Wednesday, July 24, 2019

విప్లవమంటే కాదోయి విధ్వంసానికి ఓంకారం

******క్రొత్త సంవత్సరంలో మొదటి రచన*******
==================================
విప్లవమంటే కాదోయి విధ్వంసానికి ఓంకారం
విప్లవమంటే కాదోయి నాశనానికి శ్రీకారం
విప్లవమంటే కాదోయి ఉన్నవాటిని తగలబెట్టడం
విప్లవమంటే కాదోయి కాలే కడుపున నిప్పుబెట్టడం
విప్లవమంటే కానే కాదోయ్ నిప్పులు గక్కే చేతికాగడా
విప్లవమంటే కానే కాదోయ్ కక్కుళ్ళు లేని కొడవలి వాటం
గొప్పకు చెప్పే సిద్ధాంతం, గుట్టుగ చేసే రాజకీయము
ఆకలి తీరని ఆరాటం, ఆశలు చూపే పోరాటం
రంకెలు వేస్తూ జనం తిరగడం, జనం నోటిలో మట్టి గొట్టడం
అంకినకాడికి నుల్లుకోవడం, ఒకరిని ఒకరు చంపుకోవడం
చంపుకోవడం, చచ్చి బ్రతకడం కానే కాదోయ్ పోరాటం
కానే కాదోయ్ పోరాటం చచ్చే వాళ్ళను మరీ  చంపడం
చైతన్యం అది కాదోయ్ జండా పట్టుకు గంతులేయడం
కానే కాదోయ్  చైతన్యం కాలే కడుపుల నిప్పుబెట్టడం
చదువూ సంధ్యా లేనివారిని అయ్యో పాపం అదిమిపెట్టడం
అమరవీరులను పేరులు పెట్టి అడవుల మధ్య పూడ్చిబెట్టడం
పల్లెల్లేందుకు జండాలు, పేరుకు పాపం జనాలు వాళ్ళు
జ్వరాల తల్లిని వరాలు కోరే వైద్యం ఎరుగని జనాలు వాళ్ళు
నరాలు తప్పా కణాలు లేని గడియలు గుణించు మనుజులు వాళ్ళు
మచ్చుక్కూడా అచ్చరమెరుగరు రెచ్చగొట్టడం కాదది భావ్యం
స్పష్టత లేని బ్రష్టుల్లారా, బ్రష్టం నాటిన మొక్కల్లారా
ఎప్పటిదాకా హీంసా మాంద్యం, మేలే లేని ఈ పోరాటం
చెట్టానల్లే పెరిగిన బ్రష్టం కప్పేస్తుందీ జనాల పాపం
కాగడ దివిటీ చేసేద్దాం, దారులు వారికి చూపిద్దాం
కొడవలి పదునుకు పంపిద్దాం, సేద్యం చేసే పనుకుందాం
అక్షరమెరుగని అభాగ్య జీవుల అక్కులు నేర్చే చైతన్యం
అక్కులు నేర్చే చైతన్యం, హక్కులు పొందే సౌకర్యం
పోరాటంగా సాగిద్దాం, చైతన్యాయానికి ఇది అర్ధం.
===================================
............... తెలుగు రచన యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment