Friday, June 8, 2018

పదుగురు తన వెనుకుంటే

1593
తెలుగు రచన
17/12/2017
=================
పదుగురు తన వెనుకుంటే
పదుగురితో తా నుంటుంటే
తను కాదోయ్ నాయకుడు
నాయకత్వ మది కాదు

ఒకరి మేలు కోరు మనిషి
మనిషి మనసు గెలుచు మనిషి
ఒకరు కొరకు బ్రతుకు మనిషి
మనుషుల్లో మహామనిషి

గుండెల్లో ధైర్యముండి
మాటల్లో న్యాయముండి
ముందడుగుగ తానుండే
వ్యాఘ్రమై నడుస్తుంటే

వెనుకాడని వేయి మంది
వెనుక జేయు జే కారము
వెనుక నడుచు అడుగుల స్వరము
నాయకత్వ మది ఒక వరము

తన స్వార్ధం మరువాలి
పరుల కొరకు బ్రతకాలి
తనదన్నది ఒకటుంటే
అదే జనం కావాలి

ఆషామాషీ ఆట కాదు
కొన బోతే కొనా రాదు
నాయకత్వ మదో గుణము
వర్ఛస్సని వేద నామము

వెనుకాడని వేయి మంది
వెనుక జేయు జే కారము
వెనుక నడుచు అడుగుల స్వరము
నాయకత్వ మది ఒక వరము
===≠=============
యలమంచిలి వెంకటరమణ

Tuesday, March 27, 2018

దేవుడు కూడా అమ్మ పుత్రుడే

దేవుడు కూడా అమ్మ పుత్రుడే
దేవతలైనా నాన్న బిడ్డలే
దేవదేవతలకు జన్మనిచ్చిన
అమ్మ నాన్నలే ప్రత్యక్షదైవం.

...........దేవుడు కూడా !!

మొక్కై ఎదిగిన విత్తూ..
మానైపోతీ జగత్తూ.....
కట్టెలుగొట్టి గాల్చేస్తూ.
ఫలాలు మరచుటె గమ్మత్తూ. 

......దేవుడు కూడా!!

కడుపు చీల్చుకుని బిడ్డ కానుపు
తనువు గాల్చుకుని బిడ్డల బ్రతుకు
బాధ్యత ఎరుగని బిడ్డలు ఘోరం
అనాథ బ్రతుకులు ఆశ్రమ వాసం
......దేవుడు కూడా!!

నచ్చిన సహకారి దొరకుట వరము
వారమ్మనాన్నలేనట వీరికి శాపం
కాదిది భావ్యం,కాదిది భావ్యం
కాకపోదుమా మనమత్తమామలం
......దేవుడు కూడా!!

తల్లీ తండ్రీ గురువూ దైవం
కళ్ళ ముందరా ప్రత్యక్షదైవం
జన్మనిచ్చినా తల్లిదండ్రులన్
చెందనాడుటా కాదోయి భావ్యం
......దేవుడు కూడా!!

........యలమంచిలి వెంకటరమణ

Monday, March 26, 2018

కనికరమే కరువయినా కరిగి జారిపోతాను.

=============================
కనికరమే కరువయినా కరిగి జారిపోతాను.
పలుకరింపు కరువై - వసుధగలిచిపోతాను
సేధదీర్చలేను నేను జలది గలిచిపోతాను
నయన జలము నేను చిఱుత బిందు నేను!!

పలుమారులు అనుకుంటా-పధిలమైఉండాలని.
అల్లాడే హృదయాలకు అంతుజిక్కకుండాలని
అంతలోనే కరిగిపోయి అంతరించిపోతాను,
బిందువు నేను-కన్నీటి బిందువు నేను!!

కంటి పాపనింటిగా-అంటి నుండననుకుంటా
అంతలొనే కరిగి నేను-మేది రాలిపోతాను.
ఓదార్చుట చేతగాక ఓరకంటపోతాను.
బిందువు నేను-కన్నీటి బిందువు నేను !!

ప్రేమించే హృదయాలకు పెద్దగురుతు నేనయ్యి
విడువలేనిబంధాలకు - వీడ్కోలును నేను
అశృవుగా మారినేను  అంతరించిపోతాను
నమితగత్తెనై నేను   క్షితినిగలిచిపోతాను.
బిందువునేను-కన్నీటి బిందువునేను !!
============================

.........................య.వెంకటరమణ

సర్వ వర్ణముల నూరి నొకటి జేసి

1582
01/11/2017
తెలుగు రచన
======================
సర్వ వర్ణముల నూరి నొకటి జేసి
చేయ సాధ్యమగునా శ్వేతవర్ణం
శ్వేత వర్ణమందు చిన్న చినుకు చేరి
చెరిపు శ్వేతగుణమది తేటతెల్లం

నూరు మూర్ఖులు జేరి,గారు సాటి మేలు
గుణము జెరచు వారు కోకొల్లలే నేడు
నొక్క మిత్రుడు చాలు, నీ మేలు గోరంగ
గుణము నెఱిగిజేయు చెలిమి మిత్రా!
=========================
               యలమంచిలి వెంకటరమణ

వెలుగు, లోకమైతే,

వెలుగు, లోకమైతే,
ఆ దీపం,నువ్వూ-నేనూ.
వెలుగులో లోకం చక్కబడుతుంది.
వెలుగునిచ్చే ఆ దీపం మాత్రం
చీకటిలోనే ఉండిపోతుంది.
చిత్రమేమిటంటే ...
వెలుగులోపడి లోకం కూడా
దీపం చీకటిలో ఉందని మరిచేపోతుంది .
నిన్ను నీవు మరిచిపోతే
వెలుగారిపోయాక,
నిను గానని లోకమే
నిను తొక్కేస్తుంది...

