Sunday, July 14, 2019

కష్టమ్సుంటాయ్-కాంట్రోల్సుంటాయ్

=======================
కష్టమ్సుంటాయ్-కాంట్రోల్సుంటాయ్
రైల్వేలో అవి  కనబడ కుంటాయ్
పొద్దు న్నన్నం రాత్రికి పొట్లమ్
పచ్చ నోటుకు  తక్కువ లేదు
చేతి కందితే కడుపు కందదు
కడుపు కందితే చేటి కంటదు
“ఇంతేనోయి తింటే తినవోయ్”
రైల్వే నినాద మిది యంటండోయ్ 
కోట్ల ఖర్చుతో  వాటర్ ప్లాంట్లు
స్టేషన్నిండా కుళాయి స్పాట్లు
బొట్టే రాలని బడాయి కుళాయి 
బోటిల్ రేటు ఇరవయ్యండోయ్
వంద కమ్మిన్నా అడిగే దెవరు
గొంతు కెండితే కొన కేంజేతురు
నీ రొకటేనా నీటూ ఉండదు
స్వశ్చభారత్ అది వీధుల్లోనే
ఫోటో ఫోజులు పేపర్లోనే
గబ్బు నిండినా బాతురూములు
శుభ్రతలుండవు సుతరామైనా.
వరసకు ముగ్గురు వసూలు కోసం
పోయొస్తే మరి  పది(రు.10)కట్టేయి 
రోగాలు భద్రం  అవి  మనకోయి
నూట పాతికా కోట్లమందిలో
పాతిక కోట్లే డబ్బున్నోళ్ళు
ముందో రెండు, వెనకో రెండు
జనరల్ బోగీ లంతే నండోయ్
పట్టకపోయిన కుక్కుకు చావు
రైల్వే వాళ్లకు డబ్బులు చాలు
సీట్ల సంఖ్య మరి డబ్బై రెండే
వెయిటింగు సీట్లు వందల్లోనే 
క్లియరెన్సు కావు – ఊరొచ్చింది
పదరా పోదాం – డబ్బులు రావు
=======================
           యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment