Friday, July 5, 2019

1568

1568
తెలుగు రచన
31/08/2017
====================
అనుభవాలనే అధ్యాయాలుగా
తరగని పుస్తక పాఠ్యంశాలుగ
తనకే తానో చక్కని బోధకుడై
సాగే పయనం జీవినసమరం.

ఎప్పటికప్పుడు తరగని ఉపదేశం
జీవితమే ఒక అభ్యాస పాఠ్యఅంశం
ఓడిపోవడం గెలిచి లేవడం
ఆఖరి వరకూ సాగే అధ్యాయము

వేసే అడుగులు తడబడకుంటే
పెదవుల పైనా  చిరునవ్వుంటే
సంకల్పంలో నిజాయితుంటే
తిరుగేముందీ విజయం నీదే

మనో ధైర్యమే ఆయుధమైతే
మనిషే మనిషికి సైన్యం ఐతే
సమసిపోయేడి సమస్యసైతం
సాగిలపడదా సలాము కొడుతూ

వెలుగు వైపుకు అడుగులు వేస్తే
నీ వెనుక నక్కునా చీకటి నీడలు.
చీకటి దారులు నీవనుకుంటే
వెలుగు జీవితం వెనకబారును

పిరికిపందలు పరుగెడతారు
సమస్య చూసి భయపడతారు
సమసిపోయెడిది సమస్య కాదా
సమసిపోవడం సమాధానమా

జీవిత పాఠం చదవాలి
జీవన సారం తెలియాలి
జీవితసత్యం అది మన లక్ష్యం
చేరడమేనో సఫలం సఫలం!
====================
......యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment