం ఒలికిపోతే ఎలా?

చిత్రమైన ఒంపులొలుకు నీ మధువులు పలుకులు,
పలుకకనే పలుకరించు నీ వాలు చూపులు.
వద్దంటూ రమ్మనీ హోయలొలుకు నీ నడకలు
చిరునామా వ్రాసిచ్చే చెక్కిలి నీ కెంపులు
మదికేసెనుగా గేలం-యెద లేచెను భూకంపం
 మధుబాలా నను వదలి,అలా వెళ్లిపోకులే
మనసు పడ్డ  మగాడిని  విడిచి వెళ్లిపోకిలా

నిన్న మొన్న లేనిదేదో నీలోనేడున్నది
ఉన్నదంత దోచుకునే కోరికీడ ఉన్నది
వన్నెలింకా కొత్తరంగు దిద్దు కున్నవి
కొత్త కొత్త కోరికలు నాలో నున్నవి
మధు మాసపు మరుమల్లీ నవ్వి వెళ్లిపోకలా
మనసు పడ్డ  మగాడిని  విడిచి వెళ్లిపోకిలా
మనసు పడ్డ  మగాడిని  విడిచి వెళ్లిపోకిలా
*************************************
..........................య.వెంకటర

Thursday, June 4, 2015

మురిపించే అందాలు

మురిపించే అందాలను ఎలా ఓర్వను
చందెపొద్దు గూకు వరకు ఎలా ఆగను
నీ నీలి కన్నుల్లో నన్ను దాగనీ
అదిరేటి ఆదరాలకు రంగులద్దనీ

దోబూచీ ఆటలాడు  పూబంతుల సోకులు
తెరమాటున దాగిఉన్న దొరసాని సొంపులు
దరహాసపు ఆదరాల జాలువారు మకరందం
మరీ మరీ మురిపించే చంద్రబింబ వాలకం
ఎలా ఎలా ఎలా నిలువను
మురిపించే అందాలను ఎలా ఓర్వను

కలకాలం తోడుంటా నన్ను చేరనీ
వెన్నెలంటి మనసులో నన్ను ఉండనీ
నరజానా నిన్ను జూడ కనులుజాలవే
వరమిస్తే నిన్ను తప్ప నేను కోరనే
 
ఎరుపెక్కిన చెక్కిలిపై చిలకెంగిలి పడదుగా
మధువొలికే పెదవులను తుమ్మెదలు తాకవుగా
లేలేత పూకొమ్మల నడిమధ్యన చోటిస్తే
సేద దీర్చుకోవాలను చిలిపి కోరిక
తొలిపొద్దు పొడుపులో చలికాగే మక్కువ
ఎలా ఎలా ఎలా నిలువను
మురిపించే అందాలను ఎలా ఓర్వను

.....................య.వెంకటరమణ

Tuesday, June 2, 2015

బ్రహ్మయ్యా ...

**************
ఎక్కడనో పుట్టిస్తావు
ఎక్కడనో ముడివేస్తావు
ఇక్కడి మారాతలను అక్కడుండి రాస్తావు
బ్రహ్మయ్యా ...నీకే తగునయ్యా !!

తప్పురాసి నవ్వుకుంటావు
ఒప్పురాసి ఓర్వకుంటావు
ఇప్పుడే ఆశలెడతావు
గుట్టుగా కాలస్తావు
బ్రహ్మయ్యా ...నీకే తగునయ్యా !!

నిప్పుతో నీరుగాల్చటమూ
నీటితో నిప్పునార్పటమూ
గొప్పగా సృష్టి జేసావు
తిప్పలే నొక్కిరాసావు
బ్రహ్మయ్యా ...నీకే తగునయ్యా !!

మక్కువింత పెంచుతావు
రెక్కలు నువ్ తెంచుతావు
గుండెకింత వెధనిచ్చి
ఆగకుండా చేస్తావు
బ్రహ్మయ్యా  ... నీకే తగునయ్యా !!

సృష్టికర్త నీవైతే
సృష్టికో లెక్కుంటే
ఒక్కమారు లెక్కలేసి
తప్పుదిద్ద జూడవయ్యా
బ్రహ్మయ్యా ...నీకే తగునయ్యా !!
***************

..............య. వెంకటరమణ


Monday, June 1, 2015

చూసేవారికి పాలిష్ చేసిన బూట్లు

చూసేవారికి పాలిష్ చేసిన బూట్లు అందంగానే కనిపిస్తాయి
లోపలెంత కరుస్తున్నాయో వేసుకున్నవారికే తెలుస్తుంది
తలభాధ వినేవారికంత భాదేమి కాదు కానీ
పడేవారికే తెలుస్తుంది అదెంత యాతనో
వినేవారికెప్పుడూ సమస్యలు చిన్నవేకాని
అనుభవించే వారికే తలమునకలౌతాయి
చెప్పేవారికి వినేవారు ఎప్పుడు లోకువే
వినేవారుంటే చెప్పటం అందరికీ సులభమే
తనవరకూ వస్తేనే చెప్పినవి మరిచిపోతాం
చెప్పటం నిన్న నావంతు అయితే
రేపు వినటం నా వంతు అవుతుంది
బాధల్లో మనిషి నీతి మరిచిపోతాడు
బాధల్లేనప్పుడా మనిషి నీతి జోలికే పోడు
నిజం నిప్పులాంటిదంటారు నిజమేనేమో
అందుకే వీలైనంతవరకు దానికి దూరంగా ఉంటారు

............................... య.వెంకటరమణ

వస్తున్నాయొస్తున్నాయవిగో

వస్తున్నాయొస్తున్నాయవిగో
వికటావికల్ప,విక్రుతావిచ్చిత
విలక్షణాప్రభల,వివక్షాభరిత
విషగడియలు వస్తున్నాయావిగో
వేధఘోషిత,ప్రబంధాలిఖితంబులవిగో 
అవిగవిగో ఆ ఘోషలినిపిస్తున్నాయవిగో
వివక్షాభరిత విష ప్రభంజనములవిగో

అవిగో అవిగవిగో ..........................
రుచిమరిగిన కాటిన్యపు రంగద్దినవిషకోరాలు.
మదమెక్కిన దౌర్జన్యపు కలయంపుల
రుధిర ప్రవాహంబులవిగో.. అవిగవిగో
కౌటిల్యపు వికట పరిహాసములవిగో
తుదిదేరగ వికటించే వికల్పంబులవిగో
కర్షణహలమదిగో కర్తరి పదునదిగో
అవిగో ఆగడియలు అగుపిస్తున్నాయవిగో
వస్తున్నాయొస్తున్నాయవిగో !!

..................య.వెంకటరమణ