Wednesday, July 24, 2019

మిట్ట మధ్యాన్నం, మండుటెండే. కలాన్ని కాసేపు ఏసీలో పెడితే ఇదిగో ఇలా వ్రాసింది మరి

మిట్ట మధ్యాన్నం, మండుటెండే. కలాన్ని కాసేపు ఏసీలో పెడితే ఇదిగో ఇలా వ్రాసింది మరి
===============================
నెలవంక చూసింది నిన్న, కొమ్మల మాటున నన్ను
పురివిప్పి ఆడెను నేడూ, దాగున్న పరువాలు నాలో
ఎలుగెత్తి చాటింది పాడూ, ఏం కోయిలేమో చూడు
చిలకమ్మ చిగురొంక చూసి, ఎగరేసే నో కన్ను నాకై
తొలిసారి మల్లేమో నాలో,హ్ రేపింది లో లో
అల్లర్లు చేస్తూ తుమ్మెదలమ్మో.అమ్మో అమ్మో అమ్మమ్మో
నమ్మని పరువం ముంచేనేమో, ఏమో ఏమో ఏమోనమ్మో
నిన్న, మొన్న లేదు గాని, నేడు లేత మనసులో
కొత్త కొత్త ఆశాలేవో గుచ్చి గుచ్చి గుబులు నేడు
లేక లేక వేసుకున్న, లేత పచ్చ పవిట కయిన
లేదు ఇంత సిగ్గు చూడు. సిగ్గు బయట సిగ్గు సిగ్గు
కొత్త కొత్త అందాలను గుచ్చి గుచ్చి చూపకలా
తగ్గు తగ్గు తగ్గుమోయి సిగ్గు దొంతరా
ఓపలేని వయ్యారమా, హొయలు మరీ పోబోకుమా
మాఘ మాస మొచ్చువరకు అణిగి ఉండుమా
చెప్పు చెప్పు. నువ్వన్న చెప్పు, మల్లెమ్మ చెప్పు
ఎప్పుడిప్పుకోవాలో మనసు మాట  చెప్పు
మనసు మాట వినకపోతే మరో దారి నువ్వే చెప్పు
వచ్చి పోయే వసంతమా ఇంత ముప్పు తెచ్చేవేమ్మా
చింత నిప్పు నయం  చూడు ఇంత తాపమా
లోకమంత విస్తుబోయే , కొత్త సోకులొచ్చెనాయే
వచ్చి బోయే వారి చూపు గుచ్చి గుచ్చి గుచ్చుతుంటె
ఎప్పుడొచ్చునో ఏమో, మాఘమాసమెప్పుడొచ్చునో
ఓపలేని మనసుకు, ఊరడింపు లెవరు జెప్పునో
చెప్పు, చెప్పు, నువ్వన్న చెప్పు.మల్లెమ్మ చెప్పు
మాఘమాసమెప్పుడుందో మరీ మరీ చూసి చెప్పు
మురిపమల్లే మూటగట్టి,ముత్యమంత మాటజెప్పు
మాఘమాసమెప్పుడుందో మరీ మరీ చూసి చెప్పు.
≠===============================
హు... ఎప్పుడొస్తాదో ఏమో ఈ మాఘమాసం.. ,,

No comments:

Post a Comment