Sunday, May 17, 2020

నవ్వులే మేలి అభరణము

1917
తెలుగు రచన
17/05/2020
======================
చాలేమో చారు నీనవ్వులు
చామంతులూ వెలుగు నీకాంతులు
కల్మషములే లేని నగుమోము
కా నవ్వులే మేలి అభరణము

పుడమి పూసిన గంధ మెంతందము
ఏ నగలు మరి దెచ్చునిట్టి లావణ్యము
చిన్నబోయెను చూడు కనక మేకంబుగాలేక
ముత్యాల పలువరసతో మెరయురాక

తాకి మువ్వెరుగనీ చరణము
పులకించదా పుడమి నిన్నుజేరి
మణులు గాయ నేవిత్తు ననుగు నేల
విరబూయదా తోట వెలగట్టనీ నవ్వుకు

సాటి నీ కేపాటి మాణిక్యము
ఈ పాట నీ నవ్వుకే అంకితం
నీ నవ్వు లోకానికే మానికం
పుడమి పుత్రీ నీకు ఇది అర్పణం... పునరార్పణం
======================
  యలమంచిలి వెంకటరమణ...