Wednesday, July 24, 2019

మంచి రోజులొచ్చేసాయ్

=========================
మంచి రోజులొచ్చేసాయ్
మూటా ముళ్ళూ గట్టండి
ఇంకా మంచిగుంటాయవి
ముందు పరుగు తీయండి
గీసి గీసి జీతాలు,జేబుకిన్ని బొక్కలు
కలిమిదండు చెల్లించగ వేసాకా లెక్కలు (కలిమిదండుగ=Income tax).
పడడానికి మిగులుతాయి ఉద్యోగుల తిప్పలు
చెప్పడానికే కదవోయ్ ఉద్యోగుల గొప్పలు
లెక్కరాని లెక్కలు(డబ్బు) కుప్పలున్న తేలవు
గిచ్చిగిచ్చి గింత ఇచ్చి గుంజనెన్ని పన్నులు
పళ్లకేమి పనీ లేదు, పన్నుకేమి లోటులేదు
పలుగు మీది, హారమ్మాది.ఫలహారం,ఫలహారం
లేనివాడికప్పులుండవిదో సిద్ధాంతం
అప్పుతీర్చ డున్నవాడు అదో తతంగం
చిన్నవాడి కప్పులిచ్చి ఇల్లు వేలమేయడం
ఉన్నవాడి కప్పులుంటె రద్దు జేసివేయడం
బలేగుంది యవ్వారం,ఇదీ మన ప్రజత్వం
బాగుపడడమెమో గాని,బాగుజేయనే ఉన్నాం
రేపునయం,మాపునయం,బ్రతుకులంతే అయోమయం
గండి కోట్ల రహస్యం, బండబడా ఎవడు నయం
గండిపడెను ఖజానాలు దండుకోండి జనాలు
మింగ ముద్ద లేకపోతె మింగిపోండి విషాలు
మీరిచ్చిన అవకాశం,మితిమీరితే ఆ సమయం
మరోసారి ఛాన్సిస్తే, ముంచేస్తాం అదిఖాయం {ఐశ్వర్యంలో అనుకుంటా)
≠======================== రచన...✍

No comments:

Post a Comment