Friday, July 5, 2019

మరియాసుత మహిమాకర

పల్లవి:

మరియాసుత మహిమాకర  మా దేవదేవా
మముబ్రోవగ నిలకేతించిన నరపాపహారా
నరపాపహరా...నరరూపా... దే..వకుమారా..
అద్భుతక్రియలతొ మమ్మొద్దరించిన మహిమోమ్మతుడా..

చరణం :
తప్పినగొఱ్ఱెల కాపాడంగా కఠినము మోసితివే
ఇలపాపములను సిలువగమోసి  అలకేతించితివే
కారుణామూర్తీ శాంతస్వరూపీ దైవకుమారా..
పాపపుఇహమున పాతుకుపోతిమి మముగాపాడుము దేవా...

!!మరియాసుత మహిమాకర  మా దేవదేవా!!

చరణం:
అలనాడదిగో అంధునికన్నులు తెరిపించితివి
ఇలాపాపులమము ఏలనువిడిచితి ఓ..యేసయ్యా
ఇలపాపులమము విడిచితివేలా ఓ యేసయ్యా..
గైకొనుమయ్యా దీనినిగేయము శరముగావీవు

శరణముశరణము  శరణమునీకే శరణముదేవా..

!!మరియాసుత మహిమాకర  మా దేవదేవా!!

No comments:

Post a Comment