Friday, July 5, 2019

పరవశించిపోనా పలుకరింపుతో

1841
తెలుగు రచన
19/06/2019
======================
పరవశించిపోనా పలుకరింపుతో
పులకరించిపోనా చిరునవ్వులతో
నన్ను మరిచిపోనా నిన్ను చూసినాక్షణం
ఇలా చెప్ప నాతరమా మధురభావము

నింగిలో చందమామ ముందుకొస్తే
వెన్నెలంటి నవ్వులిన్ని ప్నాకుతెస్తే
పరిమళించు పూవులన్ని పరవశించవా
వంతగలిపి కోయిలమ్మ పాటపాడదా

నిన్ను నన్ను చూసేమో నీలాకాశం
ఇంద్రధనస్సు హారమిచ్చే అది నీకోసం
మిళుకుమిళుకు తారాలన్ని మురిసిపోయి
చిలకరించే అక్షింతలు తొలకరిచినుకై

జాగు చేయకంటోంది జాజికొమ్మా
హారతీయనొచ్చించి ఆ మెరుపమ్మా
మేళంతో వచ్చింది మేఘమమ్మా
శుభమస్తూ శ్రీకారం చుట్టేద్దామా?

(ఇంకా ముందుకెళ్తే ఏమో ఏమవుతుందో. అందుకని  ఇక్కడే వదిలేసి మన పని మనం చేసుకుందాం)
======================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment