Wednesday, July 24, 2019

ఇంకిలానే ఉంటుందా ఈ పోకడ

◆◆◆◆◆◆◆◆◆◆◆◆
ఇంకిలానే ఉంటుందా ఈ పోకడ
కొంతైనా మారేదుందా ఈ లోగడ
మారాజు లెపుడూ మారాజులేనా
గరీబు బ్రతుకులు గరాళానికేనా
వెలుగు చూడని బడుగు జీవులు
జీవమెరుగని చావు చూపులు
నామ మాత్రం నాది రాజ్యం
నిలువ నుండదు నీడమాత్రం
మట్టి గొట్టిన చేతులంటీ
నల్ల బారెను తెల్ల డబ్బు
నల్ల డబ్బు చెల్లదయ్యో
తెల్ల మొహామీ బడుగువాడు
మంచి రోజుకు ఎదురు చూస్తూ
ముంచు వారిని కొలుచుకొస్తూ
ఎంత కాలం ఎదురు చూపులు
వెదవలెవ్వరు నిన్ను చూడరు
మూగ బోయిన గొంతులారా
బొరియ దాగిన బొమ్మలారా
రొమ్ము తాగే పిల్లలారా
వెలుగుజూడగ బయలు రారేరా
నిన్న నమ్మిన వాడి నయమోయి
మన్ను నమ్మిన వీడు వమ్మోయి
గింజ లమ్మగ రేటు రాదోయి
కొనను బోతే నీకేది రాదోయి
పంట కావాలి, వంట సాగాలి
గింజ కొలిచే రైతు కడుపులు
మండి చావాలి,ఎండి పోవాలి
అండ లేకే వాడుండి పోవాలి
పంట దాకా గెంటు కెళితే
పంట మొత్తం గండి కెళితే
గింత మిగిలి పన్ను కెళతాయ్
గంతే లేమోయ్ రైతు బ్రతుకులు
నూట పాతిక కోట్లమంది
ఓట్లు వేసే జనము వాళ్ళు
మడుగు ఒడ్డున, రోడ్డు ప్రక్కన
స్వశ్చ భారత్ డబ్బాలిరుకున
లెక్కకందని జనం బోలెడు
మచ్చుకైతే మనుజులాళ్ళు
చెత్తలూడ్చే చీపురెంబడి
శవాలై మరి తేలుతుందురు
ఒక్కడైనా ముందుకొస్తే
లెక్కలైనా వేసి చస్తే
స్వశ్చ భారత్ మేరా భారత్
అప్పుడే అది మన గొప్పలేరా
చెప్పుకుంటే సిగ్గు చేటు
ఒకడు కంటే ఒకడు గ్రేటు
చెప్పబోతే నాకు వేటు
చెప్పుకుంటే మీకు చేటు.....ప్చ్
◆◆◆◆◆◆◆◆◆◆............✍

No comments:

Post a Comment