1756
తెలుగు రచన
10/04/2018
==================
వెనుకాడకు, మరిచూడకు
అనుకుంటే ఇక ఆగకు
గెలుపన్నది నీసొంతం
సాధనతో అది సాధ్యం.
సంకల్పం దృఢమైతే
సంకోచం నీకెందుకు?
నీ ధైర్యం తోడుంటే
వేరెవరో నీకెందుకు?
ఆలిప్తం నీ ధైర్యం
విజయానికి అది మూలం
నమ్మకమది నీకుంటే
తిరుగుందా ఇక నేస్తం
తొలి అడుగుల గాంభీర్యం
వెనుదట్టే నీ ధైర్యం
వెనుకంజకు తావీయకు
ఆ విజయం నీ సొంతం
అపసర్గం అపసర్గం
ప్రతి కార్యం అపసర్గం
సంకల్పం దృఢమైతే
కాదేదీ దుర్లభ్యం
వెనుకాడకు, మరిచూడకు
అనుకుంటే ఇక ఆగకు
గెలుపన్నది నీసొంతం
సాధనతో అది సాధ్యం.
==================
యలమంచిలి వెంకటరమణ....✍
No comments:
Post a Comment