ఆ దేశంలో పరమాణు అస్త్రాలు

1583
తెలుగు రచన
15/11/2017
===================
ఆ దేశంలో పరమాణు అస్త్రాలు
ఈ దేశంలో అణు బాంబుల సరణీలు
ఓ దేశంలో తోపులకే తోపులు, తోపులు
ఎన్నున్నా ఒకటే లక్ష్యం,
నిన్ను చంపడం నేను బ్రతకడం.

ఆ పాలల్లో యూరియా కెమికల్
ఈ నూనెల్లో మడ్డీ, మసాల
ఈ బియ్యంలో ప్లాస్టిక్ మాసర
ఎన్ని కలిపినా ఒకటే  ఉద్దేశ్యం,
నువ్వు పోయినా నే బ్రతకాలి.

ఆ ఔషద తయారి  మోసం
ఈ భవంతి మసలతు లోపం
ఆ వంతెన కట్టడి ఘోరం
ఎన్ని చేసినా ఒకటే మర్మం,
నువ్వు పోయినా నాకొస్తే చాలు

ఆ జబ్బుకు లేదే మందు
ఈ జబ్బిక బాగే పడదు
ఆ జ్ఞానమింకా రానే లేదు
ఎన్ననుకున్నా ఒకటే,
చండంలో ఉన్న శ్రద్ధ
బ్రతికించడంలో లేదు
====================
యలమంచిలి వెంకటరమణ

ఏమాశించాలి మనం

1584
తెలుగు రచన
17/11/2017
==========================
ఏమాశించాలి మనం
కాస్త ప్రేమడిగితే ద్వేషిస్తారీ జనం
సాయమడిగితే సాధిస్తుందీ సమాజం
ఎలా బ్రతకాలయ్యా మనం
తొక్కేస్తుంటే మన స్వార్థం
ఎక్కడ నిలుస్తుందీ న్యాయం
అన్యాయానికి పట్టం గట్టింది మనం
కురిడీలో కొబ్బరినీళ్ల వయనం
శాంతి చిరునామా మరిచేపోయాం
అశాంతికి అంతస్తులు కట్టిచ్చాం
ఎవరన్నారిది భారతదేశం
భరతుడినే మరిచిందీ సమాజం
నిజమేనా ఇది స్వతంత్ర దేశం
కోటు జేబుల్లో అది అస్తవ్యస్తం
అస్తరులా మారిందది పాపం
దేవుడేం జేస్తాడ్లే నిరాకారం
సైతాను ఒకడుకాదు కోట్లున్నారు పాపం
ఇంతలో కాదులే యుగసమాప్తం
జరగాల్సింది బోలెడుందింకా  నేస్తం.
===========================
........ ... .యలమంచిలి వెంకటరమణ

రవి రశ్మికి అలవాటు పడిపోయాం

1586
తెలుగు రచన
17/11/2017
◆◆◆◆◆◆◆◆◆◆◆
రవి రశ్మికి అలవాటు పడిపోయాం
వెన్నెలెప్పుడో మరిచిపోయాం
వెలుగులో పరుగులు తీస్తూ
రాత్రిని చీకటికే వదిలేస్తున్నాం
భయపెడుతున్న భ్రమలో
భయాడుతూ బ్రతికేస్తున్నాం
విలువలేని సున్నాలకు వెలకడుతున్నాం
వెలవెల బోయే అంకెను
ఓ ప్రక్కన పడవేస్తున్నాం
నోరిప్పిన నేలకే నీరెడుతున్నాం
నెరగట్టిందని సరిపడుతున్నాం
చిన్నగ్గిని ఉఫ్అని ఊదేస్తున్నాం
అది పెద్దయితే వేడని పరిగెడుతున్నాం
కుళ్లులో బ్రతికే మనము
మల్లెవాసననెపుడో వెదిలేశాం
చచ్చయినా బ్రతికేస్తున్నాం
అందుకే మరణిస్తున్నాం
మర నిస్తున్నాం, బ్రతికేస్తున్నాం
వేడిశ్వాస రుమాలుతో అదిమేస్తున్నాం
అది మేస్తున్నాం, బ్రతికేస్తున్నాం
పొగలొస్తుంటే తలుపేస్తున్నాం
ఏసీ గదిలో బ్రతికేస్తున్నాం
అందుకే మరణిస్తున్నాం
తెల్లారిందదిగో, పరిగెడదాం
ఒకరి వెనుకొకరిలాగే నిలబడదాం
బ్రతికేద్దాం,బ్రతికేస్తున్నాం
చచ్చాయినా బ్రతికేస్తుందాం
ఉమ్మేస్తే తడవకుడా కొంగేసుకుందాం
వెనక తరం అడిగే ప్రశ్నలకు
ఒప్పేసుకుందాం,మా చేతకాలేదని
ఒప్పేసుకుందాం,
మట్టిగాజులు మనమేసుకుందాం
ఉంటే,..తలదించుకుందాం
◆◆◆◆◆◆◆◆◆◆◆

....యలమంచిలి వెంకటరమణ

నీలి మేఘంలో చుక్కలు

1587
తెలుగు రచన
18/11/2017
====================
నీలి మేఘంలో చుక్కలు
వెలుగులో ఏకమయ్యే వేళ.
తుమ్మెదొచ్చి పూల నిధురలేపే
రమ్యమైన ఉదయ కాంతి వేళ
గెంతులేసే చిన్న ఆవుదూడలజూసి
రంకెలేసెడి ఆవు గొంతు వేళ
మల్లె మొగ్గలు అలసి
ఘ్రాణంబు మరిచి గోముగుండే వేళ
రవ తళుకులొలుకు హిమబిందు మెరుపు
ముద్దు మురిపెంబు లొలుకు
మోము పసికందులా నవ్వు
పావు రాళ్ళ గూళ్ళు బిక్కవోవ
నొక్కటిన్ను లేక నింగికెగసే
గుముల గుముల వేళ
చల్లగాలికి నేల పులకించి పచ్చ
చీర గప్పిన రీతి పచ్చికల్ల వేళ
ఎంత మధురమీ ఉదయం
ఇది  ఎంత మధురం
===================
.. ........... మాధుర్యం

పెనిమిటొచ్చు వేళ

చల చల్లని వెన్నియలు

1588
తెలుగు రచన
18/11/2017
=================
చల చల్లని వెన్నియలు
తియ తీయని తేనియలు
మధురమెంత మధురము
కుసుమాలా ఈ సొగసులు

పిల్లగాలి కొలను జేరి
కొండ కోన వంత గలిపి
ఎంత మధుర ఆలపం
ఎంత మధురమీ సమయం

వడి వడి మేఘమాల
ఎటులమ్మా నీ పయనం
తళుకు తార బిక్క ముఖం
మిళుకు మిళుకులాడెను

ఈ తుంటరి జాజి కొమ్మకు
ఏమి తెలిసెనేమో ఏమో
తుళ్ళి తుళ్ళి నవ్వసాగెను
మళ్లీ మళ్లీ నన్నే చూసును

గుప్పుచిప్పు గోదారమ్మా
వెండి చీర గట్టిందా
గట్టుమీద కోకిలమ్మ
కొమ్మలెక్కి పాడనుందా

ఏమో ఏమో ఇంతందం
నిన్నకూడా ఉందో ఏమో
కొంటె మామ కబురు దెలిసి
నేడు నాకు ఇంపో ఏమో

సిగ్గులెంత గప్పుకున్నా
కొంటె పైట నిలువదేమి.
కంటిమీద కునుకు లేదు
మామ కెదురు వెళ్లిందేమి!

ఎంతసేపు ఓపాలింకా
ఎంగిలంటు దాచాలింకా
దోర దోర జామపండు
చిలక ముందు ఎన్నాళ్లింకా

అందమైన రాతిరి వేళ
సద్దు మణిగందరు ఉంటే
కన్నె పిల్ల కొప్పునపూలు
కన్నుగీటి నవ్వులు ఏమో

ఏమో ఏమో ఇదేనేమో
వలపుకు ఇది తొలకరేమో
మెలికలు ఈ మేనుకు
మెరుగుల సరి మొగ్గలేమో

ఏమో ఏమో ఇంతందం
నిన్నకూడా ఉందో ఏమో
కొంటె మామ కబురు దెలిసి
నేడు నాకు ఇంపో ఏమో
=================
...యలమంచిలి వెంకటరమణ

నీలి మేఘంలో చుక్కలు

1587
తెలుగు రచన
18/11/2017
=================
నీలి మేఘంలో చుక్కలు
వెలుగులో ఏకమయ్యే వేళ.
తుమ్మెదొచ్చి పూల నిధురలేపే
రమ్యమైన ఉదయ కాంతి వేళ
గెంతులేసే చిన్న ఆవుదూడలజూసి
రంకెలేసెడి ఆవు గొంతు వేళ
మల్లె మొగ్గలు అలసి
ఘ్రాణంబు మరిచి గోముగుండే వేళ
రవ తళుకులొలుకు హిమబిందు మెరుపు
ముద్దు మురిపెంబు లొలుకు
మోము పసికందులా నవ్వు
పావు రాళ్ళ గూళ్ళు బిక్కవోవ
నొక్కటిన్ను లేక నింగికెగసే
గుముల గుముల వేళ
చల్లగాలికి నేల పులకించి పచ్చ
చీర గప్పిన రీతి పచ్చికల్ల వేళ
ఎంత మధురమీ ఉదయం
ఇది  ఎంత మధురం
===================
.. ............... మాధుర్య

మలారంతో ఒకడు

1590
తెలుగు రచన
19/11/2017
==============
మలారంతో ఒకడు
తుకారాం ఇంకొకడు

వికారమైన బుద్ధులు
వీళ్ళే మనకు ప్రబుద్ధులు

మళ్లీ మొదలు సన్నాహాలు
తలదన్నే చెత్త పన్నాగాలు

కంపు కంపు ప్రసంగాలు
వెయ్యి రెండు లవంగాలు

మొబైల్ యుగంలో
గ్రామ్ ఫోన్ రికార్డులు

అరిగిపోయిన ప్లేట్లు
పాడేవి పాత పాట్లు

ఊరు ఊరంతా జెండాలు
ఊరు బయట దందాలు

అసలు రంగు బయట పడనట్టు
ఖద్దరు గుడ్డలు చుట్టబెట్టు

రక్త సంబంద మన్నట్టు వీరు
వచ్చి వాటేసుకునే తీరు

ఐదేళ్ల పదవిలో సమయం లేనట్టు
అదే బెంగతో వచ్చి కలుస్తున్నట్టు

ఒకడు పంచి పెట్టినట్టు
ఇంకొకడు పంచె పెట్టినట్టు

ప్రజా సేవ బోల్టు
బిగిస్తారు బోల్తా పడేటట్టు

పనయ్యాక పిరాయిస్తారు ప్లేట్లు
ఆ తర్వాతన్నీ మనకేలే పాట్లు

మత్తు విడిచిపెట్టు
ప్రజాస్వామ్యం నిలబెట్టు

నీ ఓటు విలువ వాళ్లకు తెలిసినట్టు
చెబుతున్నా నువ్ తెలుసుకో నన్నట్టు
========================
........యలమంచిలి వెంకటరమణ

విద్వేషాలకు హద్దుల్లేవు

1591
తెలుగు రచన
12/12/2017
===================
విద్వేషాలకు హద్దుల్లేవు
విద్వాంసాలకు సిద్ధం సిద్ధం
ఎక్కడికక్కడ ఒకటే హోమం
మారణకాండకు అందరు సిద్ధం

నశించిపోతూ మానవత్వము
నామ మాత్రమే అక్కటితత్వం
ఎక్కడ చూసినా రక్తపాతము
మనుషుల్లాంటి సైతానులోకం

వాయి వరసలు దగ్ధం దగ్ధం
ప్రేమలన్నవి పెదాల వాటం
అంకిన కాడికి నులిమే లోకం
అందరికందరు ఇదేమిలోకం

ఆరో స్థానం ఐదో స్థానం
అంకెల్లోనే నిష్కర్షణము
అంతకంతకు అధమస్థానం
అందరికందరు అనాథవైనం

అణుబాంబెందుకు కొంతే ద్వంసం
ఎంతుందింకా యుగానికంతం
అయినా తీరని ఆరాటాలు
అర్ధం లేని పోరాటాలు

నక్షలవాదం ఒకప్రక్క
పక్కోళ్ళ వైరం ఒక ప్రక్క
ఇక్కడ జానాలదొక్కో లెక్క
కుక్కలు నయమవి ఎంచక్కా

కొట్టుకుజచ్చే జనాలు మారి
ఒక్కరినొక్కరు ప్రేమగ జేరి
ఉన్నదానితో తృప్తిగ నుంటే
ఉందా చెప్పు ఇలకు మించిన స్వర్గం స్వర్గం!!
============================
యలమంచిలి వెంకటరమణ

పదుగురు తన వెనుకుంటే

1593
తెలుగు రచన
17/12/2017
=================
పదుగురు తన వెనుకుంటే
పదుగురితో తా నుంటుంటే
తను కాదోయ్ నాయకుడు
నాయకత్వ మది కాదు

ఒకరి మేలు కోరు మనిషి
మనిషి మనసు గెలుచు మనిషి
ఒకరు కొరకు బ్రతుకు మనిషి
మనుషుల్లో మహామనిషి

గుండెల్లో ధైర్యముండి
మాటల్లో న్యాయముండి
ముందడుగుగ తానుండే
వ్యాఘ్రమై నడుస్తుంటే

వెనుకాడని వేయి మంది
వెనుక జేయు జే కారము
వెనుక నడుచు అడుగుల స్వరము
నాయకత్వ మది ఒక వరము

తన స్వార్ధం మరువాలి
పరుల కొరకు బ్రతకాలి
తనదన్నది ఒకటుంటే
అదే జనం కావాలి

ఆషామాషీ ఆట కాదు
కొన బోతే కొనా రాదు
నాయకత్వ మదో గుణము
వర్ఛస్సని వేద నామము

వెనుకాడని వేయి మంది
వెనుక జేయు జే కారము
వెనుక నడుచు అడుగుల స్వరము
నాయకత్వ మది ఒక వరము
===≠=============
యలమంచిలి వెంకటరమణ

సాగిపోతున్న నావలో వడగళ్ల వాన

1594
తెలుగు రచన
18/12/2017
====================
సాగిపోతున్న నావలో వడగళ్ల వాన
కలిసున్న కుటుంబంలో వాటాల గోడ
లేని బేధాలతో సాహితీ సత్కారం
అక్కడోడికక్కడే ఇక్కడోడికిక్కడే
కదా ఇదో విస్ఫోటపు ఆర్భాటం
====================

యలమంచిలి వెంకటరమణ

ఎంతకైనా తగిందీ రాజకీయం

1595
తెలుగు రచన
18/12/2017
===================
ఎంతకైనా తగిందీ రాజకీయం
ఆలూ మగలకే పెట్టింది వైరం
భూమాత ఓరిమి స్త్రీలకు సైతం
పట్టించింది మగడి పైనే ఖడ్గం

విభజించి పాలించే సిద్ధాంతం
మాటల్లో మహిలొద్దరణాలక్ష్యం
మగడి ఉద్యోగం కోటా  తగ్గించడం
భార్య నెత్తిన బరువు మోపడం

అస్పృశ్య నివారణ అదో విడ్డూరం
సమానం చేస్తామని ఇల్లు కట్టివ్వడం
కులాల వారీ స్థలాలివ్వడం
ఎక్కడికక్కడ విడదీసి పెట్టె పన్నాగం

కలిసికట్టుగా బ్రతికే అవకాశం
కల్పిస్తే ఏర్పడదంటారా సమన్మయం
మాలపల్లెలు, ఈడిగ పేటలు
అగ్రహారము,కాదంటారా విభక్త యాగం

సాహిత్యం జోరందుకుంది
లేదందులో అనుమానం
విభజించి పాలించే సిద్ధాంతం
మనమే చేసాముగా సఫలం

పడిపోయికండి అందులో నేస్తం
విడదీకండిది తెలుగుని మాత్రం
ఎవరు వ్రాసినా అదే అక్షరం
ఎప్పటికీ మనమేగా తెలుగోళ్ళం

దేశ ద్రోహుల విగ్రహాలనే స్థాపించుకున్నాం
శత్రువచ్చినా పూజిస్తునే ఉన్నాం
తెలుగు కవులనెలా తీసేస్తాం
ఇది న్యాయంగా ఉందా నేస్తం

అన్నా చెల్లీ అని పిలుచుకుందాం
రాజకీయాలను ఆమడ పెడదాం
తెలుగు తల్లికి బిడ్డలమై ఉందాం
ఉందాం మనమంతా కలిసుందాం

చాలా బాధేస్తుంది నానేస్తం
కన్నీటితో వ్రాస్తున్నానిది వాస్తవం
తలుచుకుంటే కన్నీటిప్రాయం
కలిసుందాం దయుంచండి నేస్తం
==================
యలమంచిలి వెంకటరమణ

ఆదిలో ఆర్యుల పోరు

1596
తెలుగు రచన
20/12/2017
===============
ఆదిలో ఆర్యుల పోరు
ఆంగ్లేయులదీ అదే తీరు
రౌడీగాళ్లది ఇప్పుడు జోరు
అణిచివేతనే రాసుందికాబోలు

అప్పట్లో ఇనుము చూపి అదిమారు
బ్రిటీషు పిరంగులతో వేధించారు
ఇపుడిదిగో రౌడీగాళ్ళూ అదే చేస్తున్నారు
అణిచివేతే కాబోలు మన వరాలు

ఎక్కడ సింధూనదీ తీరం
ఇప్పుడు సముద్రం దాకా చేరాం
ఇంకా భయపడితే ఏడికేగి పోతాం
కళ్ళు తెరవండి నేస్తం కాస్తైనా బ్రతికేద్దాం
లేకపోతే మనమింతే ఇలానే ఉండిపోతాం

తలెత్తి నిలబడితే తెగిపోతోందా
తలదించుకుంటే అది సరిపోతుందా
ఎదురు తిరిగితే ఏమవుతుంది
మరీ అంటే తానొక్కడికే ఇరకాటం

ఎంతని సహిస్తాం ఎవరైతే మాత్రం
అన్యాయం కోరల్లో దమ్ముండదులే నేస్తం
విరిచేస్తే ఓ పనైపోతుంది యత్నిద్దాం
చేతులున్నది సలాముకే కాదు
జవాబు క్కూడా అదేగా నేస్తం
====================
..యలమంచిలి వెంకటరమణ

వంగవే ఓ పూల కొమ్మా

1597
తెలుగు రచన
20/12/2017
===============
వంగవే ఓ పూల కొమ్మా
వంపులాడి సింగారమా
సిగ్గుతోటి ఊగపోయే
సోకు మూర బారల్లేమా

చిన్న నవ్వు సిగ్గుల మొగ్గ
గండుమల్లి గడసరి కొమ్మ
డిగ్గి వెంకి కొప్పున జేరి
సిగ్గు లప్పు ఇచ్చావామ్మా

వెన్నెలేమో వచ్చి పోయే
తుమ్మిదిలా రెచ్చి పోయే
సిగ్గు మొగ్గ వెంకి మోము
ముగ్దమయ్యిపోయిందోయమ్మా

సిగ్గు సిగ్గు తెల్లారింది
కోడి కూసి జామయ్యింది
పవిట పైన మామ నిద్ర
బుగ్గలెరుపు పోయేదెలామా

చిందరైన మల్లెలు చాలు
చిల్లరైన గాజులు చాలు
పందిరెక్కి కూసే కోళ్ళు
అల్లరల్ల రందరు నవ్వేరు
.
సిగ్గు సిగ్గు తెల్లారింది
మొగ్గ మారి పువ్వయ్యింది
హద్దుమీరి వెలుగు రేఖ
తొంగి తొంగి అంతా చూస్తుందీ

మళ్లీ చూడు మల్లేపూలు
తెల్లబారే గుమగుమలు
చిట్టి చిట్టి చేమంతమ్మా
తెల్లవారె లే లెండమ్మా!!
================
........య.వెంకటరమణ

సూర్యడు సోకిన చోటే

1598
తెలుగు రచన
29/12/2017
===============
సూర్యడు సోకిన చోటే
వెలుగులు కనిపిస్తాయి
మొక్కలు నాటిన చోటే
పువ్వులు  వికాశిస్తాయి
హక్కులు  సాధించిన చోటే
ఉన్నతి అగుపిస్తుంది
ప్రేమలు పంచిన చోటే
వాత్సల్యం బదులిస్తుంది
=================
       య.వెంకటరమణ..✍

ఇన్ని నాళ్ళు వేచి ఉన్నా

==================
ఇన్ని నాళ్ళు వేచి ఉన్నా
పడుచుదనపు పరుగులాపి
నిన్ను చేరే వింత ఆశలు
నేడు కలిగేను, నేడు కలిగేను

నింగి నేలా సాక్షమయ్యి
నీవు నేను ఏకమయ్యి ,
నన్ను నేనే మరిచిపోయి
నీవు నేనై కలిసిపోయే,
ఇన్ని ఆశలు ఎలావచ్చేను

కడలి పొంగుల చాటుజేరి
నింగి నేలా ఏకమయ్యే
వింతలేవో నేడు చూసేను
అంతలోనే పులకింతలేవో
నన్ను తాకేను,నన్ను తాకేను.

ప్రకృతెంత  అందమాయేను
కొత్త బాషలు నేడు తెలిసేను ,
చిలిపి ఆశలు నాకు కలిగేను
పరువమే మరి పంచి యాయెను
నిన్నలేని వింతధోరణి నేడు వచ్చేను
ఇంతలోనే వింతలేవో ముంచుకొచ్చేను

పదుగురింటే పరువు పోయే
బిడియమేదో తెలిసి వచ్చేను
ఇన్ని నాళ్ళు వేచి ఉన్నా
పడుచుదనము పరుగులాపి
నిన్నలేని కొత్త  ఆశలు
నిన్ను చేరే వింత ఆశలు
నేడు కలిగేను, నేడు కలిగేను.
=======================

...........................య.వెంకటరమణ

సూర్యడు సోకిన చోటే

1598
తెలుగు రచన
29/12/2017
===============
సూర్యడు సోకిన చోటే
వెలుగులు కనిపిస్తాయి
మొక్కలు నాటిన చోటే
పువ్వులు  వికాశిస్తాయి
హక్కులు  సాధించిన చోటే
ఉన్నతి అగుపిస్తుంది
ప్రేమలు పంచిన చోటే
వాత్సల్యం బదులిస్తుంది
=================
       య.వెంకటరమణ..✍

సరస కోమలి కుసుమ సరని

1599
తెలుగు రచన
03/01/2018
===========================
సరస కోమలి కుసుమ సరని
హరిత రూపరి దళ విభూషణీ
గళము కోయిల శ్రావ్య సుందరీ
కణితి నయన ముగ్ద మనోహరీ

హొయల నొంపుల కోనేటి నడక
ఆరిదేరిన వీర విల్లంబు సదృశ
వెన్నముద్దల నునుపు నేమి వర్ణం
నెమలి పించముల బారు పవిటతీరు

నిహారముల మెరుపు మేను ఛాయలేమీ
పసిడి విడిచిన స్తరము ఈ వర్ణమేమీ
నీలి మేఘములు చేరి కురులుగా మారి
ఏరి జేసెనేమో ఈ నారి నా శిల్పి..
=========================
.......య.వెంకటరమణ

చలియించని మనిషేగా స్థితప్రజ్ఞుడు

1600
తెలుగు రచన
07/01/2018
యక్ష జ్ఞానాదారితం
==================
చలియించని మనిషేగా స్థితప్రజ్ఞుడు
కష్టంలో దుఃఖించని,వాడేలే ధనవంతుడు
ఇంద్రియాలు నిగ్రహమే నిజ ధైర్యము
అజ్ఞానం అదేనోయి అసలు దుఃఖము

అర్జవమే అసలు మనిషి నిలువుటద్దము
మంచి చెడులు నెంచుటయే  నికర జ్ఞానము
అప్రియమును ప్రియముజేయు నిత్య ధనుడగు
చేయరాని పనులుజేయ సిగ్గు కర్థము

సత్పురుషులు దిక్సూచులు లోకమదేలే
యాగకర్మ జేయుటనే అసలు తృప్తిలే
సజ్జనులతొ సంధి ఎపుడు శిథిలమవ్వదు
ద్వంద్వాలను సహియించుట క్షమా గుణమగు

వృతభికుల ధర్మాలను ఆచరించుము
త్వజయిస్తే నీ గర్వం స్వజనాదరనం
క్రోధాన్ని విడనాడిన శోకరహితము
లోభ లోబి సుఖవంతుడు ధనవంతుడగును

దానగుణం గొప్పగుణం సంతసమోయి
సుఖమునకు ఆధారం శీలము కదవోయ్
సత్యమార్గమదే కదా ముక్తి మార్గము
ధర్మానికి ఆధారం దయ దాక్షిణ్యం

బ్రహ్మ నిర్దేశం, సూర్యోదయము
సరణుజొచ్చువానిని ఆదుకొనుట భావ్యము
నీ ధైర్యం నీకు రక్ష విజయ మర్మము
నీ ధర్మమే నిన్ను నిలుపు ఇదే సత్యము
============================
..................యలమంచిలి వెంకటరమణ

మాటు వేసి కరవవులే పాములు

1602
తెలుగు రచన
12/01/2018
===========================
మాటు వేసి కరవవులే పాములు
కాటు వేసి మొరగవులే కుక్కలు
పగబట్టీ వెంటబడదు పులి కూడా
ప్రాణాపాయం ఆకుకూడా ఔషధమేగా

అబ్బురపడి చేసావు  అయ్యో మనిషిని
మొత్తమంత విషం నింపి మురిసిపోతివి
ముక్కునోరు పన్నుగోరు అన్ని విషం మనసుకుడా
బలే ఉంది మనిషి వరస చూడు బ్రహ్మయ్యా

మనసు విషం మాట విషం
మనిషి కాటు మరీ విషం
కుళ్ళి కుట్ర కుటుంత్రాలూ
ఒళ్ళు జలదరిల్లు పనులు

బలే ఉంది భళా వీడి యవ్వారం
బంక మట్టి వీడు చూస్తే బలే ప్రమాదం
సమయముంటే వచ్చేయ్ లే బ్రహ్మయ్యా
కొత్తయుగం చేసేయ్ లే ఇకనైనా.
==========================
..........యలమంచిలి వెంకటరమణ

నీలా ఉండాలని నాకనిపిస్తుంది

1603
తెలుగు రచన
27/02/2018
==============================
నీలా ఉండాలని నాకనిపిస్తుంది,
నీతోనే ఉండాలని నాకనిపిస్తుంది
నీవై  నేనుండాలని నాకనిపిస్తుంది
నీవే ఇక నేనెమో,నీవేనని అనిపిస్తుంది

నా కలలకు ఆ రూపం నీవే నాకనిపిస్తుంది
ఈ చిగురులు చూస్తుంటే జీవితమేనపిస్తుంది
నీ నవ్వులు పువ్వులుగా వికసిస్తూ అవి ఉంటే
అవి చాలిక జీవితమే, జీవితమే అనిపిస్తుంది

ఈ సవ్వడి నీదేనా,ఈ హృదయం నీవేనా
నీ పేరే వల్లించే ఈ హృది లయలవి నావేనా
ఈ కన్నుల్లో కదలాడే నా లోకం నీవేనా
నీవేనా అది నీవేనా,ఊహల ఆ సౌధం నాదేనా

ఈ కాలం ఇక్కడితో ఆగిపోతె బాగుండును
నా కలలన్నీ నిజమై ఇక నీ తోడే నాకుంటే
బాగుండును జీవితము నీవుండే ఆ లోకం
బాగుండును ఆ లోకం, నీతో నా జీవితము.
==============================
......................యలమంచిలి వెంకటరమణ

కటిక చీకటి కలలు వెలుగు

1604
తెలుగు రచన
29/01/2018
==================
కటిక చీకటి కలలు వెలుగు
మతికి మంత్రం మనకు కడుగు
అడుగు బొడుగు అంతే బడుగు
మా చేతిగ్గొడుగు వాడొచ్చి వొదుగు

రామ రామ రాజ్యం
వచ్చింది స్వరాజ్యం
పచ్చుంది ఎండబెట్టడం
నారా'తీసి కట్టి పడేడం

మాటలు తేనె కత్తులు
కళ్ళల్లో ఒత్తులు,బిసి-కత్తులు
అసుకులు,రసకులు,బ్రతుకులు
గతుకులు గతుకులు

పత్తులు పత్తులు విపత్తులు
లోతట్టులు, ముంచెత్తులు
ముంజేతులు,మోకాళ్ళ నొప్పులు
తిప్పలు,కుక్క లక్కు చెప్పు లు

ఓటేసా,ఒకటేసా,వెంకటేశా
వెన కేసా,అర బాటిలు సీసా
నోటి రేసా, గెలిచేసా
ఐదేళ్లు.. చూడు తమాషా

మసా..? తుడిచేసా
త మాసా,అల్లా'రి చూసా
జనాల పేరాస, అదో నిషా
మా మూలే,మునేశా..

వచ్చే ఏడాది ఏ లక్ష ను
జగానో, చంద్రా నో
ఆంధ్రనో కేంద్రన్నో
పగటి కల లు, చీ కటినో

అట్ట మార్చి కొత్త పుస్తకం
కలలకు పన్ను లెత్తేస్తాం
బ్రతుకు నిస్తాం, బ్రతుకనిస్తాం
తిరగ వ్రాస్తే కొట్టేస్తాం,

ప్రజాస్వామ్యం, ఒప్పేద్దాం
తలో చేతిలో చెప్పె ట్టడం
అసంబ్లీలో గొడవెట్ట డం
ఇది రామ రామ రాజ్యం
================
.........య.వెంకటరమణ

లక్షల కొద్దీ ఫీజులు

==================
లక్షల కొద్దీ ఫీజులు
గుట్టల కొద్దీ బుక్కులు
గుక్కతిరగని చదువులు
బట్టీ పట్టే పరిక్షలు !
పరిక్షలయ్యాక పట్టాలు
పట్టబద్రుల చిట్టాలు
నిన్నటిదాకా ఒక పాట్లు
ఇప్పుడే మొదలు అగచాట్లు!
ఉద్యోగానికి పది సీట్లు
దరకాస్తులు పది రెట్లు
ఆ పట్టాలిక్కడ చెల్లవన్నట్లు
మళ్ళీ పరీక్షల కేర్పాట్లు!
డబ్బు కట్టైనా ఉద్యోగం కొట్టు
రేపు జనం నోట్లో మట్టిగొట్టు
బహుమానం దీనికి పేరెట్టు
లంచాన్నిలాగే అరికట్టు!
ఇదండీ మన సమన్మయం
అందరికీ ఇక్కడొక్కటే న్యాయం
డబ్బు కడితేనే సదుపాయం
లేదంటే,చెల్లదంటారీ అన్యాయం!
ప్రభుత్వానికి తెలీదంటీ అన్యాయం
మొన్న ఎలక్షన్ లో పెట్టిన వ్యయం
రావాలంటే,ఈ సమన్మయం
పాటించాలి , ఇదే నియమం
ఎప్పటిదాకానండీ దారుణం
నవ్వి పోతున్నారు  జనం!
==================
                   య. వెంకటరమణ

తెలుగు రాష్ట్రాల్లో చంద్ర మండలాలు

1705
తెలుగు రచన
04/02/2018
==============================
తెలుగు రాష్ట్రాల్లో చంద్ర మండలాలు
ఇక్కడ అమాష చీకటైతే
అక్కడ వెలుగుల సంబరాలు
జగాని'కే గ్రహణం పట్టింది పాపం
పవరు తార' మిళుకు మిళుకు

దూద్ మేన్లు పెథేన్లు
మెఘా' వేషానికి తుఫాన్లు
బాలియ్యం సొల్లు తుపార్లు
స్టేజులు రెండు,బోలెడు నాటకాలు

దిల్ వాలోంకా ఢిల్లీ శాసనం
దుల్హనియా లేజాయేగా సింహాసనం
కంగ్ రేసు' రాహు'వు పాపం
ఇట లీ లలు మటు మాయం

నరేంద్రు'ని పాలక రాజ్యల్లో
ఆపేయాలని 'పద్మావతి' కళ్యాణం
పెళ్లి కూతురు పేరే మారింది
మిగిలిందంతా శుభప్రదం

జీ ఎస్ టీ, (జెమినీ స్ట్రాంగ్ టీ)
కాలుతుంది,కాస్తైనా చల్లారుతుందా
అందరికీ వస్తున్నా కింద మంట
గాంధారి వేషంలో జనమంతా 

జరిగింది రద్దే. వీళ్లకు లేదే హద్దు
పస్తులుండేది పేదోళ్ళేరా మొద్దు
పతా... అంజలి బనేన్లు,డ్రాయర్లు
పెళ్లముంటే ఒక హెలికాఫ్టర్ కొనిచ్చేవాడు

వేసిన అమె రిక' రిక్కలు,
మన పాక్కో'డి ఆకలి కేకలు
ట్రంప'న్నాడు పాకిస్తానని
పాకిస్తాడో,అప్పుగానిస్తా డో
==========================
...యలమంచిలి వెంకటరమణ