Wednesday, July 24, 2019

అంతస్తుల కంతస్తులు ఎన్ని ఉన్నా శాశ్వతమా

========================
అంతస్తుల కంతస్తులు ఎన్ని ఉన్నా శాశ్వతమా
ఏడడుగులు శాశ్వతమవి ఎచట రాసెనో కదా
చలువ రాతి మేడలలో ఎంత కులికితేమిలే
చివరి కునుకు సమాధిలో నిజంలే మరి
కోట్లు పెట్టి కారులెన్ని గుట్టలెట్టినా సరే
చివరి యాత్ర పాటి పైన అదే నిజముగా మరి
కట్టు బట్టకెన్ని బ్రాండు లెన్ని ఉన్న నేమిలే
చుట్టబెట్టు బట్టకేమి బ్రాండు లేదు కదా మరి
నీ మోసం ఎందరిని మోసుకెళ్లేనో జారి
నిన్ను మోసుకెళ్ల నే నలుగురు నేమో మరి
ఎంత కాల మెన్ని పూసి గప్పినా శరీ
ఈ ఖలనము మన్నుతో గప్ప తప్పునా మరి
ఇన్ని తెల్సి నీ మనిషికి ఎన్ని ఆశలు
ఆ యాశలు మొత్తము చావుతోనే సరే సరి
అనుకుంటే అందరమూ ఒక్కటే మరి
అనుకోకే తొక్కుకెళ్లు సిస్టముంది భాయి
నీ వెనక ముందు నడుచుకెళ్లు దెందరైతేనేఁ
ఎందరుందురందులో అందున నీ చివరి యాత్రలో
ధనం కాదు సోదరా జనం చూసుకో
స్వయం చచ్చిపోయినా,బ్రతుకు నేర్చుకో
బ్రతికి చచ్చిపోవుకంటే,చచ్చి బ్రతుక మెప్పుగా
బ్రతికేస్తే ఏమున్నది బలాదూరు మనిషిలా,
బ్రతికుండాలది కాదా బ్రతుకు సోదరా
బ్రతికుండుము నూరేళ్లు,వజ్రంలా వెయ్యేళ్లు.
బ్రతికుండుము వేయేళ్ళు వెయ్యి మంది మనసులో
=============================
                            ......తెలుగు రచన/-

No comments:

Post a Comment