Monday, March 26, 2018

మలారంతో ఒకడు

1590
తెలుగు రచన
19/11/2017
==============
మలారంతో ఒకడు
తుకారాం ఇంకొకడు

వికారమైన బుద్ధులు
వీళ్ళే మనకు ప్రబుద్ధులు

మళ్లీ మొదలు సన్నాహాలు
తలదన్నే చెత్త పన్నాగాలు

కంపు కంపు ప్రసంగాలు
వెయ్యి రెండు లవంగాలు

మొబైల్ యుగంలో
గ్రామ్ ఫోన్ రికార్డులు

అరిగిపోయిన ప్లేట్లు
పాడేవి పాత పాట్లు

ఊరు ఊరంతా జెండాలు
ఊరు బయట దందాలు

అసలు రంగు బయట పడనట్టు
ఖద్దరు గుడ్డలు చుట్టబెట్టు

రక్త సంబంద మన్నట్టు వీరు
వచ్చి వాటేసుకునే తీరు

ఐదేళ్ల పదవిలో సమయం లేనట్టు
అదే బెంగతో వచ్చి కలుస్తున్నట్టు

ఒకడు పంచి పెట్టినట్టు
ఇంకొకడు పంచె పెట్టినట్టు

ప్రజా సేవ బోల్టు
బిగిస్తారు బోల్తా పడేటట్టు

పనయ్యాక పిరాయిస్తారు ప్లేట్లు
ఆ తర్వాతన్నీ మనకేలే పాట్లు

మత్తు విడిచిపెట్టు
ప్రజాస్వామ్యం నిలబెట్టు

నీ ఓటు విలువ వాళ్లకు తెలిసినట్టు
చెబుతున్నా నువ్ తెలుసుకో నన్నట్టు
========================
........యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment