Thursday, July 25, 2019

ఎవరన్నారివి వెలుగులని

1793
తెలుగు రచన
25/07/2018
=================
ఎవరన్నారివి వెలుగులని
మబ్బులు గప్పిన వెన్నెలనీ
ఎవరన్నారిది వెలుగుయని
ఉదయభాస్కర కిరణమని

పెళ పెళ పేలే మెరుపులవి
నిప్పులు గక్కే పిడుగులవి
ఎవరన్నారివి వెలుగులని
మబ్బులు గప్పిన వెన్నెలనీ

ఎవరన్నారివి పిలుపులని
ప్రగతిబాటకవి మలుపులని
మరణమృదంగపు నాదమది
మృగాలుపాడే గానమది

ఎవరన్నారిది ఉదయమని
వెలుగులునిండే సమయమని
కనబడలేదా వృకవిన్యాసం
చిక్కులమారి కపటట్టాసం

ఎవరన్నారూ ఎవరన్నారు
రక్కసులంతా గతియించారని
ఎవరన్నారూ ఎవరన్నారు
ధూశ్యాషణులు ఇలపైలేరని

వినబడలేదా ఘీంకారాలూ
అరుపులుబొబ్బలు ఆర్తఃధ్వనులు
చిరిగినవస్త్రం చిన్నారిఅరుపులు
నదులైపారే అబలాశ్రువులు

ఎవరన్నారిక వచ్చేసాయని
ఎవరూ ఎరుగని మంచిరోజులు
ఎవరన్నారిక భయపడవద్దని
బ్రష్టాచారం మరిఇక లేదని

కనబడలేదా  ఈకాఠిన్యం
శవాలపైన జనవ్యాపారం
ఖలేజలేని శవాలు పాపం
శవపేటికపై లంచాలబేరం

ఎవరన్నారివి వెలుగులని
మబ్బులు గప్పిన వెన్నెలనీ
ఎవరన్నారిది వెలుగుయని
ఉదయభాస్కర కిరణమని
=================
             వెంకటరమణ/..

Wednesday, July 24, 2019

కొండ కోన కొంటె ఆటలు, కోమలాంగి పూలబాటలు

==============================
కొండ కోన కొంటె  ఆటలు, కోమలాంగి పూలబాటలు
ఒంపు సోంపు వయారాలు, ఉరకలేయు సెలయేర్లు
వంగి వంగి తొంగి జూచు, లే లేత చిగురు కొమ్మలు
రంగులతో రంగరించి రమణీయం రమణీయం
ఎంత మధురమీ ప్రకృతి, ఇది ఎంత మధురము
మరి యేదో  చెప్పాలని  మలయమారుతం
నేల కొంగి నన్ను తాకె మనసు పరవశం
అక్షింతల గిలిగింతల వాన చినుకులు
పులకించే నేలతల్లి ఒలికించే ఈ సొంపులు
ఎంత మధురమీ ప్రకృతి, ఇది ఎంత మధురము
బంగారపు వన్నెలతో బాను వెలుగు కిరణాలు
ప్రతి బింబం పరవళ్ళు అలలు చేయు సంబరాలు
గూడు విడిచి బారుదీరి విహరించే ఈ పక్షులు
తెల్లబోయి తెరదీసిన నల్లమబ్బు నివాళులు
ఎంత మధురమీ ఉదయము, ఎంత మధురము
ఎత్తవోయీ కుసుమ సల్లాప స్వరమాల
గొంతెత్తి పాడవోయి మధువు లొలుకు భావాలు
రెప రెపల తెరచాప మరుగు తీపి గానాలు
పుణికి పుచ్చుకున్న పడతి అందచందాలు
ఎంత మధురమీ రాగ మెంత మధురము
========================  
...............య.వెంకటరమణ (తెలుగు రచన)

పేదవాళ్ళనే దెయ్యాలెందుకు పడుతూ ఉంటాయ్?

===========================
పేదవాళ్ళనే దెయ్యాలెందుకు పడుతూ ఉంటాయ్?
పెద్దోళ్ళమెడలో తాయత్తులెందుకు కనబడకుంటాయ్?
కట్టుమోతుతో,పెట్టుమోతుతో  చంపేదంటూ ఒకటుంటే,
చంపేటందుకు, పేలటమెందుకు,మానవ బాంబై నీ మనిషి?
‘శివుడాజ్ఞ లేనిదె చీమైన కుట్టదు’ తెలిసిన మాటే అందరికీ,
తెలిసీ,తెలిసీ ఎందుకని?, తెలిసిన జనాలు ఎందుకని?
కాపాడంటూ పరుగులెట్టడం,ఆసుపత్రిలో లైను కట్టడం 
ఆయుషుంటే బ్రతికిపోవడం,లేదనుకుంటే ‘సోర్రీ’ లినడం
విశ్వాసముంటే నయమైపోమ్మని ‘యేసే’ చెప్పగ నానాడు
ఎవరిచ్చారో ఎమో గానీ స్వస్థత వరాల జోరుంది నేడు
టచ్చ్’కు కుదిరే రోగాల బీడు, రోజూ వస్తాయ్ టీవీ చూడు
వాడూ,వీడని ఏముంది లేవోయ్,ఎవడికి వాడే నే’నంటాడు.
మంత్రం తెలీదు,మర్మం తెలీదు యజ్ఞంచేస్తే సరిపోతుందా
మదిలో దమిడీ ధర్మం లేదు గుడిలోకెళితే సరిపోతుందా?
చూస్తే’పాపం ‘సురా’వి జ్ఞానం,చూడడమేమో,కనబడనీయారు
కాలం తీరు ఖర్మర బాబు,మారదు చూడు లోకం తీరు,లోకం తీరు
=================================== 
                                                       ..య.వెంకటరమణ

అర్రులుజాచుకు చూస్తుంధదిగో అత్యాచారం హద్దులుమీరగ.

అర్రులుజాచుకు చూస్తుంధదిగో అత్యాచారం హద్దులుమీరగ.
హద్దులుమీరిన పాపంచూడు స్తిగ్ధం చేసెను నిన్నూ-నన్నూ.
కాస్తా కూస్తా అనుకున్నారా? పాతుకుపోయెను పాపంచూడు.
దీపంపెట్టే  ధమనుడు లేకే  పాపం పాతుకుపోయిందీడ !!
ముంచేటోళ్ళ మూర్తులుబెట్టి,మొక్కేతీరే మారలయ్యా.
దుమ్ములుసైతం పీల్చేస్తుంటే దన్నంపెట్టే తీరేందయ్యా?
దాసోహాలను దహనంజేసే ధైర్యంపుట్టేదెప్పటికయ్యా?
దమ్ములు తెలిసేదేప్పటికయ్యా?దుమ్ములు విరిచేదెప్పటికయ్యా?
తెగులుగమారిన తీరున్చూడు -తెగనరుకయ్యా అంకినకాడికి.
అప్పుడుగాని అంతం కాదు సప్పుడుజేయక సమరంబూను.
అంతా ఇంతా అనుకున్నారా? పాతుకుబోయెను పాపంజూడు.
అంతేనయ్యా అంతంచూడగ-పూరించాలిక శంఖారావం!!
..................య.వెంకటరమణ

దీనపు చూపుల కన్నుల్లారా

======:=:====:=====
దీనపు చూపుల కన్నుల్లారా
నిరాశ నిండిన జీవుల్లారా
ఆర్తానాధపు గానం పాడుచు
నిస్పృహ నింపుకు నాస్థులుగా
ఇంకా ఎందుకు విలపిస్తున్నావ్
వస్తున్నాయ్ వస్తున్నాయవిగో
సట్రం విరిగిన చక్రాలు
చక్రం విరిగిన రథాలు
వస్తున్నాయ్ వస్తున్నాయవిగో
వెలు గారిన కాగడాలు
మసి బట్టిన లాంతరులు
వస్తున్నాయవిగో
దారులు కానని చీకటిలో
గమ్యం ఎరుగని పయనంతో
పాదుకలెరుగని పాదాలవిగో
పాపం కరిచిన జీవాలవిగో
వస్తున్నాయ్ వస్తున్నాయవిగో.....✍
========== . . .  య.యలమంచిలి వెంకటరమణ

వేరు దిగువకొలదీ వృక్కు మేడి పెరుగు

========================
వేరు దిగువకొలదీ వృక్కు మేడి పెరుగు
వినయమందు మనిషి కీర్తి పెరుగు
ఎత్తునున్న పొద్దు నేలగూంకపోదు
వినయమెరిగి మసలు తెలుగు రచన
=========================

కరుకు లేని వెన్న కరిగిపోవునిట్టే

==========================
కరుకు లేని వెన్న కరిగిపోవునిట్టే
కరిగిపోవు నిట్లే వేడి తగిలినంత
కరిగి ఊరకుండా తిరిగి వెన్నకాదు
కటువుగున్న గాని ఇనుము నయము
కరిగినెంత యైన ఇనుము తిరిగి ఇనుము
మెత్తనైన మనసు మరి మేలు గాని
కష్ట కాలమందు వెన్ను జూపరాదు
నొప్పు తగిలినంత నియమాలు మార్చేటి
మెత్త మనసు మంచిదెట్లు చెప్పు
యిట్టె కరిగి తాను రూపు మార్చునట్టి
వెన్న మనసు కన్నా ఇనుము మేలు
కష్టమెంత యైన నిలిచి యుండ మేలు
కరిగి మరరాదు వెన్న బొలి .....................✍
========================
తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ

విప్లవమంటే కాదోయి విధ్వంసానికి ఓంకారం

******క్రొత్త సంవత్సరంలో మొదటి రచన*******
==================================
విప్లవమంటే కాదోయి విధ్వంసానికి ఓంకారం
విప్లవమంటే కాదోయి నాశనానికి శ్రీకారం
విప్లవమంటే కాదోయి ఉన్నవాటిని తగలబెట్టడం
విప్లవమంటే కాదోయి కాలే కడుపున నిప్పుబెట్టడం
విప్లవమంటే కానే కాదోయ్ నిప్పులు గక్కే చేతికాగడా
విప్లవమంటే కానే కాదోయ్ కక్కుళ్ళు లేని కొడవలి వాటం
గొప్పకు చెప్పే సిద్ధాంతం, గుట్టుగ చేసే రాజకీయము
ఆకలి తీరని ఆరాటం, ఆశలు చూపే పోరాటం
రంకెలు వేస్తూ జనం తిరగడం, జనం నోటిలో మట్టి గొట్టడం
అంకినకాడికి నుల్లుకోవడం, ఒకరిని ఒకరు చంపుకోవడం
చంపుకోవడం, చచ్చి బ్రతకడం కానే కాదోయ్ పోరాటం
కానే కాదోయ్ పోరాటం చచ్చే వాళ్ళను మరీ  చంపడం
చైతన్యం అది కాదోయ్ జండా పట్టుకు గంతులేయడం
కానే కాదోయ్  చైతన్యం కాలే కడుపుల నిప్పుబెట్టడం
చదువూ సంధ్యా లేనివారిని అయ్యో పాపం అదిమిపెట్టడం
అమరవీరులను పేరులు పెట్టి అడవుల మధ్య పూడ్చిబెట్టడం
పల్లెల్లేందుకు జండాలు, పేరుకు పాపం జనాలు వాళ్ళు
జ్వరాల తల్లిని వరాలు కోరే వైద్యం ఎరుగని జనాలు వాళ్ళు
నరాలు తప్పా కణాలు లేని గడియలు గుణించు మనుజులు వాళ్ళు
మచ్చుక్కూడా అచ్చరమెరుగరు రెచ్చగొట్టడం కాదది భావ్యం
స్పష్టత లేని బ్రష్టుల్లారా, బ్రష్టం నాటిన మొక్కల్లారా
ఎప్పటిదాకా హీంసా మాంద్యం, మేలే లేని ఈ పోరాటం
చెట్టానల్లే పెరిగిన బ్రష్టం కప్పేస్తుందీ జనాల పాపం
కాగడ దివిటీ చేసేద్దాం, దారులు వారికి చూపిద్దాం
కొడవలి పదునుకు పంపిద్దాం, సేద్యం చేసే పనుకుందాం
అక్షరమెరుగని అభాగ్య జీవుల అక్కులు నేర్చే చైతన్యం
అక్కులు నేర్చే చైతన్యం, హక్కులు పొందే సౌకర్యం
పోరాటంగా సాగిద్దాం, చైతన్యాయానికి ఇది అర్ధం.
===================================
............... తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ

తీపి ఉండాలే కానీ చీమల కేం కొదవా

============================
తీపి ఉండాలే కానీ చీమల కేం కొదవా
కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవ
ఉప్పు తగిలితే చెదిరి పోవా చీమలు
నొప్పి తగిలితే బెదిరి పోరా చుట్టాలు

ఏడుస్తుంటే నవ్వించే వాళ్ళు ఎందరు?
నవ్వే వాడిని చూసి ఏడ్చే వాళ్ళే కదా అందరు
నిన్నమంచికి అందరూ తలో కారణం
నేడు బెసిగి పోతే అదంతా దురదృష్టం

పచ్చికాయ మీద కళ్ళు,పండుకు దోసిళ్ళు
పక్కవాడి మీదే కళ్ళు, ఇవ్వాల్సి వస్తే చెల్లు
పడవేయడానికి తవ్వడం, పడ్డాక నవ్వడం
కొత్తేముంది, మానవాళికి ఇవే ఆనవాళ్ళు
============================
.                                   తెలుగు రచన   యలమంచిలి వెంకటరమణ

