Wednesday, July 24, 2019

కలలు గన్న నా కన్నులు నిజం తాళ లేకున్నాయ్

==============================
కలలు గన్న నా కన్నులు నిజం తాళ లేకున్నాయ్
నిన్న కన్నా కలలు నేడు కల్లలై పోతున్నాయ్
కళ్ళ ముందు స్వప్నాలను చేరలేని నావలో
దిక్కెరుగని  బాటసారిని,రెక్క తెగిన పక్షినైతిని
నిన్న కన్న కలలు నాకు నేడు పాటమాయెను
రేపు లేని చివరి పేజీ విషయసూచినయ్యాను
కొన్ని చరిత లింతేలే వింతరాతలు
చిన్నవాన జల్లుకే చెరిగిపోవు మంత్రాలు
నిన్న నేను వ్రాసుకున్న చిన్న గీతము
నేడు పాడలేకపోతుందీ దగ్ధఖంటము
నిన్న పాట మళ్ళీ మళ్ళీ నన్ను పాడనీ
చివరి పాట  పాడుకునే వరాలివ్వవే
నిన్న ప్రణయ గీతాలు నేడు పిచ్చి రాతలు
అవే ప్రణయగీతాలు అడవి గాచు వెన్నియలు
విధిరాతను చెరపడం కాదు కదా నాతరం
తిరగ రాయు సాహిత్యం ఎవరికుందిలే,ఖర్మం
నేను నమ్ముకున్న ప్రేమ వమ్ముకాదులే
నిన్ను నమ్ముకున్న నేను బొమ్మ కాదులే
బొమ్మలతో ఆడి ఆడి అలసిపోతివా
ఆట  బొమ్మ నన్ను చూసి నవ్విపోతివా
కలలు గన్న నా కన్నులు నిజం తాళ లేకున్నాయ్
నిన్న కన్నా కలలు నేడు కల్లలై పోతున్నాయ్
కళ్ళ ముందు స్వప్నాలను చేరలేని నావలో
దిక్కెరుగని  బాటసారిని,రెక్క తెగిన పక్షినైతిని     
===========================
.................................య.వెంకటరమణ

No comments:

Post a Comment