1571
తెలుగు రచన
01/08/2017
====================
ఎవరన్నారు నేను కబోధిని
లోక పాపాలకు నేనో విరోధిని
ఎలా అవుతాను నేను వికలాంగుడ్ని
దూరనిరీక్షముల పాలి వరపుత్రుడ్ని
ఎవరన్నారు నేను బాధిరుడ్ని
దూరితములను వినగ లేని వర్జితనేను
ఎలా అవుతాను నేను వికలాంగుడ్ని
చెడు వినగ లేని ధన్యుడను
ఎవరన్నారు నేను మూగవాడిని
చెడు పలుకని వరములు పొంది
వల్ల కుండు నేనెట్లు వికలాంగుడను
చెడు పలుకుట చెల్లు నాకు ధన్యుడ నేను
చెడుపలకని నాలుకలు తెగుతున్నాయ్
అవిగవిగో చెవులవిగో చెడు వినకే మడుగయ్యాయ్
చెడు చూడక చెల్లునెట్లు నలుమూలల చెలరేగే
ధరిత పైన ధన్యమాయే వికలాంగుడు నేను నయము
===================
యలమంచిలి వెంకటరమణ
No comments:
Post a Comment