అదిగో అభాగ్యులకు హారతిపళ్లెం

=========================
అదిగో అభాగ్యులకు హారతిపళ్లెం
ఎదురెళ్లే దరిద్రులకి ఏకదాటి సత్కారం
అభ్యున్నత పధంలో ఆరో అడుగు
అంకెల గారడిలో అగ్రగామి తతంగం
బిక్షగాళ్ల ఉన్నతికై సన్నాహాలు సిద్ధం
ఆర్తులకై ప్రణాళికలు సిద్ధం,సంసిద్ధం
ఆకలిబాధలు మేమెన్నటికీ సహించం
ఆకలి ఏడ్పులు నిర్మూలిస్తాం
ఆ ఏడ్చే మిషన్లేవో మేమే కొనిస్తాం
పేదిరికాన్ని సమూలంగా రూపుమాపుతాం
సమాధులు కొరత రాకుండా జగ్రత్తపడతాం
సముద్రంలోకైనా వాళ్ళని ఈడ్చేస్తాం
పేదిరికాన్ని సమూలంగా రూపుమాపుతాం
నిరుద్యోగ సమస్య నివారిస్తాం
అడుక్కునే మిషన్లకు తయారు చేసైనా
ఆపరేటరు పోస్టులు సృష్టిస్తాం,భర్తీ చేస్తాం
నిరుద్యోగ సమస్య సమూలంగా రూపుమాపుతాం

కుల మత భేదాలను ఖండిస్తాం
మా పల్లెలు,మీ పేటలు ఇలానే కొనసాగిస్తాం
అందుకు భూములు కేటాయిస్తాం,
కాస్త దూరంగానే అవి కొనిపెడతాం
కుల మత భేదాలను ఖండిస్తాం
రిజర్వేషన్లు ఇలానే కొనసాగిస్తాం

రోటీ కపడా ఔర్ మకాన్
ఆ పనిలోనే మేమున్నాం 
ఆకలిచంపే బిళ్లల తయారీలో మేమున్నాం
బట్టకొరత ఎక్కువగా ఉన్నట్టుంది
చెడ్డీలేసుకుని తిరిగే అనుమతి మేమిస్తాం
విమానం రేట్లు బాగా తగ్గించాం, నెమ్మదిగా
బస్సు రేట్లు కూడా అక్కడికే తెచ్చేస్తాం
సామ్నాన్యుడు చింతించే పనిలేదు
కాలుకు ఐదు, చేతికి పది
ప్రాణానికి పాతికవేలైనా మేమిచ్చేస్తాం
బ్రతికేం సాధిస్తాం, ఆ పాతికైనా మిగిలిద్దాం
ఇంకా బోలెడు ప్రస్తావనలు నెమ్మదిగా చర్చిద్దాం
వచ్చే ఎలక్షన్లో మమ్మల్ని గెలిపిస్తే
జాతకం చివరిపేజీ ఉచితంగా మేమిస్తాం
అభాగ్యుల వెనువెంటే మేముంటాం
అంటని  ఆ భాగ్యానికి చింతిస్తాం
===========================.
ఇది కూడా ఓ కవితేనా అనకండి సుమీ °°°

అనంతవిశ్వంలో గుళికరాయి నేను

============================
అనంతవిశ్వంలో గుళికరాయి నేను
జీవన పోరాటంలో సైనికుండ నేను
కలల సామ్రాజ్యానికి అధిపతి నేను
కడలియానానంలో నావికుఁడ నేను
ఆకలి ఆ బాధలకు తలయొగ్గే నేను
నా వరకూ నేనూ సామ్రాట్టును నేను
అనాది చరిత్రలో మొదటిమనిషి నేను
అనంత విశ్వంలో గుళికరాయి నేను
నేననే నేను నాకు నేనే నేను, నేను.........✍
============================

తృష్టమైన శిలను తృటిని మలచివీవు

=========================
తృష్టమైన శిలను తృటిని మలచివీవు
మూర్తి రూపమిచ్చి, మోహరింపజేయు
మహాశిల్పివయ్య , మహీబ్రహ్మవయ్య.
మంత్ర మేసి చేయు తంత్ర మూర్తి కన్నా
మర్మ మెరుగ నట్టి నీ మూర్తి మిన్నయ్యా
మహికి మెప్పు నీవు నెలవైన ఉలికాఁడా!!
==========================
               తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ

ఆపకు, నీ పరుగాపకు

ఆపకు, నీ పరుగాపకు
పరుగాపకు నడకాపకు
శ్వాసిడువకు నిట్టూర్పుగ
నిలబడితే అది ఆగదు కాలం
ఆగని ఆ కాలంతో నీవుంటే పోరాటం
పోరాటమే జీవితము
జీవితమో పోరాటం
సంగ్రామం ఇది సమరం
సాదించే దది విజయం
అనుకున్నది సాధిస్తే
ఆ సాధన నీదైతే
నీదేనోయ్ ఆ విజయం
ఆ విజయమే జీవితము
వికశించని వృక్కుల్లా
మరి పెరగని మొక్కల్లా
ఎదుగెరుగని బండల్లా
ఎన్నాళ్ళో ఈ నీళ్లు
నువ్ నమిలే కన్నీళ్లు
ఎదురీదే ఆ చేపలు
అవి చేరువ తమ గమ్యం
దరి చేరని ఆ కెరటం
మరి ఆపదు తన యత్నం
మరి ఆపకు నీ పయనం
పరుగాటల ఈ పందెం
జీవితమే పోరాటం
గెలుపోటమి అనివార్యం
సాధిస్తే అది మధురం
గెలుపోటమి సమ్మోహం
జీవితమో జీవితము
నడకాపకు, నీవాగకు
నీ గమ్యం నువ్ చేరే
నీ సత్తా నువ్ దాచకు
నడకాపకు, నువ్వాగకు
ఆ గమ్యం నీదేనోయ్, నీదినోయ్!!
.....…..........................................✍
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

మట్టి మనిషి చూడు మట్టినిష్టపడదు

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
మట్టి మనిషి చూడు మట్టినిష్టపడదు
మట్టినిష్టపడకే మట్టి తినును వీడు
మట్టి పోగుజేసి మెట్లిన్ని గట్టేడు
మెట్ల క్రింద మట్టినదిమి తొక్కేడు
వట్టి మనిషి వీడు ఎట్లు మారె నేడు
చెట్లు నరికి వాటి ఫలము గోరే వీడు
మెట్లు గట్టేదెట్లు? బ్రతికి బట్ట కట్టేడెట్లు?
వట్టి మనిషి గాడు రేకెట్లు కని బెట్టే
రేకెట్లు కనిబెట్టే, గ్రహాపాట్లు తలపెట్టే
నేల పండే గింజ నాడేడ కనిపెట్టే
వట్టి మనిషే వీడు,ఒట్టు మనిషే వీడు...✍
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

తేనె జల్లులు, పూల వానలు

=======®========
తేనె జల్లులు,
పూల వానలు
వాలు చూపులు,
తీపి ఊసులు
మరుమల్లెల
చిరు నవ్వుల
పాలరాతి బొమ్మకు
వెన్నెలమ్మ తానాలు
చిగురాకుల
నగుమోము
అదిరే ఆ అదరాలు
లేలేత పూరేకలు
రెప రెపల కను రెప్పలు
బెదురు చూపులు
నిచ్చెలి ఆ కనుబొమ్మలు
విప్పలేని పొడుపు కథలు
ఎప్పుడో మరి విప్పుకోలు
నునుపెక్కిన ఆ చెక్కిలి
చేజిక్కగ చందమామ
కెంత తొందర
మరి మిక్కిలి
నడిమంత్రపు
నడుమొంకులు
మితిమీరి మరీ మరీ
మరిచెనులే తన ఉనికిని
భూకంపం
మతి భ్రంశం
జడ తాకిడి
వెనకేదో
తగి దిన థోమ్
తకి దిన థోమ్
ఉద్దేశం
సిద్ధాంతం
మధు మాసం
అధిరోహం
కథ నడిపే ఉద్దేశం
సరేనంటే చేసేద్దాం
ఉత్తరాన జామచెట్టు
పొదల మాటు
చిలక కొట్టు
తినిపిస్తా సై కొట్టు
తీపి తాయిలం ........✍
======®=======

నీటిపైన ప్రతిభింబం ఎంతవరకూ శాశ్వతం

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
నీటిపైన ప్రతిభింబం ఎంతవరకూ శాశ్వతం
ఊహల్లో బ్రతకడం అవుతుందా జీవితం
సంకల్పం దృఢమైతే ఏదైనా మరి సాధ్యం
అసమర్దుడి వంతు ఇతరులను నిందించడం
నిప్పు కాలుతుందని పచ్చి తింటామా  నేస్తం
కష్టమున్నా చోటే సుఖముంటుంది ఇది వాస్తవం
వాస్తవాలెపుడూ అలానే ఉంటాయనేది సత్యం   
పగలు చూసి రాత్రినెటులయ్యా మరిచిపోతాము
మరువకుంటేనేగా చీకటిలో వెలుగు చూస్తాము
నొప్పి నోర్వలేక తప్పుకుంటే జనము
ఎవరు చెప్పయ్య నేల పుట్టుకొచ్చేము
లెగలేని వాడికే లెక్క లెక్కువ
బొత్తిగా లేనోడికి గొప్పలెక్కువ
కోట్లు పలికే వజ్రమెప్పుడయ్యా పలుకు
రేట్లు పలుకనంత మెరవకుండునెట్లు మేలిమోయి°
°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°°✍
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆

నా పయనంలో సాగే ఈ పయనంలో

®®®®®®®®®®®®®®
నా పయనంలో
సాగే ఈ పయనంలో
నా మొదటి అడుగు నీకోసం
నా బ్రతుకుకు చివరడుగిది.
ఈ యాణంలో
నా విరమణ సూర్యోదయము
నా అడుగులు చీకటి పయనం
అంధకార లోయల్లో
అగుపించని లోతుల్లో
ఎదురీతల పయనంలో
ఎలా చేరుకోవాలి
అందని పర్వత శిఖరం
నా పయనం
నావెరుగాని ఈ నదిలో
ఎదురీతల నా పయనం
కడకింతే కలవడం
కడలి చేరు నా పయనం
,®®®®®®®®®®®®

ఈల వేసేను ఈ పవనము

================
ఈల వేసేను ఈ పవనము
పాట పాడేను ఆ కొలనులు
ఊగి ఆడేను ఈ కొమ్మలు
తాళ మేసేను ఈ గువ్వలు
నింగి చూసేను ఈ సోయగం
వాన కురిసేను ఆ మేఘము
తరలి వచ్చేట్టు ఈ కెరటము
చూసి దోబూచి ఆ చంద్రము
నాట్యమాడేను ఆ పక్షులూ
చేలు పులకించెనది ఎంతగా
గిరులు పరికించెనది వింతగా
తరులు వర్షించె తన వొంతుగా
ఎంత ఉల్లాస మీ భువి రాగము
మనసు పరవశము ఈ సోయగం
మరి ఎక్కడో లేదు ఇదిస్వర్గము
దివి  దర్పణం,పృద్వి దివి దర్పణం
====================
....................య.వెంకటరమణ

సూన్యమైన ఆకశాన చుక్కల మెరుపు

®::::®::::®::::®::::®::::®::::®::;:::®
సూన్యమైన ఆకశాన చుక్కల మెరుపు
నీదైనా నా మనసుకు జ్ఞాపకాల వెలుగు
నల్లమబ్బు తెరలకే కానరాదు ఆ మెరుపు
పెను తుఫాను వీచినా చెరిగిపోదు నీ గురుతు
ఎగసిపడే గాలి కెరటము చివరికది కడలి స్వాస్థ్యము
కనే కలలు ఎంత మధురము కన్నులకవి గావు శాశ్వతం
నిన్న గన్న కలలు నేడు తీపి జ్ఞాపకం
రేపు కొరకు కలలు గనుట నేడు వ్యాపకం
చిరుగాలీ వెళ్లమ్మా, కబురు చెప్పిరా
పెనుగాలీ నీవైనా నన్ను జేర్చవా
వంటరియై వేగుచున్న మూగ ప్రాణికి
ఊపిరియై రారాదా ఒక్క మారిలా
గడియ గడియ గడియారం నడకలా ఇలా
గడియనొక్క యుగంలా గడిపేది నేనెలా
ఆ గడియ రాక పోదని,ఎదురు చూడ నాపని
ఎద వాకిట తలుపు తెరిచి అదే పాట నన్ను పాడనీ!!
®::::::®:::::::®:::::®:::::::®:::::::®:::::::::®..........✍

నింగి నాదే, నేల నాదే, గాలి నీరు అన్ని నావేలే

■■■■■■■■■■■■■■■■■■■
నింగి నాదే, నేల నాదే, గాలి నీరు అన్ని నావేలే
బ్రతుకు నాదే, బాధ నాదే,సుఖము ఫలము అన్ని నావేలే
కష్టపడుట మనిషి వంతు, ఫలితమొసగుట కష్ట మొంతు
మొక్క నాటుట మనిషి వంతు, ఫలాలిచ్చుట చెట్టు వంతు
ఆవగింజలు గాలికిసిరి, ఆశ మామిడి తగదు కాదోయీ
సుఖం మరిగిన సోమరోళ్లు, పరుల సొమ్ముకు అర్రులొగ్గును
సుఖం మరిచిన మనుజులెప్పుడు పరుల కొరకే బ్రతుచుందురు
నిన్న నాదే, నేడు నాదే, వెలుగు చీకటి అన్ని నావేలే
మొన్నలాగే నేడు నేనూ, ఉన్న మనిషికి ఆశ చావదులే
ఎగురు పక్షికి ఎవరు దిక్కయ్యా,
తానెగిరినంతా నేల తనదయ్యా
నీవు నాటిన మొక్క సైతం
నింగికెదిగే వృక్కు చూడయ్యా
వేరు పయనం నీటి కొరకయ్యా
నింగి తనది, నేల తనది ఫలము తనదయ్యా
పరుల సొమ్ముకు తానొంగి చూడదు
నిజంకదాయ్యా, ఇది నిజంకాదయ్యా!!
■■■■■■■■■■■■■■■■■■■

కలలు గన్న నా కన్నులు నిజం తాళ లేకున్నాయ్

==============================
కలలు గన్న నా కన్నులు నిజం తాళ లేకున్నాయ్
నిన్న కన్నా కలలు నేడు కల్లలై పోతున్నాయ్
కళ్ళ ముందు స్వప్నాలను చేరలేని నావలో
దిక్కెరుగని  బాటసారిని,రెక్క తెగిన పక్షినైతిని
నిన్న కన్న కలలు నాకు నేడు పాటమాయెను
రేపు లేని చివరి పేజీ విషయసూచినయ్యాను
కొన్ని చరిత లింతేలే వింతరాతలు
చిన్నవాన జల్లుకే చెరిగిపోవు మంత్రాలు
నిన్న నేను వ్రాసుకున్న చిన్న గీతము
నేడు పాడలేకపోతుందీ దగ్ధఖంటము
నిన్న పాట మళ్ళీ మళ్ళీ నన్ను పాడనీ
చివరి పాట  పాడుకునే వరాలివ్వవే
నిన్న ప్రణయ గీతాలు నేడు పిచ్చి రాతలు
అవే ప్రణయగీతాలు అడవి గాచు వెన్నియలు
విధిరాతను చెరపడం కాదు కదా నాతరం
తిరగ రాయు సాహిత్యం ఎవరికుందిలే,ఖర్మం
నేను నమ్ముకున్న ప్రేమ వమ్ముకాదులే
నిన్ను నమ్ముకున్న నేను బొమ్మ కాదులే
బొమ్మలతో ఆడి ఆడి అలసిపోతివా
ఆట  బొమ్మ నన్ను చూసి నవ్విపోతివా
కలలు గన్న నా కన్నులు నిజం తాళ లేకున్నాయ్
నిన్న కన్నా కలలు నేడు కల్లలై పోతున్నాయ్
కళ్ళ ముందు స్వప్నాలను చేరలేని నావలో
దిక్కెరుగని  బాటసారిని,రెక్క తెగిన పక్షినైతిని     
===========================
.................................య.వెంకటరమణ

నీ చూపేలే అది నను తాకింది

◆◆◆◆◆◆◆◆◆◆◆
నీ చూపేలే అది నను తాకింది
ఈ గాలేదో నీ కబురే తెచ్చింది
నెలవంక తొంగి తొంగి చూస్తుంది
తెలిసింది,అది నీవెనని తెలిసింది
నల్లమబ్బు విడిపోయి వెన్నెలెలా గాచింది
ఇన్నినాళ్ళ విరహాన్ని మటుమాయం చేసింది
ఎడవాకిట వీణ పాట వినిపిస్తుంది
తెలిసింది, అది నీ స్వరమేనని తెలిసింది
చుప్పనాతి చూపుల్లో చిక్కుకున్న నీ మనసు
నన్ను మరిచి పోదని నాకిపుడే తెలిసింది
తెలిసి నవ్వుకుంటుంది,మనసు పాడుకుంటుంది
చిగురు తొడిగి పూలవనం ఆహ్వానం పలుకుతుంది
మళ్ళీ మళ్ళీ కోకిలమ్మ పాట పాడ నొచ్చింది
మల్లెలమ్మ పరవశించి పందిరి మనకేస్తుంది
తెరిచి ఉన్న తలుపు బయట నిలువ నేలనోయి
నిన్నే నిన్నే తలచుకునే మనసు నడగవోయి
తెలిసిందిలే, అది నీవే నీవేనని నా మనసుకు
వేగి రమ్ము, జాగుచేయకే, ప్రియా సఖీ
జాగు చేసి నీమనసుకు వేదనెక్కువే
తెరిచి ఉన్న తలుపు బయట నిలువనేలనో
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ.....✍

మొదలయ్యిందదిగో రొద రొద రణము

==◆===◆===◆===◆===◆==
మొదలయ్యిందదిగో రొద రొద రణము
వాడిగ సంధించే వాగ్దానపు బాణం 
మొదలయ్యిందదిగో రొద రొద రణము
వాడిగ సంధించే వాగ్దానపు బాణం
ఇల్లు కాలి ఈరి గాడు,వినరెవరూ వాడి ఘోడు
కడుపుకాలి సూరిగాడు,కాలి క్రింద రాయి వాడు
తిప్ప లెవడికెరుకరా, నొప్పిలేని కడుపు బాధ
అనాకారి నాయాళ్ళు వేస్తు న్నా వారధులు
వారధిలే ముందు గట్టి,ఐదేళ్లకు గండి కొట్టు
ముంపు తీర్చు వాగ్దానం మరీ కదా విడ్డూరం
ఒళ్ళుగాయ గుడ్డలేదు, తల దాచే చోటులేదు
తస్సాదియా తగదునంటూ తయారయ్యే వీళ్ళు
తొత్తు కింద తొత్తు వీళ్ళు,తొక్కిడి బిల్లాటగాళ్లు
అంగ్రేజీ నయమంటే, అరుస్తారు జనం గానీ
అంతకంటే దారుణం, అనాకారు లెవ్వారం
అదిగదిగో ఆర్భాటం, అబద్ధాల ప్రసంగం
మొదలయ్యిందదిగో రొద రొద రణము
వాడిగ సంధించే వాగ్దానపు బాణం 
మొదలయ్యిందదిగో రొద రొద రణము
వాడిగ సంధించే వాగ్దానపు బాణం
==◆===◆===◆===◆===◆==.........✍

ఇంకిలానే ఉంటుందా ఈ పోకడ

◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ఇంకిలానే ఉంటుందా ఈ పోకడ
కొంతైనా మారేదుందా ఈ లోగడ
మారాజు లెపుడూ మారాజులేనా
గరీబు బ్రతుకులు గరాళానికేనా
వెలుగు చూడని బడుగు జీవులు
జీవమెరుగని చావు చూపులు
నామ మాత్రం నాది రాజ్యం
నిలువ నుండదు నీడమాత్రం
మట్టి గొట్టిన చేతులంటీ
నల్ల బారెను తెల్ల డబ్బు
నల్ల డబ్బు చెల్లదయ్యో
తెల్ల మొహామీ బడుగువాడు
మంచి రోజుకు ఎదురు చూస్తూ
ముంచు వారిని కొలుచుకొస్తూ
ఎంత కాలం ఎదురు చూపులు
వెదవలెవ్వరు నిన్ను చూడరు
మూగ బోయిన గొంతులారా
బొరియ దాగిన బొమ్మలారా
రొమ్ము తాగే పిల్లలారా
వెలుగుజూడగ బయలు రారేరా
నిన్న నమ్మిన వాడి నయమోయి
మన్ను నమ్మిన వీడు వమ్మోయి
గింజ లమ్మగ రేటు రాదోయి
కొనను బోతే నీకేది రాదోయి
పంట కావాలి, వంట సాగాలి
గింజ కొలిచే రైతు కడుపులు
మండి చావాలి,ఎండి పోవాలి
అండ లేకే వాడుండి పోవాలి
పంట దాకా గెంటు కెళితే
పంట మొత్తం గండి కెళితే
గింత మిగిలి పన్ను కెళతాయ్
గంతే లేమోయ్ రైతు బ్రతుకులు
నూట పాతిక కోట్లమంది
ఓట్లు వేసే జనము వాళ్ళు
మడుగు ఒడ్డున, రోడ్డు ప్రక్కన
స్వశ్చ భారత్ డబ్బాలిరుకున
లెక్కకందని జనం బోలెడు
మచ్చుకైతే మనుజులాళ్ళు
చెత్తలూడ్చే చీపురెంబడి
శవాలై మరి తేలుతుందురు
ఒక్కడైనా ముందుకొస్తే
లెక్కలైనా వేసి చస్తే
స్వశ్చ భారత్ మేరా భారత్
అప్పుడే అది మన గొప్పలేరా
చెప్పుకుంటే సిగ్గు చేటు
ఒకడు కంటే ఒకడు గ్రేటు
చెప్పబోతే నాకు వేటు
చెప్పుకుంటే మీకు చేటు.....ప్చ్
◆◆◆◆◆◆◆◆◆◆............✍

తోటలన్నీ వెతికి, పూలనేరి

=================
తోటలన్నీ వెతికి, పూలనేరి
పూలనందు గింత మైనమెంచి
ఇంత గంతా గూర్చి గదులు గట్టి
పరులకంద నెత్తు నది గూడుగట్టి
భవిత బిడ్డలెంచి బంజరంతా తిరిగి
తిరిగి తిరిగీ నీగ మకరందమేరి
కొంత కొంతా కూర్చి ఇంతజేసి
బిడ్డ రాకను గాంచే నిశ్చింతగానీగ
ప్రక్కనున్నా పూల మకరందమెరుగండు
ఎత్తునున్నా తేనె నెట్లేట్లు గనిపెట్టి
తుంట గాల్చీ, చంపి ఈగను
పుణుకి దెచ్చును  తేనెపట్టును
సాటి వాని చేయి సఖ్యపడని మనిషి
అవసరాన్ని బట్టి అన్ని మరచే నెట్లు
ఈగ ఎంగిలయిన  ఈ తేనె పెట్టున్
జుర్రుకొనును చూడు జుంటు తేనియలనుచు
తగదు కాదా మనకు తగదు మిత్రా
తనదన్న దానిన్ను తానొంద తగదు
దూడ జూపీ పొదుగు పాలు బితక
పొదుగు గోసీ పాలు త్రాగ బతుక
===================రచన...✍

మంచి రోజులొచ్చేసాయ్

=========================
మంచి రోజులొచ్చేసాయ్
మూటా ముళ్ళూ గట్టండి
ఇంకా మంచిగుంటాయవి
ముందు పరుగు తీయండి
గీసి గీసి జీతాలు,జేబుకిన్ని బొక్కలు
కలిమిదండు చెల్లించగ వేసాకా లెక్కలు (కలిమిదండుగ=Income tax).
పడడానికి మిగులుతాయి ఉద్యోగుల తిప్పలు
చెప్పడానికే కదవోయ్ ఉద్యోగుల గొప్పలు
లెక్కరాని లెక్కలు(డబ్బు) కుప్పలున్న తేలవు
గిచ్చిగిచ్చి గింత ఇచ్చి గుంజనెన్ని పన్నులు
పళ్లకేమి పనీ లేదు, పన్నుకేమి లోటులేదు
పలుగు మీది, హారమ్మాది.ఫలహారం,ఫలహారం
లేనివాడికప్పులుండవిదో సిద్ధాంతం
అప్పుతీర్చ డున్నవాడు అదో తతంగం
చిన్నవాడి కప్పులిచ్చి ఇల్లు వేలమేయడం
ఉన్నవాడి కప్పులుంటె రద్దు జేసివేయడం
బలేగుంది యవ్వారం,ఇదీ మన ప్రజత్వం
బాగుపడడమెమో గాని,బాగుజేయనే ఉన్నాం
రేపునయం,మాపునయం,బ్రతుకులంతే అయోమయం
గండి కోట్ల రహస్యం, బండబడా ఎవడు నయం
గండిపడెను ఖజానాలు దండుకోండి జనాలు
మింగ ముద్ద లేకపోతె మింగిపోండి విషాలు
మీరిచ్చిన అవకాశం,మితిమీరితే ఆ సమయం
మరోసారి ఛాన్సిస్తే, ముంచేస్తాం అదిఖాయం {ఐశ్వర్యంలో అనుకుంటా)
≠======================== రచన...✍

వరదలొస్తున్నాయ్ గండి కొట్టుడి

=====================
వరదలొస్తున్నాయ్ గండి కొట్టుడి
తుఫానులవిగో లంగరులేయుడి
కెరటాల తాకిడి అణిచేస్తుంది
కాలంతో మరి సిద్ధంకండి,సిద్ధంకండి
ఎడమావితో కుండ నింపులు
ఎండు గొంతుకు చెమట చుక్కలు
ఆకలి కడుపును ఊహల కంచం
పంచే పంచెలు,అవిగో తెల్లగ
తెల్లవారనీ చీకటి బ్రతుకులు 
తెల్లవారితే చీకటి భయములు
ఎక్కడ చూస్తే అక్కడ చూడు
అమాస వీడని పొద్దుపొడుపులు
శాంతిని దాచిన సామంతులరిగో
శాంతి యాత్రలకు సిద్ధం సిద్ధం
వట్టి మాటలకు కట్టిన కోటలు
అవిగో మళ్ళీ పునాది వాటం
నిప్పుల గుండం ముందుంది
ఆచీ తూచీ అడుగులేయుడి
బ్రష్టులకంతా పట్టం గడితే
బ్రష్టుబట్టడం ఖాయంలే మరి
మాటల గారడి మాంత్రికుడొకడు
మూటలు మాయం తాంత్రికుడొకడు
వాటాలేసుకు తినేటి వాళ్ళు  
మాటుగాచుకుని మళ్ళీ సిద్ధం
భ్రష్టత్వాన్ని బ్రద్దలు గొట్టే
ఈవీఎమ్ తో యుద్ధం చేద్దాం
ఎవడబ్బ సొమ్ముర,ఇది నాదేశం
స్వతంత్ర్య దేశపు వెలుగులు చూద్దాం 
========================......✍

అదురు నీ అదరముల

❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
అదురు నీ అదరముల
నీ మధుర భాష్యములు
తేనియలూరించు తీపి మాటలు
హిమవాయువు నీ స్వరలహరి
అలవోక నినిపించు వీణగానమేమో
ఆలప లయ మాధుర స్వర బాణీ
వికశించెడి నగుమోమున చిరునవ్వు
వెలుగు వెన్నియల చంద్రబింబమెమో
కుసుమ కోమలి నీ త్వచః కాంతులేమో
మృగనయనా  బెదురు చూపులేమో
పలుకకనే పలుకరించు నా భవబాషలేమో
సిగ్గులొలుకు ఆ బుగ్గల సింధూరమేనేమో
ఉదయ భానుని వర్ణమట్లు మలచే
ఎక్కుపెట్టిన విల్లు వీర ధనస్సు నడుము
హొయలు బోవు నడక హంస నేర్పెనేమో
గళ్ళు గళ్ళు మ్రోగు నా మువ్వ పలుకులేమో
వెన్న ముద్దల పొదుపు విందు లెవరికేమో
ఏమో,ఏమేమో. ఇది దివ్య కన్యనేమో
తనను బోలిన రంభ నచట నిడిచి
భువిని జేరినా కిన్నెరీమె కావచ్చునేమో
నీ లోటు స్వర్గంబు నెవరు దీర్చగలరు
నువ్ చెంతనుండఁగ నాకంటే రాజెవరు
నేల,రాజ్యంబులేల?నీ హృదయమొకటి చాలు
ఈ రేడు కేలంగా సామ్రాజ్యమదిగాద సామ్రాట్టుగా౹.✍
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
=================================

మట్టి కడవ అల్పము,అట్టిదేలే కుటుంభం

మట్టి కడవ అల్పము,అట్టిదేలే కుటుంభం
విలువ తెలియు నెట్లు పగలగొట్టు తనకి
నిలుప శ్రమలనోడ్చు,నిలువు తనకి దప్ప
నిబ్బరంబు మేలు, పగుల నతుక లేమూ
నిశ్చయంబు చూడు నిండు కడవలెపుడు
తొణక కుండు నయ్యా తృష్టదీర్చ నెపుడు
అల్పమైన నేమి అది మేలు మన ఇంట 
సొమ్మసిల్లు వేళ తానుండు నీకండా ||.......✍

సకల చరాచరములకిది యాది

================================
సకల చరాచరములకిది యాది
నిఖిల జగత్తుకిన్ అహ్లాద మిది
బ్రహ్మసృష్టి కిదియే కద పునాది
ఉగాది! ప్రయత  ప్రయతంబిది
మంచి చెడుల సంయమనము
మనకు నేర్పెడి  పర్వదినము
ఋతు మార్పుల దోషాలకు
నింబ కుసుమ భక్షణము
మాలబారుదీరిన వేపపువ్వులు
రూపు దేరిన లేత చామరములు
గింత ఉప్పు,చెరకుతీపి,చింతపులుపు
బ్రతుకు నేర్వగ చక్కనైన మేలుకొలుపులు
పానకాలు,వడపప్పు  పరమేశా ఫలహారం
గ్రీష్మఋతువు తాపానికి నీటిపానకం
విసినకర్ర ఇచ్చునట్టి మొదటి  ఆచారం
వేస వేగము, ఇది ఏసీ యుగము
============================
తెలుగు రచన మిత్రులకు శుభాకాంక్షలతో
..................యలమంచిలి వెంకటరమణ

ఉగాది శుభాకాంక్షలతో

ఉగాది శుభాకాంక్షలతో
^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^
సకల చరాచరములకిది యాది
నిఖిల జగత్తుకిన్ అహ్లాద మిది
బ్రహ్మసృష్టి కిదియే కద పునాది
ఉగాది! ప్రయత ప్రయతంబిది
మంచి చెడుల సంయమనము
మనకు నేర్పెడి పర్వదినము
ఋతు మార్పుల దోషాలకు
నింబ కుసుమ భక్షణము
మువ్వహారం వేప పూవులు
రూపుదేరిన ముగ్ద చామరాలు
గింత ఉప్పు,తీపి చెరకు,చింత పులుపు
బ్రతుకు సత్యం నేర్పు యత్నం
పానకాలు, వడపప్పు ఫలహారం
గ్రీష్మఋతువు నీటి పానకం
విసినకర్ర ఇచ్చునట్టి మొదటి ఆచారం
వేస వేగని, ఇది ఏసీ యుగము
తెలుగు మిత్రుల వెలుగుగోరే
తెలుగు రచన శుభాకాంక్షలు
క్రొత్త ఆశలు చిగురు తొడిగే
శుభాకాంక్షలు, శుభాకాంక్షలు
^^^^^^^^^^^^^^^^^^^^^^^^
మిత్రులకు హేమలాంబ నామ ఉగాది  శుభాకాంక్షలతో
                                                      .......యలమంచిలి వెంకటరమణ

ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం

ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం
=================== ====
ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం
కష్టాలసముద్రంలో సుఖాలెతకడం
కష్టమెరుగని సుఖాలను కష్టపెట్టడం
నిజమైన  నిజాన్ని  సూన్యమనడం
సూన్యమైన సమాజాన్ని సొంతమనడం
కష్టాల సముద్రంలో సుఖాలెతకడం
సుఖాల గమ్యం చవిచూడకుండానే
కష్టంగా సుఖంలో కరిగి పోవడం
ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం
ఎంతకష్టమోకదా సుఖంగా బ్రతకడం
=======================
......................య.వెంకటరమణ

వీరుని జేతిలో ఖడ్గంలా

◆◆◆◆◆◆◆◆◆◆◆◆
వీరుని జేతిలో ఖడ్గంలా
రగిలే సూరజ గోళంలా.
రెప్పలు వేయని అత్యాచారం-
రెక్కలునరికే ఉద్వేగంతో
చీకటి తెరలను ఛండాడంగా
వచ్చిందదిగో వచ్చేసింది.
మర్మం దెలియని ప్రజలకు
రోషం వచ్చిందదిగో వచ్చేసింది.
◆◆◆●◆◆◆◆◆◆◆◆

ప్రయత్నం వెనుకనే ఉంటుంది విజయం

==========================
ప్రయత్నం వెనుకనే  ఉంటుంది విజయం
ప్రయత్నం నీదైతే, నీ నీడే ఆ సాఫల్యం
ప్రయాసలో అది నీ వెనుకుంటుంది
నువ్వు వెనుదిరిగితే అది ఆగిపోతుంది
నీ అడుగులు వెలుతురు వైపయితే
విజయం ఎపుడూ నీ వెంటే నేస్తం
చీకటివైపు అడుగులు వేస్తూ
నీ కెపుడూ దొరకుదులే విజయం 
===========================
                                    ....తెలుగు రచన

నమ్మే రోజులు పోయాయి

=====================
నమ్మే రోజులు పోయాయి
కమ్మెను పాపం జూడోయ
దొమ్మీ దోపిడీ దౌర్జన్యం కీ
లోకం మొత్తం దాసోహం
ఎత్తుకు మోసే చెప్పులు పాపం
గుమ్మం బయటే అవి స్తగితం
నెత్తిన మెరిసే మకుటం కోసం
ఈ లోకుల కెంతెం తారాటం
నీళ్లే  ఉండని ఎడారి నడుమ
బ్రహ్మాజెముడి దో పోరాటం
బ్రహ్మ సృష్టిలో మనుజుల మాకు
జలాల మధ్యన ఆరాటం
ఏడు రంగులు,ముపై హంగులు
నాలుగు పింగులు,టింగురంగలు
నాశనమైతే అయిపోనీ
నా వాటా నాకే నువ్ రానీయ్
చేసే వాడికి చేసే  యోగం
చూసే వీడికి రాజబోగము
పదండి ముందుకు పదండి పోదాం
మనుజులుండరు అడవుల కెళదాం
ఎవడికి వాడే రాజారంగం
చెప్పేవాడే బోడి లింగము
ముక్కుకు సూటి ముందీ గోడ
ముక్కు పచ్చడి, రక్తం రక్తం
బ్రష్టాచారం స్వైరయానము
నిమ్మకు నీరు జనాలు ఘోరం
వరాహమూర్తి విష్ణును పిలువు
ఎత్తి తిప్పగ భూమిని మొత్తం
===================
              ... తెలుగు రచన/. .

అలసిన అడుగులు

===========================================
అలసిన అడుగులు నడిచొస్తున్నాయ్ సవ్వడిలవిగో వినిపిస్తున్నాయ్
పొలిమేరల్లో చిరు-పోధలాడే గుసగుసలవిగో వినిపిస్తున్నాయ్
హైన్యం ఎరుగని దేహం చేసే ఆలాపనలో అపసృతులున్నాయ్
రక్కసక్రీడకు స్పందన లేవి? రగిలేమంటలు అగుపిస్తున్నాయ్
ఆకలిమరిగిన గాజులు పాపం,రక్తపుమరకలు చవిచూస్తున్నాయ్
మొరటి చేతిలో మల్లెలు కూడా అల్లాడేనే  చెల్లాచెదురై
ఆఖలితీర్చే చెమటలు పాపం మంచును కూడా మరిపిస్తున్నాయ్
వెలుగే ఎరుగని చూపులు 'ఎవరని?'వేసే ప్రశ్నకు
చీకటి చెప్పే జవాబు ' కానిది తనదను నవాబు'
ఒదార్పెరుగని భాష్పాలవిగో,స్వేదంతోమరి చెలిమైపోయే.
===========================================
.................................య.వెంకటరమణ

అంతస్తుల కంతస్తులు ఎన్ని ఉన్నా శాశ్వతమా

========================
అంతస్తుల కంతస్తులు ఎన్ని ఉన్నా శాశ్వతమా
ఏడడుగులు శాశ్వతమవి ఎచట రాసెనో కదా
చలువ రాతి మేడలలో ఎంత కులికితేమిలే
చివరి కునుకు సమాధిలో నిజంలే మరి
కోట్లు పెట్టి కారులెన్ని గుట్టలెట్టినా సరే
చివరి యాత్ర పాటి పైన అదే నిజముగా మరి
కట్టు బట్టకెన్ని బ్రాండు లెన్ని ఉన్న నేమిలే
చుట్టబెట్టు బట్టకేమి బ్రాండు లేదు కదా మరి
నీ మోసం ఎందరిని మోసుకెళ్లేనో జారి
నిన్ను మోసుకెళ్ల నే నలుగురు నేమో మరి
ఎంత కాల మెన్ని పూసి గప్పినా శరీ
ఈ ఖలనము మన్నుతో గప్ప తప్పునా మరి
ఇన్ని తెల్సి నీ మనిషికి ఎన్ని ఆశలు
ఆ యాశలు మొత్తము చావుతోనే సరే సరి
అనుకుంటే అందరమూ ఒక్కటే మరి
అనుకోకే తొక్కుకెళ్లు సిస్టముంది భాయి
నీ వెనక ముందు నడుచుకెళ్లు దెందరైతేనేఁ
ఎందరుందురందులో అందున నీ చివరి యాత్రలో
ధనం కాదు సోదరా జనం చూసుకో
స్వయం చచ్చిపోయినా,బ్రతుకు నేర్చుకో
బ్రతికి చచ్చిపోవుకంటే,చచ్చి బ్రతుక మెప్పుగా
బ్రతికేస్తే ఏమున్నది బలాదూరు మనిషిలా,
బ్రతికుండాలది కాదా బ్రతుకు సోదరా
బ్రతికుండుము నూరేళ్లు,వజ్రంలా వెయ్యేళ్లు.
బ్రతికుండుము వేయేళ్ళు వెయ్యి మంది మనసులో
=============================
                            ......తెలుగు రచన/-

మరుపెరుగని అనురాగం

మరుపెరుగని అనురాగం
================================
కలనో, కల్పనో, ఇది ఊహేనేమో
నిజమో, వరమో, ఇది తరగని ప్రేమేమో
నిను మరువాలని నేననుకున్నా ఎన్నోసార్లు
నన్నే నే మరిచానన్నేసార్లది వాస్తవము
మణి దీపం నీ వెలుగును వికశించెను నా మోము
మనసున మాయని మమతల జ్ఞాపకము
ప్రియా! నీకై వేచే మౌనం ఓ యుగము
నీతో గడిపిన ఆ క్షణము, ఊపిరి నేడది నిజము
అలుపెరుగని నీ తలపులు ఆయెను ప్రాణం
కాలాలే మారినా, దూరాలే పెరిగినా
మాయవులే మారావులే అనురాగాలు
మాయవులే మారవులే అనురాగాలు
===============================
                                                    ....మాధుర్య

తీపి ఉండాలే కానీ చీమల కేం కొదవా

============================
తీపి ఉండాలే  కానీ చీమల కేం కొదవా
కాసులుండాలే కానీ చుట్టాలకేం కొదవ
ఉప్పు తగిలితే చెదిరి పోవా చీమలు
నొప్పి తగిలితే బెదిరి పోరా చుట్టాలు
ఏడుస్తుంటే నవ్వించే వాళ్ళు  ఎందరు?
నవ్వే వాడిని చూసి ఏడ్చే వాళ్ళే కదా అందరు
నిన్నమంచికి అందరూ తలో కారణం
నేడు బెసిగి పోతే అదంతా  దురదృష్టం
పచ్చికాయ మీద కళ్ళు,పండుకు  దోసిళ్ళు
పక్కవాడి మీదే  కళ్ళు, ఇవ్వాల్సి వస్తే చెల్లు
పడవేయడానికి తవ్వడం, పడ్డాక నవ్వడం
కొత్తేముంది, మానవాళికి ఇవే ఆనవాళ్ళు
============================
............................ య. వెంకటరమణ

ఎంత మధురమో ఈ స్మృతి ఎంత మధురమో

ప్రియురాలి ఎదురుచూపు ఇలానే ఉంటుందేమో!
==============================
ఎంత మధురమో ఈ స్మృతి ఎంత మధురమో
ఎంత హాయినో నీ పొందుకు ఒరిగి ఉండడం
వింత అనుభం నీ చెంతచేరడం ఎంత అనుభవం
గిలిగింత మనసుకి ఎంత సంబరం ఎంత సంబరం
కోయిలమ్మ ఇలా వచ్చు కబురు చెప్పి వెళ్ళింది
కోరికేమో పురులు విప్పి నాట్యమాడ సాగింది
వస్తావని చందమామ వెన్నెలంతా పరిచింది
ముస్తాబయ్యి అందమంతా సిగ్గులోలకబోస్తుంది
చిరుగాలీ ఉండవే, సిగపువ్వలు తురమకే
మరుమల్లీ ఎందుకే, మరీ అంత తొందర
పందిరి మంచమా చిందులు వేయకే
మున్ముందు రానుంది సిందుల ఆ పండగలే
వంపులలా తిరుగకే వయ్యారీ దీపమా
హద్దు జారీపోమాకు సిగ్గు విడిచి వస్త్రమా
సిగ్గు మొగ్గ లేత బుగ్గ తొందరేలనే
వస్తాడు వస్తాడు  పెందలాడే చందమామ
=========================== .  తెలుగు రచన

మిట్ట మధ్యాన్నం, మండుటెండే. కలాన్ని కాసేపు ఏసీలో పెడితే ఇదిగో ఇలా వ్రాసింది మరి

మిట్ట మధ్యాన్నం, మండుటెండే. కలాన్ని కాసేపు ఏసీలో పెడితే ఇదిగో ఇలా వ్రాసింది మరి
===============================
నెలవంక చూసింది నిన్న, కొమ్మల మాటున నన్ను
పురివిప్పి ఆడెను నేడూ, దాగున్న పరువాలు నాలో
ఎలుగెత్తి చాటింది పాడూ, ఏం కోయిలేమో చూడు
చిలకమ్మ చిగురొంక చూసి, ఎగరేసే నో కన్ను నాకై
తొలిసారి మల్లేమో నాలో,హ్ రేపింది లో లో
అల్లర్లు చేస్తూ తుమ్మెదలమ్మో.అమ్మో అమ్మో అమ్మమ్మో
నమ్మని పరువం ముంచేనేమో, ఏమో ఏమో ఏమోనమ్మో
నిన్న, మొన్న లేదు గాని, నేడు లేత మనసులో
కొత్త కొత్త ఆశాలేవో గుచ్చి గుచ్చి గుబులు నేడు
లేక లేక వేసుకున్న, లేత పచ్చ పవిట కయిన
లేదు ఇంత సిగ్గు చూడు. సిగ్గు బయట సిగ్గు సిగ్గు
కొత్త కొత్త అందాలను గుచ్చి గుచ్చి చూపకలా
తగ్గు తగ్గు తగ్గుమోయి సిగ్గు దొంతరా
ఓపలేని వయ్యారమా, హొయలు మరీ పోబోకుమా
మాఘ మాస మొచ్చువరకు అణిగి ఉండుమా
చెప్పు చెప్పు. నువ్వన్న చెప్పు, మల్లెమ్మ చెప్పు
ఎప్పుడిప్పుకోవాలో మనసు మాట  చెప్పు
మనసు మాట వినకపోతే మరో దారి నువ్వే చెప్పు
వచ్చి పోయే వసంతమా ఇంత ముప్పు తెచ్చేవేమ్మా
చింత నిప్పు నయం  చూడు ఇంత తాపమా
లోకమంత విస్తుబోయే , కొత్త సోకులొచ్చెనాయే
వచ్చి బోయే వారి చూపు గుచ్చి గుచ్చి గుచ్చుతుంటె
ఎప్పుడొచ్చునో ఏమో, మాఘమాసమెప్పుడొచ్చునో
ఓపలేని మనసుకు, ఊరడింపు లెవరు జెప్పునో
చెప్పు, చెప్పు, నువ్వన్న చెప్పు.మల్లెమ్మ చెప్పు
మాఘమాసమెప్పుడుందో మరీ మరీ చూసి చెప్పు
మురిపమల్లే మూటగట్టి,ముత్యమంత మాటజెప్పు
మాఘమాసమెప్పుడుందో మరీ మరీ చూసి చెప్పు.
≠===============================
హు... ఎప్పుడొస్తాదో ఏమో ఈ మాఘమాసం.. ,,

లంచ మెంత నొక్కాడో గాని

==================
లంచ మెంత నొక్కాడో గాని
మంచి బొమ్మ చేశాడే వాణీ.
మీ నడుముకున్ను మన్ను దీసి
మా నడుం కేసి కట్టాడేమి
మీ కళ్ళల్లో మత్తు సరే
మా కనుల కింత శిక్షేమి
చిన్న వాలు చూపుకే
చిత్తయ్యే మా కళ్ళకు
చిత్తగింపు చిన్న నవ్వు
ఎక్కడుంది న్యాయము
ముక్కు పైన ఈ కోపము
నీకైతే ఎంతందము
గురక వరం మాకిచ్చెను
ఏమమ్మా మా ఖర్మం
నునుపైనా ఆ చెక్కిలి
గెడ్డమొకటి మాకడ్డం
నవ మాసాలోకే లే
ఎంత కాలమీ గర్భం
గాడిద'ని అమ్మ తిడితే
తిట్టేలే అనుకున్నాం.
సంసారం మూటగట్టి
వీపు మీద పెడుతుంటే
సరుకు తోలు సావుకారు
ఏమి వరం ఏమి వరం
మోయాలిక మేమంతే
మీతో మరి కాపురం
గట్టిగా చడవకండి
పక్కన వాళ్ళున్నారు
ఒక్కరిన్న  అంతేనిక
ఉరిదీయుట మరి కాయం
వెనకున్నా జడలు కూడ
వాళ్ళ కున్న మరో వరం
===============
.                  తెలుగు రచన

దేశమీగతి ఎవరు బాద్యులు

====================
దేశమీగతి ఎవరు బాద్యులు
దమన నీతికి అంతమెవ్వరు
దనుజ దష్టం రక్షనెవ్వరు
మశక జీవుల మనుగడెవ్వరు
ఎవరు,చరితకు సాక్షులెవ్వరు
తిరగ వ్రాసే నాధులెవ్వరు
పెక్కుటిల్లే ఆర్తిఘోషా శ్రోతలెవ్వరు
అశ్రుధారకు దోసిలోగ్గే దాదులెవ్వరు
వేగు మంత్రం జోగు జనులకు
ఎవరు, ఎవ్వరు వెలుగు కిరణం
ఎవరు,యువతకు మేలుకొలుపు
మేటి భారత చాటువెవ్వరు
మిణుగు పురుగుల వెలుగు ఉదయం
కుక్కలొడ్డిన ఎంగిలన్నము
మెతుకులుడకని మేటి శాస్త్రం
మార్చు నాదులు ఎవరు ఎవ్వరు
కాదు సమయం , వర్ణ బేధం
కులం కాదోయ్ ప్రగతి వర్జ్యం
మనం మనము ఒక్కటైతే
పెక్కుటిల్లద కీర్తి నాదం
యుద్ధ నౌకలు, పెద్ద ట్యాంకులు
చిన్నబోవా యువత ముందర
యువత ఒకటై పిడికిలిస్తే
నిలుచునా మరి భ్రష్టనీతి
వెక్కు పెట్టిన వీర విల్లుగ
విల్లు వీడిన శరము నీవుగ
అడుగు వేస్తే తిరుగు లేదోయి
భరత కీర్తికి సాటి లేదోయి
===================
              .... తెలుగు రచన ✍

బలే గమ్మత్తులే ఈ 'మత్తు'

=================
బలే గమ్మత్తులే ఈ 'మత్తు'
జగమంతా దానికి చిత్తు
జులాయి వాడికి తిరుగుడు మత్తు
జూడగాడికి గెలుపొక మత్తు
పోకిరిగాళ్లకు సోకుల మత్తు
మతిలేనోడికి మమైక మస్తు
కడుపు మాడితే గంజినీళ్లు మత్తు
కడుపు నిండితే దమ్ముకొట్టు మత్తు
వంక దొరికితే మందుకొట్టు మత్తు
వంకర వాళ్లకు  తుంటరి మత్తు
ఊగుతుంది నేడు జగతినంతా మత్తు
మనిషి బ్రతుకు సగం మత్తులోనే చిత్తు
మత్తు విడువకుంటే జీవితమే ఇక్కట్టు
నిద్ర మత్తుకై పెట్టకు నీ బ్రతుకును తాకట్టు
మందు కొట్టడం, మాదక ద్రవ్యం
మసాల పొడులు,స్మోకింగ్ పొగలు
మైకంలో పడి యువత తిరుగుడు
విడువక పోతే అంతా గడ బడు
బలే గమ్మత్తులే ఈ 'మత్తు'
జగమంతా దానికి చిత్తు
=====================
                      తెలుగు రచన/..✍

గుండెల్లో లేకుండ భక్తి

◆◆◆◆◆◆◆◆◆◆
గుండెల్లో లేకుండ భక్తి
కొండల్లో ఉంటుందా ముక్తి
పక్కోడి సొమ్మంతా కొట్టి
పైవాడికేస్తావా రాశి
రోజంతా చేసేదే ఘోరం
లెంపల్తో పోతుందా పాపం
మనసంటూ ఉంటే నేస్తం
ఒప్పేసుకోవయ్యా సత్యం
మొసంగా పోగేసి పైకం
మోక్షానికిస్తావా లంచం
పైవాడి కేడుంది షాపు
కొంటాడా ఏంటయ్యా స్టాకు
నువ్ చేసుకున్నాదే నోటు
మొన్నేగా కాల్చావో లాటు
పస్తులతో పేదోళ్ల పాట్లు
గుడి నింప వేస్తావా నోట్లు
నమ్మయ్య కాదేమి నేరం
మూఢంగా నమ్మేస్తే క్షవరం
కొంతైనా చేవయ్యా సాయం
తనకింక నీవేగా దైవం
నదిలోకి విసిరేస్తే నాణెం
వస్తుందా ఏమయ్యా పుణ్యం
ఓ పూట కూడెడితే నయ్యం
పది రోజులుంటాడు పాపం
పుట్టలో పోసేస్తే పాలు
ఏదయ్యా తాగేందుకు వీలు
వెనకొచ్చు నిలబడితే పాము
వేసేస్తా రేమంటే, భయము
కొండల్లో ఉంటాడా దైవం
గుండెల్లో చూడయ్యా నేస్తం
నీ మనసు నీకేలే సాక్షం
అది, ఒప్పుకుంటేనే మోక్షం
◆◆◆◆◆◆◆◆◆◆
                    తెలుగు రచన....✍

గొప్పు తగిలిన వాడికే గా బొప్పి

◆◆◆◆◆◆◆◆◆◆◆◆
గొప్పు తగిలిన వాడికే గా బొప్పి
చూసేవాడికేముంటుంది  నొప్పి
పల్లకిలో ఊరేగడం గొప్పే
మోసే వాడి నడిగి చెప్పొయ్
వాడికి జరిగితే తగిన సాస్తి
మనవరకూ వస్తే అది విపత్తే
చూసేవాడికి మూడు మల్లెలెత్తు
మోసేవాడి కదే మణుగెత్తు
సోమలింగం గారు చాలా బెస్ట్
వాళ్ళావిడంటే విన్న "నువ్వు వేష్టు"
పక్కవాటా నుండి వినిపిస్తే గుసగుసలు
పెళ్ళాం మాటంటేనే వీడికి రొస రొసలు
వానకురిస్తే ఎండ కోరతాడు
ఎండగాస్తే ఇలా తిడతాడు
మనిషిలాంటోడనే పెట్టాడిన్ని ఋతువులు
వీడితో ఏగలేకనే నేమో ఇక్కడ పారేశారు
◆◆◆◆◆◆◆◆◆◆◆◆
                    తెలుగు రచన..✍


ముందందరికీ హేయమే

◆◆◆◆◆◆◆◆◆
ముందందరికీ హేయమే
రెండో సారి కాస్త భయం
మరోసారనిపిస్తుంది  నయం
తుదికదే నీకు ప్రాణాపాయం
మొదల్లో సోకు కోసం సిగరెట్టు
పొగలు వదలడం స్టయిలన్నట్టు
క్రమంగా అవుతుంది అలవాటు
మానకపోతే శేేటూ,లివరింక చెల్లినట్టు
తాగుడుకు వెనకో చరితున్నట్టు
వాడే చెబుతాడు నిజమన్నట్టు
మొహం చూడు ఉద్దరిస్తున్నట్టు
హలాహలం గళంలో దాస్తున్నట్టు
సగం మంది లవరు మీదికే నెట్టు
కష్టాలు తీర్చే ఔషధ మన్నట్టు
పోతూ ఉంటారు గాని,చూసీచూడనట్టు,
వాళ్ళకీ తెలుసు, లివరు పోయినట్టు.
సౌచాలయాన్ని వెనకకు పెట్టు
ఆ ముందే గుట్కాలమ్మే కొట్టు
నీళ్లు లేకపోయినా సరే నన్నట్టు
ఇవి లేకపోతే చచ్చిపోతామన్నట్టు
ఎవడైనా ముందు సరదాగానే మొదలెట్టు
వ్యసన మవుతుంది లే ఆ అలవాటు
అది నీ ఆరోగ్యము పై  మట్టి గొట్టు
ఇప్పుడైనా విడిచిపెట్టు,లేదంటే నీ ఖర్మన్నట్టు
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
తెలుగు రచన( యలమంచిలి వెంకటరమణ )..

