Friday, July 5, 2019

1577

1577
తెలుగు రచన
15/09/2017
=================
దేవుడే నేలకు దిగి వస్తే
ప్రియా నీవా దేవునికగుపిస్తే
ఇం తందం ఎవరికిచ్చారని
చింతనలో పడతాడేమో.

తేనె పట్టు జారి చినుకు
నీ అదరాలను తాకినంత
తన మధురం మరిచి మరీ
నీ మధురం మరుగునేమో

నీ నడక చూసి హంసలు,
ఈ నడక నేర్ప లేదేమని,
తమ తల్లి నడుగకుండునా.
తల్లిహంస నడక నేర్వ నిన్ను చేరకుండునా

నీ స్వరం విన్న తామ్ర తీగ
స్వరం మార్చుకోవాలని
తపన చెందకుండునా
నీ స్వరం నేర్వకుండునా

అందంలో నేను కదా
ఇంతందమెలా వచ్చెననీ
చందమామ చిన్నబోయి
వెన్నెలీయ మరుచు నేమో

మొక్క నిడిచి కొప్పుజేరి
గొప్పలు బోతున్నవిలే
గొప్ప గొప్ప పూలు కూడ
విస్తుబోవకుండవులే

దేవుడే నేలకు దిగి వస్తే
ప్రియా నీవా దేవునికగుపిస్తే
ఇం తందం ఎవరికిచ్చారని
చింతనలో పడునులే!!
==================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment