Friday, July 5, 2019

ఈ లలాటముల నే కలములతో లలరుచినావో

1833
తెలుగు రచన
09/06/2019
======================
ఈ లలాటముల నే కలములతో లలరుచినావో
విల విల నీ మనుజుల నేల నీవు పుట్టించావో
ఇంత కడుపుకెంతెంతాకలి సృష్టించావో
గింత గోర్ధమందు నిన్నిన్ని మాయలెటులుంచావో

ఖర్మలన్ని వ్రాసే నీవు దుష్కర్మ లేల నేర్పించావో
కారుణ్యం సృష్టించి కఠిన్యాలేలా నిట్లు నేర్పించావో
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్
అధర్మమైపోయిన వానిసంగీతేమిటయ్యా చేస్తావు

బలే సృష్టించావయ్యా బ్రహ్మాండం బ్రహ్మయ్యా
మనిషినైతే నీలానే సృష్టించి నిలువెల్లా విషమే నింపావు
బలేవాడివయ్యా బ్రహ్మయ్యా ఇలా ఎందుకు సృష్టించావయ్యా
కార్తిలిన్ని బెట్టి భుక్తానికి కార్తిల్లేకుండా చేసావు

పిందెలు నేలరాలిపోతుంటే ప్రాణం నీరైపోతుంది
కామాంధుల స్వైరయానంలో స్వరదగ్దమౌతుంది
గొంతెండి పోతుంది గోవిందా గోడు వినుము రామయ్యా
గోవర్ధన గిరినొదిలేస్తే జలపాతంలో కొట్టుకుపోతాం

బలే సృష్టించావయ్యా బ్రహ్మాండం బ్రహ్మయ్యా
మనిషినైతే నీలానే సృష్టించి నిలువెల్లా విషమే నింపావు
బలేవాడివయ్యా బ్రహ్మయ్యా ఇలా ఎందుకు సృష్టించావయ్యా
కార్తిలిన్ని బెట్టి భుక్తానికి కార్తిల్లేకుండా చేసావు
======================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment