Friday, July 5, 2019

పాడనా పరవశించి మధుర గానము

శ్లోకం :
(పాటకు ముందు చదవాలి వీణతో)
"సంగీత మపి సాహిత్యం, సరస్వత్యాః పదద్వయం
ఏక మాపాత మధుర మన్య మాలోచనామృతం"

పల్లవి :
పాడనా పరవశించి మధుర గానము
శృతిలయల సంగమమై సుమధుర సంగీతము

చరణం:
సామవేద శ్లోకాలా సాత్విక నాదం
త్యాగరాజు అన్నమయ్య రామదాసు సాహిత్యం
శృతిరాగా తాళాల సమ్మోహన రాగము
హృదయవీణ మ్రోగించే శ్రావ్యమైన సంగీతం

             !!పాడనా ఈ పూటా!!

పురందరా దాసువారి స్వర పాళీలు
జానపద జనరంజక శాస్త్రీయ గీతాలు
ఉచ్వ్వాసా నిచ్వాసల ఉత్కంఠిత రాగాలు
భక్తిముక్తి సాధనకై  భవగీత లాలనలు
             !!పాడనా ఈ పూటా!!
తీగమ్రోగినా పలికే సంగీతా ప్రవళికలు
పర్వతాలు కరిగించే మధుర సంగీతాలు
స్మరణకీర్త శ్రవణదాస్య సుస్వర శృతులు
రాగకీర్తనా మధుర వీణాపాని గానాలు
         !!పాడనా ఈ పూటా!!

No comments:

Post a Comment