Sunday, July 14, 2019

ప్రయత్నం వెనుకనే ఉంటుంది విజయం

◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ప్రయత్నం వెనుకనే  ఉంటుంది విజయం
ప్రయత్నం నీదైతే, నీ నీడే ఆ సాఫల్యం
ప్రయాసలో అది నీ వెనుకుంటుంది
నువ్వు వెనుదిరిగితే అది ఆగిపోతుంది
నీ అడుగులు వెలుతురు వైపయితే
విజయం ఎపుడూ నీ వెంటే నేస్తం
చీకటివైపు అడుగులు వేస్తూ
నీ కెపుడూ దొరకుదులే విజయం 
◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆◆
                                    ....తెలుగు రచన

ప్రలోభాలు తీర్ధంలో

తెలుగు రచన
09/04/2019
=====================
ప్రలోభాలు తీర్ధంలో
కొత్తకలల వ్యాపారం
వాగ్దానాల పెట్టుబడి
పేదోడితోనే వ్యాపారం
అందనంతెత్తు పథకం
అందుకోలేని ఆకలిపోరాటం
అందుతుందని ఎదురు చూడ్డం
అది మామూలే
వచ్చే ఎన్నికలకెదురుచూడడం
ఒకడు మట్టి జల్లడం
నోట్లో వీడు మట్టిగొట్టడం
మోసపోతున్నామని
తెలిసినా ఏమిజేస్తాం
బేలెట్ పేపరు మొత్తం
పైనుంచి క్రిందకి భ్రష్టం
పరిపాటే కలల వాయిదా
గ్రహాపాటేమో ఆకలి సౌదా
వర్షం వెలిసియేతోంది
వాగ్దానాల పర్వం ముగిసిపోతోంది
మళ్లీ మొదలెడదాం
చెమటతో భూములు తడుపుదాం
భూస్వాములు నిదరోతున్నారు
నెమ్మదిగానే కష్టపదాం
=====================
యలమంచిలి వెంకటరమణ

ప్రలోభాలు తీర్ధంలో

తెలుగు రచన
09/04/2019
=====================
ప్రలోభాలు తీర్ధంలో
కొత్తకలల వ్యాపారం
వాగ్దానాల పెట్టుబడి
పేదోడితోనే వ్యాపారం
అందనంతెత్తు పథకం
అందుకోలేని ఆకలిపోరాటం
అందుతుందని ఎదురు చూడ్డం
అది మామూలే
వచ్చే ఎన్నికలకెదురుచూడడం
ఒకడు మట్టి జల్లడం
నోట్లో వీడు మట్టిగొట్టడం
మోసపోతున్నామని
తెలిసినా ఏమిజేస్తాం
బేలెట్ పేపరు మొత్తం
పైనుంచి క్రిందకి భ్రష్టం
పరిపాటే కలల వాయిదా
గ్రహాపాటేమో ఆకలి సౌదా
వర్షం వెలిసియేతోంది
వాగ్దానాల పర్వం ముగిసిపోతోంది
మళ్లీ మొదలెడదాం
చెమటతో భూములు తడుపుదాం
భూస్వాములు నిదరోతున్నారు
నెమ్మదిగానే కష్టపదాం
=====================
యలమంచిలి వెంకటరమణ

ప్రలోభాలు తీర్ధంలో

తెలుగు రచన
09/04/2019
=====================
ప్రలోభాలు తీర్ధంలో
కొత్తకలల వ్యాపారం
వాగ్దానాల పెట్టుబడి
పేదోడితోనే వ్యాపారం
అందనంతెత్తు పథకం
అందుకోలేని ఆకలిపోరాటం
అందుతుందని ఎదురు చూడ్డం
అది మామూలే
వచ్చే ఎన్నికలకెదురుచూడడం
ఒకడు మట్టి జల్లడం
నోట్లో వీడు మట్టిగొట్టడం
మోసపోతున్నామని
తెలిసినా ఏమిజేస్తాం
బేలెట్ పేపరు మొత్తం
పైనుంచి క్రిందకి భ్రష్టం
పరిపాటే కలల వాయిదా
గ్రహాపాటేమో ఆకలి సౌదా
వర్షం వెలిసియేతోంది
వాగ్దానాల పర్వం ముగిసిపోతోంది
మళ్లీ మొదలెడదాం
చెమటతో భూములు తడుపుదాం
భూస్వాములు నిదరోతున్నారు
నెమ్మదిగానే కష్టపదాం
=====================
యలమంచిలి వెంకటరమణ

తికమిక పడకో అమ్మడు

1813
తెలుగు రచన
23/12/2018
==================
తికమిక పడకో అమ్మడు
తెగ వేదన పడకో తమ్ముడు
చిన్నాపెద్దా ఒకటే..
మరి తేడాలంతగ లేవు.
డేటింగులంటూ లేచిపోవటం,
డైటింగులంటూ పస్తులుండడం.
ఉన్న గుడ్డలు చింపుకోవటం,
పేషన్లంటూ తిరుగులాడడం.
ఒకటే ఒకటే తమ్ముడు
మరి తేడాలెందుకు అమ్మడు
చింపిరీకలు గాలికొదలడం ,
చింపిరిగుడ్డలు సిగ్గుగప్పటం.
పచ్చిపులుసులో ముంచుకోటం,
పానీపూరీ పోజులివ్వడం.
ఒకటే ఒకటే తమ్ముడు
ఊరకె ఫోజులు అమ్మడు
బ్రెడ్డుముక్కలో పచ్చికూరలు,
బర్గర్ పేషన్ బడా బాబులు .
అజీర్తిరోగం అయ్యోపాపం,
రాగి సంగటి,డైటింగ్ డైటింగ్.
తికమక పడకో తమ్ముడు,
తుదకంతా ఒకటే తమ్ముడు.
గంజీ ఉప్పూ కలిపితాగడం,
సూపని చెప్పి మురిసిపోవడం.
తిండి కోసమని పరుగులెట్టడం,
తిన్నదరగక పరుగుదీయడం.
ఒకటే ఒకటే తమ్ముడు,
మరి తేడాలెందుకు అమ్మడు.
==================
యలమంచిలి వెంకటరమణ

గొంతెత్తి పాడనీ ఈ పాట

............................................
గొంతెత్తి పాడనీ ఈ పాట
పలికే వరకూ ప్రతినోటా
ప్రజ్వల జ్యోతుల వెలిగేదాకా
గొంతెత్తి పాడనీ ఈ పాట
చీకటి ఈ దారుల్లో నను పాడనీ
గమ్యం ఎరుగని పయనాలకు తోడుగ కానీ
వెలుగెరిగని బ్రతుకుల్లో వెలుగును కానీ
గొంతెత్తి పాడనీ ఈ పాట
బ్రష్టాచారం బ్రద్దలగొట్టే బ్రమరం కానీ
ఒంటరి నీతికి గొంతును కలిపి
పాడనీ నన్నిలా పాడనీ
తెలవారని చీకిటిలో వెలుగై పాడనీ
ఎటుబోతుందో తెలియని సామ్యం
ఏమవుతుందో తెలియని లోకం
రగులు వెన్నెల ప్రభల గీతమును
ఇలాపాడనీ నన్నుపాడనీ ఇంకాపాడనీ
ఇంకా నన్నే ఇలా పాడనీ
............................................
                         తెలుగు రచన

వేలుగెరుగని ఉదయం

వేలుగెరుగని ఉదయం
=====================
రగిలే కడుపుకు ఓదార్పు మంత్రం
ప్రజలే రాజ్యం - ఇది ఒక సోధ్యం
తృణమో పణమో బ్రతికుంచడమే
ప్రజలకు పాపం రాజుల వరము
చెమటకు నిండని కడుపుల భారం
కన్నీరందుకు సాయం సాయం
సీతలపానుపు గోడలు మందం
గోడే వినని రాజుల వైనం
అదిగో కాంతి తూరుపునుదయం
అంతే వేగం పడమటి పయనం
వెలుగే ఎరుగని చీకటి బ్రతుకు
పడమటిలోనే సూర్యోదయము
సూర్యోదయము సూర్యోదయము
సూన్యం సూన్యం అంతా సూన్యం
ఆవిరికాని చెమటలకీగతి
సమాధి పాపం విశ్రాంతి మఠము
=====================
●●●●●●●●య.వెంకటరమణ
=====================
రగిలే కడుపుకు ఓదార్పు మంత్రం
ప్రజలే రాజ్యం - ఇది ఒక సోధ్యం
తృణమో పణమో బ్రతికుంచడమే
ప్రజలకు పాపం రాజుల వరము
చెమటకు నిండని కడుపుల భారం
కన్నీరందుకు సాయం సాయం
సీతలపానుపు గోడలు మందం
గోడే వినని రాజుల వైనం
అదిగో కాంతి తూరుపునుదయం
అంతే వేగం పడమటి పయనం
వెలుగే ఎరుగని చీకటి బ్రతుకు
పడమటిలోనే సూర్యోదయము
సూర్యోదయము సూర్యోదయము
సూన్యం సూన్యం అంతా సూన్యం
ఆవిరికాని చెమటలకీగతి
సమాధి పాపం విశ్రాంతి మఠము
=====================
●●●●●●●●య.వెంకటరమణ

1805

1805
TELUGU RACHANA
01/11/2018
================================
తీపిధారలొలుకు పలుకు ఛాందస భాష
మధురభావ సుగందమీ తెలుగు భా షా
సంగీతా నాద లయకు శ్రావ్యమైన భాష
తెలుగుభాష తీపిబాష మధువులొలుకు మాతృభాషా
ఆదికవీ నన్నయ్యా అక్షర శ్వాసా
శివకవులు, ఎఱ్ఱన్న తి క్కన్న భాష
శ్రీనాధుడి శృంగారపు కావ్య భాషా
రాయులోరి యుగములోన రాజిల్లిన దీబాషా
వాసుదేవచార్యులూ ఎంచుకున్న ఏకభాష
త్యాగరాజు సృతులుబల్కి,అన్నమయ్య గానమయ్యి
క్షేత్రయ్యా క్షేత్రాలకు కీర్తి నాది తెలుగు భాషా
తెలుగుభాష తీపిభాష మధువులొలుకు మాతృభాషా
రాజశేఖ రాచరితా కందుకూరి నవలభాష
ముత్యాల సరాలుగా గుర జాడా తెలుగుభాష
గిడుగువారు, కట్టమంచి రాయప్రోలు వ్రాసినభాషా
మహమ్మదు శతకంతో  మైత్రి చాటెనీ భాషా
తీపిధార లొలుకు పలుకు ఛాందసబాషా
మధురభావ సుగందమీ తెలుగు బాషా
సంగీతా నాదలయకు శ్రావ్యమైన బాష
తెలుగుభాష తీపిబాష మధువులొలుకు మాతృభాష
===============================+==
యలమంచిలి వెంకటరమణ..✍

కష్టమ్సుంటాయ్-కాంట్రోల్సుంటాయ్

=======================
కష్టమ్సుంటాయ్-కాంట్రోల్సుంటాయ్
రైల్వేలో అవి  కనబడ కుంటాయ్
పొద్దు న్నన్నం రాత్రికి పొట్లమ్
పచ్చ నోటుకు  తక్కువ లేదు
చేతి కందితే కడుపు కందదు
కడుపు కందితే చేటి కంటదు
“ఇంతేనోయి తింటే తినవోయ్”
రైల్వే నినాద మిది యంటండోయ్ 
కోట్ల ఖర్చుతో  వాటర్ ప్లాంట్లు
స్టేషన్నిండా కుళాయి స్పాట్లు
బొట్టే రాలని బడాయి కుళాయి 
బోటిల్ రేటు ఇరవయ్యండోయ్
వంద కమ్మిన్నా అడిగే దెవరు
గొంతు కెండితే కొన కేంజేతురు
నీ రొకటేనా నీటూ ఉండదు
స్వశ్చభారత్ అది వీధుల్లోనే
ఫోటో ఫోజులు పేపర్లోనే
గబ్బు నిండినా బాతురూములు
శుభ్రతలుండవు సుతరామైనా.
వరసకు ముగ్గురు వసూలు కోసం
పోయొస్తే మరి  పది(రు.10)కట్టేయి 
రోగాలు భద్రం  అవి  మనకోయి
నూట పాతికా కోట్లమందిలో
పాతిక కోట్లే డబ్బున్నోళ్ళు
ముందో రెండు, వెనకో రెండు
జనరల్ బోగీ లంతే నండోయ్
పట్టకపోయిన కుక్కుకు చావు
రైల్వే వాళ్లకు డబ్బులు చాలు
సీట్ల సంఖ్య మరి డబ్బై రెండే
వెయిటింగు సీట్లు వందల్లోనే 
క్లియరెన్సు కావు – ఊరొచ్చింది
పదరా పోదాం – డబ్బులు రావు
=======================
           యలమంచిలి వెంకటరమణ

వయసుతో వచ్చిందైనా

=================
వయసుతో వచ్చిందైనా
పదవు లది తెచ్చిందైనా
పెద్దిరకం చాలా చెడ్డది
చాలా చెడ్డది పెద్దిరకం
నిశ్చింతగ నిదరోనివ్వదు
నిత్యం ఏదో చింతనలోనే
నిలకడ ఎరుగదు పెద్దిరకం
చాలా చెడ్డది పెద్దిరకం
దూదూ పుల్ల దుక్కుడు బిళ్ళ
ఇంచక్కా మరి ఆడనీయదు
ఆడే ఆటలు చూడనీయదు
చాలా చెడ్డది పెద్దిరకం
చెడుగుడు ఆటలు చెడగొట్టే
చెరువు గట్టునూ విడగొట్టే
చెరుకు ముక్కలు,చేలో ఆటలు
చెడడొట్టింది,చెడగొట్టింది పెద్దిరకం
రుపాయిలేమో దేవుడికెరుక
రూపాలు మొత్తం మార్చేసింది
లేపా ళాకులు, బుడగ లాటలు
గుడుగుడు గుంచం మటుమాయం
వీధి పిల్లలు గోళీ ఆటలు
ఏదీ పట్టని నానమ్మ మాటలు
ఎండా వానా ఎవరికి లెక్క
బలేటి బాల్యం అయ్యో మాయం
ఆటా పాటకు ఆటంకం
అంతస్థులతో ఇరకాటం
ఆడనీయదు,ఏడ్వనీయదు
ఎంత చెడ్డదీ పెద్దిరకం
ఎంత చెడ్డదీ పెద్దేషం।।
==================
........................ య.వెంకటరమణ

మురిపించే అందాలను ఎలా ఓర్వను

===================
మురిపించే అందాలను ఎలా ఓర్వను
చందెపొద్దు గూకు వరకు ఎలా ఆగను
నీ నీలి కన్నుల్లో నన్ను దాగనీ
అదిరేటి అదరాలకు రంగులద్దనీ
దోబూచీ ఆటలాడు  పూబంతుల సోకులు
తెరమాటున దాగిఉన్న దొరసాని సొంపులు
దరహాసపు అదరాల జాలువారు మకరందం
మరీ మరీ మురిపించే చంద్రబింబ వాలకం
ఎలా ఎలా ఎలా నిలువను
మురిపించే అందాలను ఎలా ఓర్వను
కలకాలం తోడుంటా నన్ను చేరనీ 
వెన్నెలంటి మనసులో నన్ను ఉండనీ
నరజానా నిన్ను జూడ కనులుజాలవే
వరమిస్తే నిన్ను తప్ప నేను కోరనే
  
ఎరుపెక్కిన చెక్కిలిపై చిలకెంగిలి పడదుగా
మధువొలికే పెదవులను తుమ్మెదలు తాకవుగా
లేలేత పూకొమ్మల నడిమధ్యన చోటిస్తే
సేద దీర్చుకోవాలను చిలిపి కోరిక
తొలిపొద్దు పొడుపులో చలికాగే మక్కువ
ఎలా ఎలా ఎలా నిలువను
మురిపించే అందాలను ఎలా ఓర్వను
=====================
.....................య.వెంకటరమణ

మురిపించే అందాలను ఎలా ఓర్వను

===================
మురిపించే అందాలను ఎలా ఓర్వను
చందెపొద్దు గూకు వరకు ఎలా ఆగను
నీ నీలి కన్నుల్లో నన్ను దాగనీ
అదిరేటి అదరాలకు రంగులద్దనీ
దోబూచీ ఆటలాడు  పూబంతుల సోకులు
తెరమాటున దాగిఉన్న దొరసాని సొంపులు
దరహాసపు అదరాల జాలువారు మకరందం
మరీ మరీ మురిపించే చంద్రబింబ వాలకం
ఎలా ఎలా ఎలా నిలువను
మురిపించే అందాలను ఎలా ఓర్వను
కలకాలం తోడుంటా నన్ను చేరనీ
వెన్నెలంటి మనసులో నన్ను ఉండనీ
నరజానా నిన్ను జూడ కనులుజాలవే
వరమిస్తే నిన్ను తప్ప నేను కోరనే
 
ఎరుపెక్కిన చెక్కిలిపై చిలకెంగిలి పడదుగా
మధువొలికే పెదవులను తుమ్మెదలు తాకవుగా
లేలేత పూకొమ్మల నడిమధ్యన చోటిస్తే
సేద దీర్చుకోవాలను చిలిపి కోరిక
తొలిపొద్దు పొడుపులో చలికాగే మక్కువ
ఎలా ఎలా ఎలా నిలువను
మురిపించే అందాలను ఎలా ఓర్వను
=====================
.....................య.వెంకటరమణ

త్వరపడకపోతే తెల్లారిపోతోంది

1831
తెలుగు రచన
08/06/2019
===============================
త్వరపడకపోతే తెల్లారిపోతోంది   సామరస్యం
నిలబడకపోతే నిర్వాణమైపోతోందీ మానవత్వం
ప్రభలమవుతోంది ప్రలోభ వ్యూహం
ప్రభాలమవుతూనే ఉంది ప్రలోభ వ్యూహం

హలం పొలంలోనే అల్లాడిపోతుంది
కళ్ళం కన్నీటితో తడిసిపోతోంది
మొసలి కన్నీరుతో ముఖం తుడిచేయంత్రాంగం
మొదలికే ముసలం మసిబూసే మాయాజాలం
మింగుడుబడని ముద్దలతో కర్షకమదనం

కులపిచ్చుకలిప్పటికే గూళ్ళు కట్టుకున్నాయి
సరిహద్దుల గోడలపై గుండు పిల్లి పచారాలు
గాలి కూగుతూ కుల పిచ్చుగ్గోళ్ళు
మదిరి కూగుతూ మన పిచ్చోళ్ళు

దేశాలు విడిపోయాయి పోతే పోనీయ్ అనుకున్నాం
రాష్ట్రాలిడిపోయాయి పోతే పోనీయ్ అనుకున్నాం
మనుషులనే విడగొడుతున్నారయ్యో అయ్యో
విడగొడుతున్నారయ్యో అయ్యో
===============================
యలమంచిలి వెంకటరమణ

Thursday, July 11, 2019

గీత-3 మహాభారతం-సమ సమవాయుల పోరాటం

గీత - 3
తెలుగు రచన
11/07/2019
======================
పల్లవి:
మహాభారతం-సమ సమవాయుల పోరాటం
ఇదిసంగ్రామం-కురు ధర్మాలా  మహాక్షేత్రము
చరణం:
భావరూపుడు భీముని సైన్యం
కరుణారూపుడు పార్ధుని సౌర్యం
వీరుడు శూరుడు సాత్వికుమారుడు
సాత్వకి విరాట  ద్రుపదరాజులు
కామరూపుడు కాశీరాజు
ఉత్తమౌజుడు యుదామన్యుడు
సుభద్ర పుత్రుడు వీరాభిమన్యుడు
అదిగో అదిగో శంకారావం
సారధి కృష్ణుని పాంచజన్యము
            !!మహాభారతం!!
భ్రమరూపుడు భీష్మునిసైన్యం
దుర్యోధనుని మోహం సారథ్యం
కర్ణుని విజాతి  కర్మరూపము
మోహం నిండిన కౌరవసైన్యం
ఆశక్తిరూపుడు అశ్వత్థాముడు
భ్రమయైన శ్వాస భూరిశ్రవుడు
ద్వైతాచరణా ద్రోణాచార్యుడు
కామంక్రోధం మొహంనిండిన
కౌరవసైన్యం
ప్రకృతి ప్రలోభ సింహా:న్నాధము
            !!మహాభారతం!!
కపిలఃస్థూపం పార్ధునిరథము
పరితాపములో అర్జునవదనం
అన్నలుతమ్ములు తాతలుమామలు
ఎవరిని చంపెదనో కృష్ణా
కులమునుచంపెడు ఈరణము
ఎవరికోసమిక ఈ విజయం
వలదీరాజ్యం వలదీసౌఖ్యం
వలదే వలదని విలవిలలాడెను అర్జున హృదయం
            !!మహాభారతం!!
======================
యలమంచిలి వెంకటరమణ

గీత-2 ఆత్మ ఒక్కటే శాస్త్రం, ఆ ఆత్మ ఒక్కటే జీవం

గీత-2
తెలుగు రచన
09/07/2019
======================
పల్లవి:
ఆత్మ ఒక్కటే శాస్త్రం, ఆ ఆత్మ ఒక్కటే జీవం
పరమాత్మ ఒక్కడే శాశ్వతం, ఇది గీత చెప్పినా వాస్తవమూ
ఆత్మ ఒక్కటే శాస్త్రం, ఆ ఆత్మ ఒక్కటే జీవం
పరమాత్మ ఒక్కడే శాశ్వతం, ఇది గీత చెప్పినా వాస్తవమూ
చరణం:
గీత ఒక్కటే జాతీయ శాస్త్రం, గీత ఒక్కటే యదార్ధ అస్త్రం
ఉచ్చా నిచ్చా భేదాలు లేని, విశ్వశాంతికిది ప్రబోధ గీతం
జననా మరణాం భయముల నుండి ఉద్ధరించేడి ఏకైక మార్గం
భవసాగర తీరాలను దాటించే వాహనము భగవద్గీతా ప్రభోదము
          !!ఆత్మ ఒక్కటే శాస్త్రం,!!
చరణం:
జ్ఞానమొక్కటే ఆత్మప్రకాశం,యోగాగ్నికి ఆహుతి ఇచ్చును యజ్ఞం
యోగసాధనా కార్యం యజ్ఞం, యజ్ఞకార్యమే క్షర్మయోగము
ప్రాణాయామా పారాయణము, శ్వాసా గతులను నిలిపే యాగం
యజ్ఞము జేయని మనిషి వ్యర్థము, మరిలేదిక మనిషి జన్మము
         !!ఆత్మ ఒక్కటే శాస్త్రం,!!.
చరణం:
యజ్ఞా నియమము వదలి, కల్పిత నియమము కలిగి
ఆచరించెడి యజ్ఞము కూడా, కౄర కర్మలకు తార్కాణం
అట్టివారినే అధములు యందురు, పాపాచారులు వారు
మహాపురుషులు వారేవారు, పరిపూర్ణ భావా కర్మాచారులు
          !!ఆత్మ ఒక్కటే శాస్త్రం,!!
======================
యలమంచిలి వెంకటరమణ

గీత-1 గీతజెప్పినా సత్యం ఒకటి

గీత-01
తెలుగు రచన
08/07/2019
======================
శ్లోకం లా :
*సర్వ వేదోపనిషత్తు సారాంశం.*
*సర్వేజన విరవిత పవిత్రగ్రంధం.*
*ఏకం,శాస్త్రం దేవకీపుత్ర గీతం.*
*శ్రీమద్ భగవద్గీతా సారాంశామ్*
" *మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః*
*మానవులంతా ఈశ్వరపుత్రులు  భగవద్గీత తెలిపినసత్యం*"
పల్లవి:
గీతజెప్పినా సత్యం ఒకటి
మానవ జాతులు రెండే రెండు
రక్కస గుణములు రాక్షసజాతి
దేవగుణముల దేవత జాతి
చరణం:
శరీరమంతా ఒకటే క్షేత్రం
హృదయం అందొక దేశందేశం
దైవసంపద నిండిన మనసే ధర్మక్షేత్రం
అసురసంపదా బహుళక్షేత్రమే కురుక్షేత్రము
                   !!గీతజెప్పినా!!
చరణం!!
తనకుతానుగా తెలుసుకున్న సత్యం
పరమాత్మకు తాను వేరగు మర్మం
ద్వైతాచరణే ద్రోణాచార్యులు
ఇరుప్రవృత్తుల ఈ సంఘర్షణము
గురు శ్రీకృష్ణుని యోగఃప్రాప్తము
                   !!గీతజెప్పినా!!
చరణం!!
సకలరోగములకు మోహమ్మూలం
దూషిత ధనమే దుర్యోధన భావం
దూషోహోత్పన్నం మోహం మోహం
కానేకాదు కఠినం కఠినం సర్వేశ్వరుని  యోగఃప్రప్రాప్తం
                   !!గీతజెప్పినా!!
======================
యలమంచిలి వెంకటరమణ

Sunday, July 7, 2019

1851 పరమాత్మ ఒక్కడే శాశ్వతం, ఇది గీత చెప్పినా వాస్తవమూ ఆత్మ

1851
తెలుగు రచన
07/07/2019
పల్లవి:
ఆత్మ ఒక్కటే శాస్త్రం, ఆ ఆత్మ ఒక్కటే జీవం
పరమాత్మ ఒక్కడే శాశ్వతం, ఇది గీత చెప్పినా వాస్తవమూ
ఆత్మ ఒక్కటే శాస్త్రం, ఆ ఆత్మ ఒక్కటే జీవం
పరమాత్మ ఒక్కడే శాశ్వతం, ఇది గీత చెప్పినా వాస్తవమూ
చరణం:
గీత ఒక్కటే జాతీయ శాస్త్రం, గీత ఒక్కటే యదార్ధ అస్త్రం
ఉచ్చా నిచ్చా భేదాలు లేని, విశ్వశాంతికిది ప్రబోధ గీతం
జననా మరణాం భయముల నుండి ఉద్ధరించేడి ఏకైక మార్గం
భవసాగర తీరాలను దాటించే వాహనము భగవద్గీతా ప్రభోదము
          !!ఆత్మ ఒక్కటే శాస్త్రం,!!
చరణం:
జ్ఞానమొక్కటే ఆత్మప్రకాశం,యోగాగ్నికి ఆహుతి ఇచ్చును యజ్ఞం
యోగసాధనా కార్యం యజ్ఞం, యజ్ఞకార్యమే క్షర్మయోగము
ప్రాణాయామా పారాయణము, శ్వాసా గతులను నిలిపే యాగం
యజ్ఞము జేయని మనిషి వ్యర్థము, మరిలేదిక మనిషి జన్మము
         !!ఆత్మ ఒక్కటే శాస్త్రం,!!.
చరణం:
యజ్ఞా నియమము వదలి, కల్పిత నియమము కలిగి
ఆచరించెడి యజ్ఞము కూడా, కౄర కర్మలకు తార్కాణం
అట్టివారినే అధములు యందురు, పాపాచారులు వారు
మహాపురుషులు వారేవారు, పరిపూర్ణ భావా కర్మాచారులు
          !!ఆత్మ ఒక్కటే శాస్త్రం,!!

1775

1775
తెలుగు రచన
07/07/2018
=================
పనిచేసేవానికి కాలం చాలదు
పనిలేని వానికి కాలం గడవదు
కాలం చాలా చెడ్డది నిన్ను ముంచేస్తుంది
కాలం చాలా గొప్పది నిను లేపేస్తుంది

కాలం చాలా చెడ్డది నిన్ను ముంచేస్తుంది
కాలం చాలా గొప్పది నిను లేపేస్తుంది
గతమై నిన్ను వెక్కిరిస్తుంది
భవితై నిన్ను హెచ్చరిస్తోంది

భవితై నిన్నై హెచ్చరిస్తోంది
ప్రశ్నమీద ప్రశ్నలడుగుతుంది
పతనమైతే ఫలితమేముంది
బ్రతుకరానీ బడవడంటుంది

రేపు కోసం చూసి చూసి లోకమెళ్ళింది
రేపనేటి రేపురాక నేడెబోయింది
హాయినిచ్చును నిదుర నిజమండి
నిదుర పోతే గతం గతమండి

సూన్యమందున చుక్కలేనోయ్
లెక్కకందవు మక్కువేలోయ్
ఆ ఒక్కడంటే నీవుగానీ
మొత్తమంతా సున్నాలేనోయ్

పరుగుదీయ్ నువ్వురకదీయ్
మందమారక నడకజేయ్
నిలిచిపోతే నిలువదోయి
కాలమది మరి యువత నీవోయ్
=================
యలమంచిలి వెంకటరమణ.. ✍

Friday, July 5, 2019

కవిత వ్రాయాలని ఉంది

1846
తెలుగు రచన
25/06/2019
==================
కవిత వ్రాయాలని ఉంది
నాకో కవిత వ్రాయాలని ఉంది
కన్నీటి ధారలు కలంనింపి
నాకో కవిత వ్రాయాలని ఉంది

ఉదరమంటిన వెన్నుమకపై
బరువుమోపి మోయలేక
చెమటలోడ్చే బడుగు స్వేదం
సిరా నింపిన కలంతో

నొక్క కవితను ఇప్పుడన్నా
నొక్కి వ్రాసే మక్కువుంది

పట్టెడన్నం పొట్టకందక
పొదలమాటున మల్లెపూలు
రక్తసిక్తపు ముళ్లపానుపు
ఒకో చుక్కా కలం నింపి

నొక్క కవితను ఇప్పుడన్నా
నొక్కి వ్రాసే మక్కువుంది

దగాకోరుల మదంకోరల
కాటుపడ్డా కడుపుమోసి
కాలమేగతి కస్సుగంప
బావిపౌరుల పుస్తకంలో

నొక్క కవితను ఇప్పుడన్నా
నొక్కి వ్రాసే మక్కువుంది

హద్దులేని ఆకశంలో
అంతులేని ఆసురతత్వం
అంతమొందే అక్షరాలను
చట్టమయ్యే పొత్తకంలో

నొక్క కవితను ఇప్పుడన్నా
నొక్కి వ్రాసే మక్కువుంది

అవిటివానికి అవిటిపిల్లలు
చెవిటివానికి చెవిటిపిల్లలు
ఇప్పుడైనా మూగవాడు
నోరువిప్పి నారదీసే

నొక్క కవితను ఇప్పుడన్నా
నొక్కి వ్రాసే మక్కువుంది

మానవత్వం మొలకలొచ్చే
విత్తమొక్కటి వెతికి వెతికి
అక్షరాలా ఎరువుగా నొక
కొత్తతోటకు అంకురార్పణ

నొక్క కవితను ఇప్పుడన్నా
నొక్కి వ్రాసే మక్కువుంది
==================
యలమంచిలి వెంకటరమణ

గొంతెత్తి పాడనీ ఈ పాట పలికే వరకూ ప్రతినోటా

............................................
గొంతెత్తి పాడనీ ఈ పాట
పలికే వరకూ ప్రతినోటా
ప్రజ్వల జ్యోతుల వెలిగేదాకా
గొంతెత్తి పాడనీ ఈ పాట

చీకటి ఈ దారుల్లో నను పాడనీ
గమ్యం ఎరుగని పయనాలకు తోడుగ కానీ
వెలుగెరిగని బ్రతుకుల్లో వెలుగును కానీ
గొంతెత్తి పాడనీ ఈ పాట

బ్రష్టాచారం బ్రద్దలగొట్టే బ్రమరం కానీ
ఒంటరి నీతికి గొంతును కలిపి
పాడనీ నన్నిలా పాడనీ
తెలవారని చీకిటిలో వెలుగై పాడనీ

ఎటుబోతుందో తెలియని సామ్యం
ఏమవుతుందో తెలియని లోకం
రగులు వెన్నెల ప్రభల గీతమును
ఇలాపాడనీ నన్నుపాడనీ ఇంకాపాడనీ
ఇంకా నన్నే ఇలా పాడనీ
............................................

                         తెలుగు రచన

అయోడిన్ పేరుతో లవమమ్మేస్తున్నారు

1838
తెలుగు రచన
19/06/2019
======================
అయోడిన్ పేరుతో లవమమ్మేస్తున్నారు
శుద్ధి పేరుతో నీళ్ళమ్మేస్తున్నారు
క్షీరం పేరుతో విషమమ్మేస్తున్నారు
సేవపేరుతో నమ్మకాన్నమ్మేస్తున్నారు

సేంద్రీయమంటూ చెత్తనమ్మేస్తున్నారు
శోధనాణాళికలంటూ ఇద్రియమమ్మేస్తున్నారు
అభివృద్ధిపేరుతో కాలుష్యమమ్మేస్తున్నారు
సమానత పేరుతో సామరస్యాన్నే అమ్మేస్తున్నారు

యోగ్యతపేరుతో విద్యనమ్మేస్తున్నారు
వైద్యంపేరుతో అవయవాలమ్మేస్తున్నారు
దేవుడిపేరుతో బూడిదనమ్మేస్తున్నారు
వాళ్లే కాదు మనమూ అమ్మేస్తున్నాము

అగ్రగణ్యమోజులో బాల్యాన్నమ్మేస్తున్నాం
సంపాదనమత్తులో సంస్కారాన్నమ్మేస్తున్నాం
ఆశలవలయంలో నీతినమ్మేస్తున్నాం
మానవత్వం చంపుకుని మనల్ని మనమే అమ్ముకుంటున్నాం

అమ్మేస్తూనే కొనిదెచ్చుకుంటున్నాం
ప్రకృతినెదిరించి ముప్పుదెచ్చుకుంటున్నాం
వ్యసనాలకుబోయి రోగాల్దెచ్చుకుంటున్నాం
వసూలుకుబోయి వడ్డీల్జెల్లించుకుంటున్నాం

కోల్పోతూనేఉన్నాం అయినా దెచ్చుకుంటున్నాం
వర్గాలపేరుతో వైషమ్యాల్దెచ్చుకుంటున్నాం
అమ్ముకుంటున్నాం,కొనుక్కుంటున్నాం
దెచ్చుకుంటున్నాం చావుకొనిదెచ్చుకుంటున్నాం
======================
యలమంచిలి వెంకటరమణ

1852

లలిత కళా స్వతి సమనస గీ...తీ
మధుర మయా శృతి ఓ రా.
గలహారీ
లలిత కళా స్వతి సమనస గీ...తీ
మధుర మయా శృతి ఓ రా.
గలహారీ

కోనేటి గలగల ప్రవాహ స్వరామో
కావేరు గంగా ప్రవాహ ధ్వనియో
కోమలదళ కొనల జారిన హిమబింధు
అది నీవేనేమో నీవే నీవే నీవేనేమో

                   !!లలిత కళా!!
నేలనురాలిన ఎండుటాకుకు రాగం నేర్పిన
ఆ..స్వర గమకము అదినీవే నీవేనేమో
బహుశాశిలలకు ప్రాణంపొసే సరగమలవి నీవేమో
లావణ్య లలితా గానము నీవే నీవేనేమో
                   !!లలిత కళా!!

1849

1849
తెలుగు రచన
27/06/2019
======================
చల్లని గాలీ, పచ్చని వనము
కోమలపుష్పా పరిమళ శోభలు
కిలకిల రావపు ఎగిరే పక్షులు
ఎదలు పరవశం ఇది మన స్వర్గం

ఏడురంగులింద్రధనుసు నీలాకాశం
అంతరిక్షపానుపులా అదిగో మేఘం
తొంగి తొంగి ఓరకంట ఆ రవికిరణం
ఇదే ఇదే ..ఇది మన స్వర్గం

కొత్తచీర కట్టుకున్న పుడమి సోకులు
నడిఒడ్డు నాంచారి కొప్పున పూలు
హొయలొలికే ఒయ్యారుల కడవబారులు
కంకిచేను అరపమీద కంతిరోడి చూపులు

ఎక్కడో దూరాన ఎంకిపాటలు
చంకనెత్తుకున్న తల్లి లాలిపాటలు
గుడిగంటలు జేగంటలు చంగుచంగు జడగంటలు
ఇలస్వర్గం మజరమహి  విరళసోయగం

చల్లని గాలీ, పచ్చని వనము
కోమలపుష్పా పరిమళ శోభలు
కిలకిల రావపు ఎగిరే పక్షులు
ఎదలు పరవశం ఇది మన స్వర్గం
======================
యలమంచిలి వెంకటరమణ

1829

తెలుగు రచన
09/04/2019
========================
ప్రలోభాలు తీర్ధంలో
కొత్తకలల వ్యాపారం
వాగ్దానాల పెట్టుబడి
పేదోడితోనే వ్యాపారం

అందనంతెత్తు పథకం
అందుకోలేని ఆకలిపోరాటం
అందుతుందని ఎదురు చూడ్డం
అది మామూలే
వచ్చే ఎన్నికలకెదురుచూడడం

ఒకడు మట్టి జల్లడం
నోట్లో వీడు మట్టిగొట్టడం
మోసపోతున్నామని
తెలిసినా ఏమిజేస్తాం
బేలెట్ పేపరు మొత్తం
పైనుంచి క్రిందకి భ్రష్టం

పరిపాటే కలల వాయిదా
గ్రహాపాటేమో ఆకలి సౌదా
వర్షం వెలిసియేతోంది
వాగ్దానాల పర్వం ముగిసిపోతోంది

మళ్లీ మొదలెడదాం
చెమటతో భూములు తడుపుదాం
భూస్వాములు నిదరోతున్నారు
నెమ్మదిగానే కష్టపదాం
=====================
యలమంచిలి వెంకటరమణ

1826

1826
TELUGU RACHANA
03/02/2019
=======================
కృషిచేయక సాధించున దేముంది
కష్టపడితే ఫలితం రాకేమవుతుంది
అవరోదాల తోటలో స-ఫలమే ఉంటుంది
సుత్తిదెబ్బలు గాచి రాయి దేవుడవుతుంది

అరిగిననకే చూడు రాయి వజ్రమవుతుంది
వజ్రమంత మెరుపు ఇంకెక్కడుంది
సూదిపోట్లు తిని పువ్వు దండ అవుతుంది
దండ చేరిన పూవు కెంతయిన విలువుంది

వేరు దిగిన చెట్టుకేమిటయ్యా భయము
గాలి మేడలు కూల పడుతుందా సమయమ్ము
కుదురు పైన కడవ కదలదెపుడు
మోపు లేని పనులు మొదలకంతే మిగులు

మనిషికొకనికేను యోచించు వరము
యోచించి వెచ్చించి నొచ్చులాభమ్ము
బొత్తిగేమీ లేక గొప్పలేలట నిడువు
పరిమళించే పూవు పలుకకున్నా నెలవు
=======================
....యలమంచిలి వెంకటరమణ