Friday, July 5, 2019

1766

1766
తెలుగు రచన
04/07/2018
=================
అనురాగం అరుగులపై
మమకారం పందిరినై
ఆకాశం హద్దులుజేసీ
నీకోసం నేనుంటాను

నీనీలీ కురులా సొగసు
నెలవంకా నుదిటిన బొట్టు
నగుమోము వెన్నెల ఛాయలు
నా ఇంటే నిలిచుండాలీ

మధువొలికే నా మృదుబాషీ
నా ఇంటా వెన్నెల గాచే
నీవుంటే చాలును నాకు
కలకాలం కళలే మనకు

ఆషాడం అది ఎన్నాళ్ళూ
శ్రావణమిక ఉన్నన్నాళ్ళూ
మేఘమాల ఆగదేలా
ఆరిళ్ళూ ఊరూ వాడా

వసంతాల మంతనాలు
తెరదీయదు తర్షంజూడూ
తెరిపిస్తే ఊరూ వాడా
కలిసొస్తారేమో రామా

త్వరపడు మరి భామాభామా
తరగకనే ఈ రేయమ్మా
తనువంతా కన్నులుగాచే
తరియిస్తా నిన్నే చూసీ
యలమంచిలి వెంకటరమణయాలనంలి వెంకటరమణ...✍

No comments:

Post a Comment