Friday, July 5, 2019

1578

1578
తెలుగు రచన
18/09/2017
====================
యుద్ధ సన్నాహాలు ఆగిపోయాయి
ఆయుధ కర్మాగారాలు జోరందుకున్నాయి
కనిపించే దంతాలు తినటానికి కావు
తినే దంతాలు కనిపించనైనా కనిపించవు
ఏనుగు నేర్పే సిద్ధాంతం ఏకంగా ప్రపంచవ్యాప్తం
లెక్కకు మించిన ఆయుధగారం
నామపలకం లేని కర్మాగారం
ఖర్మకొద్దీ సరఫరా అదే ఆయుధం
ఐదో తనం పోయిన ఆడదాని వాటం
వీళ్ళతోనా మన పోరాటం
సిగ్గుచేటు వెనకబడి రాయబారం
వెనమాలు యవ్వారం లోతుగానే తవ్వకం
వాడికి కింద సగం, వీడు మనిషి సగం
దొంగచాటుగా పంది మాంసం
మైకుల్లో నీతి ప్రసంగం
నిన్న కొట్టింది దులిపేసుకున్న కుక్కవాటం
కావాటం, అలీఉద్దీన్ ఆరిపోయే దీపం
బ్రీ టన్నుల బీభత్సం, బ్రోతల్ వ్యాపారం
ఆమె రిక రికల ప్రాకారం ఆంద్రోణి ఆర్ధికమాంద్యం
అప్పుడెప్పుడో అప్పు గానిస్థాన్
ముప్పు గొనిస్తాం, ముందు తప్పుకోనిస్తాం
అంతర్కలహం అదో పేరు, అంతా బహిర్గతం
బంగాళాకాతంలో బీభత్సం
ములిగేది సామాన్యులే కదా పాపం
చేస్తూనే ఉన్నాం ప్రయత్నం
ఒక్కడ్ని తీసుకురాలేక ముచ్చెమతలుబోతున్నాం
వస్తాం పోతాం, డబ్భైఏళ్ళేగా అయ్యింది ఇంకా చూద్దాం
===================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment