Friday, July 5, 2019

కార్మికులారా కర్షకులారా

1835
తెలుగు రచన
11/06/2019
====================
కార్మికులారా కర్షకులారా
శ్రమించి ద్రవించు దమనుల్లారా
మాసిన గుడ్డా, మట్టిచేతుల
పురోగాయామి ప్రవలుల్లారా

శ్రమైకజీవన సాక్షులు మీరై
నిరాశచెందని యోధులు మీరై
నిస్పృహ నడుమ నిట్టూర్పులతో
నెట్టుకుబోయే యువతకు మీరో

మేలుగొలుపులై వెలుగుదారులై
వాడిన మొక్కకు చిగురులు మీరై
వెలుగులు జూపే కాగడ మీరై
యుద్ధం నేర్పండదిగో సైన్యం

కత్తీ కొడవలి, సుత్తీ సీనం
ఆయుధగారం అది మన స్వాస్థ్యం
తెలతెలవారుతు అదిగో ఉదయం
తరిమికొట్టగా దరిద్ర దెయ్యం

అమాసలోనా ఆర్తనాదం
ఎన్నాళ్లింకా మనకీ దైన్యం
ఎవరొస్తారని ఎదురు చూపులు
వెన్నెల కాస్త,అమాస మలుపులు

కర్మాగారపు క్రాంతిని చూద్దాం
సస్యశ్యామల దేశం చూద్దాం
కాగడలోనా తైలం పొద్దాం
వెలుగు దారుల పదండిపోదాం
====================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment