Monday, March 26, 2018

భయపడకు, భాదపడకు

1706
తెలుగు రచన
06/02/2018 11:03
=========================
భయపడకు, భాదపడకు
ఇది ఖర్మని సరిపడకు
భయం-గియం,బాధామయం
పిరికివాళ్ళ ప్రదమగుణం
చిటికలోన చితికిపొవు
చీమ తిరగ బడుతుంది
కరువు రాని పిల్లిపిల్ల
ఎదురు తిరుగి ఉరుముతుంది
మనిషివి నువ్, మనిషివి నువ్
మసిజేసే శక్తిగల మహాశక్తి నీవు
నీవు భయమొదలోయ్,బాదొదిలేయ్
అన్యాయం ఎదురైతే,
అదేపోనీ అనుకొనక
అక్రమాలు కంటబడితే
అలా వదిలి ఊరుకొనక
కొట్టూ గొట్టూ అవినీతిని తరిమిగొట్టు
నీతిని నువ్ నిలబెట్టు,
అదే నిన్ను నిలబెట్టు
తరిమిగొట్టు, తరిమిగొట్టు
అవినీతిని తగలబెట్టు
భయపడి నువ్ పరుగు దీస్తె
కుక్కలు నిను తరుమదా
వెలుగు వైపు నడక జేయ
నీడ నిన్ను వెంబడించదా
చీకటిలో నిలబడితే,
వెలుగు విడిచి పారిపోతె
నీ నీడా తోడు రాదు,
ఏ తోడూ నీకుండదు
ఎదురు తిరుగు,ఎదురు తిరుగు
అవినీతికి ఎదురు తిరుగు
అచ్చోసిన ఆంబోతుల
విచ్చలవిడి రాజ్యంలో
కప్పేసిన అవినీతిని
చీల్చివేయ శక్తి నీవు
కెరటాలు తాళ లేక
దూరముండు రాయిజూడు
నునుపు లేని బండరాయి,
అది అట్లే ఉండునోయి
కెరటాలకు ఎదురు తిరిగి,
వీపుగాచి నిలబడితే
తాళలేని కెరటాలే
తలవంచుకు పోవునుగా
ఎదురు గాచి బండ రాయి
నునుపుదేర చూడవోయి
ఎదురు తిరుగు ఎదురు తిరుగు
వీపుగాచి నునుపుదేరు
చలువరాయి నీవేనోయ్
కష్టాలకు భయపడకు,
ఎదురుతిరుగు నిలబడతావ్
తిరుగుబాటులేనిదే
ప్రగతిమాట లేదులే
ప్రగతిబాట సాగానీవు
తిరుగుబాటు చేయుమోయ్
అవినీతిని ఎదిరించు,
నీ నీతిని బ్రతికించు
రాజ్యాంగం హద్దుల్లో,
రాజువై నిలచుండు
నీతికి నువ్ తోడుండు,
న్యాయమై నీవుండు
దిగులు విడువు,
ఎదురు తిరుగు
అదే నీకు ఆయుధం,
అదే నీకు ఆయుధం
==================
యలమంచిలి వెంకటరమణ

No comments:

Post a Comment