Friday, July 5, 2019

1825

1825
TELUGU RACHANA
02/02/2019
========================
పరుగులాటలో ప్రాణం అలసిపోయింది
అవస్థల వస్త్రం చినిగిపోయింది
ఈ మనిషి ఆవేదనిలా చల్లారింది
నిన్నటి ఆశలు నేడు దహనమయ్యాయి
రేపటి చింతనలిక చెల్లిపోయాయి
పంచనామాతో తన పేరు మారిపోయింది
నిన్నటి పిలుపు నేడు శవమయ్యింది
వీలునామాలు చెల్లుబాటుకొచ్చాయి
మనుగడ వెనుకబాట పట్టింది
జ్ఞాపకాల పుస్తకం ఒకో పేజీ   వెనుదారి తీసింది
శతమానం భవతి ఆశీస్సులు
అశ్రునయన ఆమె మనసు వికలమయ్యింది
ఈతని జీవిత పుస్తకంలో మొదటిపేజీ
జ్ఞాపకాల తిరగవేతలో చివరిపేజీ
తల్లి ప్రేగు కళుక్కుమంది
ఏడుపుతో మొదలైన ఈ పుస్తకం
ఏడిపిస్తూ కడకు ముగిసింది
ఎక్కడో దూరాన నక్కల అరుపులు
చెట్టు కొమ్మల కదలికలో అతని ఉనికి చూపులు
నిన్నటివరకు ఇతనే వీరందరికీ ధైర్యం
నేడా అందరికి తానంటే భయం
అంతస్తులు బేలపోయాయి
ఆనవాళ్లు ఆసిడ్ తో చెరపబడ్డాయి
ఆస్తులు కుదించుకుని ఆరడుగులు మిగిలాయి
ఇతడే...ఇతడే......
నిన్న మన సమాధి దాటుకెళ్ళిందితడే
ఎవరన్నారో తెలీదు
నాకనిపించింది
బహుశా.. ఈతడు అని ఉంటాడు
రేపు నేను కూడా మరొకరిని నిలదీస్తానిలానే అని
అంతలోనే కాకుల కోసం కొడుకుల వెతుకులాట
తాననుకొని ఉండడు బహుశా
కాకితో కూడా తనకు పనుంటుందని
నా స్థానంలో ఇప్పుడా కాకుంటుందని
========================
ఏమో ఇలా వచ్చేసింది వ్రాసేసాను
========================
తెలుగు రచన
=========

No comments:

Post a Comment