Thursday, July 25, 2019

ఎవరన్నారివి వెలుగులని

1793
తెలుగు రచన
25/07/2018
=================
ఎవరన్నారివి వెలుగులని
మబ్బులు గప్పిన వెన్నెలనీ
ఎవరన్నారిది వెలుగుయని
ఉదయభాస్కర కిరణమని

పెళ పెళ పేలే మెరుపులవి
నిప్పులు గక్కే పిడుగులవి
ఎవరన్నారివి వెలుగులని
మబ్బులు గప్పిన వెన్నెలనీ

ఎవరన్నారివి పిలుపులని
ప్రగతిబాటకవి మలుపులని
మరణమృదంగపు నాదమది
మృగాలుపాడే గానమది

ఎవరన్నారిది ఉదయమని
వెలుగులునిండే సమయమని
కనబడలేదా వృకవిన్యాసం
చిక్కులమారి కపటట్టాసం

ఎవరన్నారూ ఎవరన్నారు
రక్కసులంతా గతియించారని
ఎవరన్నారూ ఎవరన్నారు
ధూశ్యాషణులు ఇలపైలేరని

వినబడలేదా ఘీంకారాలూ
అరుపులుబొబ్బలు ఆర్తఃధ్వనులు
చిరిగినవస్త్రం చిన్నారిఅరుపులు
నదులైపారే అబలాశ్రువులు

ఎవరన్నారిక వచ్చేసాయని
ఎవరూ ఎరుగని మంచిరోజులు
ఎవరన్నారిక భయపడవద్దని
బ్రష్టాచారం మరిఇక లేదని

కనబడలేదా  ఈకాఠిన్యం
శవాలపైన జనవ్యాపారం
ఖలేజలేని శవాలు పాపం
శవపేటికపై లంచాలబేరం

ఎవరన్నారివి వెలుగులని
మబ్బులు గప్పిన వెన్నెలనీ
ఎవరన్నారిది వెలుగుయని
ఉదయభాస్కర కిరణమని
=================
             వెంకటరమణ/..

No comments:

Post a Comment